న్యూఢిల్లీ: ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) విద్యార్థులపై పోలీసులు శనివారం లాఠీ ఝుళిపించారు. ఓ విద్యార్థిని మద్దతుగా నిరసన తెలుపుతున్నవారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాగా శుక్రవారం రాత్రి అత్యాచారానికి గురైన విద్యార్థిని క్యాంపస్ లోకి వెళ్లడానికి సెక్యూరిటీ గార్డులు అనుమతి ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో నిఫ్ట్ స్టూడెంట్ రేప్ కు గురైందా? అనే గందరగోళం నెలకొంది. కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(కేఐటీ) క్యాంపస్ లోనే నిఫ్ట్ కూడా ఉంది.
అర్థరాత్రి రెండు గంటల సమయంలో స్టేషన్ నుంచి క్యాంపస్ కు వచ్చిన బాధితురాలు రేప్ కు గురైందని విద్యార్థులు తెలిపారు. సాయం కోసం క్యాంపస్ గేట్ల ముందు నిల్చొని పెద్దగా ఏడుస్తూ తలుపులు తెరవాలని ఆమె కోరినట్లు చెప్పారు. గార్డులు ఎంతకూ స్పందించలేదని వివరించారు. కొంతసేపటికి గేటు వద్దకు వచ్చిన ముగ్గురు లేదా నలుగురు మృగాళ్లు ఆమెను మరలా రేప్ చేశారని విద్యార్థులు చెప్పారు.
విద్యార్థుల ఆరోపణల్లో నిజం లేదని ప్రాథమిక విచారణలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలేవి దొరకలేదని పోలీసులు తెలిపారు. గేటు వద్ద నిల్చొని కేకలు వేస్తూ ఏడ్చిన ఆమె కొద్ది రోజులుగా డాక్టర్ సూచించిన మందులను తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు రేప్ జరిగిందని చెప్తున్న యువతి సంస్థలో విద్యార్థి కాదని కేఐటీ ప్రకటించింది. అది నిఫ్ట్ సమస్యని వ్యాఖ్యానించింది. రూమర్స్ కారణంగానే విద్యార్థులు ఆందోళన చేస్తూ డైరెక్టర్ తో మాట్లాడాలని అనుకుంటున్నారని కేఐటీ స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ చెప్పారు. రేప్ కు గురైన యువతి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా.. నిఫ్ట్ పేరు బయటకు వస్తుందేమోనని ఆమె బెదిరిస్తున్నారని ఓ విద్యార్థి తెలిపాడు.
నిఫ్ట్ విద్యార్థినిపై అత్యాచారం?
Published Sat, Aug 6 2016 4:35 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement