
లడఖ్ ఖేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు మృతిచెందారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో ఎనిమిది మంది జవాన్లు కాగా, ఒకరు జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) ఉన్నారు.
లేహ్ ప్రాంతానికి సుమారు 150కిమీ దూరంలో ఉన్న ఖేరీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ ఆర్మీ జవాన్లు మరణించడంతో యావత్ భారతదేశం ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురైంది.
Comments
Please login to add a commentAdd a comment