Gangtok
-
మంచులో చిక్కుకున్న పర్యాటకులను కాపాడిన ఆర్మీ సిబ్బంది
తూర్పు సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అకస్మాత్తుగా భారీ హిమపాతం కురియడంతో తూర్పు సిక్కింలోని నటులాలో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. వీరిని గమనించిన ఆర్మీ సైనికులు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు కారణంగా 500 మంది పర్యాటకులతో పాటు దాదాపు 175 వాహనాలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. వారిని ఆర్మీ బృందం కాపాడింది. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ పర్యాటకులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ తెలిపింది. దీనికిముందు ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన వాహనాలను తరలించడంలో సీఆర్పీఎఫ్ సైనికులు సహాయం అందించారు. భారీ వర్షం, హిమపాతం కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐒𝐧𝐨𝐰𝐟𝐚𝐥𝐥 𝐢𝐧 𝐄𝐚𝐬𝐭 𝐒𝐢𝐤𝐤𝐢𝐦, 𝟓𝟎𝟎 𝐒𝐭𝐫𝐚𝐧𝐝𝐞𝐝 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐭𝐬 𝐑𝐞𝐬𝐜𝐮𝐞𝐝 𝐛𝐲 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐓𝐫𝐢𝐬𝐡𝐚𝐤𝐭𝐢 𝐂𝐨𝐫𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐫𝐦𝐲 Due to sudden heavy snowfall, approximate 175 vehicles with more than 500 tourists got… pic.twitter.com/vdQTbdQ6jJ — Trishakticorps_IA (@trishakticorps) February 21, 2024 -
మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు
గాంగ్టక్: సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్ల అసోషియేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులైన మహిళలకు ఏడాది పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులపాటు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్(SSCSOA) సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా సర్వీసు రూల్స్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం తమాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పరిపాలనలో అధికార యంత్రాంగం పాత్ర చాలా ముఖ్యమైనదని, రాష్ట్ర ఎదుగుదలకు, అభివృద్ధికి వారు వెన్నుముకగా నిలిచారని అన్నారు. ఇకపై మహిళా అధికారులకు 12 నెలల పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీని వలన విధినిర్వహణలో భాగంగా ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండే అధికారులకు కుటుంబంతోనూ పిల్లలతోనూ కొంత సమయం గడిపే అవకాశముంటుందని అన్నారు. అతి త్వరలోనే సర్వీస్ రూల్స్ లో ఈ సవరణలు చేస్తామని చెబుతూ, కొత్తగా ఎంపికైన ఐఏఎస్, సిక్కిం సివిల్ సర్వీసెస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ప్రస్తుతం 6 నెలలు లేదా 28 వారాల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడది సంవత్సరం పాటు పెంచడంతో మహిళా అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్ -
సిక్కింలో మంచులో చిక్కిన 900 మంది యాత్రికులు
గ్యాంగ్టాక్: సిక్కింలో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, టోంగో లేక్ నుంచి రాజధాని గ్యాంగ్టాక్ వైపు శనివారం సాయంత్రం బయలుదేరిన 89 వాహనాలు దట్టమైన మంచులో చిక్కినట్టు అధికారులు చెప్పారు. వీటిలో సుమారు 900 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారన్నారు. ఆర్మీ సాయంతో వీరిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. అడ్డంకులను తొలగిస్తుండటంతో ఇప్పటికే 15 వాహనాలు గ్యాంగ్టాక్ వైపు బయలుదేరాయని చెప్పారు. కొందరు ప్రయాణికులను దగ్గరల్లోని క్యాంపులకు తీసుకెళ్తామని వెల్లడించారు. -
ఫ్యామిలీ వెకేషన్స్.. టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ టాప్–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ – ఫ్యామిలీ ఎడిషన్ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్‌గా తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్డౌన్లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది. పిల్లలకు సదుపాయాలు ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ, పుదుచ్చేరి, మెక్లయోడ్ గంజ్, మహాబలేశ్వర్ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్ బోల్ పేర్కొన్నారు. హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్ పార్క్‌లు, పెద్ద టెలివిజన్ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్‌కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
ఈ రోడ్డు చాలా ‘హైట్’ గురూ...
గ్యాంగ్‌టక్ : సిక్కింలోని కెరంగ్-జొడాంగ్ల మధ్య 18,600 అడుగుల ఎత్తులో 19 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో రహదారిగా నిలుస్తుంది. 2021కల్లా రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్ఓ) అధికారి తెలిపారు. 2015లో మంజూరైన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కొండలను తవ్వే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రోడ్డు 3.75 మీటర్ల వెడల్పు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతం టూరిజం పరంగా అభివృద్ధి చెందుతున్నందున సాధారణ పౌరులు తిరిగేందుకు కూడా ఆర్మీ అనుమతించే అవకాశం ఉందని తెలిపారు. -
సిక్కిం సీఎంగా ప్రేమ్‌సింగ్ ప్రమాణస్వీకారం
గ్యాంగ్‌టక్ : సిక్కిం క్రాంతికారి మోర్ఛా(ఎస్కేఎమ్) అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్ తమాంగ్ సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రేమ్ సింగ్ తమాంగ్‌తో గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేపించారు. పల్జోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిక్కిం క్రాంతికారి మోర్ఛా మద్దతు దారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రేమ్ సింగ్ నేపాలి భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం అసెంబ్లీలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎస్కేఎమ్, ఎస్డీఎఫ్ పార్టీల మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఎస్కేఎమ్ 17 స్థానాల్లో గెలుపొందగా, ఎస్టీఎఫ్ 15 స్థానాలతో తృటిలో అధికారాన్ని కోల్పోయింది. -
సిక్కింలో భూకంపం
సిక్కింలో గురువారం స్వల్పంగా భూమి కంపించింది. రెక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 5గా నమోదైనట్టు ప్రాంతీయ భూకంప హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. ఉదయం 11.43 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు వెల్లడించింది. భూకంప ప్రభావానికి గ్యాంగ్‌టక్‌లో కొన్ని భవనాలకు బీటలు బారినట్టు అధికారులు తెలిపారు. భయబ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లల్లో నుంచి వీధులోకి వచ్చారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు.