సమస్యలు పరిష్కరించుకుందాం | Maharashtra CM Fadnavis To Requested MP Kavitha | Sakshi

సమస్యలు పరిష్కరించుకుందాం

Aug 26 2015 3:38 AM | Updated on Oct 8 2018 5:57 PM

సమస్యలు పరిష్కరించుకుందాం - Sakshi

సమస్యలు పరిష్కరించుకుందాం

తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుందామని ఎంపీ కవిత.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను కోరిన ఎంపీ కవిత
నిజామాబాద్ కల్చరల్: తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుందామని  ఎంపీ కవిత.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు. ఎంపీ కవిత ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగిత్యాల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్‌లు మంగళవారం ముంబైలో ఆయన అధికారిక నివాసంలో కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్యలోని సాలూర బ్రిడ్జి నిర్వహణ చర్చకు వచ్చినట్లు తెలిసింది.

అప్పటి ఏపీ-మహారాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాయని, ప్రస్తుతం బ్రిడ్జి నిర్వహణకు తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చే విధంగా చూడాలని ఫడ్నవీస్‌ను కవిత కోరారు. ఇరురాష్ట్రాల ప్రయోజనాల కోసం లెండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, తెలంగాణకు నీటిని విడుదలచేయాలని ఫడ్నవీస్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావుతో కూడా ఆమె భేటీ అరుు పలు అంశాలు చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement