తూర్పు సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అకస్మాత్తుగా భారీ హిమపాతం కురియడంతో తూర్పు సిక్కింలోని నటులాలో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు.
వీరిని గమనించిన ఆర్మీ సైనికులు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు కారణంగా 500 మంది పర్యాటకులతో పాటు దాదాపు 175 వాహనాలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. వారిని ఆర్మీ బృందం కాపాడింది. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ పర్యాటకులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ తెలిపింది.
దీనికిముందు ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన వాహనాలను తరలించడంలో సీఆర్‌పీఎఫ్ సైనికులు సహాయం అందించారు. భారీ వర్షం, హిమపాతం కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐒𝐧𝐨𝐰𝐟𝐚𝐥𝐥 𝐢𝐧 𝐄𝐚𝐬𝐭 𝐒𝐢𝐤𝐤𝐢𝐦, 𝟓𝟎𝟎 𝐒𝐭𝐫𝐚𝐧𝐝𝐞𝐝 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐭𝐬 𝐑𝐞𝐬𝐜𝐮𝐞𝐝 𝐛𝐲 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐓𝐫𝐢𝐬𝐡𝐚𝐤𝐭𝐢 𝐂𝐨𝐫𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐫𝐦𝐲
— Trishakticorps_IA (@trishakticorps) February 21, 2024
Due to sudden heavy snowfall, approximate 175 vehicles with more than 500 tourists got… pic.twitter.com/vdQTbdQ6jJ
Comments
Please login to add a commentAdd a comment