భారత ఆర్థికవ్యవస్థలో 10 శాతం వీరివద్దనే
భారత ఆర్థికవ్యవస్థలో 10 శాతం వీరివద్దనే
Published Fri, Aug 4 2017 12:44 PM | Last Updated on Wed, Apr 3 2019 4:29 PM
న్యూఢిల్లీ : భారత ఆర్థికవ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు కోటి కోట్లకు పైగానే. ఈ కోటి కోట్లలో సుమారు 10 శాతం మేర సంపద, అంటే 200 బిలియన్ డాలర్లకు పైనా సంపద దేశంలోని టాప్-20 పారిశ్రామికవేత్తల దగ్గరే ఉన్నట్టు తెలిసింది. 2017 తొలి ఏడు నెలల కాలంలో వీరి సంపద అదనంగా 50 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌లో వెల్లడైంది. 18 మంది టాప్ ఇండియన్ బిలీనియర్లలో ప్రతి ఒక్కరూ ఈ ఏడు నెలల కాలంలో తమ సంపదను 1 బిలియన్ డాలర్లు(రూ.6400 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువగానే పెంచుకున్నారని ఈ ఇండెక్స్ తెలిపింది.
ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాలతో మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను అదనంగా ఏకంగా 13 బిలియన్ డాలర్లను పెంచుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా అదానీ గ్రూపుకు చెందిన గౌతమ్ అదానీ, విప్రో అజిమ్ ప్రేమ్‌జీ, ఆర్‌కే దమానీ వంటి వారు బ్లూమ్‌బర్గ్ డేటాలో దూసుకుపోయినట్టు వెల్లడైంది. వీరి సంపద 3-4 బిలయన్ డాలర్ల మధ్యలో ఎగిసినట్టు ఇండెక్స్ తన రిపోర్టులో పేర్కొంది.
ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు తొమ్మిదేళ్ల గరిష్టంలో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియోను విజయవంతంగా ఈ ఇండస్ట్రీస్‌ను లాంచ్ చేయడంతో తమ, నమ్మకం మరింత పెరుగుతుందని గ్రూప్ చెబుతోంది. విప్రో ప్రమోట్‌చేస్తున్న అజిమ్ ప్రేమ్‌జీ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాను కలిగి ఉన్నారు. అంతేకాక ఎన్‌సీసీ, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, జేఎం ఫైనాన్సియల్ సంస్థల్లో అజిమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్ వాటాలను కలిగి ఉంది.
వీటన్నింటితో ప్రేమ్‌జీ సంపద 3.8 బిలియన్ డాలర్లు ఎగిసి 16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖేష్ అంబానీ, ప్రేమ్‌జీ మాత్రమే కాక, దమానీ, గౌతమ్ అదానీ, ఉదయ్ కొటక్, కుమార్ మంగళం బిర్లా, పంకజ్ పటేల్, విక్రమ్ లాల్, లక్ష్మీ మిట్టల్, కేపీ సింగ్, అజయ్ పిరామిళ్, పల్లోజి మిస్త్రీ వంటి వారు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌కి ప్రతేడాది 2 బిలియన్ డాలర్లను అందిస్తున్నారు.
Advertisement
Advertisement