ముంబై : భారత స్టార్టప్‌లు ఇబ్బందులను అధిగమిస్తూ ఎదుగుతున్న తీరు ఇన్వెస్టర్లలో నయా జోష్ నింపుతోంది. బిలియనీర్ అజీం ప్రేమ్‌జీ వెన్నుదన్నుతో సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌గా మొదలైన ఐసెర్టిస్ తాజాగా 100 కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరుతూ యూనికార్న్ ఘనతను సాధించింది. శాప్ ఎస్‌ఈ, ఒరాకిల్ కార్పొరేషన్‌లతో తలపడుతూ క్లౌడ్ కాంట్రాక్టులను నిర్వహించే సంస్థల వ్యాపారాలకు సేవలందించే ఐసెర్టిస్ తాజాగా 115 మిలియన్ డాలర్లను సమీకరించి అరుదైన ఘనతను అందుకుంది.
పూణేకు చెందిన ఐసెర్టిస్‌లో ప్రేమ్‌జీ కుటుంబ కార్యాలయం నిర్వహించే ప్రేమ్‌జీఇన్వెస్ట్, గ్రేక్రాఫ్ట్ పార్టనర్స్ ఎల్‌ఎల్‌సీ, బీ క్యాపిటల్‌గ్రూప్, క్రాక్ క్రీక్ అడ్వైజర్స్ పెట్టుబడులు పెట్టాయి. తాజా పెట్టుబడులతో ఐసెర్టిస్ 211 మిలియన్ డాలర్లకుపైగా సమీకరించింది. ఐసెర్టిస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 57 లక్షల కాంట్రాక్టులు నిర్వహిస్తున్న కస్టమర్లకు సేవలందిస్తోందని, ప్రతి కంపెనీ అంతర్జాతీయంగా పోటీని ఎదుర్కొంటున్న క్రమంలో కాంట్రాక్టుల నిర్వహణకు ఆయా కంపెనీలకు సాఫ్ట్‌వేర్ అవసరం నెలకొందని సంస్థ సహ వ్యవస్ధాపకులు, సీఈవో సమీర్ బొదాస్ పేర్కొన్నారు. భారత టెక్నాలజీ స్టార్టప్‌లపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసం, క్రేజ్‌కు ఐసెర్టిస్‌లో భారీ పెట్టుబడులతో వారు ముందుకు రావడమే నిదర్శమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment