ఆర్మీ కొత్త యూనీఫాం
న్యూఢిల్లీ: మన ఆర్మీ యూనీఫాం మారబోతోంది. సౌకర్యవంతమైన, వాతావరణ అనుకూలమైన, డిజిటల్ డిస్‌రప్టీవ్ ప్యాట్రన్‌లో కొత్త యూనీఫాంను ఇండియన్ ఆర్మీ శనివారం ఆవిష్కరించింది. కొత్త యూనీఫాంలను ధరించిన ప్యారాచూట్ సైనిక దళం నిన్న (శనివారం) ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొన్నారు. భారత ఆర్మీ కొత్త యూనీఫాం రూపురేఖల విశేషాలు ఇవే..
►ఆలివ్, మట్టి రంగులతో సహా వివిధ రంగుల సమ్మేళనంతో రూపొందించిన కొత్త యూనిఫాం, దళాల వ్యూహరచన ప్రాంతాలు, వివిధ వాతావరణ పరిస్థితులు వంటి అంశాల దృష్ట్యా రూపొందించడం జరిగింది.
►నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి వివిధ దేశాల ఆర్మీల యూనిఫాంలను విశ్లేషించిన అనంతరం కొత్త యూనిఫాంలను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
►ఈ యూనిఫాం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, అన్ని రకాల వాతావరణాల్లో ధరించవచ్చని తెలిపారు. కంప్యూటర్ సహాయంతో డిజిటల్ డిస్‌రప్టివ్ ప్యాటర్న్‌లో ప్రత్యేకంగా రూపొందించారు.
►కొత్త యూనిఫాంలోని షర్టును, ట్రౌజర్‌లో టక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇకపై మన ఆర్మీ డ్రెస్ ఇన్‌షర్ట్ లేకుండా ఉండబోతుందన్నమాట.
►కొత్త ఆర్మీ యూనిఫామ్‌లు బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి.
#WATCH | Delhi: Indian Army’s Parachute Regiment commandos marching during the Army Day Parade in the new digital combat uniform of the Indian Army. This is the first time that the uniform has been unveiled in public. pic.twitter.com/j9D18kNP8B
— ANI (@ANI) January 15, 2022
Comments
Please login to add a commentAdd a comment