
విప్రో కొత్త లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కొత్త లోగోను ఆవిష్కరించింది. 1998లో ప్రారంభించిన రంగురంగుల పొద్దుతిరుగుడు పువ్వు స్థానంలో చుక్కలతో కూడిన కొత్త లోగోను విప్రో వినియోగించనున్నది. విశ్వసనీయమైన డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కంపెనీగా విప్రోను ఈ కొత్త లోగో ప్రతిబింబిస్తోందని విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ తెలిపారు. 1945లో మహారాష్ట్రలోని అమల్‌నర్‌లో వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రోడక్ట్స్ కంపెనీగా విప్రో ప్రారంభమైంది. ఐటీ పరిశ్రమలోకి 1981లో ప్రవేశించింది. ప్రస్తుతం విప్రో కంపెనీలో 1.7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 850 కోట్ల డాలర్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది.