దాడిలో చైనా వాడిన ఆయుధాలు
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు దేశాలపై నిత్యం దురాక్రమణకు పాల్పడే జిత్తులమారి చైనా ప్రత్యర్థి సైన్యంపై ఎప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తుంది. ఐదు శతాబ్ధాలకు పైగా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతున్న భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడింది. ఎలాంటి తుపాకులు ఉపయోగించకుండా.. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కాఠిన్యం ప్రదర్శించింది. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వనా లోయలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసులుబాసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల మధ్య దాడి జరిగిన ప్రాంతంలో చైనా సైనికులు వాడిన ఇసుప రాడ్లు లభ్యమయ్యాయి. బలమైన రాడ్లకు కొండీలు అమర్చి భారత సైనికులపై దాడి చేసేందుకు ఆయుధంగా ఉపయోగించాయి. వాటితో దాడి చేయడం మూలంగానే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. (భారత్-చైనా మధ్య కీలక చర్చలు)
ఉద్దేశపూర్వకంగా కయ్యానికి కాలుదువ్విన చైనా దుస్సాహసాన్ని భారత జవాన్లు పసిగట్టలేకపోయారు. గతకొంత కాలంగా సరిహద్దుల్లో గిల్లికజ్జాలు ఆడుతున్న ‘రెడ్ ఆర్మీ’ దొంగదెబ్బ తీయాలని అదునుచూసి ఘర్షణకు దిగింది. దాడికి ఎలాంటి ప్రణాళిలకు లేకపోయినప్పటికీ.. భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. కాగా సరిహద్దుల్లో సమస్య సమసిపోయే విధంగా భారత్-చైనా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. మేజర్ జనరల్ స్థాయి అధికారులు సరిహద్దు వివాదంపై చర్చించేందుకు గురువారం సమావేశమైనట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. (భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం)
Comments
Please login to add a commentAdd a comment