Border issues
-
జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయం
న్యూఢిల్లీ: కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల కోసం భారత్‌కు చైనా కంటే జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయమని మెడికల్ టెక్నాలజీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (ఎంటాయ్) పేర్కొంది. ఇతర దేశాల మాదిరే భారత్ సైతం తన మెడికల్ టెక్నాలజీ అవసరాల కోసం ప్రధానంగా అమెరికా, జపాన్, యూరప్, బ్రిటన్, చైనా, సింగపూర్ దేశాలపై ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేసింది. చైనా నుంచి మెడికల్ టెక్నాలజీ దిగుమతుల విలువ పెరుగుతుండడం ఆందోళనకరమని, ప్రాధాన్య ప్రాతిపదికన ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించింది కొన్ని రకాల వైద్య పరికరాలకు భారత్ తగినంత తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకుందని చెబుతూ.. క్లిష్టమైన సాంకేతికతతో కూడిన ఉపకరణాల కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు తెలియజేసింది. నాణ్యమైన, అత్యాధునిక వైద్య పరికరాల దిగుమతులు కష్టమేమీ కాబోదంటూ.. చైనా నుంచి ఈ తరహా ఉత్పత్తుల విలువ పెరగడం ఒక్కటే ఆందోళన కలిగిస్తున్నట్టు ఎంటాయ్ చెప్పింది. చైనా–భారత్ మధ్య గత మూడేళ్లుగా సరిహద్దు, ద్వైపాక్షిక విభేదాలు నెలకొనడం తెలిసిందే. అయినా కానీ కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల విలువ 2020–21లో 327 బిలియన్ డాలర్ల నుంచి 2021–22లో 515 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ‘‘వైద్య పరికరాలు, విడిభాగాల దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పలు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించడం విలువైన చర్యే. కానీ, ఇది ఫలితాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు భారత్ అత్యవసరంగా చైనాకు ప్రత్యామ్నాయాలను చూడాలి’’అని ఎంటాయ్ చైర్మన్ పవన్ చౌదరి పేర్కొన్నారు. -
చైనా దూకుడుకు కారణాలెన్నో!
చైనాకు లదాఖ్ ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. టిబెట్ అటానమస్ రీజియన్‌ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్‌తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్‌లోని అక్సాయ్ చిన్ ఉంది. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుంది. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. ఈ సంవత్సరం జనవరి 20–22 తేదీల్లో ఢిల్లీలో ‘కంచె లేని భూసరిహద్దుకు సంబంధించిన భద్రతా సమస్యలు’ అనే అంశంపై ఇంటలిజెన్స్ బ్యూరో నిర్వహించిన సమావేశంలో లదాఖ్‌లో చైనాతో ఉన్న సరిహద్దుకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చి, అవి మీడియాలో కూడా అనేక చర్చలకు దారితీశాయి. ప్రధాని, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం– ఈ ప్రాంతంలో కారకోరం పాస్ నుండి చుమూర్ గ్రామం వరకు ప్రస్తుతం ఉన్న 65 పాట్రోలింగ్ పాయింట్స్‌లో 26 పాయింట్స్ అంటే పాయింట్ నంబర్ 5 నుండి 17, 24 నుండి 32, 37, 51, 52, 62 అనే పాయింట్స్ ఇండియా కోల్పోయిందనీ, చైనా పాటించే సలామి స్లైస్ వ్యూహంలో(చిన్న దాడులతో పెద్ద ఫలితం రాబట్టడం) ఇవి చిక్కుకున్నాయనీ వెల్లడయిన విషయాలు ఆందోళన కలిగించేవే! అయినప్పటికీ ఈ ప్రాంతంపై చైనాకు ఉన్న ఆర్థిక రాజకీయ వ్యూహాత్మక భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఇది ఊహించదగ్గదే. ఇండియా, చైనా మధ్య 2020 ఏప్రిల్ నుండి ఇప్పటివరకూ సుమారు 17 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, వాటి ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా రాలేదు. రెండు దేశాల సైన్యాలు బాహాబాహీకి దిగుతున్న సంఘటనలు, నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, మిలిటరీ స్టేషన్స్, జనావాసాలు... ఎన్ని రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ 2020 సంవత్సరానికి పూర్వం ఉన్న పరిస్థితులు పునరుద్ధరించడం కష్టమేనన్న భావన కలిగిస్తున్నాయి. దానికి తోడు జనవరి 20వ తేదీన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ లదాఖ్ ప్రాంతంలోని చైనా సైనికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. చైనాకు ఈ ప్రాంతం ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే ఈ సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. గత మూడు దశాబ్దాల్లో చైనా విదేశీ విధానంలో, దాని రూపకల్పనలో సైన్యం పోషించే పాత్రలో చాలా మార్పులు వచ్చాయి. తొంభయ్యో దశకంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించకుండా అతిగోప్యతను పాటించడం, ఇతర దేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ముఖ్యమైన విధానంగా ఉంటే, కొత్త సహస్రాబ్దిలో చైనా సాధించిన ఆర్థిక విజయాలు ఈ విధానంలో సమూల మార్పులకు దోహద పడ్డాయి. అందులో భాగంగా తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి సైన్యం కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందని గుర్తించింది. దూకుడైన విధానాలు, బలమైన, టెక్నాలజీ సపోర్ట్‌తో కూడిన రక్షణ వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి పెట్టింది. జిన్‌పింగ్ కాలంలో విదేశీ విధానాల రూపకల్పనలో సైన్యం పాత్ర మరింత పెరగటం గమనించవచ్చు. జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక 2013లో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా చైనా వాణిజ్యం పెంచే ఎగుమతులు దిగుమతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా కొనసాగించడానికి రక్షణ చర్యలు తీసుకొనవలసిన అవసరం ఏర్పడింది. 2016 నుండి తన పశ్చిమ సరిహద్దుల్లో ముఖ్యంగా సెంట్రల్ అసియా, అఫ్గానిస్తాన్‌లో పెరుగుతున్న తీవ్రవాదం ప్రభావం తన ఉగెర్, క్సిన్జియాంగ్ ప్రాంతాల్లో పడకుండా ఉండడానికి ఆ ప్రాంతాల్లో మిలిటరీ ఉనికిని పెంచడమే కాకుండా, తన వెస్ట్రన్ కమాండ్‌ను మొత్తంగా పునరుద్ధరించింది. ఈ చర్యలు అటు క్సిన్జియాంగ్ ప్రోవిన్సుతో పాటు, టిబెట్ ప్రావిన్స్ లలో సైన్యం కదలికలు పెరిగి ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతాల్లోని సరిహద్దులపై దృష్టి పెట్టేందుకు దోహదపడ్డాయి. గత రెండు దశాబ్దాల్లో చైనా విధానాల్లో వచ్చిన మరొక ముఖ్యమైన మార్పు, తాను నిర్దేశించుకున్న ‘మూల ప్రయోజనాలు’. తొంభయ్యో దశకం వరకు ఆర్థిక అభివృద్ధి, దేశ సమగ్రత ముఖ్య లక్ష్యాలయితే, అది కొత్త మిలీనియంలో విదేశాల్లో ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఆయా దేశాల్లో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకునేందుకు, అందుకు అవసరమైతే మిలిటరీ తదితర శక్తుల ప్రదర్శన చేయడంగా రూపాంతరం చెందింది. అయితే ఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో చైనాకు లదాఖ్ ప్రాంతంలో ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ, అవి ఏమిటన్నది వెల్లడించలేదు. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే చైనాకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతమని గోచరిస్తుంది. చైనాకు ఈ ప్రాంతంతో మూడు రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి: చైనాలో ఉన్న టిబెట్ అటానమస్ రీజియన్‌ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్‌తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్‌లోని అక్సాయ్ చిన్ ఉంది. ఈ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న నగరి డ్యామ్ ద్వారా సింధు నదీ జలాల ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా, వాటిని తన రక్షణ దళాల అవసరాలకు మళ్ళించుకోవడానికీ, ఆప్రాంతానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తి చేయడానికీ అక్సాయ్ చిన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై చైనాకు పూర్తి నియంత్రణ అవసరం. రెండు: క్సిన్జియాంగ్ ప్రావిన్స్‌ను టిబెట్ ప్రావిన్స్‌తో కలిపే ఎ219 హైవే, కషుగర్ నగరాన్ని సెంట్రల్ చైనా నుండి బీజింగ్‌తో కలిపే ఎ314 హైవే... ఈ రెండింటి భద్రతకు అక్సాయ్ చిన్, లదాఖ్ ప్రాంతాలు చైనాకు అతి ముఖ్యమైనవి. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. ఈ ప్రాంతంలో ఇండియా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రహదారులు, దౌలత్ ఓల్డ్ బేగ్ లాంటి వైమానిక స్థావరాలతో చైనా భద్రతకు, అందునా చైనా– పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను కషుగర్ సిటీతో కలిపే కారకోరం హైవేకు ప్రమాదం ఏర్పడుతుందని చైనా అంచనా. మూడు: ఈ ప్రాంతంలో 1913లో జరిగిన డి ఫిలిపె ఎక్స్‌పెడీషన్, ఆ తర్వాత సోవియెట్ యూనియన్ జరిపిన భౌగోళిక సర్వేలో అత్యంత విలువైన థోరియం, యురేనియం, బోరోక్స్, సల్ఫర్, నికెల్, పాదరసం, ఇనుము, బంగారం, బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. 2019లో చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదికలో చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే వీటి వెలికితీత కార్యక్రమాలు, శుద్ధిచేసే ప్లాంట్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఖనిజ సంపదతో తన తూర్పు ప్రాంతానికి సమానంగా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చనీ, ఉగెర్ ప్రాంతంలో నెలకొని ఉన్న పేదరికాన్ని, వేర్పాటువాదాన్ని ఎదుర్కొనవచ్చనీ చైనా వ్యూహం. ఈ పరిస్థితుల మధ్య భారత్‌తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుందనీ, భవిష్యత్తులో మరింత దూకుడుగా ఉంటుందనీ అంచనా వేయవచ్చు. ఇంతకు ముందులా కాకుండా భారత్ కూడా లదాఖ్ నుండి అరుణాచల్ వరకు ఉన్న తన సరిహద్దుల వెంబడి అనేక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, సైనిక దళాలకు కావలసిన వసతులను వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నది. చైనాకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా, అది వ్యవహరిస్తున్న తీరును బట్టి, భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు తలెత్తవచ్చని చెప్పవచ్చు. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. వ్యాసకర్త సహాయ ఆచార్యులు, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ గద్దె ఓంప్రసాద్ -
భారత భూభాగం ఆక్రమించిన చైనా.. కేంద్రానికి సంచలన నివేదిక!
భారత్ సరిహద్దుల్లో చైనా కారణంగా ఎప్పుడూ ఉద్రిక్తత చోటుచేసుకుంటూనే ఉంటుంది. డ్రాగన్ కంట్రీ భారత్‌కు చెందిన సరిహద్దులపై కన్నేసి ఆక్రమణలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా భారత్‌కు సంబంధించిన భూమిని చైనా ఆక్రమించుకున్నట్టు స్వయంగా దేశానికి చెందిన సీనియర్ అధికారి ఓ నివేదికలో చెప్పడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలోని 65 పాయింట్లలో భారత్ గస్తీ నిర్వహించాల్సి ఉండగా.. మన బలగాలు 26 చోట్లకు మాత్రమే ప్రవేశించగలుగుతున్నాయి. పలు చోట్ల భారత్ గస్తీ నిర్వహించడం లేదని ఈ క్రమంలోనే ఆక్రమణ జరిగినట్టు లేహ్ ఎస్పీ నిత్య కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఈ నివేదికను ఆమె.. ఢిల్లీలో జరిగిన పోలీసుల సదస్సులో కేంద్రానికి సమర్పించారు. కాగా, ఆ ప్రాంతం కారాకోరం శ్రేణుల్లో నుండి చమూరు వరకు విస్తరించి ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇక, ఈ ప్రాంతాల్లో భారత్ గస్తీ నిర్వహించకపోవడంతో చైనా.. ఆయా ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో కొన్ని చోట్ల బఫర్ జోన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అయితే, బఫర్ జోన్లను ఆసరాగా తీసుకుని భారత్‌కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు నివేదికలో చెప్పుకొచ్చారు. అలాగే, భారత్ బలగాల కదలికలను సైతం గుర్తించేందుకు అక్కడి ఎత్తైన శిఖరాలపై చైనా.. కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. ఇలా, బఫర్ జోన్లోకి భారత సైన్యం వెళ్లిన వెంటనే ఆ ప్రదేశం తమ దేశానికి చెందినదే అని చైనా దూకుడగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా ఇలా చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నివేదికలో స్పష్టం చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఉన్నారు. Did India lose access to 26 patrolling points in Eastern Ladakh? Become a Youturn Supporter: https://t.co/6cvL9b8072#Youturn | #FactCheck | #IndiaBorder | #Ladakh pic.twitter.com/kHY6nsLBcY — Youturn English (@Youturn_media) January 25, 2023 -
మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దుల్లో హైఅలర్ట్.. బస్సులు బంద్
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు రాష్ట్రాల అనుకూలవాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టడం, వాహనాలపై పరస్పరం దాడులకు దిగడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారం రాత్రి ఫోన్‌ద్వారా మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్నాటకలో నిరసనకారులు దాడులు చేస్తున్న కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి కర్నాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంట్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, కర్నాటకలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించిన కారణంగానే తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని తెలిపారు. మళ్లీ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే బస్సు సర్వీసులను పునఃప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఏమిటీ వివాదం? రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం 1957 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావితోపాటు మరాఠా భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు స్వాతంత్య్రం కంటే ముందు అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. బెళగావి నగరాన్ని, 814 గ్రామాలను కర్ణాటకలో 1957లో విలీనం చేశారు. కానీ, అవి తమవేనని మహారాష్ట్ర వాదిస్తోంది. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెళగావి తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదిస్తోంది. అంతేకాదు అక్కడ బెంగళూరులోని విధాన సౌధను పోలిన సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఏడాదికోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. Mumbai: Maharashtra Suspends All Bus Services To Karnataka Amid Border Dispute - https://t.co/36uk5KYPiy#Karnataka#BorderDispute#BusServices pic.twitter.com/nNcGVXGk6T — HW News English (@HWNewsEnglish) December 7, 2022 -
సరిహద్దులో రెచ్చిపోతున్న చైనా.. విమానంతో చక్కర్లు కొడుతూ..
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల పర్వం మళ్లీ మొదలైంది. గతంలో మాదిరిగానే డ్రాగన్ కంట్రీ మళ్లీ తన కపట బుద్ధిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇటీవల లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి చొచ్చుకొచ్చింది. వాస్తవాధీన రేఖ వెంబడి చక్కర్లు కొట్టింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమవడంతో చైనా విమానం వెనుతిరిగింది. కాగా గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో చైనా ఈ తరహా ఉల్లంఘనకు పాల్పడటం ఇదే మొదటి సారని భారత సైనిక వర్గాలు తెలిపాయి. తీరు మారని చైనా.. ఇప్పటికే చైనాతో పలుమార్లు భారత్ చర్చలు జరిపినప్పటికీ అవి ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా మరోసారి భారత్‌పై కవ్వింపులకు దిగింది డ్రాగన్ కంట్రీ. వివరాల ప్రకారం.. జూన్ చివరి వారంలో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా విమానం భారత స్థావరాలకు చాలా దగ్గరగా వచ్చింది. భారత వైమానిక దళం దీన్ని గమనించి వెంటనే అప్రమత్తం కావడంతో చైనా విమానం దూరంగా వెళ్లిపోయింది. సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఐఏఎఫ్(IAF) రాడార్ ద్వారా చైనా విమానాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తూర్పు లడఖ్‌కు సమీపంలో చైనా వైమానిక దళం నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో డ్రిల్స్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు. చైనీయులు 2020లో చేసిన విధంగానే ఏదైనా దుస్సాహసాన్ని పాల్పడితే వాటిని అరికట్టడానికి తూర్పు లడఖ్ సెక్టార్లో భారత్ బలమైన చర్యలు తీసుకుంది. చదవండి: తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి -
ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. భారత్ ఆందోళన
వాషింగ్టన్: కొద్దిరోజులగా రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. లక్షకు పైగా రష్యా బలగాలు సరిహద్దుల్లో మోహరించి యుద్ధ విన్యాసాలు సైతం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా ఈ పరిణామాలపై భారత్ సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. సరిహద్దుల్లో నెలకొన్న ఈ పరిణామాలు శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయాని వ్యాఖ్యానించింది. మంగళవారం ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ ఉద్రిక్తతల అంశంపై వీలైనంత త్వరగా రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో 20వేల మందికి పైగా ఉన్న భారత పౌరులు, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి రక్షణే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా, అన్ని దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలన్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుందన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రైలేటరల్ కాంటాక్ట్ గ్రూప్ ద్వారా ప్రయత్నిస్తున్న దేశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. Safety&security of civilians essential. More than 20,000 Indian students& nationals live&study in different parts of Ukraine, incl in its border areas. The well-being of Indians is of priority to us: India's Permanent Rep to United Nations TS Tirumurti, at UNSC meet on Ukraine pic.twitter.com/kRcAdVAtuI — ANI (@ANI) February 22, 2022 -
అవన్నీ అబద్ధాలు.. కట్టుకథలు: చైనా
బీజింగ్: నేపాల్ భూభాగాన్ని తాము ఆక్రమించామన్న వార్తలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేసింది. నేపాల్- టిబెట్ సరిహద్దులో గల తమ భూభాగంలోని సుమారు 150 హెక్టార్ల స్థలాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించిందని నేపాలీ రాజకీయ నాయకులు ఆరోపణలు చేసినట్లుగా టెలిగ్రాఫ్ మంగళవారం ఓ కథనం ప్రచురించింది. ఈ విషయంపై మీడియా సమావేశంలో స్పందించిన చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్.. ‘‘ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం. నిరాధారమైని. కల్పితాలు మాత్రమే’’అని స్పష్టం చేశారు.(చదవండి: అరుణాచల్ సరిహద్దులో చైనా కొత్త రైల్వేలైన్) కాగా నేపాల్‌లోని హుమ్లా జిల్లాలో గల భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను ఆ దేశ అధికార మీడియా తీవ్రంగా ఖండించింది. భారత్‌కు అనుకూలంగా ఉండే కొంతమంది నేపాలీ ప్రతిపక్ష నేతలు కావాలనే ఈవిధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సౌత్‌వెస్ట్(నైరుతి) చైనాలో గల టిబెట్ అటానమస్(స్వయంప్రతిపత్తి) రీజియన్‌లో చేపట్టిన నిర్మాణాలను నేపాల్‌లో నిర్మించినట్లు ప్రచారం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టింది. భారత్‌కు అనుకూలంగా ఉన్నవాళ్లే తమ గురించి ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారంటూ విషం చిమ్మింది. ఇక నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి గత కొన్నినెలలుగా భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే సమయంలో చైనాతో స్నేహం పెంపొందించుకుంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే గతకొన్ని రోజులుగా భారత్– నేపాల్ సంబంధాల్లో వినిపించిన చిటపటలు కాస్త సద్దు మణిగాయి. భారత సైనిక దళాల ప్రధానాధికారి ఎం.ఎం. నరవణే నవంబరులో ఆ దేశంలో పర్యటించబోతున్నారు. నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆయనకు నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారాన్ని అందజేయబోతున్నారు. ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్ భావించగా, అందుకు మన దేశం కూడా అంగీకరించడం వంటి పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. -
మా మధ్య మీ జోక్యం వద్దు: చైనా
బీజింగ్: భారత్‌తో సరిహద్దు సమస్య ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని, ఇందులో అమెరికా జోక్యం అనవసరమని చైనా పేర్కొంది. ఇండో పసిఫిక్ పేరిట అమెరికా ఈ ప్రాంతంపై పట్టుకోసం అవలంబిస్తున్న వ్యూహాలను మానుకోవాలని హెచ్చరించింది. భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యలు చక్కబెట్టుకునేందుకు యత్నిస్తున్నాయని చైనా ప్రతినిధి వాంగ్ వెంబిన్ చెప్పారు. ఇక ఇండో పసిఫిక్ వ్యూహాల పేరిట అమెరికా చేస్తున్న యత్నాలు ప్రచ్ఛన్న యుద్ధ(కోల్డ్ వార్) మనస్థత్వాన్ని చూపుతున్నాయని, తన ఆధిపత్యం చూపేందుకు యూఎస్ యత్నిస్తోందని, ఇవన్నీ మానుకోవాలని హెచ్చరించారు. కాగా 2+2 చర్చల్లో భాగంగా భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చైనాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం కారణంగా భారత సార్వభౌమత్వానికి ఎటువంటి భంగం కలగకుండా తాము తోడుగా ఉంటామని పేర్కొన్నారు. అదే విధంగా.. వుహాన్ నుంచి కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించిందని డ్రాగన్ దేశంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను వ్యతిరేకించే పార్టీగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీని అభివర్ణించారు.(చదవండి: చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా 2+2 చర్చలు ) చదవండి: ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం -
నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్, అమెరికాల మధ్య నేడు ఒక కీలకమైన రక్షణ రంగ ఒప్పందం కుదరనుంది. అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదిలీ సహా ఇరుదేశాల సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందం ఇది అని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ టీ ఎస్పర్ మధ్య సోమవారం జరిగిన చర్చల సందర్భంగా దీనిపై ఒక అంగీకారం కుదిరినట్లు తెలిపాయి. ఇరుదేశాల మధ్య రక్షణ సహా వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, రెండు దేశాల మధ్య సైన్యాల మధ్య సహకారం పెంపొందించుకోవడం మొదలైన అంశాలపై ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరిపారని, చైనాతో సరిహద్దు వివాదం అంశం కూడా వారిమధ్య చర్చకు వచ్చిందని వెల్లడించాయి. ఇరుదేశాల మధ్య ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)’ ఒప్పందం కుదరడంపై రాజ్‌నాథ్, ఎస్పర్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపాయి. మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ సోమవారం పరస్పర విస్తృత ప్రయోజనకర అంశాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్(నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా(ఎయిర్‌ఫోర్స్), డీఆర్డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి తదితరులున్నారు. భారత్, అమెరికాల మధ్య నేడు(మంగళవారం) ప్రారంభం కానున్న 2+2 కీలక మంత్రిత్వ స్థాయి చర్చల కోసం మార్క్ ఎస్పర్, మైక్ పాంపియో సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ 2+2 చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్, జైశంకర్ పాల్గొననున్నారు. ద్వైపాక్షిక సహకారంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతం విషయంలో పరస్పర సహకారం అంశంపై కూడా వారు చర్చించనున్నారు. అమెరికా మంత్రులు పాంపియో, ఎస్పర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌ను కూడా కలవనున్నారు. యూఎస్ రక్షణ మంత్రి ఎస్పర్‌కు రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద త్రివిధ దళాలు గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భార త్, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ 2+2 చర్చలు జరుగుతుండటం గమనార్హం. భారత్‌తో సరిహద్దు ఘర్షణలు, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి ప్రయత్నాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఎదుర్కొన్న తీరు.. తదితర అంశాలపై అమెరికా ఇప్పటికే పలుమార్లు చైనాను తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. రక్షణ, విదేశాంగ మంత్రుల భారత పర్యటనకు ముందు.. ‘ప్రాంతీయ, ప్రపం చ శక్తిగా భారత్ ఎదగడాన్ని అమెరికా స్వాగతిస్తోంది’ అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. 2016లో అమెరికా భారత్‌ను ‘ప్రధాన రక్షణ రంగ భాగస్వామి’గా ప్రకటించి, రక్షణ రంగ సహకారంలో విశ్వసనీయ మిత్రదేశం హోదా కల్పించింది. ఎస్పర్‌కు స్వాగతం పలుకుతున్న రాజ్‌నాథ్ -
సరిహద్దు సమస్యను గమనిస్తున్నాం!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు సమస్యను నిశితంగా గమనిస్తున్నామని, ఈ సమస్య ముదరకూడదని కోరుతున్నామని ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారత్‌కు తమ ప్రభుత్వం ఆయుధాల విక్రయాలు, సంయుక్త మిలటరీ విన్యాసాలు, సమాచార పంపిణీలాంటి పలు రూపాల్లో సహకరిస్తోందన్నారు. కేవలం హిమాలయ ప్రాంత సమస్యల విషయంలోనే కాకుండా భారత్‌కు అన్ని అంశాల్లో తాము సహకరిస్తున్నామని చెప్పారు. లద్దాఖ్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనా మధ్య టెన్షన్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో అన్ని వ్యవహారాల్లో భారత్ మరింత పాత్ర పోషించాలని తాము భావిస్తున్నట్లు అమెరికా అధికారి చెప్పారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు క్వాడ్ పేరిట భారత్, యూఎస్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్‌లు జట్టుకట్టాయి. చైనా ఇటీవల కాలంలో దక్షిణ, తూర్పు సముద్రాల్లో అన్ని పొరుగుదేశాలతో వివాదాలు పడుతోంది. తన ద్వీపాల్లో భారీగా మిలటరీ మోహరింపులు చేస్తోంది. ఈ సముద్ర జలాల్లో యూఎస్‌కు ఎలాంటి వాటా లేకున్నా, చైనా ఆధిపత్యం పెరగకుండా ఉండేందుకు ఆయా దేశాలకు సాయం చేస్తోంది. చైనాకు సవాలు విసురుతున్నట్లుగా ఈ సముద్ర జలాల్లో అమెరికా వార్‌షిప్పులు, ఫైటర్ జెట్లను మోహరిస్తోంది. అంతర్జాతీయ స్వేచ్ఛా నౌకాయానానికి భంగం కలగకుండా ఉండేందుకే తాము ఈ జలాల్లో ప్రవేశిస్తున్నామని అమెరికా చెబుతోంది. -
చైనా కొత్త ఎత్తుగడ; అప్పుడే ఉపసంహరణ!
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత భారత్- చైనా దేశాలు వాస్తవాధీన రేఖ వెంబడి భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకులను మోహరించాయి. కౌంటర్ అటాక్ కోసం మిసైళ్ల మోహరింపు సహా ఇతర యుద్ధ సామాగ్రిని బార్డర్‌కు తరలించాయి. అయితే ఇవి కేవలం ముందు జాగ్రత్త చర్యలు మాత్రమేనని, చర్చల ద్వారానే ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్నదే తమ ఉద్దేశమని, ఇరు దేశాల మధ్య జరుగుతున్న మిలిటరీ స్థాయి చర్చలు సుస్పష్టం చేస్తున్నాయి. కానీ మూడేళ్ల క్రితం డోక్లాం వివాదంలో, ఇటీవలి జూన్ 15 నాటి ఘటన తర్వాత డ్రాగన్ ఆర్మీ ఎంతటి ఘాతుకానికి పాల్పడేందుకైనా వెనకాడబోదన్న విషయం, చైనా సైన్యం కుయుక్తులు మరోసారి బట్టబయలయ్యాయి. ఇలాంటి తరుణంలో బలగాల ఉపసంహరణ విషయంలోనూ డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి: రణరంగంలో డ్రోన్లదే ప్రాధాన్యత) చైనా కుయుక్తులు తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నాటి నుంచి ఇప్పటికే పలు దఫాలుగా ఈ విషయం గురించి ఇరు వర్గాల మిలిటరీ అధికారుల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు విభేదాలను పరిష్కరించుకునే అంశం మీద దృష్టి పెట్టిన వేళ చైనా, అనేకమార్లు దుందుడుకుగా వ్యవహరించింది. ఎల్ఏసీ వెంబడి 5జీ నెట్వర్క్ ఏర్పాటు ప్రయత్నాలతో పాటుగా ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద కొత్తగా నిర్మాణాలు చేపట్టడం సహా, డోక్లాం, నకు లా, సిక్కిం సెక్టార్ల వద్ద డ్రాగన్ కొత్తగా రెండు ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు నిర్మిచండం వంటి కవ్వింపు చర్యలకు దిగింది. డోక్లాం పీఠభూమిలో భారత్- చైనా-భూటాన్ ట్రై జంక్షన్లో ఆర్మీ కార్యకలాపాలకు డ్రాగన్ చేపట్టిన కొత్త నిర్మాణాల ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి పిలవడమే లక్ష్యంగా జరుగుతున్న చర్చల్లో చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. (అణ్వాయుధాలను రెట్టింపు చేసుకునే పనిలో చైనా!?) యథాతథస్థితి నెలకొన్న తర్వాతే తొలుత యుద్ధ ట్యాంకులు, ఇతర సామాగ్రిని బార్డర్ నుంచి ఉపసంహరించుకున్న తర్వాతే, ఉద్రిక్తతలు తగ్గుతాయని, అప్పుడే బలగాల ఉపసంహరణ ప్రక్రియ కూడా సాఫీగా సాగిపోతుందనే వాదనను డ్రాగన్ లేవలెత్తినట్లు సమాచారం. అయితే చైనా కుయుక్తులను పసిగట్టిన భారత్, పలు దశల్లో బలగాలను వెనక్కి పిలిచి, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఉద్రిక్తతలు చల్లారే అవకాశం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక, లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి 1597 కిలోమీటర్ల మేర ఏప్రిల్ 2020 ముందునాటి యథాతథస్థితి నెలకొన్న తర్వాతే ఇది సాధ్యమవుతుందని తేల్చిచెప్పినట్లు సమాచారం. మిలిటరీ స్థాయి చర్చల్లో ఈ మేరకు ఇరువర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.(యుద్ధానికి సిద్ధంగా ఉండండి: జిన్‌పింగ్) ఒకవేళ తోక జాడిస్తే ఈ నేపథ్యంలో... యుద్ధ ట్యాంకులు, ఫిరంగి దళాలను వెనక్కి పిలవడం భారత్‌కు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పీఎల్ఏ మళ్లీ తోకజాడిస్తే, యుద్ధ సామాగ్రిని అంతత్వరగా బార్డర్‌కు తరలించలేమని, అదే సమయంలో ఇప్పటికే సరిహద్దుల్లో భారీస్థాయిలో రహదారులు, వంతెనల నిర్మాణాలు చేపట్టినందున డ్రాగన్‌కు వేగంగా కదిలి మరోసారి విషం చిమ్మే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్యాంగ్యాంగ్, హాట్‌స్ప్రింగ్స్‌లో చైనా ఆర్మీ గతంలో ప్రదర్శించిన దుందుడుకు వైఖరిని దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇక బలగాల ఉపసంహరణ విషయంలో చైనా జాప్యానికి గల కారణాలపై జాతీయ భద్రతా నిపుణులు మరో వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో ఈ అంశాన్ని ముడిపెడుతున్నారు.(భారత సరిహద్దులో 60 వేల చైనా సైన్యం: అమెరికా) అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఉంటుందా? ఈ క్రమంలో, నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేంత వరకు డ్రాగన్ చర్చల సాగదీతతకే ప్రాధాన్యం ఇస్తుందని, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూల ఫలితాలు వెలువడే అవకాశం ఉంటే ఒకలా, వ్యతిరేక పవనాలు వీస్తే చైనా ఆర్మీ వైఖరి మరోలా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చైనా, తైవాన్‌పై ఎక్కువగా దృష్టి సారించిందని, అధ్యక్ష ఎన్నికల ఫలితం తర్వాత భారత సరిహద్దుల్లో అనుసరించే వైఖరిపై ఓ స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కాగా తమ అంతర్భాగమని చైనా చెప్పుకొంటున్న తైవాన్‌కు అమెరికా అన్ని విధాలుగా అండగా ఉంటున్న సంగతి తెలిసిందే. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే! అయితే మరో వర్గం మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తోంది. వుహాన్‌లో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక వ్యవస్థ పతనం, రాజకీయపరంగా వస్తున్న విమర్శలు తదితర అంతర్గత అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జిన్‌పింగ్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చేదాకా వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగుతునాయని పేర్కొంటున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డ్రాగన్ ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు. -
44 బ్రిడ్జిల ప్రారంభం: చైనా తీవ్ర వ్యాఖ్యలు
బీజింగ్: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా మరోసారి భారత్‌ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. భారత కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్‌ను గుర్తించబోమంటూ విషం చిమ్మింది. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్‌లో చేపట్టిన నిర్మాణాలను కూడా వ్యతిరేకిస్తున్నామంటూ అక్కసు వెళ్లగక్కింది. కాగా లదాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ తదితర వ్యూహాత్మక ప్రాంతాల్లో 44 నూతన వారధులను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా నిర్మించిన ఈ బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు భారత సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగనుంది. ఈ విషయంపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. (చదవండి: పథకం ప్రకారమే పాక్, చైనా కయ్యం) ఈ మేరకు డ్రాగన్ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణమే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిందన్నారు. విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లను తాము గుర్తించబోమని వ్యాఖ్యానించారు. అదే విధంగా చైనా- భారత్‌ల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి కట్టుబడి సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొనేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం చూషుల్ వద్ద మరోసారి మిలిటరీ అధికారులు చర్చలు జరిపారు. ఈ విషయం గురించి చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. బలగాల ఉపసంహరణ విషయంలో లోతైన, సానుకూల చర్చ జరిగిందని పేర్కొంది. -
పథకం ప్రకారమే పాక్, చైనా కయ్యం
న్యూఢిల్లీ: సరిహద్దు విషయంలో దాయాది దేశం పాకిస్తానే కాదు చైనా సైతం తరచూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, ఒక పథకంలో(మిషన్) భాగంగానే పాక్, చైనా సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఆయన సోమవారం 44 నూతన వారధులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ వారధులు ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్‌కు 7,000 కిలోమీటర్ల సరిహద్దు ఉందని తెలిపారు. భారత్‌కు ఇబ్బందులు కలిగించాలని ఉత్తర దిశ నుంచి పాకిస్తాన్, తూర్పు దిశ నుంచి చైనా ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నూతన బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వారు సులువుగా అక్కడికి చేరుకోగలుగుతారని వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాకిస్తాన్, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూనే భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించనున్న 450 మీటర్ల సొరంగ మార్గం నెచిపూ టన్నెల్ నిర్మాణానికి ఆయన ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌ను రాజ్‌నాథ్ ప్రశంసించారు. -
చైనాకు బదులిచ్చేందుకు మిసైళ్లతో..
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా ఆర్మీ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా భారత్ సమాయత్తమవుతోంది. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌కు దీటుగా సమాధానమిచ్చేందుకు వీలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులు, ఇతర సామగ్రిని ఇప్పటికే తరలించింది. అదే విధంగా.. జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతంలో చైనా భారీ స్థాయిలో క్షిపణులు మోహరిస్తోందన్న వార్తల నేపథ్యంలో బ్రహ్మోస్, నిర్భయ్, ఆకాశ్ వంటి మిసైళ్లతో చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. చైనా గనుక హద్దు దాటితే వీటితో పాటు ఈ సూపర్ సోనిక్ నిర్భయ్‌ను రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. (చదవండి: ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!) ఇక ఎల్ఏసీ వెంబడి వివాదాస్పద ఆక్సాయ్ చిన్తో పాటు కష్గర్, హొటాన్, లాసా, నియాంగిచిల్ ప్రాంతాల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాల్లో నుంచి గాల్లోకి, గాల్లో నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలిగే బ్రహ్మోస్ 500 కిలోమీటర్లు, 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ద్వారా ప్రత్యర్థి దేశ ఆర్మీ పన్నాగాలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. తూర్పు లదాఖ్‌లో ఘర్షణ వాతావరణం, హిందూ మహాసముద్రంలో పీఎల్ఏ యుద్ధనౌకలు మోహరించిన వేళ, కార్ నికోబార్‌లోని ఐఏఎఫ్ ఎయిర్‌బేస్‌లో సు- 30 ఎమ్కేఐ యుద్ధ విమానాలను మోహరించి ఎయిర్- టూ- ఎయిర్ రిఫ్యూల్లర్స్(గాల్లోనే ఇంధనం నింపుకునేలా) ఉపయోగించి చురుగ్గా కదులుతూ ప్రత్యర్థులకు దీటుగా బదులిచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అదే విధంగా.. నిర్భయ్ వంటి సూపర్సోనిక్ మిస్సైళ్లలోని అంతర క్షిపణుల ద్వారా సుమారు 1000 కిలోమీటర్ల పరిధిలో గల లక్ష్యాలను చేరుకునేలా(100 మీటర్ల నుంచి 4 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరటం సహా టార్గెట్‌ను ఫిక్స్ చేసి సమర్థవంతంగా ఛేదించేలా) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకేసారి 64 టార్గెట్లను ట్రాక్ చేసి, ఒకేసారి పన్నెండింటిపై విరుచకుపడగలిగే 3-డీ రాజేంద్ర రాడార్ కలిగి ఉన్న ఆకాశ్ క్షిపణిని ప్రయోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను కూడా పేల్చేయగల సామర్థ్యం దీనిసొంతం. -
చైనాకు భారత్ ఘాటు హెచ్చరికలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్, చైనాకు స్పష్టం చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) కవ్వింపులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వాస్తవాధీన రేఖను దాటి భారత స్థావరాల వైపు చొచ్చుకువచ్చే ప్రయత్నం చేస్తే గట్టిగా సమాధానం ఇస్తామని పేర్కొంది. ఒప్పందాలు అతిక్రమించి ముందుకు వచ్చినట్లయితే ఆత్మరక్షణకై కాల్పులకు దిగేందుకు తమ సైనికులు వెనుకాడబోరని హెచ్చరికలు జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గల్వాన్ లోయలో ఘర్షణలు చోటుచేసుకున్న నాటి నుంచి భారత్- చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దఫాల చర్చల అనంతరం బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. అయితే డ్రాగన్ ఆర్మీ మాత్రం కొన్ని ప్రదేశాల్లో దుందుడుగానే వ్యవహరిస్తోంది.(చదవండి: విస్తృత బంధాల్లో సరిహద్దు ఒక భాగం) ఈ నేపథ్యంలో దేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం మాట్లాడుతూ.. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొంత సంక్లిష్టమైందని పేర్కొన్నారు. ఇందుకు పరస్పర ఆమోదనీయ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో చైనా ఆర్మీ అదే మొండివైఖరి ప్రదర్శిస్తే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అన్ని ఏరియాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డ్రాగన్ ఆర్మీకి స్పష్టం చేసినట్లు వెల్లడించింది. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్-చైనాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆరవ రౌండ్ కార్పస్ కమాండర్-స్థాయి చర్చలు చైనా భూభాగంలోని మోల్డోలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో భారత్ ప్రధానంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో నుంచి చైనా బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలు లక్ష్యంగా చర్చలు జరిగాయి. చైనా మొదట తన దళాలను వెనక్కి రప్పించాలని భారత్ కోరినట్లు సమాచారం. చైనానే మొదట చొరబాటుకు ప్రయత్నించింది కనుక.. ముందు అదే వెనక్కి తగ్గాలని భారత్ ఆశిస్తున్నట్లు తెలిసింది. (చదవండి:అంతర్జాతీయ సంకేతాలే కీలకం...) ప్యాంగ్యాంగ్ త్సో, హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, ఫింగర్ ఏరియాలో తక్షణమే చైనా దళాలు ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఒకవేళ చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే.. భాతర దళాలు సుదీర్ఘకాలం మోహరిస్తాయని హెచ్చరించింది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి లేహ్ ఆధారిత 14 కార్పస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా.. చైనా వైపు సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించినట్లు తెలిసింది. -
9 నెలల్లో ఏకంగా 3186 సార్లు ఉల్లంఘన
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ ఆగడాలు సరిహద్దుల్లో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికి పాక్ మాత్రం దాన్ని తుంగలో తొక్కుతూ తరచూ సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇదే తరహా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే సరిహద్దులో అప్రమత్తంగా ఉండే భారత సైన్యం… పాకిస్తాన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉంటుంది. అయితే 17 ఏళ్లలో మొదటిసారి సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎక్కువసార్లు ఉల్లంఘించింది. ఈ జనవరి నుంచి సెప్టెంబర్ 7 వరకు దాదాపు తొమ్మిది నెలల్లో 3186 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపింది. అయితే ప్రతిసారి భారత సైన్యం పాకిస్తాన్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా, పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ ప్రాంతంలో 242 సరిహద్దు కాల్పులు (జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు) జరిగాయని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రాజ్యసభలో తెలిపారు. (చదవండి: భారత్‌పై ఆన్లైన్ వార్‌కు పాక్ కుట్ర) ఈ ఏడాది కాల్పుల విరమణ ఉల్లంఘనల సందర్భంగా ఎనిమిది మంది ఆర్మీ సిబ్బంది దేశం కోసం మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు చంపబడ్డారు, అనేక ఇళ్ళు, భవనాలు ధ్వంసమయ్యాయని శ్రీపాద్ నాయక్ తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు 2,432 కాల్పుల విరమణ ఉల్లంఘనలు నమోదయ్యాయని ఇవి అప్రకటిత దాడులే కాక 2003 కాల్పుల విరమణ అవగాహనకు విరుద్ధంగా జరిగాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉపసంహరణతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని గతేడాది ఆగస్టులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం కూడా పెరిగింది. 2019 అంతటా సుమారు 2,000 కాల్పుల విరమణ ఉల్లంఘనలు మాత్రమే జరిగాయి. -
భారత్- చైనా: 5 అంశాల్లో కుదిరిన ఏకాభిప్రాయం!
మాస్కో/న్యూఢిల్లీ/బీజింగ్: గత కొన్ని నెలలుగా భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోయేలా ఇరు దేశాల మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సులో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్- చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ గురువారం సుమారుగా రెండున్నర గంటలపాటు సరిహద్దుల్లో తలెత్తిన విభేదాల గురించి చర్చించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (చదవండి: భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’) ఈ సందర్భంగా.. డ్రాగన్ ఆర్మీ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరు, భారీగా సైనిక బలగాలు, యుద్ధట్యాంకుల మోహరిస్తున్న చైనా వైఖరిపై జైశంకర్.. వాంగ్ యీ వద్ద అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సరిహద్దు వ్యవహారాలపై 1993, 1996లో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చైనా మంత్రికి భారత్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా సరిహద్దుల్లో శాంతి స్థాపన, సుస్థిరతకై సరైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని జైశంకర్ సూచించినట్లు పేర్కొన్నాయి.( చదవండి: ఇదే చైనా కుటిల నీతి..) భారత్- చైనా మంత్రుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం 1. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకుంటూ.. విభేదాలు.. వివాదాలుగా మారకుండా ఇరు వర్గాలు చొరవ చూపాలి. 2. ప్రస్తుతం సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఎవరికీ ప్రయోజనం చేకూర్చవు. కాబట్టి ఇరు వర్గాల సైనిక బలగాలు చర్చలు కొనసాగిస్తూ, త్వరగా ఉపసంహరణకు ఉపక్రమించి, సమదూరం పాటిస్తూ ఉద్రిక్తతలు చల్లారేలా చర్యలు తీసుకోవాలి. 3. భారత్- చైనా సరిహద్దు వ్యవహారాల్లో ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, శాంతి పెంపొందేలా చూడాలి. ఉద్రిక్తతలు పెరిగేలా ఎటువంటి చర్యలకు పూనుకోకూడదు. 4. సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులపై స్పెషల్ రిప్రెజంటేటివ్ మెకానిజం ద్వారా చర్చలు కొనసాగించాలి. కన్సల్టేషన్, కో-ఆర్డినేషన్ ఆన్ ఇండియా- చైనా బార్డర్(డబ్ల్యూఎంసీసీ) తరచుగా భేటీ అవుతూ సంబంధిత అంశాలపై చర్చించాలి. 5. బార్డర్లో విభేదాలు సమసిపోయి, ఇరు వర్గాల్లో పరస్పరం విశ్వాసం నింపి, శాంతి, సుస్థిరత నెలకొనేలా ఇరు దేశాలు సమర్థవంతంగా పనిచేయాలి. -
లద్దాఖ్ చేరుకున్న ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ భాగం, ఇతర ప్రాంతాల్లో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లద్దాఖ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, తలెత్తిన వివాదాల గురించి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో టాప్ కమాండర్లు తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న భూ వివాదాల గురించి ఆర్మీ చీఫ్‌కు వివరించనున్నట్లు సమాచారం. అంతేకాక భారత్ భూభాగంతో పాటు ఇక్కడి పర్వత ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నించిన చైనా సైనికులను ఇండియన్ ఆర్మీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ఆర్మీ చీఫ్ ఈ ఆపరేషన్లలో పాల్గొన్న అధికారులతో పాటు ఇతర సైనికులను కలవనున్నారని సమాచారం. చైనాతో ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న ప్యాంగ్యాంగ్ సో సరస్సు ప్రాంతంలో భారత్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా బలగాలకు గట్టి షాక్ ఇస్తూ ఇప్పటికే ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ తీరంలోని మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను భారత బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. (చదవండి: వ్యూహాత్మక మోహరింపు) ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంపై ప్రస్తుతం భారత సైన్యం ఆధిపత్యం చెలాయిస్తోంది. గత కొద్ది రోజులుగా, తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడానికి చైనా సైన్యం పలు ప్రయత్నాలు చేసింది. కానీ అప్రమత్తమైన భారత దళాలు ఈ ప్రయత్నాలన్నింటిని విఫలం చేశాయి. అంతకుముందు, ప్యాంగ్యాంగ్ సో సరస్సు ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో రెండు రోజుల పాటు(సోమ, మంగళవారాల్లో)చుషుల్‌లో బ్రిగేడ్ కమాండర్-స్థాయి చర్చలు జరిపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రతి రోజు ఆరుగంటలకు పైగానే సాగిన ఈ చర్చల్లో ఎలాంటి ఫలితం వెలువడలేదు. గత కొద్ది రోజులుగా భారత సైన్యం మనకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన కొండ శిఖరాలు, ప్రదేశాలను ఆక్రమించి చైనాపై పట్టు బిగించింది. -
చైనా ఆర్మీకి దీటుగా బదులిస్తున్న భారత సైన్యం
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా జవాబిస్తోంది. తూర్పు లదాఖ్‌లో దూకుడుగా ముందుకు సాగుతున్న జవాన్లు... ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ భాగాన కీలక శిఖరాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ సైనికులకు సరైన సమాధానం ఇవ్వాలని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో భారత ఆర్మీ ఈ మేరకు ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీ ఎత్తున సైనిక బలగాలు, యుద్ధ ట్యాంకులను మోహరించాయి. దీంతో భారత్- చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (చదవండి: సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: చైనా) కాగా ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ చైనా మిలిటరీ సోమవారం దుస్సాహసానికి దిగిన విషయం తెలిసిందే. ఇందుకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం.. డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇరు దేశాలు మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్ వైపున్న చుషుల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారులు చర్చలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (చదవండి: భారత్, చైనా మిలటరీ చర్చలు) -
సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: చైనా
బీజింగ్: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా ఉద్రిక్తతలు ఘర్షణలకు దారి తీయకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాల్సిన ఆవశ్యకత ఉందని డ్రాగన్ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. సినో- ఇండియా బార్డర్లో తామెప్పుడూ సుస్థిరతకే ప్రాధాన్యం ఇస్తామని, ఎన్నడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. భారత్‌తో సామరస్యపూర్వక చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ‘‘ఇటీవల కాలంలో చైనా- భారత్ సంబంధాలపై అన్ని వర్గాలకు ఆసక్తి పెరిగింది. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. పరిస్థితులు చేయి దాటిపోయేలా చైనా ఎన్నడూ ముందడుగు వేయలేదు. సరిహద్దుల్లో సుస్థిరత నెలకొల్పాలనే నిబద్ధతతో ఉంది. అయితే మా సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. రక్షణ కవచంలా నిలబడతాం. (చదవండి: మళ్లీ చైనా దుస్సాహసం) ఇంకొక విషయం ఏమిటంటే.. చైనా- భారత్ మధ్య సరిహద్దులు నిర్ణయించబడలేదు. కాబట్టి ఇలాంటి సమస్యలు తలెత్తడం సహజం. అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్రిక్తతలు ఘర్షణలుగా మారేందుకు అవకాశం ఇవ్వకూడదు. అదే ఇరు దేశాలకు శ్రేయస్కరం. డ్రాగన్(చైనా), ఎలిఫెంట్(ఇండియా) తలపడితే 1+1=2 అవుతుంది. అదే అవి రెండూ కలిసి డ్యాన్స్ చేస్తే 1+1=11 అవుతుంది. మరో ఉదాహరణ చెబుతాను. విభేదాలు పక్కనబెట్టి ఇరు దేశాధినేతలు పరస్పర ప్రయోజనాల గురించి ఆలోచిస్తే 2.7 బిలియన్ మంది ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగుతారు. ఇరు దేశాలు అభివృద్ధి చెందడంతో పాటుగా సత్పంబంధాల కారణంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. భారత్‌తో బంధం బలోపేతం చేసుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది’’ అని వాంగ్ యీ వ్యాఖ్యానించినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్యారిస్‌లోని ప్రఖ్యాత ఫ్రెంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో సోమవారం ప్రసగించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించింది. కాగా తూర్పు లదాఖ్, పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా ఆర్మీ బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడిందని భారత్ ప్రకటన విడుదల చేసిన కొద్దిసేపటికే వాంగ్ యీ ఈ మేరకు స్పందించడం గమనార్హం.(చదవండి: భారత్ – చైనాలే ఆశాదూతలు! ) -
మా దళాలు ఎల్ఏసీని దాటలేదు: చైనా
న్యూఢిల్లీ: చైనా దళాలు తూర్పు లద్దాఖ్, ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించినట్లు భారత్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా దీనిపై స్పందించింది. తమ ఆర్మీ ఎల్ఏసీని దాటలేదని స్పష్టం చేసింది. భారత్‌తో తాజా సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ పీఎల్ఏ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) దళాలు ఎల్ఏసీని ఎప్పుడూ దాటలేదని తెలిపారు. సరిహద్దు వివాదానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయన్నారు. ఆగస్టు 29న ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు ప్రయత్నించినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ దళాలు.. డ్రాగన్ చర్యలను తిప్పికొట్టాయి. (చదవండి: చైనా కవ్వింపు చర్యలు.. బదులిచ్చిన భారత్) మే నెలలో ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగిన దక్షిణ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో చైనా శిబిరాలను ఏర్పాటు చేయడమే కాక.. మౌళిక సదుపాయాలను పెంచే ప్రయత్నం చేస్తోంది. చైనా కదలికలను గమనించిన భారత సైన్యం పీఎల్ఏ చర్యలను అడ్డుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
చైనా కవ్వింపు చర్యలు.. బదులిచ్చిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగిన చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చింది. తూర్పు లదాఖ్, ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. బలగాల ఉపసంహరణ చర్చల ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రత్యర్థి దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది.(చదవండి: డోక్లాం సమీపంలో చైనా మిసైల్ బేస్‌ల నిర్మాణం) కాగా గల్వాన్ లోయలో జూన్ 15న ఘాతుకానికి పాల్పడిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు దఫాలుగా దౌత్యపరమైన, మిలిటరీ చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దశల వారీగా బలగాలను రప్పించాలనే ఒప్పందానికి తూట్లు పొడిచిన చైనా ఆర్మీ ఆగష్టు 29, 30 తేదీల్లో తూర్పు లదాఖ్, ప్యాంగ్ యాంగ్ సరస్సు వద్ద స్టేటస్ కోను మార్చే ప్రయత్నాలు చేసిందని భారత రక్షణ శాఖ వెల్లడించింది. (చదవండి: డ్రాగన్ దూకుడుకు చెక్) -
మారని చైనా తీరు.. మళ్లీ కొత్త నిర్మాణాలు!
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలకు పరిష్కారం దిశగా చర్చలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్ మరోసారి సరికొత్త నిర్మాణాలు చేపట్టింది. జూన్ నెలలో చెలరేగిన ఘర్షణలకు కేంద్ర బిందువైన తూర్పు లదాఖ్ సమీపంలో డెమ్చోక్ వద్ద చైనా 5జీ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి మెరుగైన కమ్యూనికేషన్ కోసం ఆగష్టు తొలి వారం నుంచే ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద కొత్తగా గుడారాలు, షెడ్లు నిర్మించినట్లు పేర్కొన్నాయి. ఓవైపు.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకై చర్చలు జరుగుతున్న వేళ చైనా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. దీంతో మరోసారి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: విమాన విధ్వంస క్షిపణులను ప్రయోగించిన చైనా) ఇదిలా ఉండగా.. వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లడంలో చైనీస్ బలగాలు జాప్యం చేస్తున్నందున భారత్ కూడా లదాఖ్‌లో మరిన్ని బలగాలు మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే మూడు రెట్ల మేర ఎక్కువ బలగాలను అక్కడికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఓ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ‘‘అనేక సమీక్షలు నిర్వహించిన అనంతరం బలగాల మోహరింపుపై నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేనందున సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింతగా పెంచుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.(చదవండి: 45 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రాణనష్టం) మారని డ్రాగన్ తీరు బలగాల ఉపసంహరణకై చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా వైఖరిలో ఎలాంటి మార్పు కనపడటం లేదు. ప్యాంగ్యాంగ్ సరస్సు వెంబడి డ్రాగన్ బలగాలు తమ ఉనికి చాటుకుంటూనే ఉన్నాయి. కేవలం ఫింగర్ 4, ఫింగర్ 5 వద్ద మాత్రమే కాస్త వెనక్కి జరిగినట్లు సమాచారం. దీంతో ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చేందుకు భారత్ సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పోటాపోటీగా నిర్ణయం తీసుకోవడం సరిహద్దుల వద్ద పరిస్థితులు మరింత సంక్లిష్టతరంగా మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా.. ఫింగర్ 4 ఏరియా నుంచి భారత్ బలగాలను వెనక్కి రప్పించినప్పటికీ.. అటువైపు నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఏప్రిల్ నాటికి ఉన్న యథాతథ స్థితిని కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనా మాత్రం ఫింగర్ 5,8 ఏరియాల్లో తన బలాన్ని మరింత పెంచుకున్నట్లు సమాచారం. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పడవలు తరలించి, గుడారాలు నిర్మించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘‘ప్యాంగ్యాంగ్ సరస్సు నుంచి వెనక్కి వెళ్లాలంటే భారత్ కూడా తన బలగాలను ఉపసంహరించాలని చైనా డిమాండ్ చేస్తోంది. అలా అయితే మా నియంత్రణలో ఉన్న ప్రాంతంపై పట్టు కోల్పోయినట్లు అవుతుంది. యథాస్థితి మార్పునకు ఇది దారి తీస్తుంది. చైనా డిమాండ్లతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి’’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి సరిహద్దు పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వివరించారు. (చదవండి: గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా రాయబారి) సైనిక చర్యకు వెనుకాడబోము జూన్‌లో గల్వాన్ లోయలో చైనా ఆర్మీ ఘాతుకానికి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను రూపుమాపేందుకు ఇప్పటికే పలు దఫాలుగా దౌత్య, మిలిటరీ చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా బలగాల ఉపసంహరణ విషయంలో ఇప్పటికే ఐదుసార్లు కార్‌్ప్స కమాండర్ స్థాయి చర్చలు జరుగగా.. త్వరలోనే మరోమారు మిలిటరీ అధికారుల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా ఘర్షణకు మూల కారణమైన గల్వాన్, పెట్రోల్ పాయింట్ 15, ప్యాంగ్యాంగ్ నుంచి ఇరు వర్గాలు బలగాల ఉపసంహరణకు అంగీకరించినప్పటికీ.. గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ఏరియా(పెట్రోల్ పాయింట్ 17ఏ) వద్ద మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో చైనా తీరు మారనట్లయితే సైనిక చర్యకు సైతం వెనుకాడేది లేదని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవలే డ్రాగన్‌ను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
మీ జోక్యం అక్కర్లేదు.. మాకు తెలివి ఉంది: చైనా
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరిస్తున్న డ్రాగన్.. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అక్కర్లేదంటూ యూకేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనను ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటామని పేర్కొంది. పరిస్థితులను చక్కదిద్దుకోగల తెలివి, సామర్థ్యాలు తమకు ఉన్నాయని ఘాటుగా విమర్శించింది. అదే విధంగా హాంకాంగ్ విషయంలోనూ ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోనూ బాహ్య శక్తుల ప్రమేయం వల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటి కారణంగా శాంతి, సుస్థిరతకు భంగం కలుగుతోందంటూ అమెరికా, యూకేను ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. ఈ మేరకు భారత్‌లో చైనా రాయబారి సన్ వెడాంగ్ శుక్రవారం ట్వీట్ చేశారు.(అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ) కాగా హాంకాంగ్ స్వయంప్రత్తిని కాలరాస్తూ చైనా అక్కడ జాతీయ భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా దక్షిణ చైనా సముద్రంపై కూడా ఆధిపత్యం చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇప్పటికే చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్నట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్న వేళ అమెరికా, యూకే డ్రాగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అంతేగాకుండా భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరును విమర్శిస్తున్నాయి.(అమెరికాకు బదులిచ్చేందుకు సిద్ధమవుతున్న చైనా!) చైనా తీరు సరికాదు: యూకే ఈ క్రమంలో తాజాగా పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతం, గోగ్రా పోస్ట్ నుంచి బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ బార్టన్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి అనేక సవాళ్లు విసురుతూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న చైనాకు బుద్ది చెప్పేందుకు మిత్ర పక్షాలతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ సుముఖంగా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా హాంకాంగ్ విషయంలో చైనా అనుసరిస్తున్న తీరు సరికాదని.. భారత్‌తో వాస్తవాధీన రేఖ వెంబడి, దక్షిణ చైనా సముద్రం విషయంలో కూడా డ్రాగన్ చర్యలపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే భారత్- చైనా సరిహద్దు విషయంలో జోక్యం చేసుకునే ఆలోచన మాత్రం తమకు లేదని స్పష్టం చేశారు. ఇక భద్రతా కారణాల దృష్ట్యా చైనీస్ దిగ్గజం హువావేను తమ దేశంలో నిషేధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఫిలిప్ వ్యాఖ్యలపై చైనా రాయబారి సన్ వెడాంగ్ ట్విటర్లో స్పందించారు. 1/2 Noted remarks regarding #China by British High Commissioner to India, rife with mistakes & false allegations. Boundary question falls within bilateral scope b/t #China & #India. We have wisdom & capability to properly handle differences. No need for third party interference. — Sun Weidong (@China_Amb_India) July 23, 2020 -
ఉపసంహరణపై సమీక్షలు అవసరం: ఆర్మీ
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లోని క్లిష్టమైన తూర్పు లద్దాఖ్ ప్రాంతం నుంచి ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉందని భారత్ పేర్కొంది. ‘బలగాల పూర్తి ఉపసంహరణకు రెండు పక్షాలు కట్టుబడి ఉన్నాయి. క్లిష్టమైన ఈ ప్రక్రియ అమలుపై ఎప్పటికప్పుడు పరిశీలన అవసరం. దౌత్య, సైనిక స్థాయిల్లో ఇవి క్రమం తప్పకుండా జరుగుతుండాలి’ అని ఆర్మీ ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు కార్ప్స్ కమాండర్ల నాలుగో దఫా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి దశ ఉపసంహరణ ప్రక్రియ అమలును సమీక్షించడంతోపాటు పూర్తిస్థాయి ఉపసంహరణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు చర్చించారని తెలిపారు. ‘అయితే, జూన్ 15వ తేదీ నాటి గల్వాన్ ఘటన నేపథ్యంలో పరస్పరం విశ్వాసం నెలకొనడానికి సమయం పడుతుంది. బలగాల సత్వర ఉపసంహరణ కూడా కష్టమే. పూర్తి స్థాయి ఉపసంహరణకు సైనిక స్థాయి చర్చలు మరికొన్ని జరగాల్సి ఉంది’ అని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అయిదో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు మరికొన్ని రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఈసారి పాంగాంగో సో ప్రాంతం నుంచి ఉపసంహరణలపైనే ప్రధానంగా దృష్టి ఉంటుందని భావిస్తున్నారు. ఘర్షణాత్మక పరిస్థితులను నివారించేందుకే తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వెంట యుద్ధ పరిస్థితులను నివారించేందుకే రెండు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ‘క్లిష్టమైన ఈ ప్రక్రియకు సంబంధించి ఆధారాలు లేని, అసత్య వార్తలను పట్టించుకోవద్దంది. ఎల్ఏసీ వెంట రెగ్యులర్ పోస్టుల్లో తిరిగి బలగాలను మోహరించాలని కూడా నిర్ణయించాయని తెలిపింది. ఇది పరస్పర ఆమోదంతో తీసుకుంటున్న చర్య అనీ, దీనిని తప్పుగా అర్థం చేసుకోరాదని పేర్కొంది. -
సరిహద్దుల్లో అన్ని ప్రొటోకాల్స్ పాటించాలి
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన కోసం సరిహద్దుల నిర్వహణలో పరస్పరం అంగీకరించిన ప్రొటోకాల్స్ అన్నీ పాటించి తీరాలని చైనాకి భారత్ మిలటరీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎక్కువ బాధ్యత తీసుకోవాలని గట్టిగా చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాల్లో చైనా తమ సైన్యాన్ని ఉపసంహరిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు 15 గంటల సేపు సుదీర్ఘంగా సాగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చెబుతున్న కొత్త సరిహద్దులపై ఆందోళన వ్యక్తం చేసిన భారత సైనిక బృందం, మే 5కి ముందు నాటి పరిస్థితుల్నే కొనసాగించాలని, ఆ నిబంధనలకు అనుగుణంగా పెట్రోలింగ్ నిర్వహించాలని గట్టిగా చెప్పింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు నాలుగో దఫా కమాండర్ స్థాయి చర్చల్లో పురోగతి సాధించినట్టుగా చైనా వెల్లడించింది. రేపు లద్దాఖ్‌కు రాజ్‌నాథ్ వివాదాస్పద ప్రాంతాల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేలా భారత్, చైనా పరస్పరం అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌కు వెళ్లనున్నారు. సరిహద్దుల్లో పరిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు. భారత సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలు తూర్పు లద్దాఖ్‌లో చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో త్రివిధ దళాలకు రక్షణ శాఖ బుధవారం ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. రూ.300 కోట్లతో అత్యవసరమైన కార్యకలాపాలకు అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఎన్ని ఆయుధాలు కొనాలన్న దానిపై ఎలాంటి పరిమితి లేదు. అయితే, మొత్తం ఖర్చు మాత్రం రూ.300 కోట్లు దాటకూడదు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
భారత్‌కు పెరుగుతున్న మద్దతు!
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా హద్దులు మీరితే తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టమైన సంకేతాలు జారీ చేసిన విషయం విదితమే.‘బలహీనులు, పిరికివారు శాంతిని సాధించలేరు. శాంతి స్థాపనకు ముందుగా ధైర్య సాహసాలు అత్యంత ఆవశ్యకం. అవి భారత జవాన్ల వద్ద పుష్కలంగా ఉన్నాయి’అంటూ భారత ఆర్మీ శక్తిసామర్థ్యాల గురించి మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. అదే విధంగా సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి ప్రమాదకరమంటూ.. విస్తరణ వాదానికి కాలం చెల్లించిందంటూ చైనాకు స్పష్టమైన సందేశమిచ్చారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా సహా ఫ్రాన్స్ సహా పలు దేశాలు, అంతర్జాతీయ సమాజం నుంచి భారత్‌కు మద్దతు పెరుగుతుండటం అన్ని విధాలుగా సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు.(సెల్యూట్.. బ్రేవ్ హార్ట్స్!) అలాంటి చర్యలకు వ్యతిరేకం ప్రధాని మోదీ లద్ధాఖ్ పర్యటించిన నేపథ్యంలో భారత్‌లో జపాన్ రాయబారి సతోషి సుజుకి కీలక వ్యాఖ్యలు చేశారు. యథాస్థితిని మార్చే ఏకపక్ష చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ డ్రాగన్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. భారత్‌కు తమ దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘చర్చల ద్వారా శాంతియుతమైన పరిష్కారాన్ని జపాన్ కోరుకుంటోంది. అదే సమయంలో యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’’అంటూ భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాతో సంభాషణ తర్వాత ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా 2017లో చైనాతో డోక్లాం వివాద సమయంలోనూ జపాన్.. భారత్‌కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. భారత్ నిర్ణయం భేష్ భారత- చైనా సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు ఆ దేశాన్ని పాలిస్తున్న చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని తేటతెల్లం చేస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక అదే విధంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. భారత్ చైనా యాప్‌లపై నిషేధం విధించడాన్ని స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. సీసీపీ ఆధీనంలోనే ఆ యాప్‌లు పనిచేస్తాయంటూ ఘాటు విమర్శలు చేశారు. అదే విధంగా అమెరికా బలగాలను రంగంలోకి దింపేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చైనాకు హెచ్చరికలు జారీ చేశారు.(చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధనౌకలు) అవసరమైతే సాయుధ బలగాలు దింపుతాం వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు నేపథ్యంలో ఫ్రాన్స్.. భారత్‌కు అండగా ఉంటామని స్పష్టం చేసింది. అవసరమైతే తమ సాయుధ బలగాలను తరలించడం సహా పాటు భారత్‌కు ఏవిధమైన సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. దక్షిణాసియా ప్రాంతంలో భారత్ తమ వ్యూహాత్మక భాగస్వామని.. క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని పేర్కొంది. జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించడం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖలో ఈ మేరకు సాయం ప్రకటించారు. నిశితంగా పరిశీలిస్తున్నాం కరోనా వ్యాప్తి తొలినాళ్ల నుంచి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా 2020 వ్యూహాత్మక రక్షణ విధానం, 2024 ప్రణాళికను ప్రారంభించిన సందర్భంగా.. ఇటీవలి కాలంలో భారత్- చైనా, దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరగడం గమనిస్తున్నామన్నారు. వ్యూహాత్మకంగా, రక్షణపరంగా ఎంతో కీలకమైన ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారణాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో పదేళ్లకాలానికి 270 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించిన సందర్భంగా.. కేవలం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇండో- పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులు, పరస్పర సహాయ సహకారాలు అందించుకోవడంలో భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం ముందుంటాయని పేర్కొన్నారు. ఆ ప్రాంతంపై ఆధిపత్యం చాటుకోవాలనుకుంటున్న చైనా తీరును పరోక్షంగా విమర్శించారు. కాగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఆస్ట్రేలియా.. చైనా హువావే టెక్నాలజీస్ లిమిటెడ్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో వివాదం ఆందోళనకరం సరిహద్దు వివాదాన్ని భారత్, చైనాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు తదితర పరిణామాలు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. అయితే తాము ఎటువైపు ఉంటామో బోరిస్ స్పష్టం చేయకపోయినా.. హాంకాంగ్ విషయంలో మాత్రం చైనాపై బ్రిటన్ గుర్రుగానే ఉంది. ఈ మేరకు బుధవారం ప్రధాని మాట్లాడుతూ.. హాంకాంగ్ విషయంలో చైనా ఒప్పందాన్ని అతిక్రమించి, తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ పెరగడంతో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కీలక విషయాన్ని వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని శుక్రవారం ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో సమగ్ర, దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ టాప్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే భారతదేశంలో టీవీల తయారీని కంపెనీ ప్రారంభించామన్నారు. అలాగే ఈ వారంలో తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌ను భారత్, యూరప్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. 2014లో ప్రవేశించినప్పటి నుండి భారతదేశం వన్‌ప్లస్‌కు కీలకమైన మార్కెట్‌గా కొనసాగుతోందనీ, 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చాలా కష్టపడ్డామని వన్‌ప్లస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవ్నిత్ నక్రా చెప్పారు. దేశంలో వన్‌ప్లస్ టీవీల తయారీని మొదలు పెట్టామని, గత సంవత్సరం హైదరాబాద్‌లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ప్రారంభించామని వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని నక్రా చెప్పారు. ఈ కేంద్రంలోని కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్, నెట్వర్కింగ్ ల్యాబ్‌లు ఆటోమేషన్ ల్యాబ్‌ల కనుగుణంగా కెమెరా, ఆటోమేషన్, నెట్వర్కింగ్, కనెక్టివిటీ ఫ్యూచర్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు. ప్రధానంగా 5 జీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. దేశంలో 5 వేలకు పైగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఉండగా, త్వరలోనే ఈ సంఖ్యను 8000 దాటాలనే ప్రణాళికలో ఉన్నామని వివరించారు. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన) వన్‌ప్లస్ 2018 ఫిబ్రవరి నుండి భారతదేశంలో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రీమియం హ్యాండ్సెట్ తయారీదారు గురువారం అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ టీవీ యు, వై సిరీస్‌ను కంపెనీ గురువారం విడుదల చేసింది. కాగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చైనాకు చెందిన అనేక కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. అయితే లద్దాఖ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల రీత్యా, టిక్‌టాక్, వీచాట్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. -
బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో ముందంజలో ఉన్న ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) మరో కీలక అడుగు వేసింది. కరోనా విస్తరణ, సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో 'చైనాను బహిష్కరించండి' అంటూ దేశీయ టాప్ పారిశ్రామికవేత్తలకు ఒక ఈ లేఖ రాసింది. చైనా వస్తువులను ఉపయోగించడం మానుకోవాలంటూ అంబానీ, టాటా, గోద్రేజ్, ప్రేమ్‌జీ, మిట్టల్‌కు తదితర 50 మంది దిగ్గజాలనుద్దేశించి సీఏఐటీ ఈ లేఖ రాసింది. భారత ప్రజలు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా, భారతీయ పరిశ్రమ కెప్టెన్లలో ఒకరిగా భావిస్తారనీ తామూ అదే నమ్ముతున్నామని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ సూపర్ పవర్‌గా భారత ప్రయాణాన్ని పునర్నిర్మించే ఈ సామూహిక ఉద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇది భారతదేశాన్ని 'స్వయం ఆధారిత భారత్' గా మార్చడానికి దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్నిస్తుందని ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. ఈ లేఖను పంపిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల జాబితాలో ముకేశ్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, అజీం ప్రేమ్ జీ, కుమారం మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, గౌతమ్ అదానీ, అజయ్ పిరమల్, విక్రమ్ కిర్లోస్కర్, సునీల్ భారతి మిట్టల్, రాహుల్ బజాజ్, శివ్ నాదర్, పల్లోంజి మిస్త్రీ, ఉదయ్ కోటక్, నుస్లీ వాడియా, శశి మధుకర్ పరేఖ్, హర్ష్ మారివాలా, డాక్టర్ సతీష్ రెడ్డి, పంకజ్ పటేల్ , నీలేష్ గుప్తా తదితరులు ఉన్నారు. కాగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, సౌరశక్తి వంటి వ్యాపారాలు చైనా దిగుమతులు, ప్రధానంగా విడిభాగాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాగే స్మార్ట్ఫోన్లు, ఔషధాలు, పునరుత్పాదక ఇంధనం, ఆటోమొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్ వంటివి కూడా చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడతాయి, దీంతో చైనా దిగుమతులు, వస్తువుల నిషేధం అంశంపై పరిశ్రమ వర్గాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు మారుతి, బజాజ్ వంటి ఆటో సంస్థలు చైనా నుండి దిగుమతులను తగ్గించడం రాత్రికి రాత్రికి సాధ్యం కాదని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి. గత 15 సంవత్సరాలకు పైగా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. భారీ పెట్టుబడులు పెట్టాం. చాలా విశ్వసనీయమైన, స్నేహితులున్నారు. అకస్మాత్తుగా నిలిపివేయాలంటే ఎలా అని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ప్రశ్నించారు. ఒక సంస్థగా, దేశంగా ఇది ఎంత వరకు సబబో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. మరోవైపు రాబోయే 3 సంవత్సరాల్లో ఆటోమోటివ్ రంగంలో విడి భాగాల దిగుమతులు, ఇతర సాధనాలపై ఆధారపడటాన్ని సగానికి తగ్గించడం సాధ్యమని ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. చైనాలోని వ్యూహాన్ నుంచి కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, సరిహద్దు వెంబడి చైనా దుశ్చర్య కారణంగా గాల్వన్ ప్రావిన్స్‌లో 20 మంది సైనికుల మరణం తరువాత చైనా బహిష్కరణ ప్రచారాన్ని సీఏఐటీ ఉధృతం చేసింది. దాదాపు 500 ఉత్పత్తులను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. 2021 డిసెంబర్ నాటికి 100,000 కోట్ల (13.3 బిలియన్ డాలర్లు) రూపాయల దిగుమతులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019-20లో చైనా నుండి 65.26 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకుంది. 2019-20లో 81.86 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ఇండియాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. -
నేపాల్‌కు గట్టి షాకిచ్చిన చైనా!
న్యూఢిల్లీ: నేపాల్ ప్రభుత్వానికి చైనా గట్టి షాకిచ్చింది. టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని ఆక్రమించింది. త్వరలోనే అక్కడ అవుట్‌పోస్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం నివేదిక ఈ విషయాన్ని వెల్లడించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. ఆ వివరాల ప్రకారం.. ఇరు దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఉన్న నదుల గమనాన్ని మళ్లించి నేపాల్‌లోని 10 ప్రాంతాలను డ్రాగన్ ఆక్రమించింది. చైనా చేపడుతున్న నిర్మాణాల వల్ల హమ్లా జిల్లాలోని 10 హెక్టార్లు, రసువా జిల్లాలోని ఆరు హెక్టార్ల భూభాగం దురాక్రమణకు గురైంది. (చైనా మరో ఎత్తుగడ.. బంగ్లాదేశ్‌తో బంధం!) అదే విధంగా టిబెట్‌లో నిర్మిస్తున్న రోడ్డును పూర్తి చేసేందుకు... సంజంగ్, కామ్‌ఖోలా నది గమనాన్ని మళ్లించి.. 9 హెక్టార్లు, ఖరానే ఖోలా, భోటే కోసీలోని 11 హెక్టార్ల భూమిని డ్రాగన్ ఆక్రమించింది. అంతేగాకుండా భవిష్యత్తులో మరింత భూభాగాన్ని ఆక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయని సర్వే వెల్లడించింది. కాగా భారత భూభాగంలోని లిపులేఖ్, లింపియదుర, కాలాపానీ ప్రాంతాలను తమ దేశంలోని భూభాగాలుగా చూపిస్తూ నేపాల్ కొత్త మ్యాప్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. (అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తోన్న నేపాల్) అంతేగాక ఇటీవల బిహార్‌లోని కొంత ప్రాంతాన్ని తమ భూభాగంగా పేర్కొంటూ మరో దుస్సాహసానికి పూనుకుని... బిహార్ జల వనరుల శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాకు మరింత దగ్గరైన నేపాల్‌కు డ్రాగన్ తాజా చర్య ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. కాగా గత కొన్ని రోజులుగా భారత్‌ను విమర్శిస్తున్న నేపాల్ పాలకులు... చైనా హాంకాంగ్‌లో ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎలక్ట్రానిక్స్‌కు ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయ్..
ముంబై: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎలక్ట్రానిక్స్ దిగుమతులను భారత్ నిజంగానే తగ్గించుకోదల్చుకుంటే ప్రత్యామ్నా య మార్కెట్లు చాలానే ఉన్నాయని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముంబై (డబ్ల్యూటీసీ) వెల్లడించింది. సింగపూర్, మలేసియా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతులను పెంచుకునే అంశం పరిశీలించవచ్చని పేర్కొంది. డబ్ల్యూటీసీ గణాంకాల ప్రకారం చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, టీవీ సెట్లు ఉంటున్నాయి. చమురుయేతర ఉత్పత్తుల దిగుమతుల్లో చైనాకు 14% వాటా ఉంటోంది. ‘2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలం లో మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతుల విలువ రూ.3.59 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువ సుమారు రూ. 1.42 లక్షల కోట్లు.. అంటే దాదాపు మొత్తం దిగుమతుల్లో 40% వాటా’ అని డబ్ల్యూటీసీ తెలిపింది. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతుల్లో అత్యధిక వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక దిగుమతులు, కంప్యూటర్, ఐటీ హార్డ్‌వేర్, మొబైల్ ఫోన్స్ మొదలైనవి) ఉంటోంది. మొబైల్ దిగుమతులు తగ్గినా.. చైనాదే హవా.. గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల దిగుమతులు మొత్తం మీద తగ్గినప్పటికీ చైనా వాటా మాత్రం పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్ – 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో సెల్ ఫోన్ దిగుమతులు సగానికి సగం పడిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని రూ. 11,304 కోట్ల నుంచి రూ. 6,313 కోట్లకు క్షీణించాయి. దేశీయంగా తయారీ పెరగడం, హ్యాండ్‌సెట్స్‌పై దిగుమతి సుంకాలు పెంచడం ఇందుకు కారణం. అయితే, చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గినప్పటికీ మొత్తం దిగుమతుల్లో దాని వాటా 55 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది. దేశీయంగా ఉత్పత్తికి ఊతం... కేంద్రం ఇటీవల కొన్నాళ్లుగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పలు స్కీములను అమలు చేస్తోంది. దీంతో 2014–2020 మధ్య కాలంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 20.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.73 లక్షల ఓట్లుగా ఉన్న స్థానిక ఉత్పత్తి 2019–20లో రూ. 5.33 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ పరిస్థితులు చూస్తే ఇది మరింత వేగంగా వృద్ధి చెందనుందని డబ్ల్యూటీసీ అంచనా వేసింది. అయితే, దేశీయంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగే దాకా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకునే క్రమంలో ఇతర మార్కెట్లవైపు చూడవచ్చని తెలిపింది. సింగపూర్, అమెరికా, మలేసియా, జపాన్ నుంచి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కలర్ టీవీ సెట్లను, సింగపూర్, తైవాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్ నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. -
‘50 ఏళ్ల పప్పును ప్లేస్కూల్‌కు పంపాలి’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అసలు పేరు ‘సరెండర్ మోదీ’ అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖా మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం, రాజకీయ పరిజ్ఞానం లేని 50 ఏళ్ల పప్పును పొలిటికల్ ప్లేస్కూల్‌కు పంపాలని ఎద్దేవా చేశారు. అప్పుడైనా దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుస్తుందని విమర్శించారు. కాగా గల్వన్ లోయ ప్రాంతంలో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో..‘చైనాతో భారత్ బుజ్జగింపు విధానం బట్టబయలు’ అనే శీర్షికతో ఉన్న విదేశీ పత్రిక కథనాన్ని రాహుల్ గాంధీ ఆదివారం ట్విటర్లో షేర్ చేశారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని.. అందుకే మోదీ అసలు పేరు ‘సరెండర్ మోదీ’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (‘చైనా దురాక్రమణకు అవే సాక్ష్యం’) ఈ విషయంపై స్పందించిన అబ్బాస్ నఖ్వీ సోమవారం ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘50 ఏళ్ల పప్పును వాళ్ల కుటుంబం ఇప్పటికైనా పొలిటికల్ ప్లేస్కూల్‌కు పంపించాలి. అప్పుడే ఆయన ఫ్వూడలిస్టు విధానాలు, అసంబద్ధమైన భాషకు కళ్లెం పడుతుంది. ఆయనకు అసలు దేశ సంస్కృతి, సంప్రదాయాలు అర్థంకావు. నిరాధారమైన కథనాలు, వదంతులను నమ్ముతూ రాజకీయం చేయాలని చూస్తున్నారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ, నాయకత్వం గురించి విచిత్ర ప్రశ్నలు వేస్తారు. తద్వారా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటారు. రోజంతా ప్రధాన మంత్రిని నిందిస్తూనే ఉంటారు. ఆయన ఉపయోగించే యాస, భాష దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించదు. ఇప్పటికైనా తన భాషను సరిచేసుకోవాలి’’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక సరిహద్దు వివాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ అసంబద్ధ వ్యాఖ్యానాలు చేస్తోందని.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని పునరుద్ఘాటించారు. కాగా ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో ఇంగ్లిష్ పదం సరెండర్ స్పెల్లింగ్‌ను surrenderకు బదులు surender అని రాహుల్ గాంధీ పేర్కొనడం గమనార్హం.( ప్రధాని వ్యాఖ్యలకు వక్రభాష్యాలు.. పీఎంవో స్పష్టత!) -
చైనాను ఆర్థికంగా ఢీకొట్టే వ్యూహాలు..
ముంబై: ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రజలు చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని డిమాండ్ ఎక్కువైంది. కాగా తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్త ఎగుమతులలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాను ఢీకొట్టడం అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. దిగుమతులు తగ్గించుకొని, తయారీ రంగంలో చైనా వస్తువులతో ఆధారపడకుండా, సొంతంగా ఎదగడానికి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. తాజా ఉద్రిక్త పరిస్థితులలో నూతన స్మార్ట్పోన్లను లాంచ్ చేసే ఈవెంట్లను చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థలు వాయిదా వేసుకున్నాయి. కాగా దేశ వృద్ధిలో చైనా ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 సంవత్సరంలో సిక్కింలో డొక్లాం ప్రాంతంపై సరిహద్దు వివాదాలున్న మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు చైనీస్ దిగ్గజాలు హువాయి టెక్నాలజీస్, షియోమీ బ్రాండ్స్ వైవిధ్యమైన స్మార్ట్ఫోన్స్తో అలరిస్తున్నాయి. అయితే దేశీయ మొబైల్ వినియోగంలో 75 శాతం చైనా నుంచి దిగుమతవుతున్నాయి. మరోవైపు దేశీయ ఫార్మా దిగుమతులలో 75శాతం ముడిపదార్థాలు చైనా నుంచి లభిస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాను ఢీకొట్టాలంటే ఒకేసారి వస్తువులను బ్యాన్ చేయాలనడం సరికాదని, అలా పిలుపునిస్తే అంతర్జాతీయంగా దేశానికి నష్టం కలిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకుల ప్రకారం.. దేశీయ తయారీ రంగానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తు, యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారిస్తే తయారీ రంగంలో వేరే దేశంపై భారత్‌కు ఆధారపడే అవకాశం తగ్గుతుంది. అలాగే యువతకు ఉపాధితో పాటు నిరుద్యోగం తగ్గి, దేశ వృద్ధి రేటు పెరుగుతుంది. కాగా దేశీయ సంస్థలు తక్కువ ధరకే క్వాలిటీ వస్తువులు అందించి, చైనాను భావోద్వేగంతో కాకుండా క్వాలిటీతో ఢీకొట్టాలి. దేశీయ మార్కెట్లో చైనా వస్తువులను ప్రజలు స్వచ్చందంగా బహిష్కరించే ప్రణాళికలు రచించడానికి సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: ఈ పాపులర్ యాప్స్ అన్నీ చైనావే) -
డ్రాగన్ దూకుడు.. తైవాన్ హెచ్చరికలు!
తైపీ: చైనా యుద్ధ విమానాలు మరోసారి తైవాన్ గగనతలంలోకి దూసుకొచ్చాయి. చైనీస్ ఫైటర్ జెట్లు జే-10, జే-11 గురువారం ఉదయం తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన గస్తీ బలగాలు సమాచారాన్ని అధికారులకు చేరవేయగా.. రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేయడంతో చైనా విమానాలు వెనక్కి వెళ్లాయి. ఈ మేరకు తైవాన్ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా గత పది రోజుల్లో చైనా ఫైటర్ జెట్లు తైవాన్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లడం ఇది ఐదోసారి. ఈ నేపథ్యంలో చైనా- తైవాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ఇష్టపడని చైనా.. పదే పదే ఆ ప్రాంతంపై ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. (సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: చైనా) ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా విమానం తైవాన్ గగనతలంలో ప్రవేశించగా.. అగ్రరాజ్యం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందంటూ వాగ్యుద్ధానికి దిగింది. అంతేగాక అమెరికా చర్య తమ సార్వభౌమత్వాన్ని సవాలు చేసిందని విరుచుకుపడింది. ఈ విషయంపై స్పందించిన తైవాన్.. అమెరికా సీ-40ఏ బోయింగ్ 737 (మిలిటరీ వర్షన్) తమ అనుమతి పొందిన తర్వాతే గగనతలంలో ప్రవేశించిందని డ్రాగన్‌కు కౌంటర్ ఇచ్చింది. అంతేగాకుండా సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా ఇకనైనా తన పంథా మార్చుకోవాలని హితవు పలికింది. ఇదిలా ఉండగా... భారత్- చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. డ్రాగన్‌పైకి రాముడు బాణం సంధించినట్లుగా ఉన్న ఫొటోను ప్రచురించిన తైవాన్ న్యూస్(స్థానిక మీడియా).. ‘‘మేం జయించాం. మేం వధిస్తాం’’అనే క్యాప్షన్‌ను జతచేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే విధంగా చైనా ఆధిపత్యంలో అణచివేతకు గురవుతున్న హాంకాంగ్ వాసులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తుండటం మరో విశేషం. -
సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: చైనా
బీజింగ్: సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా చర్చలకు సిద్ధమంటూనే చైనా పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. గాల్వన్ లోయ ప్రాంతం తమదేనని ఆ దేశ మిలటరీ అధికారులు సహా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా సోమవారం నాటి ఘర్షణలకు భారత సైన్యమే కారణమంటూ ఆరోపణలు చేశారు. తాజాగా చైనా విదేశాంగ శాఖ సమాచార విభాగం డైరెక్టర్ జనరల్ హువా చునింగ్ కూడా అదే రాగం ఆలపించారు. గాల్వన్ లోయలో చైనా సైనికుల ఘాతుకాన్నిభారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తీవ్ర స్థాయిలో ఖండించిన నేపథ్యంలో గురువారం ట్విటర్ వేదికగా భారత ఆర్మీపై ఆమె అక్కసు వెళ్లగక్కారు.(చైనాకు రైల్వే శాఖ షాక్.. ఒప్పందం రద్దు!) ఈ మేరకు.. ‘‘ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘించి భారత బలగాలు వాస్తవాధీన రేఖ దాటాయి. ఉద్దేశపూర్వకంగానే చైనా అధికారులు, సైనికులపై దాడులు చేశాయి. భౌతిక దాడుల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి’’ అని భారత సైన్యంపై అసత్య ప్రచారానికి పూనుకున్నారు. అదే విధంగా చైనా ఆర్మీని తక్కువగా అంచనా వేయొద్దని... దేశ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని వ్యాఖ్యానించారు. కాగా గాల్వన్ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి భారత జవాన్లపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసినట్లు ఘటనాస్థలంలో ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ ఘర్షణకు చైనా వ్యవహరించిన తీరేన కారణమని పేర్కొంది. క్షేత్రస్థాయిలో మార్పులు చేయాలన్న ముందస్తు ప్రణాళికతోనే డ్రాగన్ ఇలా వ్యవహరించిందని, ఇది గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. Indian front-line troops broke the consensus and crossed the Line of Actual Control, deliberately provoking and attacking Chinese officers and soldiers, thus triggering fierce physical conflicts and causing casualties. — Hua Chunying 华春莹 (@SpokespersonCHN) June 18, 2020 -
మారని చైనా తీరు.. మళ్లీ అదే మాట!
బీజింగ్: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో గురువారం తెలిపారు. కమాండర్ స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని.. త్వరలోనే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం, సుస్థిరత నెలకొనే దిశగా ఇరు దేశాలు నిజాయితీగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక గాల్వన్ లోయ ఘర్షణలకు భారత సైనికులనే బాధ్యులను చేస్తూ అసత్య ప్రచారాలకు దిగిన డ్రాగన్.. తాజాగా మరోసారి అదే పంథాను అనుసరించింది. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జావో సమాధానం ఇచ్చిన విధానమే ఇందుకు నిదర్శనం.(సుదీర్ఘంగా సాగిన ఇండో-చైనా సైనికాధికారుల భేటీ) ‘‘సినో- ఇండియన్ బార్డర్‌లోని గాల్వన్ నదిపై చైనా డ్యామ్ నిర్మిస్తుందా? దానిని అడ్డుకునేందుకు భారత బలగాలు ప్రయత్నించినందు వల్లే తాజా ఘర్షణ చోటుచేసుకుందా’’ అని విలేకరులు ప్రశ్నించగా.. డ్యామ్ విషయం గురించి స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అయితే ఘర్షణలకు మాత్రం భారత ఆర్మీ ప్రవర్తనే కారణమంటూ మరోసారి విషం చిమ్మారు. చైనా సైనికుల తప్పేమీ లేదంటూ సమర్థించుకున్నారు. అదే విధంగా సోమవారం నాటి ఘటనలో ఎంత మంది చైనా సైనికులు మరణించారన్న ప్రశ్నలకు కూడా జావో సమాధానం దాటవేశారు. కాగా ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం విదితమే. (గల్వాన్ లోయ భారత్‌దే: అమీన్ గల్వాన్) -
గాల్వన్ లోయ భారత్‌దే: అమీన్ గాల్వన్
న్యూఢిల్లీ: గాల్వన్ లోయ ఇప్పుడు.. ఎప్పుడు భారతదేశంలో భాగమని అమీన్ గాల్వన్ అన్నారు. ప్రముఖ సాహసికుడు గులాం రసూల్ గాల్వన్ పేరు మీదుగా ఈ ప్రాంతానికి గాల్వన్ లోయ అనే పేరు వచ్చింది. ఆ రసూల్ గాల్వన్ మనవడే ఈ అమీన్ గాల్వన్ ఈ క్రమంలో లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం రాత్రి గాల్వన్‌లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు మరణించారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. చైనా మాత్రం ఇప్పటి వరకు తమ సైనికులు ఎంతమంది చనిపోయారో అధికారికంగా ప్రకటించలేదు. గాల్వన్ ఘటన తర్వాత ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల వైరంపై గల్వాన్ మనవడు అమీన్ గాల్వన్ స్పందించారు. ఈ ప్రాంతం ఎప్పటికి భారతదేశంలో భాగమని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఆ పేరు రావడం వెనక ఉన్న కథను వివరించారు. (ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు!) ‘మా తాత రసూల్ గాల్వన్ 1878 లో లేహ్‌లో జన్మించాడు. 12 సంవత్సరాల వయసులో టిబెట్, మధ్య ఆసియాలోని పర్వతాలు, ముఖ్యంగా కారకోరం రేంజ్లో బ్రిటిష్ వారికి గైడ్‌గా పనిచేయడం ప్రారంభించాడు. 19వ శతాబ్దంలో భారత్‌ను పాలిస్తున్న బ్రిటీషర్లు రష్యా ఆక్రమణల గురించి భయపడుతుండేవారు. ఆ సమయంలో మా తాత రష్యన్ల గురించిన సమాచారాన్ని బ్రిటీష్ వారికి చేరవేస్తుండేవాడు. ఈ క్రమంలో ఓ సారి లాడ్ డ్యూనమోర్ అక్సాయ్ చిన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చాడు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పారు. అప్పుడు వారికి గైడ్‌గా ఉన్న మా తాత కొత్త మార్గాన్ని అన్వేషించి వారిని చావు నుంచి కాపాడి.. క్షేమంగా తిరిగి తీసుకొచ్చాడు. అందుకు కృతజ్ఞతగా బ్రిటీషర్లు డన్మోర్ లోయ, నదికి మా తాత రసూల్ గాల్వన్ పేరు పెట్టారు’ అని తెలిపాడు. 1962లో కూడా చైనా గల్వాన్ లోయ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించింది. కానీ ఈ ప్రాంతం అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు భారతదేశంలో భాగం అన్నారు. (చైనాకు రైల్వే శాఖ షాక్.. ఒప్పందం రద్దు!) -
ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు!
పట్నా: ‘‘ఆయన గొంతు విన్నాక కన్నీళ్లు ఆగలేదు. ఆనందం పట్టలేకపోయాను. అవును.. అది రోషిణి వాళ్ల నాన్న గొంతే’’ అంటూ భారత ఆర్మీ జవాను సునీల్ కుమార్ భార్య మేనక ఉద్వేగానికి లోనయ్యారు. తన భర్త బతికే ఉన్నాడన్న వార్త తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు వీర మరణం పొందిన విషయం విదితమే. తొలుత ఈ ఘటనలో కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారని వెల్లడించిన ఆర్మీ.. ఆపై తీవ్రంగా గాయపడిన మరో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని బుధవారం వారి పేర్లను విడుదల చేసింది. (విషం చిమ్మిన చైనా..) ఈ క్రమంలో బిహార్‌కు చెందిన సునీల్ కుమార్ అసువులు బాసినట్లుగా ఆర్మీ నుంచి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సునీల్ కుమార్ త్యాగాన్ని కీర్తిస్తూ స్థానికులంతా ఆయన నివాసానికి చేరుకుని కుటుంబాన్ని ఓదార్చారు. వీర జవానుకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆర్మీ నుంచి వచ్చిన మరో ఫోన్ కాల్ వారి ముఖాల్లో ఆనందాన్ని నింపింది.(‘ఇద్దరు మనుమలనూ సైన్యంలోకి పంపుతా’) సరిహద్దు ఘర్షణలో మరణించిన వేరే జవాను కుటుంబానికి బదులు పొరబాటున సునీల్ గ్రామానికి ఫోన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ సునీల్ కుమార్ భార్య మేనక మాత్రం షాక్ నుంచి తేరుకోకపోవడంతో.. ఆర్మీలోనే పనిచేస్తున్న ఆయన సోదరుడు అనిల్ ద్వారా మరోసారి సమాచారాన్ని చేరవేశారు. బుధవారం మధ్యాహ్నమే తనకు ఈ విషయం తెలిసిందని ఆమెను ఓదార్చాడు. అనంతరం కాన్పరెన్స్ కాల్లో మేనక సునీల్‌తో మాట్లాడే విధంగా ఆర్మీ అధికారులు గురువారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో వారి కుటుంబంలో అలుముకున్న విషాదం తొలగిపోయి.. ఆనందం వెల్లివిరిసిందని హిందీ డైలీ హిందుస్థాన్ తెలిపింది. -
భారత్‌పై మరోసారి విషం కక్కిన చైనా
బీజింగ్ : భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణపై డ్రాగన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ని మొదటి భారత సైనికులు దాటారంటూ ఆరోపణలుకు దిగింది. కుట్రపూరితంగానే భారత సైనికులు తమ ఆర్మీపై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ నిందలు మోపింది. ఈ మేరకు గురువారం చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా ఆర్మీ సంయమనం పాటిస్తోందని, భారత సైనికులు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారంటూ బుకాయించారు. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కూడా భారత సరిహద్దు దళాలు నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపించారు. (భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా జిత్తులు) కాగా గాల్వన్ లోయ ఘర్ణణ అనంతరం కూడా ఆ ప్రాంతం తమదేనంటూ చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. ఈ వివాదం ముగియక ముందే భారత సైన్యంపై మరోసారి విషంకక్కింది. ఇక సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాల మేజర్ జర్నల్ స్థాయి అధికారులు గురువారం సమావేశం అయ్యారు. కాగా తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. (చైనా మరో దాష్టీకం.. లీకైన డాక్యుమెంట్లు) -
చైనా కాఠిన్యం: భారత జవాన్లపై కర్కశం
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు దేశాలపై నిత్యం దురాక్రమణకు పాల్పడే జిత్తులమారి చైనా ప్రత్యర్థి సైన్యంపై ఎప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తుంది. ఐదు శతాబ్ధాలకు పైగా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతున్న భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడింది. ఎలాంటి తుపాకులు ఉపయోగించకుండా.. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కాఠిన్యం ప్రదర్శించింది. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వనా లోయలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసులుబాసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల మధ్య దాడి జరిగిన ప్రాంతంలో చైనా సైనికులు వాడిన ఇసుప రాడ్లు లభ్యమయ్యాయి. బలమైన రాడ్లకు కొండీలు అమర్చి భారత సైనికులపై దాడి చేసేందుకు ఆయుధంగా ఉపయోగించాయి. వాటితో దాడి చేయడం మూలంగానే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. (భారత్-చైనా మధ్య కీలక చర్చలు) ఉద్దేశపూర్వకంగా కయ్యానికి కాలుదువ్విన చైనా దుస్సాహసాన్ని భారత జవాన్లు పసిగట్టలేకపోయారు. గతకొంత కాలంగా సరిహద్దుల్లో గిల్లికజ్జాలు ఆడుతున్న ‘రెడ్ ఆర్మీ’ దొంగదెబ్బ తీయాలని అదునుచూసి ఘర్షణకు దిగింది. దాడికి ఎలాంటి ప్రణాళిలకు లేకపోయినప్పటికీ.. భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. కాగా సరిహద్దుల్లో సమస్య సమసిపోయే విధంగా భారత్-చైనా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. మేజర్ జనరల్ స్థాయి అధికారులు సరిహద్దు వివాదంపై చర్చించేందుకు గురువారం సమావేశమైనట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. (భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం) -
చైనాకు షాకివ్వనున్న భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తత, నెట్వర్క్ సెక్యూరిటీ సమస్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు షాకివ్వనుంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాల వినియోగాన్ని నిషేధించనుంది. బీఎస్ఎన్ఎల్ తో పాటు ఎంటీఎన్ఎల్, ఇతర అనుబంధ సంస్థలకు కూడా ఇదే ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి పాత టెండర్లను రద్దు చేసి రీ-టెండరింగ్ కు కూడా వెళ్లనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎన్ఎల్ సంస్థలో మేడ్-ఇన్-చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికం విభాగం నిర్ణయించింది. కేంద్రం ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ లో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువులను కొనుగోలు చేయమని తన పరిధిలోని అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రైవేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తి చేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించాలంటూ ఆదేశించనుంది. అలాగే టెండర్ల ప్రక్రియలో చైనా కంపెనీలు పాల్గొనలేని విధంగా నిబంధనలను మార్చాలని రాష్ట్రంలోని సర్వీసు ప్రొవైడర్లను కోరడంతోపాటు, మునుపటి టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కోరనుంది. కాగా లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా దుశ్చర్య కారణంగా 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) కూడా సిద్ధమయ్యింది. చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ట్విటర్లో 'హిందీచీనిబైబై', 'భారత్ వెర్సస్ చైనా వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. -
మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చైనా!
బీజింగ్: గాల్వన్ లోయ ప్రాంతం తమదేనని.. భారత దళాలే వాస్తవాధీన రేఖను దాటి తమ సైనికులపై దాడులు చేశారంటూ చైనా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కూడా భారత సరిహద్దు దళాలు నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపించింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా భారత్ తమ సైనికులను కట్టడి చేయాలంటూ ఎదురుదాడికి దిగింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ బుధవారం మాట్లాడుతూ.. ‘‘గాల్వన్ లోయ ప్రాంతం ఎల్లపుడూ చైనా భూభాగానికి చెందినదే. కమాండర్ స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కూడా భారత సరిహద్దు దళాలు నిబంధనలు ఉల్లంఘించాయి. తమ సైనికులను క్రమశిక్షణతో మెలిగేలా చూసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కవ్వింపు చర్యలు మానుకుని.. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని కోరుతున్నాం’’ అంటూ భారత సైన్యంపై అక్కసు వెళ్లగక్కారు.(విషం చిమ్మిన చైనా..) అదే విధంగా.. సరిహద్దు ఉద్రిక్తతలపై దౌత్యపరమైన, సైనిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే .. తాజా ఘర్షణలో చైనా తప్పేమీ లేదంటూ తమ ఆర్మీని వెనకేసుకువచ్చారు. ‘‘వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భూభాగం వైపే ఘర్షణ జరిగింది. కాబట్టి ఇందులో తప్పెవరిదో స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో చైనాను నిందించడానికి ఏమీ లేదు’’అని వ్యాఖ్యానించారు. భారత్‌తో ఘర్షణను తాము కోరుకోవడం లేదని.. చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. -
‘భారత్ చర్యలతో.. సంబంధాలు సంక్లిష్టం’
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికారి ఒకరు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం దౌత్యవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇండియా, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లోని చైనా మిషన్‌లో ప్రెస్ ఆఫీసర్‌గా ఉన్న వాంగ్ జియాన్ఫెంగ్ ‘కశ్మీర్ యథాతథ స్థితిని మార్చడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వంటి భారతదేశం చర్యలు.. చైనా, పాకిస్తాన్ సార్వభౌమత్వానికి సవాలుగా మారాయి. భారతదేశం-పాకిస్తాన్ సంబంధాలు, చైనా-ఇండియా సంబంధాలను మరింత క్లిష్టతరం చేశాయి’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ లేదా ప్రధాన ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో అనుబంధంగా ఉన్న ఒక ప్రభావవంతమైన సంస్థ స్కాలర్ కథనాన్ని ట్వీట్‌తో పాటు లింక్ చేశారు వాంగ్. ఈ కథనంలో సరిహద్దు ఉద్రిక్తతలు, కశ్మీర్ స్థితిలో మార్పు మధ్య సంబంధం వంటి అంశాలు ఉన్నాయి. లదాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే చైనా అధికారి సరిహద్దు వివాదాన్ని, కశ్మీర్‌తో ముడిపెట్టడం మాట్లాడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా వాంగ్ ట్వీట్ అతని వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తుందంటున్నారు అధికారులు. ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడం కోసం ఇండియా, చైనా.. దౌత్య, సైనిక విధానాలను అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. (లదాఖ్‌లో చైనా దొంగ దెబ్బ) గత ఏడాది ఆగస్టు 5న భారతదేశం జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పుడు, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను విమర్శిస్తూ రెండు ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ఒకటి రాష్ట్ర భూభాగాలుగా విభజించడంపై దృష్టి సారించింది. సరిహద్దు సమస్యపై భారతదేశం ‘జాగ్రత్తగా’ ఉండాలని.. సరిహద్దు సమస్యను మరింత క్లిష్టతరం చేసే చర్యలను నివారించాలని ఈ ప్రకటన విజ్ఞప్తి చేసింది. అంతేకాక చైనా భూభాగాన్ని భారతదేశం అధికార పరిధిలో చేర్చడాన్ని చైనా ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపింది. (‘వాస్తవాధీన రేఖ’లో సామరస్యం) -
‘10 వేల బలగాలను చైనా వెనక్కి పిలవాలి’
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన 10 వేల బలగాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉపసంహరించుకున్నపుడే సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉందని భారత్ స్పష్టం చేసింది. భారత్- చైనాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన తూర్పు లడఖ్‌లోని మూడు ప్రాంతాల(గాల్వన్ లోయ- పెట్రోలింగ్ పాయింట్ 14, పెట్రోలింగ్ పాయింట్ 15, హాట్ స్ప్రింగ్స్- పెట్రోలింగ్ పాయింట్ 17) నుంచి ఇరు వర్గాలు బలగాల ఉపసంహరణకు అంగీకరించిన విషయం తెలిసిందే. పాంగోంగ్ త్సో ప్రాంతంలోని ఫింగర్స్ రీజియన్, దౌలత్ బేగ్ ఓల్డీ మినహా మిగతా చోట్ల డ్రాగన్ బలగాలు 2 నుంచి రెండున్నర కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దౌత్య, మిలిటరీ స్థాయి చర్చల తర్వాత ఈ మేరకు రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపాయి.(భారత్- చైనా చర్చలు: బలగాల ఉపసంహరణ!) ఈ క్రమంలో బుధవారం మరోసారి ఇరు వర్గాల మధ్య మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘తూర్పు లడఖ్ సెక్టార్లో బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇదంతా బాగానే ఉంది. అయితే ఎల్ఏసీ వెంబడి మోహరించిన 10 వేలకు పైగా బలగాలు, ఫిరంగి దళాలను చైనా వెనక్కి పిలిచినప్పుడే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. భారీ ఫిరంగులు, ట్యాంకులు, పదాతి దళం వినియోగించే యుద్ధ వాహనాలను వారు వెనక్కి పంపాలి’’అని ప్రభుత్వ వర్గాలు వార్తా సంస్థ ఏఎన్ఐతో పేర్కొన్నాయి. చైనా భారీ మొత్తంలో బలగాలు మోహరించిన నేపథ్యంలో వారికి దీటుగా బదులిచ్చేందుకు వీలుగా భారత్ సైతం 10 వేల బలగాలను మోహరించినట్లు వెల్లడించాయి. (భారత్‌తో ఏకాభిప్రాయం కుదిరింది: చైనా) -
బలగాలను ఉపసంహరించుకుంటున్న చైనా!
న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దుల వద్ద మోహరించిన బలగాలను చైనా ఉపసంహరించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ప్రతిగా భారత్ సైతం దశలవారీగా సైన్యాన్ని వెనక్కి పిలుస్తున్నట్లు పేర్కొన్నాయి. తూర్పు లడఖ్, గాల్వన్ లోయ, ప్యాంగాంగ్ త్సో సెక్టార్ వద్ద చైనా బలగాలు మోహరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన అనంతరం శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్- చైనాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాల విదేశాంగ శాఖలు ప్రకటన విడుదల చేశాయి. (విభేదాలు.. వివాదాలుగా మారకూడదు: చైనా) ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో మోహరించిన బలగాలను ఇరు దేశాలు ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం.‘‘ ప్రతిష్టంభనకు కారణమైన ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. భారత్ కూడా ఈ ప్రక్రియను ఆరంభించింది. పరస్పర అంగీకారంతో ఇరు వర్గాలు ముందుకు సాగుతున్నాయి’’ అని ఓ అధికారి పేర్కొన్నారు. బుధవారం మరోసారి ఇరు వర్గాల మధ్య తూర్పు లడఖ్‌లో చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా సరిహద్దు వివాదాలపై చర్చించేందుకు శుక్రవారం భారత విదేశాంగ తరఫున సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ వూ జియాంగోతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు భారత ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. (‘ఏ దేశం ముందూ భారత్ తలవంచదు’) -
భారత్‌తో ఏకాభిప్రాయం కుదిరింది: చైనా
బీజింగ్: తూర్పు లడఖ్‌లో సరిహద్దుల వద్ద తలెత్తిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. సరిహద్దుల్లో తలెత్తిన విభేదాలు.. వివాదంగా మారేందుకు భారత్- చైనా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోవని వ్యాఖ్యానించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గతంలో అనేకమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారని.. తాజాగా మరోసారి ఇదే పునరావృతమైందని పేర్కొంది. (సరిహద్దుల్లో చైనా సన్నద్ధత?.. నిజమెంత!) ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునైంగ్ సోమవారం మాట్లాడుతూ.. ‘‘ జూన్ 6 మధ్యాహ్నం చుసుల్- మోల్డో ప్రాంతంలో చైనా, ఇండియా కమాండర్ల మధ్య సమావేశం జరిగింది. ఇరు వర్గాలు తమ వాదన వినిపించాయి. సరిహద్దు పరిస్థితులపై దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలు జరిగాయి. సరిహద్దు ఉద్రిక్తతలపై శాంతియుత పరిష్కారం కనుగొని.. విభేదాలు వివాదాలుగా మారకుండా ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. చర్చలకు ఇరు వర్గాలు సుముఖంగా ఉన్నాయి. కాబట్టి పరిస్థితులన్నీ స్థిరంగా, అదుపులోనే ఉన్నాయి’’ అని ఆమె పేర్కొన్నారు. (చైనాతో శాంతియుత పరిష్కారం) కాగా భారత్, చైనా ఉన్నతస్థాయి సైనికాధికారుల మధ్య శనివారం చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ హాజరు కాగా.. చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. అంతకుముందు రోజు భారత విదేశాంగ తరఫున సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ వూ జియాంగోతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక భారత్ సైతం తూర్పు లదాఖ్‌లో సరిహద్దుల వద్ద తలెత్తిన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలు అంగీకారానికి వచ్చినట్లు భారత్ వెల్లడించిన విషయం విదితమే. -
‘డోక్లాం’ వ్యూహంతోనే మరోసారి చైనా ఆర్మీ!
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్- చైనా మధ్య మిలటరీ స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ హాజరుకాగా.. చైనా తరఫున టిబెట్ మిలటరీ కమాండర్ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్ లోయ, పాంగాంగ్ లేక్, గోగ్రా ప్రాంత సరిహద్దు వివాదాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ నుంచి చైనా బలగాలు వెనుదిరగాలని.. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను వెంటనే తొలగించాలని భారత్ స్పష్టం చేసింది. కాగా ఇరు దేశాల దౌత్యవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాల గురించి శుక్రవారం చర్చించిన విషయం తెలిసిందే. ‘‘శాంతియుత చర్చల ద్వారానే ఇరు వర్గాలు విభేదాలను పరిష్కరించుకోవాలి. భేదాభిప్రాయాలను వివాదాలుగా మారకుండా చూసుకోవాలి’’అని కీలక వ్యాఖ్యలు చేశారు.(అంగుళం భూమి వదులుకోం.. క్షమించం: చైనా) ఇప్పుడు కూడా అదే వ్యూహంతో చైనా?! విరోధిని మానసికంగా దెబ్బకొట్టడానికి సైకలాజికల్ ఆపరేషన్స్ చేపట్టే డబ్ల్యూజెడ్సీ(చైనా వార్ జోన్ కాన్సెప్ట్) సిద్ధాంతాన్నే డ్రాగన్ మరోసారి అవలంబించినట్లు తాజా పరిస్థితులను బట్టి వెల్లడవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించే వీడియోలు, మ్యాపులు సోషల్ మీడియాలో విడుదల చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శత్రుదేశ బలగాల సన్నద్ధత, సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తేలా చేయడం.. సరిహద్దు ఉద్రిక్తతల గురించి చిలువలు పలువలుగా అధికార మీడియాలో కథనాలు ప్రచురించడం ఎత్తుగడలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందని అనిపించుకోవడం సహా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సొంత మీడియాలో ఈ మేరకు క్యాంపెయిన్లు నడిపిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు తమ వైపు వేలెత్తిచూపడం.. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా తమపై తీవ్రంగా మండిపడుతూ వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో.. ప్రపంచం దృష్టిని మరల్చేందుకు డ్రాగన్ ఇలాంటి చర్యలకు పూనుకుందని మరికొంత మంది వాదిస్తున్నారు. ఏదేమైనా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డోక్లాం విషయంలో అనుసరించిన వ్యూహాలతోనే ఇప్పుడు కూడా ముందుకు సాగుతోందని అభిప్రాయపడుతున్నారు. -
అంగుళం భూమి వదులుకోం : చైనా
బీజింగ్: పొరుగుదేశాలతో తాము ఎల్లప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటామని... అయితే అదే సమయంలో అంగుళం భూమిని కూడా వదులుకోమని చైనా స్పష్టం చేసింది. అంతేగాక అమెరికా మాయలో పడవద్దంటూ భారత్‌కు హితవు పలికింది. తూర్పు లడఖ్ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద భారత్- చైనా మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ మేరకు తన అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్‌లో కథనం ప్రచురించింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు శనివారం ఇరు దేశాల ఉన్నతస్థాయి కమాండర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.(పాక్ పోర్టులో చైనా మరో నిర్మాణం.. అందుకేనా?) భారత్‌తో శత్రుత్వానికి కారణం కనిపించడం లేదు ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి కథనంలో..‘‘ భారత్‌తో చైనా ఎలాంటి వివాదాన్ని కోరుకోవడం లేదు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం చైనా జాతీయ ప్రాథమిక విధానం. దశాబ్దాలుగా ఇదే పద్ధతిని పాటిస్తోంది. సరిహద్దు వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. భారత్‌ను శత్రువుగా చేసుకునేందుకు మాకు ఏ కారణం కనిపించడం లేదు. అయితే తన భూభాగం నుంచి ఒక్క అంగుళాన్ని కూడా చైనా ఎన్నటికీ వదులుకోదు. వ్యూహాత్మక తప్పిదాలతో చైనా భూభాగంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తే.. చైనా అస్సలు క్షమించదు. ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. సరిహద్దుల్లో చైనా మిలిటరీ ఆపరేషన్స్ ఎలా ఉంటాయో ఇండియాకు బాగా తెలుసు’’ అని తాజా వివాదంపై తన వైఖరిని స్పష్టం చేసింది.అదే విధంగా.. చైనా- భారత్ పరస్పరం సహకరించుకుంటేనే అంతర్జాతీయ సమాజంలో భారత్ శాంతియుత సంబంధాలు మరింత మెరుగవుతాయని డ్రాగన్ అభిప్రాయపడింది. (చైనా వివాదాస్పద చట్టానికి నేపాల్ మద్దతు!) అమెరికాకు డ్రాగన్ భయపడదు అంతేగాకుండా ఇరు దేశాల మధ్య తలెత్తిన విభేదాలను అమెరికా తన స్వప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోందని విమర్శించింది. ‘‘ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల హిమాలయ ప్రాంతం, భారత ఉపఖండంలో అస్థిరత చోటుచేసుకుంటుంది. ఏ బాహ్య శక్తిని దీనిని మార్చలేదు. ఇరు వర్గాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వకంగా.. శాంతియుతంగా మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. దేశాల మధ్య చీలిక తెచ్చి.. తన వైపునకు తిప్పుకునే విషయంలో వాషింగ్టన్ ముందు వరుసలో ఉంటుంది. చైనాపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. (ఊచకోత; చైనా క్షమాపణ చెప్పాల్సిందే: తైవాన్) అంతేతప్ప ఏ దేశ ప్రయోజనాలకు వారు అనుకూలంగా ఉండరు. చైనా- ఇండియా వివాదాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారీ అమెరికా ఇండియాకు మద్దతుగా నిలుస్తోంది. కొత్త వివాదాలు తలెత్తేలా రాద్దాంతం చేస్తోంది. అమెరికా చేతిలో ఇండియా ఫూల్ కావొద్దు. ఎందుకంటే చైనా భయంకర పరిస్థితులు సృష్టించదు. అంతేకాదు అమెరికా ఒత్తిళ్లకు లొంగదు. భయపడదు. చైనాను ఇబ్బందుల్లో పడేసే అమెరికాను ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు మేమెలా అనుమతిస్తాం’’అంటూ మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసింది. (ట్రంప్ మధ్యవర్తిత్వం: కొట్టిపారేసిన చైనా) -
కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు?
-
కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. చరిత్రాత్మక నిర్ణయాలు?
న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా సమావేశం కానున్న ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లఢక్ సరిహద్దులో చైనాతో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భద్రతా అంశాల కేబినెట్ కమిటీ, ఎకనమిక్ అఫైర్స్ కమిటీ కూడా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నిబంధనలు పూర్తిస్థాయిలో సడలించిన నేపథ్యంలో మాల్స్, రెస్టారెంట్లు, ప్రార్థనా స్థలాలు తిరిగి తెరిచేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్‌లాక్-1 పునరుద్ధరణ ప్రణాళిక రచించనున్నట్లు సమాచారం. కరోనా సంక్షోభంతో పదకొండేళ్ల కనిష్టానికి జీడీపీ పడిపోవడం సహా ఏప్రిల్ నాటికి 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా సూచించిన తరుణంలో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. (11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన జీడీపీ) కాగా ప్రధాన మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోదీ శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ‘‘నా దేశ పౌరులారా.. గతేడాది ఇదే రోజున భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు భారీ మెజారిటీతో పూర్తిస్థాయి అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు, దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, సహృదయత, సహకారం నూతనోత్సహాన్ని, శక్తిని, స్ఫూర్తిని నింపాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించటం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా’’అంటూ తన ఏడాది పాలనకు సంబంధించిన విషయాలను ప్రజలతో పంచుకున్నారు.(మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ) -
మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్
సాక్షి, న్యూఢిల్లీ/వాషింగ్టన్ : భారత్, చైనా సరిహద్దు వివాదంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఇండో-చైనా సరిహద్దులో తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగించేందుకు తన ప్రమేయం ఉపయోగపడుతుందని రెండు దేశాలు భావిస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీనిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తాను ఫోన్ లో సంప్రదించాననీ, అయితే ఆ సమయంలో ఆయన మంచి మూడ్ లో లేరని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న రెండు పెద్ద దేశాలు భారత్, చైనా మధ్య సరిహద్దు విషయంలో సమస్య నడుస్తోందన్నారు. అయితే, ప్రధాని మోదీతో ఎప్పుడు మాట్లాడారో ట్రంప్ స్పష్టం చేయలేదు. (మధ్యవర్తిత్వం చేస్తా) వైట్ హౌస్ లో గురువారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వంపై ప్రశ్నించినపుడు తాను అందుకు సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ చెప్పారు. చైనా, భారత్ దేశాలకూ బలమైన మిలటరీ శక్తి ఉందని, ప్రస్తుత వివాదంతో ఇరుదేశాలు అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. లదాఖ్ లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తానంటూ ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (‘చైనాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’) కాగా చైనాతో తలెత్తిన ఈ సమస్యను సామరస్యపూర్వకంగా చర్చలతోనే పరిష్కరించుకుంటామని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. అంతకుముదు భారత్ చైనా సమస్యలు పరిష్కరించుకునేందుకు మంచి వాతావరణం ఉందంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ కూడా ప్రకటించారు. #WATCH "We have a big conflict going on between India & China, 2 countries with 1.4 billion people & very powerful militaries. India is not happy & probably China is not happy, I did speak to PM Modi, he is not in a good mood about what's going on with China": US President Trump pic.twitter.com/1Juu3J2IQK — ANI (@ANI) May 28, 2020 -
భారత బలగాలు వెనక్కి వెళ్లాలి: నేపాల్ మంత్రి
ఖాట్మండూ: కాలాపానీ ప్రాంతంలో మోహరించిన భద్రతా బలగాలను భారత్ వెంటనే వెనక్కి పిలిపించాలని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల్లో తలెత్తిన వివాదాన్ని వెంటనే పరిష్కరించుకునేలా చర్చలకు సిద్ధమవ్వాలని కోరారు. ‘‘సుగౌలీ ఒప్పంద స్ఫూర్తిని భారత్ గౌరవించాలని కోరుకుంటున్నాం. కాలాపానీ వద్ద మోహరించిన బలగాలను భారత్ ఉపసంహరించుకోవాలి. ఆ ప్రాంతాలను తిరిగి నేపాల్‌కు అప్పగించాలి. నేపాల్ భూభాగంలో రహదారి నిర్మాణం చేపట్టడం వంటి ఏకపక్ష చర్యలను మేం ఎంతమాత్రం ఉపేక్షించబోమని పునరుద్ఘాటిస్తున్నా. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి’’ అని ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుధవారం వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభానికి ముందే ఈ విషయం గురించి భారత్‌తో చర్చలు జరపాలని భావించామని.. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని ప్రదీప్ చెప్పుకొచ్చారు. (మ్యాపుల వివాదం.. నేపాల్ ప్రధానికి షరతులు!) ఆ విషయాన్ని నిరూపించగలం ఇక 19వ శతాబ్దంలో కుదుర్చుకున్న సుగౌలీ ఒప్పందాన్ని 21వ శతాబ్దంలో కొనసాగడానికి నేపాల్ పాలకుల వైఫల్యమై కారణమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘బ్రిటీష్ ఇండియాతో జరిగిన యుద్ధంలో నేపాల్ ఓడిపోయిన కారణంగా ఈ ఒప్పందం కుదిరింది. దాదాపు మూడు వంతుల భూభాగాన్ని మేం కోల్పోయాం. అయితే ఇప్పుడు ఆ ఒప్పందంలో పేర్కొన్న సరిహద్దుల గురించే మేం మాట్లాడుతున్నాం. ఇక దీనిని అనుసరించే 1981 నుంచి ఇరు దేశాలు అంతర్జాతీయ సరిహద్దుల మ్యాపింగ్‌పై సర్వేలు చేపట్టాయి. కాబట్టి ప్రస్తుతం మా భూభాగంలో భారత్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడాన్ని వ్యతిరేకించేందుకు ఈ ఒప్పందమే మాకు అవకాశం కల్పించింది. లిపులేఖ్, లింపియధుర, కాలాపానీ కొత్త మ్యాపులను దీని ఆధారంగానే రూపొందించాం’. ఆ విషయాన్ని నిరూపించగలం’’ అని పేర్కొన్నారు. (కొత్త మ్యాపులు: వెనక్కి తగ్గిన నేపాల్?!) మేం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం అదే విధంగా చైనా- భారత్ సరిహద్దుల్లో ఉద్రికత్తలు నెలకొన్న తరుణంలో నేపాల్ దూకుడు పెంచడాన్ని ఎలా భావించవచ్చు అని అడుగగా.. నేపాల్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని.. తమపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా లిపులేఖ్‌లో భారత్ చేపట్టిన నిర్మాణంపై అభ్యంతరం తెలిపిన నేపాల్... కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్‌లను తమ భూభాగాలుగా పేర్కొంటూ పటాలు విడుదల చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.(అవసరమైతే యుద్ధానికి సిద్ధం.. కానీ: నేపాల్ మంత్రి) కాగా బ్రిటీష్ ఇండియా- నేపాల్ మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరఫున సంతకాలు చేశారు. ఆ ప్రాంతంలో పారుతున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. -
మ్యాపుల వివాదం.. నేపాల్ ప్రధానికి షరతులు!
ఖాట్మండూ: కొత్త మ్యాపుల ప్రచురణకై పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సభలో తగినంత బలం లేకపోవడం(మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదం)తో అధికార పార్టీకి నిరాశ ఎదురైంది. బిల్లు నెగ్గించుకునేందుకు తొమ్మిది మంది సభ్యుల అవసరం ఉండగా.. నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి షాకిచ్చింది. దీంతో చర్చ జరుగకుండానే సభ వాయిదా పడింది. ఈ క్రమంలో భారత్‌తో వివాదానికి కారణమైన లిపులేఖ్, లింపియధుర, కాలాపానీ ప్రాంతాలను నేపాల్ భూభాగంలో ఉన్నట్లుగా రూపొందించిన మ్యాపుల ప్రచురణ మరింత ఆలస్యం కానుంది. నమ్మకం ఉంది.. ఇక ఈ విషయంపై స్పందించిన నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. తాము ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘రేపు బడ్జెట్ ఉంది. కాబట్టి శుక్రవారం మరోసారి ఈ బిల్లు సభ ముందుకు వస్తుంది. ఎందుకంటే పార్లమెంటు ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచాం. కాబట్టి త్వరలోనే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకుంటాం. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మాతో కలిసి వస్తాయని నాకు నమ్మకం ఉంది’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. (కొత్త మ్యాపులు: వెనక్కి తగ్గిన నేపాల్?!) ప్రధానికి షరతులు..! కాగా ఇటీవల భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి.. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలని 33 మంది సభ్యులు కలిగిన మధేశీ(పూర్వకాలంలోనే నేపాల్‌కు వెళ్లి స్థిరపడిన భారతమూలాలున్న ప్రజలు) పార్టీలు షరతు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2015-16లో నేపాల్ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన పౌరసత్వ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా సదరు పార్టీలు కోరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.(అవసరమైతే యుద్ధానికి సిద్ధం.. కానీ: నేపాల్ మంత్రి) అదే విధంగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ సైతం సెంట్రల్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మీదే తమ విధానం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అంతవరకు ప్రస్తుత బిల్లును హోల్డ్‌లో పెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక నేపాల్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘సరిహద్దు వివాదాలు సహజంగానే ఎంతో సున్నితమైనవి. పరస్పర నమ్మకం, పూర్తి విశ్వాసం ఉన్నపుడే ఇరు వర్గాల మధ్య సఖ్యత చేకూరుతుంది’’అని పేర్కొన్నాయి. -
భారత్- చైనా వివాదం: ట్రంప్ ఆఫర్!
వాషింగ్టన్: భారత్- చైనా సరిహద్దు వివాద పరిష్కారానికై మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘సరిహద్దులో వివాదం రేగుతున్న తరుణంలో మధ్యవర్తిత్వం వహించడానికి యూఎస్ సుముఖంగా ఉన్నట్లు భారత్, చైనాలకు సమాచారం ఇచ్చాం. ధన్యవాదాలు’’ అని ట్రంప్ బుధవారం ట్వీట్ చేశారు. కాగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి.(వారంలోగా చైనాపై కఠిన చర్యలు: ట్రంప్) ఈ నేపథ్యంలో మంగళవారం సైన్యాధికారులతో జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే క్రమంలో యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), పీపుల్స్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్‌కు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, తైవాన్‌పై పెత్తనం చెలాయించేందుకు డ్రాగన్ ప్రయత్నాలు చేస్తుండటం సహా భారత సరిహద్దుల్లో చైనా సైన్యం పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్.. సరిహద్దుల వద్ద పరిస్థితులను ఇరు దేశాధినేతలు నిశితంగా పరిశీలిసస్తున్నారని, చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని సంకేతాలు ఇవ్వడం విశేషం. మరోవైపు భారత్ సైతం చైనాకు ధీటుగా సమాధానం చెబుతూనే.. చర్చల కోసం ‘డోక్లాం టీం’ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. (చైనా దూకుడు: మళ్లీ అదే టీం రంగంలోకి?!) కరోనా: ట్రంప్ మాట నిజమైంది! కొత్త మ్యాపులు: వెనక్కి తగ్గిన నేపాల్?! We have informed both India and China that the United States is ready, willing and able to mediate or arbitrate their now raging border dispute. Thank you! — Donald J. Trump (@realDonaldTrump) May 27, 2020 -
చైనా దూకుడు: ప్రధాని మోదీ కీలక భేటీ!
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే, చీఫ్ ఆఫ్ ది ఎయిర్‌స్టాఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ బధూరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ తదితరులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.(సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్–డ్రోన్) అదే విధంగా విదేశాంగ శాఖ కార్యదర్శితో కూడా ప్రధాని మోదీ ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక సరిహద్దుల వద్ద డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ప్రధానితో సమావేశానికి ముందే త్రివిధ దళాల అధినేతలతో చర్చించినట్లు సమాచారం. కాగా గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో.. లడఖ్ సమీపంలో చైనా ఎయిర్‌బేస్‌ను విస్త్రృతం చేస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా భారత గగనతలంలోకి చైనా మిలిటరీ హెలికాప్టర్లు చొచ్చుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ శత్రు సైన్యాల కదలికలను పసిగట్టేందుకు వీలుగా అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్–డ్రోన్‌ను భారత్ సరిహద్దుల్లో మోహరించనున్నట్లు చైనా అధికార మీడియా కథనం వెలువరించడం సహా.. భారత్‌లో చిక్కుకుపోయిన చైనీయులు తిరిగి రావాల్సిందిగా భారత్‌లోని రాయబార కార్యాలయం వెబ్సైట్లో పేర్కొనడం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా ఉద్దేశపూర్వకంగానే కవ్వింపు చర్యలకు దిగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేగాక లిపులేఖ్ అంశంలో నేపాల్ సైతం దుందుడుకు వైఖరి ప్రదర్శించడం వెనుక చైనా ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం గమనార్హం.(భారత్‌పై నేపాల్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు) -
అందుకే ఆ హెలికాప్టర్ డ్రోన్: చైనా
బీజింగ్: కొత్తగా అభివృద్ధి చేసిన హెలికాప్టర్ డ్రోన్‌ను భారత్ సరిహద్దులో మోహరించనున్నట్లు చైనా అధికార మీడియా పేర్కొంది. భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ 15 వేల అడుగుల ఎత్తులో నుంచి లక్ష్యంపై అగ్ని గోళాలు కురిపించగల సామర్థ్యం గల ఏఆర్500సీని బలగాలు రంగంలోకి దింపినట్లు గ్లోబల్ టైమ్స్ సోమవారం కథనం వెలువరించింది. చైనా భూభాగంలోని గల్వాన్ ప్రాంతంలో భారత్ రక్షణ దళాల అవసరాల నిమిత్తం చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఈ హెలికాప్టర్‌ను మోహరించినట్లు తెలిపింది. సిక్కిం, లఢక్ సెక్టార్ల వెంబడి భారత్ దూకుడు చర్యలకు సమాధానం చెప్పేందుకే ఈ చర్యకు పూనుకున్నట్లు వెల్లడించింది. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా) కాగా తూర్పు లఢక్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది ఘర్షణకు దిగి.. పరస్పరం రాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లఢక్‌లోకి చైనా మిలిటరీ హెలికాప్టర్ చొరబాటు యత్నాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై స్పందించిన భారత్ విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. వాస్తవాధీన రేఖ వెంబడి నిబంధనలను అనుసరించి భారత దళాలు గస్తీ కాస్తున్నాయని స్పష్టం చేశారు. చైనా కావాలనే తమ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.పరిస్థితులును పర్యవేక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ ఎమ్ నరవనె శుక్రవారం లేహ్‌ను సందర్శించారు.(భారత జవాన్లను నిర్బంధించిన చైనా, ఆపై) -
సరిహద్దుల్లో ఉద్రిక్తత: చైనా స్పందన
బీజింగ్: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజాన్ బుధవారం స్పందించారు. సరిహద్దు వద్ద తమ సైన్యం ఎంతో సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సాధారణ పెట్రోలింగ్‌లో భాగంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన విధులను సమర్థవంతగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత సంక్లిష్టయ్యేలా భారత్ ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది ఘర్షణకు దిగడంతో పాటు.. పరస్పరం రాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరుదేశాల సైనికులు గాయపడ్డారు. ఒకానొక సమయంలో ఉద్రిక్తతలు శిఖరస్థాయికి చేరుకోవడంతో ఇరు దేశాలు మరిన్ని దళాలను ఆ ప్రాంతానికి తరలించాయి. (ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత) ఇక మహమ్మారి కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ దేశాలు చైనాపై సందేహాలు వ్యక్తం చేస్తుండటంతో పాటుగా.. పలు బహుళజాతి కంపెనీలు బీజింగ్ నుంచి భారత్‌కు తమ కార్యకలాపాలను తరలించాలని యోచిస్తుండటంతో చైనాపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశాన్ని చుట్టుముడుతున్న ఒత్తిళ్లతోనే ఆ దేశ ఆర్మీ అసహనంతో దుందుడుకు చర్యలకు పాల్పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జావో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘సరిహద్దు వద్ద మా వైఖరి ఎంతో స్పష్టంగా ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దళాలు శాంతియుతంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. కాబట్టి భారత్ ఈ విషయంలో సంయమనంగా వ్యవహరించాలి. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణిగేలా ద్వైపాక్షిక చర్చలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పరిస్థితిని సంక్లిష్టంగా మారితే శాంతి, సుస్థిరతకు విఘాతం కలుగుతుంది’’అని వ్యాఖ్యానించారు. (ఒత్తిళ్లతో చైనా అసహనం) -
‘సరిహద్దు’పై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు సమస్యలకు త్వరలోనే శాశ్వత సానుకూల పరిష్కారం లభిస్తుందని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ ముకుంద్ నరవనే ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన దేశాలతో భారత్ సరిహద్దులు పంచుకుంటోందని..ఇరు దేశాలూ సమాన ప్రాధాన్యత కలిగినవేనని ఆయన అన్నారు. గతంలో మనం పశ్చిమ ప్రాంతంవైపే దృష్టిసారించామని, ఉత్తర ప్రాంతం కూడా అంతే ప్రాధాన్యత కలిగిఉందని గుర్తెరగాలన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనంపై రాజకీయ నేతలు తరచూ చేస్తున్న ప్రకటనలపై స్పందిస్తూ అన్ని సవాళ్లు, వ్యూహాలపై సైన్యం విశ్లేషిస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని జనరల్ నరవనే పేర్కొన్నారు. సేనల ఆధునీకరణ ప్రణాళికలకు కీలక ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. సవాళ్లకు అనుగుణంగా దీర్ఘకాల వ్యూహాలతో ముందుకెళతామని, సేనలకు ఎదురయ్యే సవాళ్లలో మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. కాగా సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జనరల్ బిపిన్ రావత్ స్ధానంలో దేశ 28వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ నరవనే మంగళవారం నూతన బాధ్యతలు స్వీకరించారు. -
సరిహద్దు వివాదం పరిష్కరించుకుందాం
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేయాలని భారత్, చైనాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకుని పురోగతే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మధ్య 22వ దఫా చర్చలు శనివారం జరిగాయి. వివాద పరిష్కారం దిశగా వీరిద్దరూ నిర్మాణాత్మకంగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవాలని, పరస్పరం విశ్వాసం పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. ‘భారత్–చైనా వ్యూహాత్మక సంబంధాల కోణంలో సరిహద్దు సమస్యను చూడాలని, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. భారత్–చైనాల సంబంధాల్లో సుస్థిర, సమతులాభివృద్ధి ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ శాంతి, అభివృద్ధికి సానుకూలంగా మారుతుందనే అభిప్రాయాన్ని ఈ ప్రత్యేక ప్రతినిధుల భేటీ వ్యక్తం చేసింది’అని విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు వివాదంపై చర్చించేందుకు వాంగ్, దోవల్‌ను రెండు దేశాలు ప్రత్యేక ప్రతినిధులుగా నియమించాయి. వచ్చే ఏడాది చైనాలో 23వ దఫా భేటీ కావాలని కూడా ఇద్దరు ప్రతినిధులు నిర్ణయించారు. భారత్–చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖపై వివాదం నలుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు టిబెట్ దక్షిణ ప్రాంతం కూడా తనదేనని చైనా వాదిస్తోంది. -
సమస్యలు పరిష్కరించుకుందాం
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను కోరిన ఎంపీ కవిత నిజామాబాద్ కల్చరల్: తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుందామని ఎంపీ కవిత.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు. ఎంపీ కవిత ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగిత్యాల టీఆర్ఎస్ ఇన్చార్జి సంజయ్‌కుమార్‌లు మంగళవారం ముంబైలో ఆయన అధికారిక నివాసంలో కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్యలోని సాలూర బ్రిడ్జి నిర్వహణ చర్చకు వచ్చినట్లు తెలిసింది. అప్పటి ఏపీ-మహారాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాయని, ప్రస్తుతం బ్రిడ్జి నిర్వహణకు తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చే విధంగా చూడాలని ఫడ్నవీస్‌ను కవిత కోరారు. ఇరురాష్ట్రాల ప్రయోజనాల కోసం లెండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, తెలంగాణకు నీటిని విడుదలచేయాలని ఫడ్నవీస్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావుతో కూడా ఆమె భేటీ అరుు పలు అంశాలు చర్చించారు.