ఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్ పథకంపై ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మందుపాతర పేలి అగ్నివీరుడు అమరుడు అయితే.. అమరుడని పిలువరు. అగ్నివీర్ అంటారు. వారికి రావాల్సిన పెన్షన్ రాదు. పరిహారం ఇంటికి అందదని మండిపడ్డారు.
అదేవిధంగా అజయ్ కుమార్ అనే అగ్నివీర్ కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించలేదని నిన్న( బుధవారం) ‘ఎక్స్’లో విమర్శలు చేశారు. మహేష్ కుమార్ మాట్లాడిని వీడియోను షేర్ చేశారు. అయితే రాహుల్ గాంధీ విమర్శలపై ఇండియన్ ఆర్మీ స్పందించింది.
‘అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి నష్టపరిహారం అందిచలేదని సోషల్‌మీడియాలో పోస్టులు వెలిశాయి. అయితే అమరుడై మహేష్ కుమార్ కుటుంబానికి 98. 39 లక్షలు అందించాం. ఎక్స్ గ్రేషియాతో పాటు ఇతర చెల్లింపుల కింద మొత్తం 67 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అగ్నివీర్ పథకం ప్రకారం పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ డబ్బును కూడా అందిస్తాం. దీంతో మొత్తం రూ. 1.65 కోట్లు మహేష్‌కుమార్ కుటుంబానికి అందించినట్లు అవుతుంది’అని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ పోస్ట్‌కు స్పష్టత ఇచ్చింది భారత ఆర్మీ.
‘రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరులైన అగ్నివీరుల కుటుంబాలకు అందించే ఆర్థిక సాయవ విషయంలో పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పారు. అమరులైన అగ్నివీర్ కుటుంబానికి రూ. కోటి ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు. అమరుడైన అగ్నివీర్ అజయ్ కుమార్ తండ్రి నాతో మీరు(ప్రభుత్వం) చెప్పిన అబద్దాలు గురించి తెలిపారు. వారి కుటుంబానికి పరిహారం అందలేదని చెప్పారు. రక్షణ మంత్రి పార్లమెంట్, దేశానికి, భారత ఆర్మీకి , అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి’అని ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
सत्य की रक्षा हर धर्म का आधार है!
लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।
उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।
रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024
ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష రాహల్ గాంధీ.. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై విమర్శలు చేశారు. అగ్నివీర్‌లను వాడకొని వదిలేస్తున్నారని మండిపపడ్డారు. రాహుల్ గాంధీ విమర్శలపై లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అభ్యంతరం తెలిపారు. అమరులైన అగ్నివీర్ కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చేల్లిస్తున్నామని తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. రక్షణ, భద్రత వ్యవస్థల్లో భారత్‌ను పటిష్టం చేసే సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment