విప్రో వ్యవస్థాపకుడు 'అజీమ్ ప్రేమ్‌జీ' (Azim Premji) తన కుమారులు.. సంస్థ చైర్మన్ 'రిషద్ ప్రేమ్‌జీ', ఎంటర్‌ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'తారిఖ్ ప్రేమ్‌జీ'లకు జనవరి 23న దాదాపు రూ.500 కోట్ల విలువైన 10.2 మిలియన్ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ చూపించింది.
అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అండ్ అజీమ్ ప్రేమ్‌జీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్‌లో బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు. లావాదేవీ తర్వాత, అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబానికి కంపెనీలో 4.4% వాటా ఉంది. ఇందులో ప్రేమ్‌జీకి 4.3%, అతని భార్య యాస్మీన్ ప్రేమ్‌జీకి 0.05%, ఇద్దరు కొడుకులకు 0.03% వాటా ఉంది.
ఇదీ చదవండి: ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు..
ప్రేమ్‌జీ కుటుంబం విప్రోలో 72.9% వాటా కలిగి ఉన్నప్పటికీ 7.4% షేర్ల నుంచి డివిడెండ్ ఆదాయాన్ని పొందుతుంది. ప్రస్తుతానికి విప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌తో సహా ప్రేమ్‌జీ సంపద మొత్తం 11.3 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో షేర్లు శుక్రవారం నాడు రూ.484.9 వద్ద ముగిశాయి. దీని ప్రకారం 1,0230,180 షేర్ల విలువ రూ. 496 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment