భారత్ సరిహద్దుల్లో చైనా కారణంగా ఎప్పుడూ ఉద్రిక్తత చోటుచేసుకుంటూనే ఉంటుంది. డ్రాగన్ కంట్రీ భారత్‌కు చెందిన సరిహద్దులపై కన్నేసి ఆక్రమణలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా భారత్‌కు సంబంధించిన భూమిని చైనా ఆక్రమించుకున్నట్టు స్వయంగా దేశానికి చెందిన సీనియర్ అధికారి ఓ నివేదికలో చెప్పడం సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలోని 65 పాయింట్లలో భారత్ గస్తీ నిర్వహించాల్సి ఉండగా.. మన బలగాలు 26 చోట్లకు మాత్రమే ప్రవేశించగలుగుతున్నాయి. పలు చోట్ల భారత్ గస్తీ నిర్వహించడం లేదని ఈ క్రమంలోనే ఆక్రమణ జరిగినట్టు లేహ్ ఎస్పీ నిత్య కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఈ నివేదికను ఆమె.. ఢిల్లీలో జరిగిన పోలీసుల సదస్సులో కేంద్రానికి సమర్పించారు. కాగా, ఆ ప్రాంతం కారాకోరం శ్రేణుల్లో నుండి చమూరు వరకు విస్తరించి ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.
ఇక, ఈ ప్రాంతాల్లో భారత్ గస్తీ నిర్వహించకపోవడంతో చైనా.. ఆయా ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో కొన్ని చోట్ల బఫర్ జోన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అయితే, బఫర్ జోన్లను ఆసరాగా తీసుకుని భారత్‌కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు నివేదికలో చెప్పుకొచ్చారు. అలాగే, భారత్ బలగాల కదలికలను సైతం గుర్తించేందుకు అక్కడి ఎత్తైన శిఖరాలపై చైనా.. కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. ఇలా, బఫర్ జోన్‌లోకి భారత సైన్యం వెళ్లిన వెంటనే ఆ ప్రదేశం తమ దేశానికి చెందినదే అని చైనా దూకుడగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా ఇలా చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నివేదికలో స్పష్టం చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ కూడా ఉన్నారు.
Did India lose access to 26 patrolling points in Eastern Ladakh?
— Youturn English (@Youturn_media) January 25, 2023
Become a Youturn Supporter: https://t.co/6cvL9b8072#Youturn | #FactCheck | #IndiaBorder | #Ladakh pic.twitter.com/kHY6nsLBcY
Comments
Please login to add a commentAdd a comment