శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్ సరిహద్దుల్లో చొరబాటుకు హత్నించిన ముగ్గురు ఉత్రవాదులను ఆదివారం భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఈ ఘటనపై తాజాగా కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్‌కర్ణి మాట్లాడారు.
‘జూలై 13,14 తేదీల్లో రాత్రి సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నించటంతో దాడులు జరిపాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నెలకొన్న శాంతి పరిస్థితులకు భంగం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నట్లు మాకు నిఘా సమాచారం ఉంది.
..అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా ఇక్కడ కల్లోలం సృష్టించాలని ఉగ్రవాదులు యత్నించారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి.. జూలై 12నే మాకు ఇంటెలిజెన్స్ నుంచి మాకు సమాచారం అందింది. దట్టమైన అడవుల నుంచి కేరాన్ సెక్టార్ గుండా విదేశీ ఉగ్రవాదులు చొరబడతారన్న సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. జూలై 13, 14 తేదీ రోజుల్లో రాత్రి మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం.
.. ఆర్మీ, బీఎస్‌ఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసు సయుక్తగా ఉగ్రవాదుల చొరబడే చోట దాడులు చేశాం. అయితే చికటి ఉండటంతో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. టెర్రరిస్టుల వద్ద భారీ ఆయుధాలు ఉన్నాయి. బాగా శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడటానికి యత్నించారు. ఇక.. మేము జరిపిన కాల్పుల్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయయ్యారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం’అని ఎన్ఆర్ కుల్‌కర్ణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment