ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ప్రథకం కింద ఇప్పటివరకు లక్షమంది అగ్నివీరులు శిక్షణపొంది వివిధ విభాగాల్లో చేరినట్లు ఆర్మీ పేర్కొంది. సుమారు 70 శాతం మంది అగ్నివీరులు వివిధ ఆర్మీ యూనిట్ల పనిచేస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ (ఆర్మీ అడ్జటెంట్ జనరల్) సీబీ పొన్నప్ప ఆదివారం తెలిపారు.
‘2022 జూన్‌లో అగ్నిపథ్ పథకం అమలులోకి వచ్చింది. జనవరి, 2022 నుంచి 2023 మధ్య మొదటి బ్యాచ్ నియామకం పూర్తి అయింది. ఈ పథకం ద్వారా లక్ష మంది అగ్నివీరులో అర్మీలో జాయిన్ అయ్యారు. ఇందులో 200 మంది మహిళలు ఉన్నారు. ఇక.. రిక్రూట్ అయిన 70 వేల మంది అగ్నివీరులు వివిధ విభాగాలు, బెటాలియన్లలో చేరారు. ఇందులో కూడా 100 మంది మహిళలు ఉన్నారు’అని తెలిపారు.
దీంతోపాటు మరో 50 వేల అగ్నివీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని 2024-25 ఏడాదికి గాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద రెండు రకాల సైనికులను ఆర్మీ తయారు చేస్తోందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
‘ఇతర సైనికుల మాదిరిగానే అగ్నివీరు అన్ని రకాల విధులను నిర్వర్తించాలి. నిబంధనల్లో కూడా పేర్కొన్నాం. ఆపరేషనల్, వృత్తిపరమైన విధులను అగ్నివీరులు నిర్వహించాలి. వీరంతా ఆయా యూనిట్లలో చేరి విధులు చేపడతారు. ఒకే విధమైన యూనిఫామ్, ఒకే విధమైన విధులు నిర్వహిస్తారు’అని లెఫ్టినెంట్ జనరల్ సీబీ పొన్నప్ప తెలిపారు.
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో సెలెక్ట్ అయినవారు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ బలగాల్లో పనిచేస్తారు. వారిని అగ్నివీర్లు అంటారు. 17.5 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నాలుగు ఏళ్ల తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తారు.
మిగతావారంతా రిటైర్ అవుతారు. ఈ పథకం విధివిధానాలు నియామక ప్రక్రియ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు సైతం ఈ పథకాన్ని రద్దు చేయాని డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్ట్‌లో సైతం ఈ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment