వాషింగ్టన్: కొద్దిరోజులగా రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. లక్షకు పైగా రష్యా బలగాలు సరిహద్దుల్లో మోహరించి యుద్ధ విన్యాసాలు సైతం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ప‍్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
తాజాగా ఈ పరిణామాలపై భారత్ సైతం కీలక వ్యాఖ‍్యలు చేసింది. సరిహద్దుల్లో నెలకొన్న ఈ పరిణామాలు శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయాని వ్యాఖ్యానించింది. మంగళవారం ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ ఉద్రిక్తతల అంశంపై వీలైనంత త‍్వరగా రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో 20వేల మందికి పైగా ఉన్న భారత పౌరులు, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి రక్షణే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
కాగా, అన్ని దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలన్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుందన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రైలేటరల్ కాంటాక్ట్ గ్రూప్ ద్వారా ప్రయత్నిస్తున్న దేశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
Safety&security of civilians essential. More than 20,000 Indian students& nationals live&study in different parts of Ukraine, incl in its border areas. The well-being of Indians is of priority to us: India's Permanent Rep to United Nations TS Tirumurti, at UNSC meet on Ukraine pic.twitter.com/kRcAdVAtuI
— ANI (@ANI) February 22, 2022
Comments
Please login to add a commentAdd a comment