Nift
-
సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ..33 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్!
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, డిజైన్ కంపెనీ సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు గురువారాని(18)కల్లా దాదాపు 33 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. ఐపీవోలో భాగంగా 2,85,63,816 షేర్లను విక్రయానికి ఉంచగా.. 93 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. వెరసి షేరుకి రూ. 209–220 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 840 కోట్లు సమకూర్చుకుంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి 87.6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 17.5 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో సైతం 5.5 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. ఇష్యూలో భాగంగా రూ. 766 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో 33.7 లక్షల షేర్లను వాటాదారులు ఆఫర్ చేశారు. ఇష్యూ ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 252 కోట్లు సమీకరించింది. ఇష్యూ ద్వారా కంపెనీ రెండున్నర నెలల తదుపరి తిరిగి ప్రైమరీ మార్కెట్‌కు జోష్‌ను తీసుకువచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతక్రితం అంటే మే 24–26 మధ్య ఏథెర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టిన విషయం విదితమే. ఐపీవోకు డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ రెడీ న్యూఢిల్లీ: విమానాశ్రయ సర్వీసుల అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల(ఆగస్ట్) 24న ప్రారంభంకానున్న ఇష్యూ 26న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా 1.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఇవి ఇష్యూ తదుపరి చెల్లించిన మూలధనంలో 33 శాతం వాటాకు సమానం. యూనిఫైడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయ సౌకర్యాలను పొందేందుకు డ్రీమ్‌ఫోక్స్ వీలు కల్పిస్తుంది. ఎయిర్పోర్ట్ లాంజ్‌లు, ఆహారం, పానీయాలు, స్పా, ట్రాన్సిట్ హోటళ్లు తదితర పలు సర్వీసులను పొందేందుకు వినియోగదారులకు కంపెనీ వీలు కల్పిస్తుంది. -
Army Day 2022: ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫాం ఇదే!
న్యూఢిల్లీ: మన ఆర్మీ యూనీఫాం మారబోతోంది. సౌకర్యవంతమైన, వాతావరణ అనుకూలమైన, డిజిటల్ డిస్రప్టీవ్ ప్యాట్రన్‌లో కొత్త యూనీఫాంను ఇండియన్ ఆర్మీ శనివారం ఆవిష్కరించింది. కొత్త యూనీఫాంలను ధరించిన ప్యారాచూట్ సైనిక దళం నిన్న (శనివారం) ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొన్నారు. భారత ఆర్మీ కొత్త యూనీఫాం రూపురేఖల విశేషాలు ఇవే.. ►ఆలివ్, మట్టి రంగులతో సహా వివిధ రంగుల సమ్మేళనంతో రూపొందించిన కొత్త యూనిఫాం, దళాల వ్యూహరచన ప్రాంతాలు, వివిధ వాతావరణ పరిస్థితులు వంటి అంశాల దృష్ట్యా రూపొందించడం జరిగింది. ►నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి వివిధ దేశాల ఆర్మీల యూనిఫాంలను విశ్లేషించిన అనంతరం కొత్త యూనిఫాంలను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ►ఈ యూనిఫాం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, అన్ని రకాల వాతావరణాల్లో ధరించవచ్చని తెలిపారు. కంప్యూటర్ సహాయంతో డిజిటల్ డిస్రప్టివ్ ప్యాటర్న్‌లో ప్రత్యేకంగా రూపొందించారు. ►కొత్త యూనిఫాంలోని షర్టును, ట్రౌజర్‌లో టక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇకపై మన ఆర్మీ డ్రెస్ ఇన్‌షర్ట్ లేకుండా ఉండబోతుందన్నమాట. ►కొత్త ఆర్మీ యూనిఫామ్‌లు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి. #WATCH | Delhi: Indian Army’s Parachute Regiment commandos marching during the Army Day Parade in the new digital combat uniform of the Indian Army. This is the first time that the uniform has been unveiled in public. pic.twitter.com/j9D18kNP8B — ANI (@ANI) January 15, 2022 -
స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు
చిట్టి పలకా బలపం చిన్నారి చదువుకునే బడి పుస్తకం నోరూరించే నూడుల్స్, పిజ్జా... ఇడ్లీ, దోసె, మిర్చిబజ్జీ అందమైన పూల మొక్కలు.. ఆకట్టుకునే ముఖచిత్రాలు నూటొక్క పూవుల బతుకమ్మ.. నిదురించే చంటిబిడ్డ పూలవనాలు, పండ్ల రాశులు అన్నీ మట్టి రూపాలే.. మనసుదోచే కళారూపాలే! పార్వతి చేతుల్లో ప్రాణం పోసుకున్న పిండిబొమ్మల్లే స్ఫూర్తి చేతుల్లో వెలుగొందుతున్నాయి మట్టి బొమ్మలు ఆమె కళారూపాలు గ్రామ సరిహద్దులను దాటి విదేశీ గడ్డపైనా ముచ్చటగా మెరిసిపోతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి వాసి అయిన స్ఫూర్తి మినియేచర్ సృష్టి... ముచ్చట ఇది.. క్లేతో ఆమె తయారు చేస్తున్న మినియేచర్స్కు దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కొనుగోలు చేస్తున్నవారు ఆనందం పొందుతుండగా, తయారు చేసి విక్రయించడం ద్వారా ఆమె ఉపాధి పొందుతోంది. కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్ కాలనీకి చెందిన శ్రీరాం, గంగల కూతురు స్ఫూర్తి దానబోయిన. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్ససరీస్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. కొంత కాలం పోచంపల్లిలో లెదర్ కంపెనీలో హ్యాండ్ బ్యాగ్స్ తయారీలో, అలాగే కోల్‌కతాలో ఆరు నెలలపాటు ఉద్యోగం చేసింది. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ప్రయత్నించింది. అయితే ఆ సమయంలోనే ప్రపంచమంతటా కరోనా మహమ్మారి కమ్ముకోవడంతో పీజీ ఆలోచనను వాయిదా వేసుకుని ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఈ సమయంలో క్లేతో మినియేచర్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. అలా తయారు చేసిన వస్తువులను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయడంతో చాలా మంది అవి తమకు నచ్చాయని, తమకు కూడా కావాలంటూ ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం మొదలై ఇప్పుడు వందలాది ఆర్డర్లు వస్తున్నాయి. గడచిన రెండేళ్లుగా స్ఫూర్తి దాదాపు రూ.3 లక్షల విలువైన ఆర్డర్లు తీసుకుంది. రాత్రింబగళ్లూ క్లేతో వారు కోరిన బొమ్మలను తయారు చేసి, వాటిని పోస్ట్, కొరియర్ సర్వీసుల ద్వారా పంపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు మన దేశంలో ఎక్కువగా మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, లక్నో, తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. వారి ద్వారా విదేశాల్లో ఉన్న వారి వారి బంధువులు కూడా ఆర్డర్లు చేస్తున్నారు. దీంతో వారు కోరుకున్నవి తయారు చేసి పంపిస్తూ ఉపాధి పొందుతోంది. ప్రతి రోజూ ఆర్డర్లు వస్తూనే ఉంటాయని, రూ.150 మొదలుకొని రూ.1200 వరకు వివిధ రకాల మినియేచర్లు తయారు చేస్తున్నట్టు స్ఫూర్తి పేర్కొంది. ఇప్పటివరకు ఇంటి దగ్గర ఉంటూ మినియేచర్స్ తయారీ ద్వారా ఖర్చులన్నీ పోనూ దాదాపు రూ.3 లక్షలు ఆర్జించింది. అలంకార వస్తువులు మినియేచర్స్తోబాటు కొంత మంది మహిళలు తమకు కీచైన్స్ కావాలని, చెవులకు జూకాలు, లాకెట్స్, హెయిర్ క్లిప్‌లు... ఇలా రకరకాల అలంకార వస్తు సామగ్రి కావాలంటూ ఆర్డర్లు ఇస్తున్నారు. వాళ్లు కోరుకున్నట్టుగా తయారు చేస్తూ వారికి పంపిస్తోంది. స్ఫూర్తి ప్రతిభ దేశ, విదేశాలకు పాకింది. ఆమెకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్న చోటనే ఉపాధి పొందవచ్చని నిరూపిస్తోంది స్ఫూర్తి. ప్రశంసలే స్ఫూర్తిగా... క్లేతో మినియేచర్స్ తయారు చేస్తున్న స్ఫూర్తి పలువురి నుంచి అభినందనలు అందుకుంది. హైదరాబాద్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆమె తయారు చేసిన మినియేచర్స్ను ప్రదర్శించడానికి ఆహ్వానం అందింది. దీంతో తాను తయారు చేసిన మినియేచర్స్ కళను ప్రదర్శించి నిర్వాహకుల నుంచి ప్రశంసలు, బహుమతులు అందుకుంది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న స్ఫూర్తి.. పేరుకు తగ్గట్టు అందరికీ స్ఫూర్తి ప్రదాత. అందమైన ఎంపిక మినియేచర్స్ తయారు చేయడం ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటి తయారీ మొదలు పెట్టాను, సక్సెస్ అయ్యాను. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది నేను తయారు చేసిన మీనియేచర్లను కానుకలుగా ఎంపిక చేసుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. ఆ విధంగానే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. – స్ఫూర్తి – ఎస్.వేణుగోపాలాచారి, కామారెడ్డి, సాక్షి -
ఫ్యాషన్.. యువతకు ఇప్పుడు చక్కటి కెరీర్.. విజయం సాధించండిలా
ఫ్యాషన్.. యువతకు ఇప్పుడు చక్కటి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. ఫ్యాషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు ఉంటే.. ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి! ఇలాంటి నైపుణ్యాలు అందించే వేదిక.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)!! దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్–2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నిఫ్ట్ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హతలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. హెయిర్ స్టైల్ అదిరిపోవాలి. డ్రెస్సింగ్ ట్రెండీగా ఉండాలి. ఎదుటివాళ్లు కళ్లు తిప్పుకోకూడదు. చివరకు కాళ్లకు తొడిగే ఫుట్‌వేర్ సైతం వెరైటీగా ఉండాల్సిందే! ఇది నేటి యువత ఫ్యాషన్ ధోరణి!! ఇలాంటి ప్రొడక్ట్స్‌ను మార్కెట్లో తేవాలంటే..అంత తేలిక కాదు. అందుకు ఫ్యాషన్ నిపుణులు అవసరం ఉంటుంది. ఇదే ఇప్పుడు యువతకు కెరీర్ అవకాశంగా మారుతోంది. నిఫ్ట్ ప్రత్యేకత భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాసంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్). ఈ ఇన్స్టిట్యూట్కు దేశ వ్యాప్తంగా 17క్యాంపస్‌లు ఉన్నాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో.. బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో కోర్సులను అందిస్తున్నారు. నిఫ్ట్ క్యాంపస్‌లు అందించే ఈ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. వీటిల్లో ప్రవేశం పొందాలంటే.. నిఫ్ట్–అడ్మిషన్ ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాచిలర్ స్థాయి డిజైన్ ►బ్యాచిలర్ స్థాయిలో..బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ పేరుతో అందుబాటులో ఉన్న కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్; లెదర్ డిజైన్; యాక్ససరీస్ డిజైన్; టెక్స్టైల్ డిజైన్; నిట్వేర్ డిజైన్; ఫ్యాషన్ కమ్యూనికేషన్. ►వీటికి ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బ్యాచిలర్ స్థాయిలోనే.. ఫ్యాషన్ విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇందులో ప్రవేశానికి ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. పీజీ ప్రోగ్రామ్‌లు ►పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ►మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా నిఫ్ట్/నిడ్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(కనీసం మూడేళ్లు)ఉత్తీర్ణులు అర్హులు. ►మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: నిఫ్ట్ అందించే బీ.ఎఫ్.టెక్ ఉత్తీర్ణులు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి బీటెక్/బీఈ ఉత్తీర్ణులు అర్హులు. ►పీజీ కోర్సులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. మూడంచెల ఎంపిక ప్రక్రియ నిఫ్ట్–అడ్మిషన్ ప్రక్రియ మూడంచెల్లో ఉంటుంది. తొలిదశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(సీఏటీ);జనరల్ ఎబిలిటీ టెస్ట్(జీఏటీ)ను నిర్వహిస్తారు. ఆ తర్వాత దశలో సిట్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్లు ఉంటాయి. వీటిలో విజయం సాధిస్తే సీటు ఖరారు చేస్తారు. తొలి దశ జీఏటీ ►బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులకు తొలి దశలో జీఏటీ(జనరల్ ఎబిలిటీ టెస్ట్)ను నిర్వహిస్తారు. పరీక్ష ప్రశ్నల క్లిష్టత స్థాయి మాస్టర్ కోర్సుల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ►బీడిజైన్ కోర్సుకు జీఏటీ పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ►ఎండిజైన్ కోర్సుకు జీఏటీ పేపర్లో 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ►జీఏటీలోనూ పలు విభాగాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; అనలిటికల్ ఎబిలిటీ; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాషన్ టెక్నాలజీ.. ప్రత్యేక పరీక్ష బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సులకు తొలి దశ ప్రవేశ పరీక్ష జీఏటీని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఈ పరీక్షలో క్యాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు ఒక కేస్ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ పరీక్షలో బీ.ఎఫ్.టెక్, ఎం.ఎఫ్.టెక్‌లకు సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయి. రెండో దశ.. సీఏటీ నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్ ప్రక్రియలో రెండో దశ పరీక్ష.. సీఏటీ(క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్). అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. మూడో దశ.. సిట్యుయేషన్ టెస్ట్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అభ్యర్థుల సృజనాత్మక ప్రతిభను పరిశీలించే విధంగా మూడో దశలో నిర్వహించే పరీక్ష.. సిట్యుయేషన్ టెస్ట్. ఇది పూర్తిగా ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఉంటుంది. అభ్యర్థులకు నిర్ణీత మెటీరియల్ అందించి ఏదైనా ఆకృతిని రూపొందించమని సూచిస్తారు. లేదా ఏదైనా ఒక సందర్భాన్ని పేర్కొని.. దానికి తగినట్లుగా ఊహా చిత్రం గీయమని అడుగుతారు. చివరగా.. జీడీ, పీఐ నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్లోని తొలి మూడు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ)లు నిర్వహిస్తారు. జీడీ ద్వారా అభ్యర్థి భావవ్యక్తీకరణ, స్పష్టత, ఆలోచన సామర్థ్యాలను పరిశీలిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ పూర్తిగా ఫ్యాషన్ కెరీర్ పట్ల అభ్యర్థికున్న ఆసక్తి, దానికి సరితూగే తత్వాలను గ్రహించే విధంగా ఉంటుంది. ఇందులోనూ విజయం సాధిస్తే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. విజయం సాధించండిలా ►నిఫ్ట్ అడ్మిషన్ ప్రక్రియలో పేర్కొన్న జీఏటీ, సీఏటీ, సిట్యుయేషన్ టెస్ట్‌లు.. వాటిలో సెక్షన్లు, సంబంధిత సబ్జెక్ట్‌లలో రాణించడానికి ఆయా అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ►క్వాంటిటేటివ్ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్,అర్థమెటిక్స్ నుంచి ఉంటాయి. వర్క్ అండ్ టాస్క్, శాతాలు, నిష్పత్తులు,టైమ్ అండ్ డిస్టెన్స్,టైమ్ అండ్ వర్క్ సంబంధించిన అంశాల్లో పట్టు సాధించాలి. ►కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: ఇంగ్లిష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.అభ్యర్థులు బేసిక్ గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ►అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ: విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక అంశంలో ఇమిడి ఉన్న ప్రధాన కాన్సెప్ట్‌లు, వాటికి సంబంధించి అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోవాలి. ►జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు హైస్కూల్ స్థాయి సోషల్ స్టడీస్ నుంచి ఉంటాయి. అదే విధంగా ముఖ్యమైన తేదీలు–సందర్భాలు వంటివి కూడా అడుగుతారు. తాజాగా జరిగిన ముఖ్యమైన సంఘటనలు కూడా తెలుసుకోవాలి. ► కేస్ స్టడీ: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుల అభ్యర్థులకు మాత్రమే నిర్వహించే కేస్ స్టడీ వినూత్నంగా ఉంటుంది. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి.. దానికి పరిష్కారం అడుగుతారు. దీనిలో రాణించాలంటే.. అభ్యర్థులు వాస్తవ అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం పెంచుకోవాలి. ఆసక్తి ప్రధానం ఫ్యాషన్ రంగంలో ప్రవేశించాలనుకునే యువతకు ఆసక్తి ఎంతో ప్రధానం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులు,జీవన శైలి,వ్యక్తుల అభిరుచుల్లో మార్పులు గమనిస్తూ.. ప్రొడక్ట్ డిజైన్ చేసే దూరదృష్టి అవసరం. ప్రస్తుతం ఫ్యాషన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఢోకా లేదు. –ప్రొ.ఎల్.మదన్ కుమార్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్, నిఫ్ట్, హైదరాబాద్ కోర్సులు–సీట్లు ►జాతీయ స్థాయిలో మొత్తం 17 నిఫ్ట్ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు–సీట్ల వివరాలు: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్: 686, లెదర్ డిజైన్: 168, యాక్ససరీ డిజైన్: 600, టెక్స్టైల్ డిజైన్: 646, నిట్వేర్ డిజైన్: 296, ఫ్యాషన్ కమ్యూనికేషన్: 642,బీఎఫ్‌టెక్(అపెరల్ ప్రొడక్షన్): 518, మాస్టర్ ఆఫ్ డిజైన్: 171, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: 650, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: 140. ►నిఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలు..బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్: 37, యాక్ససరీ డిజైన్:37, టెక్స్టైల్ డిజైన్: 37, నిట్వేర్ డిజైన్: 37, ఫ్యాషన్ కమ్యూనికేషన్: 37, బీ.ఎఫ్.టెక్(అపరెల్ ప్రొడక్షన్): 37,మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: 37. n అన్ని క్యాంపస్‌లలోనూ ఇక్కడ పేర్కొన్న సీట్లతోపాటు ప్రతి కోర్సులో అయిదు సీట్లను అదనంగా.. ఎన్ఆర్ఐ విద్యార్థులు, సార్క్ దేశాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల కోసం కేటాయించారు. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ►యూజీ/పీజీ కోర్సులకు దరఖాస్తులకు చివరి తేది: 2022 జనవరి మొదటి వారం. ►బ్యాచిలర్ కోర్సులకు రాత పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి మొదటి వారం ►వివరాలకు వెబ్సైట్: https://www.nift.ac.in/ -
డిజైన్స్ షో
-
10,900 పాయింట్లపైకి నిఫ్టీ
చివర్లో జోరుగా సాగిన కొనుగోళ్ల కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్ల బలహీనత కారణంగా రోజులో అధిక భాగం మన మార్కెట్ నష్టాల్లోనే ట్రేడైంది. ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించడంతో చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. స్టాక్ సూచీలు లాభపడటం ఇది వరుసగా ఆరో రోజు. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 10,900 పాయింట్లపైకి ఎగబాకింది. 20 పాయింట్ల లాభంతో 10,909 పాయింట్లకు చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్77 పాయింట్లు పెరిగి 36,347 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,387 పాయింట్లు పెరిగింది. ఫార్మా, లోహ, క్యాపిటల్ గూడ్స్, వాహన రంగ షేర్లు పెరిగాయి. ఐటీ, ఎఫ్ఎమ్సీజీ షేర్లు తగ్గాయి. ప్రపంచ మార్కెట్లు పతనమైనా.... అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం మంగళవారం ఆరంభమైంది. రేట్ల పెంపునకు సంబంధించిన కీలక నిర్ణయం నేడు (బుధవారం) వెలువడనున్నది. రేట్ల పెంపు అంచనాలకు తోడు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు కూడా జత కావడంతో సోమవారం అమెరికా స్టాక్ సూచీలు 2 శాతం పతనమయ్యాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా 1–2 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్లు పతనమైనా మన మార్కెట్ మాత్రం లాభాల్లో ముగియగలిగింది. అమెరికా షేల్‌గ్యాస్ ఉత్పత్తి అంచనాలను మించుతుందన్న వార్తల కారణంగా బ్యారెల్ బ్రెంట్ చమురు 2.7 శాతం క్షీణించి 57.98 డాలర్లకు పడిపోయింది. ముడి చమురు ధరలు తగ్గడం రూపాయికి జోష్‌నిచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 93 పైసలు లాభపడి 70.63ను తాకింది. నష్టాల్లోంచి...లాభాల్లోకి.... సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. ఆరంభంలో అమ్మకాలు, ఆ తర్వాత కొనుగోళ్లు, జోరుగా సాగాయి. మధ్యాహ్నం వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. ఒక దశలో 224 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 105 పాయింట్లు లాభపడింది. రోజంతా 329 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడినట్లయింది. ఇక నిఫ్టీ ఒక దశలో 69 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 27 పాయింట్లు లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, మన మార్కెట్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. చమురు ధరలు దిగిరావడం, బాండ్ల రాబడులు కూడా తగ్గడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు. సన్ ఫార్మా షేర్ 2.9% లాభంతో రూ. 433 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ముడి చమురు ధరలు తగ్గడంతో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 2.7 శాతం వరకూ పెరిగాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్ వంటి విమానయాన రంగం షేర్లు 7 శాతం వరకూ ఎగిశాయి. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ రేటింగ్‌ను బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో జీ ఎంటర్టైన్మెంట్ షేర్ 8 శాతం నష్టంతో రూ.463 వద్ద ముగిసింది. నిఫ్టీలో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రహదారి ఆస్తులను విక్రయించనున్నామని వెల్లడించిన కారణంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు–ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ షేర్లు 10 శాతం వరకూ పెరిగాయి. ఆరు రోజుల్లో రూ.6.80 లక్షల కోట్లుస్టాక్ మార్కెట్లో ఆరు రోజులుగా లాభాల జోరు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఆరు రోజుల్లో రూ.6.80 లక్షల కోట్లు పెరిగి రూ.1,44,72,895కు పెరిగింది. -
ఫ్యాషన్ హంగామా
-
చేనేత అందాల కళబోత
-
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభ మయ్యాయి. సెన్సెక్స్ 41 పాయింట్ల లాభంతో 30,791 వద్ద,నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 9511 వద్ద ట్రేడ్అవుతోంది. ముఖ్యంగా ఆయిల్ గ్యాస్ సెక్టార్ టాప్ లూజర్‌గాఉంది. వచ్చే ఏడాది(2018) మార్చివరకూ ఉత్పత్తిని నియంత్రించేందుకు ఒపెక్ దేశాలు గురువారంనాటి సమావేశంలో అంగీకరించినప్పటికీ ముడిచమురు ధరలు పతనం దిశగా పయనిస్తున్నాయి. ఐటీ బలహీనంగా, ఫార్మా, మెటల్, పాజిటివ్‌గా ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ , డా. రెడ్డీస్, అరబిందో, టాటా స్టీల్, మారుతి సుజుకి, టీవీఎస్ మోటార్ లాభాల్లో ఉన్నాయి. సిప్లా, బీపీసీఎల్, ఐఓసీ టెక్ మహీంద్రచ భారతి ఎయిర్ టెల్ నష్టాల్లోఉన్నాయి. -
నిఫ్ట్ ఫ్యాషన్ షో అదిరింది
-
ఫ్యాషన్ షో అదుర్స్
-
నిఫ్ట్ సలహా కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రస్థాయి సలహా కమిటీని నియమించింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్థిక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు, సంబంధిత పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రతినిధులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. -
నిఫ్ట్ విద్యార్థినిపై అత్యాచారం?
న్యూఢిల్లీ: ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) విద్యార్థులపై పోలీసులు శనివారం లాఠీ ఝుళిపించారు. ఓ విద్యార్థిని మద్దతుగా నిరసన తెలుపుతున్నవారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాగా శుక్రవారం రాత్రి అత్యాచారానికి గురైన విద్యార్థిని క్యాంపస్ లోకి వెళ్లడానికి సెక్యూరిటీ గార్డులు అనుమతి ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో నిఫ్ట్ స్టూడెంట్ రేప్ కు గురైందా? అనే గందరగోళం నెలకొంది. కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(కేఐటీ) క్యాంపస్ లోనే నిఫ్ట్ కూడా ఉంది. అర్థరాత్రి రెండు గంటల సమయంలో స్టేషన్ నుంచి క్యాంపస్ కు వచ్చిన బాధితురాలు రేప్ కు గురైందని విద్యార్థులు తెలిపారు. సాయం కోసం క్యాంపస్ గేట్ల ముందు నిల్చొని పెద్దగా ఏడుస్తూ తలుపులు తెరవాలని ఆమె కోరినట్లు చెప్పారు. గార్డులు ఎంతకూ స్పందించలేదని వివరించారు. కొంతసేపటికి గేటు వద్దకు వచ్చిన ముగ్గురు లేదా నలుగురు మృగాళ్లు ఆమెను మరలా రేప్ చేశారని విద్యార్థులు చెప్పారు. విద్యార్థుల ఆరోపణల్లో నిజం లేదని ప్రాథమిక విచారణలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలేవి దొరకలేదని పోలీసులు తెలిపారు. గేటు వద్ద నిల్చొని కేకలు వేస్తూ ఏడ్చిన ఆమె కొద్ది రోజులుగా డాక్టర్ సూచించిన మందులను తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు రేప్ జరిగిందని చెప్తున్న యువతి సంస్థలో విద్యార్థి కాదని కేఐటీ ప్రకటించింది. అది నిఫ్ట్ సమస్యని వ్యాఖ్యానించింది. రూమర్స్ కారణంగానే విద్యార్థులు ఆందోళన చేస్తూ డైరెక్టర్ తో మాట్లాడాలని అనుకుంటున్నారని కేఐటీ స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ చెప్పారు. రేప్ కు గురైన యువతి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా.. నిఫ్ట్ పేరు బయటకు వస్తుందేమోనని ఆమె బెదిరిస్తున్నారని ఓ విద్యార్థి తెలిపాడు. -
నిఫ్ట్ ఛైర్మన్ గా చేతన్ చౌహాన్
మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ చేతన్ చౌహాన్.. నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (నిఫ్ట్) ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఢిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) వైస్ ప్రెసిడెంట్, సీనియర్ బీసీసీఐ అధికారిగా ఉన్న చౌహాన్.. సొంతంగా ఓ క్రికెట్ అకాడమీని నడపడంతో పాటు, న్యూస్ ప్రింట్ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. తనను నిఫ్ట్ ఛైర్మన్ గా నియమించినందుకు చౌహాన్ ప్రధానమంత్రి మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు చాలాకాలం పాటు ఓపెనింగ్ పార్టనర్ గా ఉన్న చౌహాన్, రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు. నిఫ్ట్ చట్టం 2006 ప్రకారం ప్రముఖ విద్యావేత్త, శాస్త్రవేత్త, సాంకేతిక లేదా వృత్తిపరమైన అనుభవం ఉన్నవారిని ఈ పదవిలో నియమిస్తారు. వీరి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ప్రస్తుతం నిఫ్ట్ ఛైర్మన్ గా నియమితులైన 68 ఏళ్ల చౌహాన్.. తనకు అప్పగించిన అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. మరోవైపు ఇంతకు ముందు డీడీసీఏ విషయంలో అవినీతి అభియోగాలు ఎదుర్కొన్న చౌహాన్ ను నిఫ్ట్ ఛైర్మన్ గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అలరించిన నిఫ్ట్ ఫ్యాషన్‌షో
-
స్పెక్ట్రమ్ షో అదుర్స్...
-
సిటీలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్.. నిఫ్ట్
హైటెక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ - నిఫ్ట్’. హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ సమీపంలోని నిఫ్ట్ క్యాంపస్ కూడా జాతీయ స్థాయిలో సుపరిచితమైన సంస్థ. ఫ్యాషన్ రంగంలో వినూత్న కోర్సుల్లో శిక్షణకు కేరాఫ్ ఈ ఇన్స్టిట్యూట్. ఫ్యాషన్ టెక్నాలజీలో యాక్సెసరీస్ డిజైన్ మొదలు నిర్వహణ నైపుణ్యాలు అందించే ఫ్యాషన్ మేనేజ్మెంట్ వరకు పలు కోర్సులను అందిస్తున్న నిఫ్ట్ విశేషాలు.. ఆధునిక ప్రపంచం.. అత్యాధునిక అభిరుచులు.. కాళ్లకు ధరించే షూస్ నుంచి కళ్లజోడు వరకు వినూత్నమైన డిజైన్లను కోరుకుంటున్న వినియోగదారులు. వ్యక్తుల రోజువారీ అవసరాల్లో భాగంగా మారిన అనేక వస్తువుల డిజైనింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో శిక్షణనందిస్తున్న సంస్థ... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. కేంద్ర టెక్స్టైల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూట్గా 1986లో ఢిల్లీలో ప్రధాన క్యాంపస్‌గా ఏర్పాటైంది. ఇప్పుడు ఈ విద్యాసంస్థ దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌ల ద్వారా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 1995లో ప్రారంభమైన నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పీజీ వరకు పలు కోర్సులను అందిస్తూ ఫ్యాషన్ రంగ ఔత్సాహికులకు చక్కటి వేదికగా నిలుస్తోంది. కలర్‌ఫుల్ కెరీర్‌కు మార్గం వేస్తోంది. బ్యాచిలర్ టు పీజీ: ప్రస్తుతం నిఫ్ట్ - హైదరాబాద్ క్యాంపస్‌లో.. డిజైన్ విభాగంలో అయిదు కోర్సులు (ఫ్యాషన్ డిజైన్; ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్; ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్ యాక్సెసరీస్; ఫ్యాషన్ కమ్యూనికేషన్; నిట్ వేర్ డిజైన్).. టెక్నాలజీ విభాగంలో ఒక కోర్సు( బీటెక్ - అపరెల్ ప్రొడక్షన్) బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫ్యాషన్ కమ్యూనికేషన్ కోర్సు వినూత్నమైందిగా పేర్కొనవచ్చు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రంగాల్లో రాణించడానికి అవసరమైన స్కిల్స్ అందించే ఈ స్పెషలైజేషన్‌ను పూర్తి చేస్తే డిజైన్ రంగంతోపాటు ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ జర్నలిజం, గ్రాఫిక్ డిజైన్ తదితర కమ్యూనికేషన్ విభాగాల్లోనూ మంచి కెరీర్‌ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. పీజీ స్థాయిలో ఎంబీఏకు తత్సమానమైన మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సు కూడా నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్‌లో ఉంది. బోధనలో సృజనాత్మకత: ఫ్యాషన్ టెక్నాలజీ అంటే సృజనాత్మకతకు పెద్దపీట వేసే రంగం. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌లో బోధనలోనూ సృజనాత్మకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులే కొత్త డిజైన్లను ఆవిష్కరించేలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కల్పించే విధంగా శిక్షణనిస్తున్నారు. ఈ క్రమంలో స్టూడెంట్-ఫ్యాకల్టీ నిష్పత్తిని 20:1గా నిర్దేశించి ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం: ఫ్యాషన్, డిజైన్ రంగాల్లో అకడమిక్ శిక్షణ మిగతా కోర్సులతో పోల్చితే భిన్నమైంది. విద్యార్థులు నిరంతరం సృజనాత్మకత, పరిశీలన దృక్పథంతో అడుగులు వేయాలి. కేవలం క్లాస్ రూం, లైబ్రరీ, లేబొరేటరీలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కూడా నిఫ్ట్ ప్రాధాన్యమిస్తోంది. నిరంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తోంది. ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్: నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను కూడా చేపడుతోంది. కేంద్ర చేనేత శాఖ ఆమోదం పొందిన పాలరాతి బొమ్మల రూపకల్పన; సిల్వర్ ఫిల్‌గ్రీ ప్రాజెక్ట్ వంటివి ఇందుకు ఉదాహరణలు. అంతేకాకుండా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని పలు పరిశ్రమలకు అవసరమైన లోగో డిజైన్, ఉద్యోగుల యూనిఫాం డిజైన్ వంటి మరెన్నో ప్రాజెక్ట్‌లు కూడా చేపట్టింది. వీటిలో ప్రత్యక్షంగా పాల్పంచుకునేందుకు విద్యార్థులకూ అవకాశం కల్పిస్తోంది. ప్లేస్‌మెంట్స్ ఖాయం: నిఫ్ట్‌లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఖాయం. ప్రతి ఏటా నవంబర్ / డిసెంబర్లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్‌లో అర్వింద్ మిల్స్, రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్, స్నాప్ డీల్, టాటా ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ కంపెనీలెన్నో పాల్గొంటున్నాయి. లక్షల్లో వార్షిక వేతనాలను అందిస్తున్నాయి. 2013 ప్లేస్‌మెంట్స్‌లో పీజీ ప్రోగ్రామ్ అభ్యర్థుల్లో అత్యధికంగా రూ.15 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లలో అత్యధికంగా రూ.9 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని నిఫ్ట్ - హైదరాబాద్ సెంటర్ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. సగటున పీజీ బ్యాచ్‌లో రూ.3.69 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లో 2.99 లక్షల వార్షిక వేతనం లభించింది. ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణులకు ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే వంటి మీడియా సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభించాయి. అత్యాధునిక సదుపాయాలు: టీచింగ్, లెర్నింగ్ కోణంలో నిఫ్ట్-హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆడియో-విజువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లేబొరేటరీ, లైబ్రరీల ద్వారా విద్యార్థులకు నిరంతర అధ్యయన మార్గాలను అందిస్తోంది. అంతేకాకుండా ఫ్యాషన్ రంగంలోని అత్యంత ఆదరణ పొందుతున్న డిజైన్ల రూపకల్పన శైలిని ప్రత్యక్షంగా తెలుసుకునే విధంగా ఆయా వస్తువులను రిసోర్స్ సెంటర్లో అందుబాటులో ఉంచుతోంది. ప్రవేశానికి మార్గం.. నిఫ్ట్ ఎంట్రెన్స్: నిఫ్ట్ 15 క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా జాతీయస్థాయిలో నిఫ్ట్ ఎంట్రెన్స్ (యూజీ/పీజీ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా కేంద్రీకృత కౌన్సెలింగ్ విధానంలో క్యాంపస్‌లు, సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్సైట్: www.nift.ac.in/hyderabad/ సృజనాత్మకత ఉంటే.. ‘‘ఫ్యాషన్ రంగంలో అవకాశాలు కోరుకునే వారికి, తగిన సృజనాత్మకత ఉన్న వారికి సరైన వేదిక నిఫ్ట్. హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటైన కొన్నేళ్లలోనే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుతోంది. విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లభించడానికి అనువైన వాతావరణం హైదరాబాద్‌లో ఉంది. నగరంలోని విభిన్న జీవన శైలులు గల వ్యక్తులు, అభిరుచులను ప్రత్యక్షంగా వీక్షించి.. తద్వారా తాజా పరిస్థితులకు సరితూగే విధంగా డిజైన్లు రూపొందించే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది’’ - ప్రొఫెసర్ ఎన్. రాజారాం, డెరైక్టర్, నిఫ్ట్ - హైదరాబాద్