శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ముగ్గరు టెర్రరిస్టులు హతమైనట్లు భారత ఆర్మీ వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను ఆర్మీ చేపట్టింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన టెర్రరిస్టులపై సైనికులు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
‘జమ్ము కశ్మీర్ కెరాన్ సెక్టార్‌లో ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. వారి వద్ద లభించినట్లు ఆయుధాలను స్వాధనం చేసుకున్నాం’ అని ఆర్మీ చినార్ కార్ప్స్ ‘ఎక్స్’ లో పేర్కొంది.
OP DHANUSH II, KERAN #Kupwara
03x Terrorists have been eliminated in the ongoing anti-infiltration operation on the #LoC in Keran Sector, alongwith recovery of weapons and other war-like stores.
The operation is continuing #Kashmir@adgpi@NorthernComd_IA— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 14, 2024
ఈ రోజు(ఆదివారం) భద్రతా బలగాలు ధనుష్-2 అనే కోడ్ పేరుతో కుప్వారాలోని కేరన్ సెక్టర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక.. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment