Parade ground
-
రాష్ట్ర అవతరణ ఉత్సవాలు.. పోలీసుల రిహార్సల్స్ (ఫొటోలు)
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు జరిగిన సమావేశానంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జరుపుతున్న ఉత్సవాల్లో సోనియా భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నా రు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. ఈరోజు సోనియాగాం«దీని కలిసి ఆహా్వనించాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త. సోనియా గాంధీ పర్యటన, అవతరణ ఉత్సవాల కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురుచూ స్తున్నాం. రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు సోనియా గాం«దీని సత్కరించడం ద్వారా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ సముచిత గౌరవం ప్రజా పాలనలో చేసుకుంటున్న తొలి ఉత్సవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్ర తి ఒక్కరినీ ఇందులో భాగస్వాముల్ని చేస్తాం. అందరినీ అధికారికంగా ఆహా్వనిస్తున్నాం. వారందరికీ సముచితమైన గౌరవం దక్కుతుంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం..’ అని సీఎం తెలిపారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. సుమారు 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీనికి ముందు తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనులను రేవంత్ పరిశీలించారు. బంగ్లా మొత్తం కలియ తిరిగి అధికారులకు కొన్ని మార్పులు సూచించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం సోమవారం అర్ధరాత్రి కేరళ నుంచి ఢిల్లీకి వచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లారు. -
‘తల్లీ.. మీ మాట వినడానికే వచ్చాను’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగ సభలో ఓ యువతి కాసేపు అందరినీ టెన్షన్ పెట్టింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె ఫ్లడ్‌లైట్ స్తంభం ఎక్కింది. దీంతో పోలీసులతో పాటు అందరిలో కంగారు నెలకొనగా.. అది గమనించిన మోదీ ఆమెను వారించారు. ‘‘తల్లీ కిందకు దిగాలి. ఇది మంచిది కాదు. మీతో నేను ఉన్నాను. మీకోసమే ఇక్కడికి వచ్చాను. మీ మాట వినడానికే వచ్చాను. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మీరు మందకృష్ణ మాట వినాలి’’ అని మైక్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రధాని అలా చెప్పడంతో ఆమె కిందకు దిగింది. కిందకు దిగిన ఆమెను పోలీసులు మందలించి వదిలేసినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ అంశంపై మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. -
మోదీ దళిత వర్గాలకు అండగా నిలిచారు: మందకృష్ణ మాదిగ
-
మాదిగ విశ్వరూప మహాసభ..మోడీ బహిరంగ సభ
-
మోదీ ఆలింగనం.. మందకృష్ణ కంటతడి
సాక్షి, హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మా) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టారు. శనివారం పరేడ్ గ్రౌండ్లో మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. దీంతో మందకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ పక్కనే కూర్చున్న మందకృష్ణ.. కంటతడి పెట్టారు. అది గమనించిన ప్రధాని మోదీ.. ఆయన భుజంపై తడుతూ ఓదార్చారు. ఈ క్రమంలో ఆయన్ని మరోసారి హత్తుకుని ఓదార్చారాయన. పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలోనే మాదిగ విశ్వరూప సభ జరిగింది. ‘‘దశాబ్దాలుగా మమ్మల్ని మనుషులుగా చూడలేదు. మేం ఊహించని కల ఇది. బలహీన వర్గాల నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన వ్యక్తి మోదీ. మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మన సమస్యలు పరిష్కరించడానికి ప్రధానే స్వయంగా వచ్చారు. అత్యంత వెనుకబడిన మాదిగలకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దళితుడ్ని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది. రెండోసారి అధికారం చేపట్టాక ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం’’ అని మందకృష్ణ ఈ వేదికపై భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన కుర్చీలోంచి లేచి సభకు హాజరైన జనసందోహంను చూస్తూ వంగి నమస్కరించారు. -
ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే కమిటీ: ప్రధాని మోదీ
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మాదిగలకు న్యాయం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ వేస్తాం. ఎస్సీ వర్గీకరణం కోసం జరుగుతున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది. మీ మాదిగ సామాజిక సామాజిక వర్గానికి న్యాయం జరగాలన్నదే మా ఆకాంక్ష. ఈ పోరాటంలో మందకృష్ణ నా నాయకుడు.. నేను ఆయన అసిస్టెంట్‌ను. అన్ని వర్గాలకు న్యాయం.. బీజేపీ లక్ష్యం. :::సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మాదిగ విశ్వరూప సభ వేదిక దేశ ప్రధాని మోదీ హామీ ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి నరసింహుడికి నమస్కారం మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన నా బంధువులకు అభినందనలు పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే ఆనందం రెట్టింపు అవుతుంది ఈ సభకు హాజరు కావడం.. నా కుటుంబ సభ్యులతో గడిపినంత ఆనందంగా ఉంది మందకృష్ణ నా చిన్నతమ్ముడిలాంటివాడు మా ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉంది స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో ప్రభుత్వాలను చూశారు ఆ ప్రభుత్వాలు.. మా ప్రభుత్వానికి ప్రజలు తేడా గమనించాలి సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. అనేది మా విధానం పేదరిక నిర్మూలనే మా ప్రథమ ప్రాధాన్యం. న్యాయం చేస్తామని అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి మీరంతా వన్ లైఫ్.. వన్ మిషన్లా పోరాటం చేస్తున్నారు మీ బాధలు పంచుకునేందుకే నేను వచ్చాను కాశీ నాథుడి దీవెనలతో నేను మీ ముందు ప్రధానిగా ఉన్నాను గుర్రం జాషువా తన కష్టాల్ని కాశీ విశ్వేశరుడికి విన్నవించుకున్నారు బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచింది స్వాతంత్రం వచ్చాక అనేక ప్రభుత్వాలు వచ్చాయి.. సామాజిక న్యాయం అమలు చేసింది బీజేపీ మాత్రమే అన్ని ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశాయి గత ప్రభుత్వాలు చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసేందుకే నేను వచ్చా ఇన్నాళ్లూ రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలు చేసి మాట తప్పినందుకు క్షమించమని కోరుతున్నా మందకృష్ణ 30 ఏళ్లుగా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారు మందకృష్ణ పోరాటానికి మేం అండగా ఉంటాం మాదిగల పోరాటానికి నా సంపూర్ణ మద్దతు పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసింది దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు పదేళ్ల కిందట ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం.. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు దళిత బంధు వల్ల ఎంత మందికి లాభం జరిగింది? బీఆర్ఎస్ నేతల బంధువుల స్కీమ్‌గానే దళిత బంధు మారింది బీఆర్ఎస్ నేతలకే దళితబంధు ఇచ్చి చేతులు దులుపుకుంది బలిదానాలు కాదని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు దళితులకు మూడెకరాలు ఇస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసింది రైతులకు రుణమాఫీ ఇస్తామని మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో స్కాం చేసింది ఢిల్లీలో ఆప్‌తో కలిసి బీఆర్ఎస్ వేల కోట్ల అవినీతి చేసింది అభివృద్ధి కోసం పార్టీలు కలిసి పని చేయాలి కానీ అవినీతి కోసం కాదు అంబేద్కర్ విధానాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తూట్లు పొడిచాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి జాగ్రత్తగా ఉండాలి రాష్ట్రపతిగా దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను ఓడించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది ఆదివాసీ అయిన ముర్ము కూడా కాంగ్రెస్ ఓడించాలనుకుంది బీజేపీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టాం అంబేద్కర్‌కు కాంగ్రెస్ భారత రత్న ఇవ్వలేదు.. ఆ ఘనత బీజేపీదే రాజస్థాన్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన దళితుడిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ను చేశాం అంబేద్కర్‌ను రెండుసార్లు గెలవకుండా చేసింది కూడా కాంగ్రెస్సే బీఆర్ఎస్లాగే.. కాంగ్రెస్ చరిత్ర కూడా అణగారిన వర్గాలకు, బీసీలకు వ్యతిరేకం బీఆర్ఎస్తో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. కాంగ్రెస్‌తోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెర వెనుక రాజకీయం నడుపుతున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకవైపు.. బీజేపీ ఒకవైపు ఉంది పేదవారికి గ్యాస్ కనెక్షన్లు, బ్యాంక్ రుణాలు అందిస్తున్నాం నాలుగు కోట్ల మందికి పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టించాం బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన సంక్షేమ పథకాలను బీజేపీ అందిస్తోంది మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో మందకృష్ణ ప్రసంగం.. దశాబ్దాలుగా మమ్మల్ని హీనంగా చూశారు 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నాం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూశారు మేం ఊహించని కల ఇది మా సభకు ప్రధాని మోదీ వస్తారని ఊహించలేదు మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పేందుకు వచ్చిన మోదీకి కృతజ్ఞతలు మాదిగల్ని కేసీఆర్ అణచివేస్తే.. మోదీ పదవులిచ్చారు బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన దమ్మున్న నాయకుడు మోదీ అత్యంత వెనుకబడిన మాదిగలకు తెలంగాణ మంత్రి వర్గంలో చోటు లేదు ఒక్క శాతం కూడా లేని వెలమకు నాలుగు మంత్రి పదువులు ఇచ్చారు అంబేద్కర్ ఆశయాల్ని అమలు చేసింది మోదీ మాత్రమే దళితుడ్ని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది రెండోసారి నెగ్గాక ప్రధాని మోదీ ఓ గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేశారు మోదీ దళిత వర్గాలకు అండగా నిలుస్తున్నారు సామాజిక న్యాయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాటలు మాత్రమే చెప్తున్నాయి సామాజిక న్యాయం అమలు చేస్తున్న మోదీకి ధన్యవాదాలు కేసీఆర్ మాదిగలను అణిచివేశారు దళితున్ని సీఎం చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారు దేశాన్ని ఆదుకునే విషయంలో దేశాన్ని కాపాడే విషయంలో మిమ్మల్ని(మోదీని ఉద్దేశించి..) మించిన నాయకుడు లేడు పెద్దన్నగా మా కోసం వచ్చిన మోదీ వర్గీకరణపై మాకు హామి ఇవ్వాలని రెండు చేతులెత్తి దండం పెడుతున్నా ►మందకృష్ణ మాదిగ భావోద్వేగం.. ఓదార్చిన ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ మాదిగ విశ్వరూప సభ వేదికగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమార్పీఎస్) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సభ ప్రారంభానికి ముందు వేదికనెక్కిన ప్రధాని మోదీ, మందకృష్ణను ఆలింగనం చేసుకున్నారు. దీంతో.. భావోద్వేగానికి లోనై మందకృష్ణ కంటతడి పెట్టారు. దీంతో.. తన పక్కనే కూర్చున్న మందకృష్ణను ప్రధాని మోదీ వీపుతట్టి ఓదార్చారు. ఇక సభ ముగిసే ముందర మందకృష్ణ పోరాటానికి మొబైల్ ఫోన్ టార్చ్‌లు ఆన్ చేసి మద్దతు తెలపాలని ప్రధాని మోదీ కోరగా.. సభకు హాజరైన జనం సెల్‌ఫోన్ టార్చ్‌లతో సంఘీభావం తెలిపారు. ఆఖర్లోనూ వెళ్లిపోయే ముందర మందకృష్ణ కంటతడి పెట్టగా.. మోదీ ఓదార్చి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. బండి సంజయ్, లక్ష్మణ్‌లు మందకృష్ణను ఓదార్చడం గమనార్హం. ►మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని ►బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ ► ఎస్సీ వర్గీకరణపై ప్రకటన? పరేడ్ గ్రౌండ్లో అణగారిన వర్గాల(మాదిగల) విశ్వరూప మహాసభ ఈ వేదిక నుంచి ఎస్సీ వర్గీకరణ ప్రకటన? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి – MRPS నిర్వహిస్తున్న మాదిగ విశ్వరూప మహాసభ స్వయంగా ప్రకటన చేయనున్న ప్రధాని మోదీ! ►కాస్త ఆలస్యంగా రానున్న మోదీ 20 నిమిషాలు ఆలస్యంగా హైదరాబాద్‌కు నరేంద్రమోదీ సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయనికి చేరుకోనున్న నరేంద్రమోదీ ముందుగా 4.45 గంటలకు షెడ్యూల్ చేసిన PMO పీఎంవో షెడ్యూల్ చేసిన సమయం 20 నిమిషాల ఆలస్యంగా షెడ్యూల్ 5.25 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు నరేంద్రమోదీ 40 నిమిషాల పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో నరేంద్రమోదీ సభ తర్వాత నేరుగా ఢిల్లీకి పయనం ►హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాని మోదీ నగర పర్యటన సందర్భంగా.. సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు శనివారం రాత్రి 8 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, టివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రోడ్లను మూసివేత బేగంపేట నుంచి సంగీత్ ఎక్స్ రోడ్స్ వైపు వెళ్లే వాహనదారులు సీటీవో ఎక్స్ రోడ్స్ వద్ద బాలమ్ రాయ్, బ్రూక్‌బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ మీదుగా వెళ్లాలని సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో బీజేపీ తరఫున ప్రచారం కోసం వారం వ్యవధిలోనే రాజధాని హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’ జరగనుంది. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. -
HYD: వారం వ్యవధిలోనే మరోసారి ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంతో.. వారం వ్యవధిలోనే దేశ ప్రధాని, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. మంగళవారం(నవంబర్ 7)న ఆయన ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నెల 11వ తేదీన ప్రధాని మోదీ నగరంలో పర్యటిస్తారని రాష్ట్ర బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో బీజేపీ మాదిగ విశ్వరూప సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారని పార్టీ ఆ ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. ఈ వేదిక నుంచి ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. షెడ్యూల్ ఇలా.. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బేగంపేటలో ప్రధాని మోదీ దిగుతారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సుమారు గంటపాటు ఈ సభ జరగనుంది. సభ జరిగిన వెంటనే తిరిగి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. -
తెలంగాణలో సభపెట్టే నైతికత సోనియాకు లేదు
సాక్షిప్రతినిధి, వరంగల్ / రసూల్‌పుర: కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ చరిత్ర, విమోచనదినం ప్రాధాన్యతను వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమె త్తారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో మీటింగ్ పెట్టే నైతికత కాంగ్రెస్ పార్టీకి, సోనియాకు లేవని, హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టుకోవాలంటే భాగ్య లక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు. అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవాన్ని జరపా లన్న కేసీఆర్.. ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం‘గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ నుంచి చేపట్టిన బైక్‌ర్యాలీ శుక్రవారం సాయంత్రం హనుమకొండ జిల్లా పరకాల అమరథామం వద్ద ముగిసింది. అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరకాల అంగడి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని, తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని లేకుంటే సోనియాగాంధీ కుటుంబ అడుగుపెట్టే అర్హత లేదన్నారు. సీఎం కేసీఆర్‌ను మజ్లిస్ ఆత్మ ఆడిస్తుందని, ఆ పార్టీకి భయపడే నాడు కాంగ్రెస్, నేడు బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నైజాం ఓడిపోయిన దినం ఎలా సమైక్యత దినం అవుతుందో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని, తెలంగాణ విమోచన దినాన్ని సమైక్య దినంగా వక్రీకరిస్తున్న కేసీఆర్ పరకాలకు వస్తావా తేల్చుకుందాం? అని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని, పరకాల అమరధామం వద్ద అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కూడా అప్పటి నిజాంలాగా అరెస్టులు చేస్తూ నిర్బంధాలు విధిస్తున్నారని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం బ్రిటిష్ పాలనలో, నిజాం పాలనలో ఉండేది కాదని, ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ, రావుల కిషన్లతోపాటు పలువురు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ టు పరకాల తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల అమరధామం వరకు బీజేపీ బైక్‌ర్యాలీని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ. తార్నాక, ఉప్పల్, భువనగిరి, జనగాం, పరకాల వరకు 200 కిలోమీటర్లు ఏడు గంటల పాటు బైక్‌ర్యాలీ కొనసాగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న YSR
-
19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న రాష్ట్రానికి రానున్నారు. నెల వ్యవధిలోనే రెండోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. గత ఏడాది కాలంలో ప్రధాని తెలంగాణకు రావడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాగా గత నవంబర్ 12న రామగుండంలో జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించిన సంగతి తెలిసిందే. తాజా రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని రూ.7,076 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 19న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలును (సికింద్రాబాద్–విశాఖపట్నం) మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడే సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తంగా చూస్తే వందేభారత్ రైలు, సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులు (రూ.1,410 కోట్ల వ్యయం), ఐఐటీ హైదరాబాద్‌లో చేపట్టిన వివిధ నిర్మాణాలు (రూ. 2,597 కోట్లు) కలిపి రూ.4,007 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేస్తారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ (రూ.699 కోట్లు), కాజీపేట వర్క్ షాపు నిర్మాణం (రూ. 521 కోట్లు)తో పాటు మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులు కలిపి మొత్తం రూ.3,069 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీఆర్ అధికారులతో బీజేపీ నేతల భేటీ మోదీ పర్యటన నేపథ్యంలో సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డా.కె.లక్ష్మణ్ దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. వందే భారత్ రైలుతో పాటు ఆరోజు ప్రధాని ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బండితో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలకు ప్రధాని పెద్దపీట ‘రాష్ట్ర ప్రయోజనాలకు ప్రధాని మోదీ పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్రం చేపట్టింది. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుంది. వందే భారత్ రైలుతో ప్రయాణికులకు మూడున్నర గంటల సమయం ఆదా కానుంది. మరోవైపు ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ గ్రామాలను పట్టణాలతో అనుసంధానిస్తున్నారు. దీంతోపాటు నదుల అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా స్పందిస్తూ..‘నూతన సంవత్సర కానుకగా ప్రధాని తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనుల కోసం రూ.2,400 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయబోతున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఈ పర్యటనతోనైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా..’ అని అన్నారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో కలిసి బండి సంజయ్, లక్ష్మణ్ పరేడ్ గ్రౌండ్స్‌ను సందర్శించారు. అక్కడ చేయాల్సిన వివిధ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గరికపాటి మోహన్‌రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులతో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏటా మరఠ్వాడ ముక్తి దిన్ ఉత్సవాలు :మహారాష్ట్ర సీఎం శిందే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంగా మహారాష్ట్రలోని శంభాజీ నగర్లో ఏటా మరఠ్వాడ ముక్తిదిన్ నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజాం నిరంకుశ, నియంతృత్వ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన ఈ రోజు బంగారు పేజీల్లో లిఖించదగ్గ రోజని అన్నారు. విముక్తి పొందిన ఇన్నేళ్ల తరువాత ఉత్సవం నిర్వహించుకునే అవకాశం దక్కిందని, ఇది ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా వల్లనే సాధ్యమైందని చెప్పారు. విమోచనం కోసం ప్రాణాలర్పించిన వారికి శిందే నివాళులు అర్పించారు. విమోచన ఉత్సవాలు జరపాలని ఎదురు చూస్తున్న ప్రజల కల నేటికి నెరవేరిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. 1948 సెప్టెంబర్ 17న అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే.. 75 ఏళ్ల తర్వాత ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారని గుర్తుచేశారు. విమోచన ఉత్సవాలు జరపకుండా రజాకార్ల పార్టీ అడ్డుకుందని, అలాంటి పార్టీ కూడా జాతీయ జెండా ఎగరేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. కర్ణాటకలోని బీదర్, రాయచూరు, యాద్గిర్ వంటి ప్రాంతాల్లో కూడా రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేశారని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీరాములు గుర్తు చేశారు. బీదర్ జిల్లాలోని 76 గ్రామాలు, రాయచూరు జిల్లాలోని 26 గ్రామాల్లో రజాకార్లు అరాచకాలు సృష్టించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, విజయశాంతి, జి. వివేక్, ఎంపీలు కె.లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ కుమార్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ధర్మారావు, వన్నాల శ్రీరాములు పాల్గొన్నారు. -
వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే: రామ్‌చరణ్
సాక్షి, హైదరాబాద్: మెగా హీరో రామ్‌చరణ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో డిఫెన్స్ అధికారులు నిర్వహించిన యుద్ధవీరుల నివాళుల కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చరణ్ వీరులకు నివాళులు అర్పించి పుష్పగుచ్ఛం సమర్పించారు. అనంతరం రామ్‌చరణ్ మాట్లాడుతూ.. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను జరుపుకోవడం, దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం నా అదృష్టం. మనం ఇక్కడ ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నామంటే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, దేశ సైనికుల త్యాగాలే దానికి కారణం. సైనికుల ధైర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం నడిచే నేల, పీల్చే గాలి, బతుకుతున్న దేశం మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుంది. వీరుల త్యాగాలను ఎవరూ మరిచిపోవద్దు. దేశం ప్రశాంతంగా ఉందంటే అది మన సైనికుల వల్లే. ధృవ సినిమాలో ఆర్మీ జవాన్ పాత్ర పోషించడం గర్వంగా ఉంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులతో పాటు పలు స్కూలు విద్యార్థులు సైతం పాల్గొన్నారు. చదవండి 👉 రూ.26 కోట్లు ఎగవేత.. జీవిత రాజశేఖర్‌కు అరెస్ట్ వారెంట్! హీరో కంట్లో పడ్డాను, నో చెప్పినందుకు అంత పని చేశారు -
Army Day 2022: ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫాం ఇదే!
న్యూఢిల్లీ: మన ఆర్మీ యూనీఫాం మారబోతోంది. సౌకర్యవంతమైన, వాతావరణ అనుకూలమైన, డిజిటల్ డిస్రప్టీవ్ ప్యాట్రన్‌లో కొత్త యూనీఫాంను ఇండియన్ ఆర్మీ శనివారం ఆవిష్కరించింది. కొత్త యూనీఫాంలను ధరించిన ప్యారాచూట్ సైనిక దళం నిన్న (శనివారం) ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొన్నారు. భారత ఆర్మీ కొత్త యూనీఫాం రూపురేఖల విశేషాలు ఇవే.. ►ఆలివ్, మట్టి రంగులతో సహా వివిధ రంగుల సమ్మేళనంతో రూపొందించిన కొత్త యూనిఫాం, దళాల వ్యూహరచన ప్రాంతాలు, వివిధ వాతావరణ పరిస్థితులు వంటి అంశాల దృష్ట్యా రూపొందించడం జరిగింది. ►నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి వివిధ దేశాల ఆర్మీల యూనిఫాంలను విశ్లేషించిన అనంతరం కొత్త యూనిఫాంలను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ►ఈ యూనిఫాం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, అన్ని రకాల వాతావరణాల్లో ధరించవచ్చని తెలిపారు. కంప్యూటర్ సహాయంతో డిజిటల్ డిస్రప్టివ్ ప్యాటర్న్‌లో ప్రత్యేకంగా రూపొందించారు. ►కొత్త యూనిఫాంలోని షర్టును, ట్రౌజర్‌లో టక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇకపై మన ఆర్మీ డ్రెస్ ఇన్‌షర్ట్ లేకుండా ఉండబోతుందన్నమాట. ►కొత్త ఆర్మీ యూనిఫామ్‌లు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి. #WATCH | Delhi: Indian Army’s Parachute Regiment commandos marching during the Army Day Parade in the new digital combat uniform of the Indian Army. This is the first time that the uniform has been unveiled in public. pic.twitter.com/j9D18kNP8B — ANI (@ANI) January 15, 2022 -
మహిళా మిలటరీ పోలీస్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది!
ఇండియన్ ఆర్మీలోని పోలీస్ సేనాదళం.. ‘కోర్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ (సీఎంపీ) తొలిసారి మహిళల్ని విధుల్లోకి తీసుకుంది! శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు 83 మంది కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు. సీఎంపీలో ఇప్పటివరకు ఆఫీసర్స్ కేటగిరీలో మాత్రమే మహిళలు ఉంటూ వస్తున్నారు. సాధారణ సైనికులుగా మహిళలు ప్రవేశించడం మాత్రం ఇదే మొదటిసారి. బెంగళూరులోని ద్రోణాచార్య పరేడ్ గ్రౌండ్లో శనివారంనాడు చాలా నిశ్శబ్దంగా ఒక ప్రతిష్టాత్మకమైన ‘పాసింగ్ అవుట్ పరేడ్’ జరిగిపోయింది! కోవిడ్ నిబంధనలు లేకుంటే పరేడ్‌ను చూసేందుకు యువ సైనికుల తల్లిదండ్రులు కూడా వచ్చేవారు. పైగా ఆ పరేడ్ మన దేశానికే ప్రథమమైనది, ప్రత్యేకమైనది. ఇండియన్ ఆర్మీలోని పోలీస్ సైనిక విభాగం అయిన ‘కోర్స్ ఆఫ్ మిలటరీ పోలీస్’ (సీఎంపీ) లో చేరేందుకు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు వాళ్లంతా. బెంగళూరు ద్రోణాచార్య పరేడ్ గ్రౌండ్లో మే 8న జరిగిన మహిళా మిలటరీ పోలీస్ ‘పాసింగ్ అవుట్ పరేడ్’. సీఎంపీ ఆవిర్భావం తర్వాత ఈ ఆర్మీ విభాగంలో మహిళలకు ప్రవేశం లభించడం ఇదే తొలిసారి! నేటి నుంచి ఈ మహిళా మిలటరీ పోలీసులు తమ విధులకు హాజరవుతారు. ఏం చేస్తారు ఈ మహిళా మిలటరీ పోలీసు లు? కండబలం, గుండె బలం ఉన్న పనులు చేస్తారు. మిలటరీ, పోలీస్ క్వార్టర్స్‌ని కనిపెట్టుకుని ఉంటారు. యుద్ధ ఖైదీల కదలికలపై ఒక కన్నేసి ఉంచుతారు. ఆర్మీ సైనికులు క్రమశిక్షణను, ఆదేశాలను అతిక్రమించకుండా చూస్తారు. త్రివిధ దళాలలోని మూడు పోలీసు విభాగాలకు, పౌర రక్షణ పోలీసు విభాగాలకు సమన్వయకర్తలుగా ఉంటారు. ఆర్మీ సిబ్బందికి సంబంధం ఉన్న కేసులలో విచారణలకు హాజరవుతారు. ఆర్మీల చీఫ్‌లు ఎవరైతే ఉంటారో వాళ్లకు భద్రతగా ఉంటారు. ఇంకా అనేకం ఉన్నాయి. చొరబాటు ‘దారులలో’ శత్రువు సృష్టించిన కృత్రిమ ట్రాఫిక్ జామ్‌లను క్లియర్ చేస్తారు. టెలీ కమ్యూనికేషన్ తెగిపోయినప్పుడు రంగంలోకి దిగి సమాచారాన్ని పునరుద్ధరిస్తారు. ఇవన్నీ చేయడానికి సీఎంపీ విభాగం అరవై ఒక్క వారాల శిక్షణ ఇస్తుంది. తాజాగా ఈ శిక్షణ పూర్తి చేసిన ఎనభై మూడు మంది మహిళా అభ్యర్థులు ఆర్మీ పొదిలోకి అస్త్రాలుగా పదును తేలారు. బెంగళూరులోని ‘కోర్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్’ శిక్షణను ఇచ్చింది. ఆర్మీ తొలిసారి మహిళల కోసం ‘సోల్జర్ జనరల్ డ్యూటీ’ కేటగిరీ ఉద్యోగాలకు గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ చూసి ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నవాళ్లలో శిక్షణకు అర్హులైన వాళ్లే.. ఈ ఎనభై మూడు మంది. భారత రక్షణదళంలో కేవలం ఆర్మీకి మాత్రమే ‘ఆఫీసర్’ ర్యాంకు కన్నా దిగువన ఉండే హోదాలలో మహిళల్ని నియమించుకునే అధికారం ఉంది. నావిక, వైమానిక దళాలకు ఆ అవకాశం లేదు. అయినప్పటికీ ఆర్మీలోని సీఎంపీకి మహిళా సోల్జర్లను తీసుకోడానికి 82 ఏళ్లు పట్టింది. సీఎంపీ ఆవిర్భవించింది 1939లో. మహిళా ఆఫీసర్లను తీసుకుంటున్న ఆర్మీకి కానీ, ఆర్మీలోని సీఎంపీ విభాగానికి కానీ ఇంతకాలం సాధారణ మహిళా సైనికులను తీసుకోడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?! జటిల సమస్య లు, కఠిన పరిస్థితులు ఉండే విధుల్లో మహిళల్ని తీసుకోవడం సరికాదు అన్న ఆలోచనా ధోరణే. అయితే అలవాటు లేని రంగాలలో సైతం మహిళ లు రాణిస్తుండటంతో ఆ ధోరణి మారింది. అదొక్కటే కాదు దేశ భద్రత విభాగాలలో ఆర్మీకి మహిళా సైనికుల చేయూత అవసరం అవుతోంది. అందుకే సీఎంపీలోకి మహిళల్ని తీసుకునేందుకు ఆర్మీ 2019 జనవరిలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందింది. ఏడాదికి వంద మంది చొప్పున 2036 నాటికి 1700 మంది మహిళల్ని సీఎంపిలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎంపీలో ప్రస్తుతం సుమారు 9000 మంది సిబ్బంది ఉండగా, మొత్తం ఆర్మీలో రిజర్వు సిబ్బంది కాకుండా 12 లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో మహిళా అధికారులు 1672 మంది, సాధారణ స్థాయి మహిళలు సుమారు ఏడు వేల మంది. -
అద్భుత విన్యాసం
-
ప్రగతిపథంలో.. తెలంగాణ పరుగులు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంగా అన్ని బాలారిష్టాలను దాటుకొని తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు తీస్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సాగు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేస్తూ దూసుకెళ్తోందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా, జాతి నిర్మాణంలో చక్కటి పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, మరే రాష్ట్రంలోనూ సంక్షేమానికి ఇంత పెద్ద భారీగా నిధులను కేటాయించటం లేదన్నారు. ప్రభుత్వం 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించే బృహత్తరమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, అంతర్రాష్ట్ర వివాదాలను అధిగమించి, అటవీ, పర్యావరణ అనుమతులన్నీ సాధించి శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగిస్తోందన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు ఈ వర్షాకాలం నుంచే ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి తదితర ప్రాజెక్టుల నిర్మాణ æపనులు అనతికాలంలో పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. ఒక్క తెలంగాణలోనే... మిషన్ కాకతీయతో రాష్ట్రంలో వేలాది చెరువులు పునరుద్ధరణకు నోచుకుని కళకళ్లాడుతున్నాయన్నారు. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ వచ్చేనెల పూర్తవుతుందని నరసింహన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఒక్క తెలంగాణలోనే వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాలతో తెలంగాణ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణమని.. రైతుబంధు ఏకంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకోవడాన్ని గవర్నర్ గుర్తుచేశారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ వర్గాల కోసం 542 రెసిడెన్షియల్ స్కూళ్ళను ప్రారంభించిందని, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో కొత్తగా మరో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించబోతోందని గవర్నర్ ప్రకటించారు. ‘డబుల్ బెడ్రూం’వేగవంతం... పేదల నివాసాలు నివాసయోగ్యంగా, గౌరవ ప్రదంగా ఉండాలనే సదుద్దేశ్యంతో ఇప్పటికే 2.72 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. మెరుగైన రవాణా కోసం 3,150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించిందని, రాష్ట్రం ఏర్పడే నాటికి 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే, నేడు రాష్ట్రంలో 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులు సమకూరాయని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతమున్న ఔటర్ రింగు రోడ్డు అవతల 340 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగు రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడంతోపాటు రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాలకు ఖచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని, పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు వచ్చేలా టీఎస్–ఐపాస్ చట్టం తీసుకొచ్చారని.. ఐటీ రంగంలో నూతన అన్వేషణలకు వేదికగా నెలకొల్పిన ‘టీ–హబ్’అంకుర సంస్థలకు అండగా నిలుస్తోందన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేసిందని, కొత్తగా ఏర్పాటు చేసుకున్న 21 జిల్లాలకు తోడుగా త్వరలోనే నారాయణపేట, ములుగు జిల్లాలు కూడా అస్తిత్వంలోకి రాబోతున్నాయని చెప్పారు. అడవుల రక్షణ కోసం కలప స్మగ్మర్ల పై ఉక్కుపాదం మోపాలని సర్కారు నిర్ణయించిందని, కాలుష్యమయంగా మారిన మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించిందని, కాళేశ్వరంతో మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని అనుసంధానం చేయాలని సంకల్పించిందని గవర్నర్ వివరించారు. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటును తెలంగాణ సాధిస్తోందని ఆయనవెల్లడించారు. అమర జవాన్లకు కేసీఆర్ నివాళి... అంతకుముందు పరేడ్ మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందుగా ఆర్మీ రిజిస్టర్లో సంతకం చేశారు. అనంతరం భద్రతా దళాలు వెంటరాగా అమరజవాన్ల స్థూపం వద్దకు వెళ్లారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరసైనికులకు నివాళులర్పించారు. తర్వాత ప్రాంగణం వద్దకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పుష్ఫగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ జాతీయ పతాకాన్ని ఎగరేసి భద్రతా దళాల గౌరవవందనం స్వీకరించారు. -
కైట్స్ ఎగిరే
-
స్వీట్ ఫెస్టివల్లో వెయ్యి వెరైటీలు
సాక్షి, హైదరాబాద్: స్వీట్ ఫెస్టివల్లో వెయ్యి రకాల మిఠాయిలు ప్రదర్శించనున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం పర్యాటక భవన్లో స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని తెలిపారు. స్థానికులతో పాటు, 20 దేశాల నుంచి దాదాపు 10 లక్షల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు. గతేడాది ఉత్సవాలకు 8 లక్షల మంది హాజరయ్యారన్నారు. విశేష స్పందన రావడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అతిథులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, నిథమ్ డైరెక్టర్ డా.చిన్నమ్ రెడ్డి, తెలంగాణలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మేరా భారత్ మహాన్
-
పరేడ్ మైదానంలో పోలీసుల రిహార్సల్స్
-
ఎగిరే కైట్.. సూపర్ హిట్..
-
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
అనంతపురం మెడికల్ : నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా యోగా కోఆర్డినేషన్ సభ్యులు, ఆయుష్ వైద్యులు నాగేశ్వరరావు, నల్లపాటి తిరుపతినాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
పెరేడ్ గ్రౌండ్ సేఫ్..!
పెరేడ్ గ్రౌండ్‌ను ప్రభుత్వం తీసుకుంటుందని, దాంతో అది అదృశ్యం అవుతుందంటూ వచ్చిన కథనాలను సీఎం కేసీఆర్ ఖండించారు. తాము తీసుకుంటున్నది బైసన్ పోలో గ్రౌండ్ తప్ప పెరేడ్ గ్రౌండ్ కాదని చెప్పారు. అందులో మొత్తం సుమారు 55-60 ఎకరాల స్థలం ఉందని, అక్కడ మంచి సెక్రటేరియట్, అసెంబ్లీ భవనంతో పాటు తెలంగాణ కళాభారతిని కూడా నిర్మిస్తామని, ఆ మూడింటి ఎదురుగానే పెద్ద ఖాళీ స్థలం ఉంటుందని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ అక్కడే బ్రహ్మాండంగా జరుపుకోవచ్చని తెలిపారు. అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అని చెబుతారని, కానీ ఇన్నాళ్లుగా ఒక్క పెరేడ్ గ్రౌండ్ కూడా లేకపోవడం దౌర్భాగ్యమని కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకు ఉన్నదాని కోసం ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి వాళ్ల గడ్డం పట్టుకుని బతిమాలి గానీ, పైరవీలు చేసి గానీ అనుమతులు తెచ్చుకోవాల్సి వచ్చేదన్నారు. ఒక్కోసారి వాళ్లు అనుమతులు కూడా నిరాకరించేవారని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా ఉండేలా హైదరాబాద్ నగరానికి ఐకానిక్‌గా ఉండే విధంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, కళాభారతి మూడింటినీ ఒకేచోట నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం పెరేడ్ గ్రౌండ్‌ను మాత్రం తీసుకోవడం లేదని, అది అలాగే ఉండాలని.. అక్కడ కుర్రాళ్లు ఆడుకోవాలని ఆయన అన్నారు. -
నిరంతరం నిఘా
► రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ ► కరీంనగర్లో బ్లూకోట్స్ బృందాలు ప్రారంభం కరీంనగర్ క్రైం : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కోసం బ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కరీంనగర్ కమిషనరేట్‌కు కేటారుుంచిన 40 బ్లూకోట్స్ ద్విచక్ర వాహనాలను మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం పరేడ్‌గ్రౌండ్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఆర్థికశాఖ మంత్రిగా తాను ఎక్కువ జీవోలు, ఎక్కువ నిధులు, సౌకర్యాలు కల్పించిన ఏకై క శాఖ పోలీస్శాఖనేనని తెలిపారు. భద్రతపై భరోసా కల్పిస్తేనే ఇతర ప్రాంతాల నుంచి పెట్టబడులు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సింగపూర్ తరహా పోలీస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కరీంనగర్ రేంజ్ ఇన్చార్జి డీఐజీ రవివర్మ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు బ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ బ్లూకోట్స్ ఏర్పాటుతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. నేరాల నియంత్రణ : సీపీ కమలాసన్‌రెడ్డి బ్లూ కోట్స్ బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. బ్లూకోట్స్ బృందాల పనితీరు వివరిస్తూ.. నేరాల నియంత్రణ, ముందస్తు చర్యలు తీసుకోవడం, విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 58 మంది కానిస్టేబుళ్లు, 58 మంది హోంగార్డులను కలిపి 40 బ్లూకోట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీరు బ్లూ కలర్ రేడియం కోట్స్ ధరించి ప్రత్యేకంగా తయారు చేసిన బైక్‌లపై తిరుగుతూ పరిస్థితులను అదుపులో ఉంచుతారన్నారు. వీరి వెంట బైక్, వాటికి జీపీఎస్ట్రాకర్, వీడియో కెమెరా, టార్చిలైట్ ఉంటుందని చెప్పారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, గంగాధర, రామడుగు, చిగురుమామిడి, గన్నేరువరం, హుజూరాబాద్, జమ్మికుంట, సైదాపూర్, కేశవపట్నం, ఇల్లందకుంట, వీణవంక పోలీస్స్టేషన్లలో వీరు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. డయల్ 100 కాల్స్‌కు సైతం స్పందించి సంఘటన ప్రాంతానికి పది నిమిషాల్లోపు చేరుకుంటారని తెలిపారు. కరీంనగర్లో 20 షీటీం బృందాలను ఏర్పాటు చేశామని ఇప్పటి వరకూ 43 మందికి కౌన్సిలింగ్ నిర్వహించగా నాలుగు కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా నేరాలకు పాల్పడని 43 మంది రౌడీషీట్స్, సస్పెక్ట్ షీట్స్ తొలగించామని కొత్తగా 53 మందిపై రౌడీషీట్స్, సస్పెక్ట్‌షీట్స్ తెరిచినట్లు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమరుు బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, నగర మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఎంపీపీ వాసాల రమేశ్, ఏసీపీలు రామారావు, రవీందర్‌రెడ్డి, సి.ప్రభాకర్, ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, బ్లూకోట్ సిబ్బంది పాల్గొన్నారు. -
సంబరాలు..అదిరేలా
► తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం ► ప్రతి గ్రామానికీ రూ.6వేలు మంజూరు ఉదయం జెండావిష్కరణ ► అనంతరం మిఠాయిల పంపిణీ పరేడ్ మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు ► అమరవీరుల స్థూపాన్ని పూలమాలలతో అలంకరించిన అధికారులు ► విద్యుత్ దీపాలతో వెలుగులీనుతున్న ప్రభుత్వ కార్యాలయాలు జెడ్పీసెంటర్ /మహబూబ్‌నగర్ క్రైం: తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పడి రెండేళ్లు పూర్తిచేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. అందులో భాగంగానే జిల్లా యంత్రాంగం గురువారం గ్రామగ్రామానా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తిచేసింది. వారంరోజుల నుంచి జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహించారు. ఇప్పటికే గ్రామపంచాయతీ కార్యాలయాలకు సున్నాలు వేయడంతోపాటు విద్యుత్‌దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రజల కు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. నేడు నిర్వహించే కార్యక్రమాలు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పలు కార్యక్రమలు చేపట్టనుంది. ఉద యం దేవాలయాలు, మసీదులు, చర్చీలను సందర్శించడం. తెలంగాణ అమరవీరుల స్థూపాలను సందర్శించి నివాళులు అర్పించడం. తెలంగాణ సాధన లో అమరులైన వారి కుటుంబాలను కలిసి వారికి భవిష్యత్‌పై భరోసా కల్పించడం, గ్రామ పంచాయతీ భ వనం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళ లు పాల్గొనే విధంగా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జాతీ య జెండా ఆవిష్కరణ అనంతరం మి ఠాయిలు పంపిణీ చేయనున్నారు. ఆస్పత్రిలో రోగులు, వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయనున్నా రు. ఈ కార్యక్రమాలు నిర్వహించేం దుకు ప్రతిగ్రామానికి రూ.ఆరువేల చొప్పున ప్రభుత్వం మంజూరుచేసింది. పరేడ్ మైదానం సిద్ధం వేడుకలకు జిల్లా పరేడ్ మైదానం సిద్ధమైంది. బుధవారం జిల్లా పోలీస్‌శాఖ నుంచి పరేడ్ మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అవతరణ వేడుకలలో పాల్గొనడానికి వచ్చే ప్రజ లకు, ఇతర అధికారుల కోసం ప్రత్యేక టెంట్లు, ఇతర ప్రభుత్వ పథకాలను ప్రత్యేక స్టాల్స్, మంత్రులు, అధికారు లు ప్రసంగించేందుకు ప్రత్యేక వేదికను తయారు చేశారు. అదేవిధంగా అవతర ణ వేడుకల్లో చేయడానికి పోలీస్ సిబ్బం ది కవాతు నిర్వహించారు. ఎస్పీ, జెడ్పీ, కలెక్టరేట్ , అంబేద్కర్ భవనం, హౌ సింగ్, ఇతర కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లాలోని వివిధ పట్టణాల ప్రధాన కూడళ్లను రం గురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పండగ వాతావరణం నెలకొంది. -
సీఎం పర్యటనకు బందోబస్తు.
గుంటూరు (పట్నంబజారు) : సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం గుంటూరు పర్యటనలో భాగంగా అర్బన్ జిల్లా పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 500 మంది సిబ్బందితో సన్నిద్ధి కల్యాణ మండపం, ఐటీసీ, ఐబీ వద్ద భారీ బందోస్తు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలికాప్టర్ దిగి వివిధ ప్రాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. 8 మంది డీఎస్పీలు, 15 సీఐలు, 23 మంది ఎస్సైలు, 77 మంది ఏఎస్సైలు, 260 మంది కానిస్టేబుళ్లు, నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన మరో 70 మంది కానిస్టేబుళ్లు ఈ బందోబస్తు నిర్వహించనున్నారు. బందోబస్తులో భాగంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం అధికారులతో సమీక్షించారు. -
ఆకట్టుకున్న పరేడ్
-
‘గ్రేటర్’లో గులాబీ జోష్..!
సభా వేదిక సాక్షిగా ఎన్నికల శంఖం పూరించిన కేసీఆర్ నగరాన్ని డల్లాస్, సింగపూర్‌లా తీర్చిదిద్దుతామని హామీ సిటీబ్యూరో: పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభ కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం కావడంతో గ్రేటర్ టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండింది. ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరు నెలల్లో బల్దియా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సభావేదిక సాక్షిగా సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖం పూరించినట్లేనని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రాబోయే మూడున్నరేళ్లలో హైదరాబాద్‌ను అమెరికాలోని డల్లాస్, సింగపూర్ తరహాలో తీర్చిదిద్దుతామని, సౌకర్యాలు కల్పించి, ట్రాఫిక్ చిక్కులు దూరం చేస్తామన్న సీఎం ప్రకటనతో గ్రేటర్ అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. వర్షమొస్తే నగరంలో కార్లు పడవలను తలపిస్తాయని ఈ పరిస్థితిని దూరం చేస్తామని సీఎం స్వయంగా ప్రకటించడం విశేషం. కాగా బహిరంగ సభను విజయవంతం చేసేందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు శక్తివంచన లేకుండా కృషిచేశారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను సభకు తరలించేందుకు ఆయా నియోజకవర్గాల నేతలు చొరవచూపారు. పార్టీ గ్రేటర్ విభాగం అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ కార్యకర్తల బృందం పాదయాత్రగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బహిరంగ సభ నేపథ్యంలో గ్రేటర్ నగరం గులాబీ వనంలా మారింది. ప్రధాన రహదారులన్నీ గులాబీ జెండాలు, కటౌట్లు, బెలూన్లతో నిండిపోయాయి. సభకు ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వేలకు తగ్గకుండా కార్యకర్తలను తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్ల నుంచి కార్యకర్తలు బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారని నేతలు పేర్కొంటున్నారు. పలు బస్తీల నుంచి మహిళా, మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడం పార్టీకి శుభపరిణామమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో పార్టీ టికెట్లను ఆశిస్తున్న ద్వితీయశ్రేణి నాయకగణం ఎక్కడికక్కడ కటౌట్లను ఏర్పాటుచేసింది. స్వాగత తోరణాలు ఏర్పాటుచేసి అగ్రనేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. సభ విజయవంతం కావడంతో బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయడం తథ్యమని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. ఈ సభకు ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, చింతల కనకారెడ్డి, నాయకులు దండె విఠల్, శంభీపూర్ రాజు, మురుగేష్, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
గులాబీ కళ
-
నేడు టీఆర్ఎస్ 14వ ఆవిర్భావ సభ
-
నేడు టీఆర్ఎస్ 14వ ఆవిర్భావ సభ
* 10 లక్షల మందితో జన సమీకరణ! * 4 వేల మంది పోలీసులతో బందోబస్తు * భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 14వ ఆవిర్భావ సభ సోమవారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా జరగనుంది. పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న సభ కావడంతో టీఆర్ఎస్ నాయకత్వం ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మునుపెన్నడూ లేని రీతిలో 10 లక్షల మంది ప్రజలను సభకు సమీకరించనుంది. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి కనీసం లక్ష మందిని సమీకరించే బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు సీఎం కేసీఆర్ అప్పగించారు. దీనిపై ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల నాయకులతో చర్చించిన కేసీఆర్...శనివారం తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మందిని సమీకరించాలని లక్ష్యం నిర్దేశించారు. ఆదివారం రాత్రి కూడా కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమై బహిరంగ సభ ఏర్పాట్లు షెడ్యూలుపై చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ పార్టీ నిర్వహించనంత భారీగా సభను నిర్వహించాలనుకుంటున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు. పార్టీ భవిష్యత్ ప్రణాళిక ఆవిష్కారం... అధికార పార్టీ హోదాలో రాష్ట్ర ప్రజానీకానికి ఏం చేయబోతున్నారో సీఎం కేసీఆర్ ఈ సభా వేదిక నుంచి భరోసా ఇస్తారని పార్టీ నాయకత్వం పేర్కొంది. వాస్తవానికి ప్లీనరీలో ప్రవేశ పెట్టిన తీర్మానాల ద్వారా ఇప్పటికే ఒక సందేశం ఇచ్చామని, బహిరంగ సభ ద్వారా మరింత స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు సీఎం ఓ సందేశం ఇస్తారని అంటున్నారు. ప్రధానంగా పార్టీ యంత్రాంగం ద్వారా ఏం చేయనున్నామో తెలుపుతారని పేర్కొంటున్నారు. ‘కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా ప్లీనరీలో విపక్షాల జోలికి పెద్దగా వెళ్లలేదు. ఆయా పార్టీల విమర్శలనూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, బహిరంగ సభ ద్వారా విపక్షాల నోళ్లు మూయించేందుకు సమాయత్తం అవుతున్నారు’ అని పార్టీ నేత ఒకరు తెలిపారు. ప్రధానంగా 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా ఈ సభ ద్వారా పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తారని విశ్లేషిస్తున్నారు. కనీసం నూరు సీట్లు లక్ష్యంగా, ఇప్పటి నుంచే పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తించారని, ముఖ్యనేతల భేటీలోనూ ఈ అంశాన్ని చర్చించారని చెబుతున్నారు. సభకు 5 వేల ఆర్టీసీ బస్సులు! భారీ జనసమీకరణ లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ బస్సులను ఎడాపెడా బుక్ చేసేశారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఆదివారం రాత్రి వరకు దాదాపు ఐదు వేల వరకు బస్సులు బుక్ అయినట్లు తెలిసింది. తొమ్మిది జిల్లాల్లో ప్రస్తుతం 6,500 ఆర్టీసీ బస్సులుండగా... టీఆర్ఎస్ నేతలు ఏకంగా 5 వేలకుపైగా బస్సులను బుక్ చేసుకోవడంతో సాధారణ ప్రయాణికులకు సోమవారం ఇబ్బందులు తప్పేలా లేవు. సాధారణంగా ఇలాంటి బహిరంగ సభలకు 30 శాతం నుంచి 40 శాతం వరకు మాత్రమే బస్సులను కేటాయించిన దాఖలాలున్నాయి. కానీ ఈ సభకు జనసమీకరణ విషయంలో నేతలకు కచ్చితమైన లక్ష్యాలు విధించటంతో వారు ఇష్టారీతిన బస్సులను బుక్ చేసుకున్నారు. కాగా, సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వల్ల కొన్ని సిటీ సర్వీసులు వృథాగా డిపోలకే పరిమితం కావొచ్చని అంచనా వేసిన అధికారులు ఆదివారం రాత్రి వరకు ఐదొందల సిటీ బస్సులను జిల్లాలకు కేటాయించారు. భారీ స్థాయిలో బందోబస్తు... ఇటీవల సంచలనం సృష్టించిన సిమి ఉగ్రవాదుల కాల్పుల ఘటనల నేపథ్యంలో సభకు ఏకంగా 4 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ప్రవేశించే ప్రధాన మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. పది జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం 23 స్థలాలను గుర్తించారు. -
పరేడ్ గ్రౌండ్లో అనుమతి ఇవ్వకుంటే...
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఈ నెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. సభావేదికకు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఖరారు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ సభకు అనుమతి రాకపోతే అంతకుమించిన మైదానంలో సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారుచేస్తామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ప్లీనరీ కోసం ఏడు కమిటీలను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. -
వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, కర్నూలు/అర్బన్: రాష్ట్ర విభజనానంతరం తొలిసారి నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలతో కర్నూలు నగరం మురిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖుల రాకతో ఉత్సవం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అధికారుల ముందస్తు ప్రణాళిక.. సమష్టి సహకారంతో సంబరం అంబరాన్నంటింది. పోలీసుల పక్కా వ్యూహం ఫలించగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కార్యక్రమం సాఫీగా సాగిపోయింది. రాష్ట్ర స్థాయి వేడుకలకు నగరం వేదిక కాగా.. తిలకించేందుకు ప్రతి ఒక్క హృదయం తపించింది. భద్రతా కారణాల దృష్ట్యా అందరికీ అవకాశం దక్కకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురి చేసినా.. ఎనిమిది ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై జెండా పండుగ వీక్షించడం ప్రజలకు సరికొత్త అనుభూతికి లోనుచేసింది. ఉదయం 7 గంటల నుంచే స్థానికులు స్క్రీన్ల వద్దకు చేరుకోవడం కనిపించింది. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో కర్నూలును రాజధానిగా ప్రకటిస్తారని ఆశించిన జిల్లావాసులకు నిరాశే మిగిలింది. కరువు రక్కసి కోరలు చాస్తున్న వేళ.. ‘అభివృద్ధి’ మాటతో.. రాజకీయ చతురతతో బాబు వరాల వర్షం కురిపించే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఉదయం 8.45 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలు దేరింది. ఫైవ్రోడ్డు జంక్షన్, ఆనంద్ థియేటర్ సర్కిల్, కొత్త బస్టాండు మీదుగా కాన్వాయ్ పెరెడ్ మైదానానికి చేరుకుంది. రెండో బెటాలియన్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న తొలి వేడుక కావడంతో పోలీసు శాఖ ఒళ్లంతా కళ్లు చేసుకుంది. ఏపీఎస్పీ మైదానం, చుట్టుపక్క ప్రాంతాలతో పాటు నగరంలోని ప్రధాన రహదారులు.. ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. పెరేడ్ మైదానం చుట్టూ ఉన్న కాలనీలు.. బహుళ అంతస్తుల భవనాలపైనా నిఘా ఉంచడంతో అడుగడుగునా పోలీసులే కన్పించారు. ఏపీఎస్పీ మైదానంలోకి అధికారులు, ప్రజాప్రతినిధులు సహా సామాన్యులను, విద్యార్థులను ఒకటికి రెండు సార్లు తనిఖీ నిర్వహించి అనుమతించారు. ఐదు ప్రధాన ద్వారాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్ బలగాలను మోహరించారు. మొత్తం వేడుక ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
ఇందూరు ఆదర్శం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఇందూరు జిల్లా ‘తెలంగాణ’లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక ప్రణాళి కతో ముందుకెళ్తామన్నారు. మన పూర్వీకు లు సాధించిన ఘన కార్యాలెన్నో ఉన్నాయ ని, వాటిని భావితరాలకు అందిస్తే వారు నవోత్తేజంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఉదయం నిజామాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన వారికి కలెక్టర్ జోహారులు అర్పించారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 2013-14 సంవత్సరంలో వ్యవసా య రంగంలో అత్యధికంగా రూ. 1,834 కోట్ల రుణాలను అందించామన్నారు. రబీ సీజన్లో 274 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని, 32 వేల మంది రైతులకు ఆన్లైన్ ద్వారా మూడు రోజుల్లోపే డబ్బులు చెల్లించామన్నారు. గతేడాది మహిళా సంఘాలకు రూ. 426 కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యం కాగా రూ. 475 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఆ ఏడాది మహిళా సంఘాలు రూ. 54 కోట్ల వడ్డీ రాయితీ పొందాయన్నారు. ఎక్కువ వడ్డీ రాయితీని పొందిన జిల్లాలో ఇందూరుది ప్రథమ స్థానమని పేర్కొన్నారు. స్త్రీనిధి పథకం కింద రూ. 132 కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యంకాగా రూ. 142 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఈ విషయంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంనుంచి పురస్కారాన్ని అందుకున్నామన్నారు. సూక్ష్మ నీటిపారుదల పథకం కింద 2013-14 సంవత్సరంలో 5,010 హెక్టార్ల లక్ష్యానికి గాను 4,431 హెక్టార్లలో నీటి పారుదల సదుపాయం కల్పించామన్నారు. బంగారుతల్లి పథకం కింద 10,129 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. ఉపాధి హామీ పథకం కింద 2013-14 సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా ప్రథమ స్థానం లో ఉందని, గతేడాది 19,621 ఇళ్ల నిర్మాణాల లక్ష్యానికిగాను 16,517 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. జిల్లాలో రెండు స్టేడియాల నిర్మాణానికి రూ.10.20 కోట్లు మంజూరయ్యాయన్నారు. నిజామాబాద్ నగరంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ. 56 కోట్లతో పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో 25 వేల కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఆర్మూర్‌కు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ. 70 కోట్ల విలువ గల పథకం మంజూరు అయ్యిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ. 34 కోట్లతో చేపట్టిన పనులు ముగింపు దశలో ఉన్నాయని, దీని ద్వారా పట్టణంలో 10 వేల అదనపు తాగునీటి కనెక్షన్లు ఇవ్వవచ్చని వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, జిల్లా జడ్జీ షమీమ్ అక్తర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్రావు, ఎస్పీ తరుణ్‌జోషి, డీఆర్వో రాజశేఖర్, డీపీవో సురేశ్‌బాబు, డ్వామా పీడీ శివలింగయ్య, డీఆర్డీఏ పీడీ వెంకటేశం, గృహనిర్మాణ సంస్థ పీడీ చైతన్యకుమార్, జడ్పీ సీఈవో రాజారాం, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు విమలాదేవి, శ్రీనివాసాచారి, కొండల్రావు, దివాకర్, భీమానాయక్, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. -
దశాబ్దాల కల సాకారమైంది..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి ప్రగతి సాధించడంలో ఆదర్శంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ, జాతీయ గీతాలు ఆల పించారు. అనంతరం కలెక్టర్ ప్రసంగించారు. దేశపటం లో తెలంగాణ 29వ రాష్ట్రంగా రాజముద్రతో ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన సమయంలో జిల్లాకు కలెక్టర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. ప్రసం గం అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సన్మానిస్తున్న సమయంలో అమరుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. కలెక్టర్ వారిని ఓదార్చారు. సంక్షేమ పథకాల అమలు ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 5,37,169 మందికి జాబ్‌కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. బోగస్ చెల్లింపులు అరికట్టేందుకు మైక్రో ఏటీఎంల ద్వారా కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. డీఆర్డీఏ ద్వారా 2013-14లో 14,399 సంఘాలకు రూ.316 కోట్లు మంజూరు చేసి వంద శాతం లక్ష్యం సాధించామన్నారు. 2014-15 ఏప్రిల్ వరకు 189 సంఘాలకు రూ.3.68 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వడ్డీలేనిరుణాల ద్వారా 2013-14 ఏడాదిలో రూ.26 కోట్లను 29,710 స్వయం సహాయ సంఘాలకు విడుదల చేశామన్నారు. 2013-14 రబీ సీజన్లో రైతులు పండించిన వరిధాన్యాన్ని 91 కొనుగోళు కేంద్రాల ద్వారా 66 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళు చేశామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 10,595 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యాన్ని 7.5 లక్షల మందికి రూపాయి కిలో చొప్పున అందజేస్తున్నామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 1.56 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు అదనంగా 1.11 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రతిపాదించి పనులు చేపట్టాం. వట్టివాగు ప్రాజెక్టు రూ.89 కోట్ల అంచనాతో పూర్తి చేసి 16 వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరందించడం జరుగుతుందని తెలిపారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు నీటి సరఫరా ప్రైవేట్ బోర్ల, బోర్ల షఫ్లింగ్కు రూ.66 లక్షలు ఖర్చు చేశామన్నారు. రూ. 162 కోట్లతో విమానాశ్రయానికి భూసేకరణ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ కేంద్రం అభివృద్ధి కోసం రూ.162 కోట్లతో భూ సేకరణ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో 594 పాఠశాలలు, 185 అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి పనులు పూర్తి చేశామన్నారు. విద్యాశాఖ ద్వారా మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలో 3,905 పాఠశాలల్లో చదువుతున్న 3.41 లక్షల మంది పిల్లలకు భోజనం ఉచితంగా అందిస్తున్నామన్నారు. తీవ్రవాద పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం ద్వారా విద్యా వ్యవస్థల్లో మౌలిక సదుపాయాలు సబ్ సెంటర్, భవనాలు, ఆశ్రమ పాఠశాలలకు, విద్యుదీకరణకు, రోడ్డు మార్గాల కొరకు రూ.76 కోట్లు ఖర్చు చేశామన్నారు. రహదారులు, భవనాల శాఖ ద్వారా ఈ ఏడాదిలో 95 పనులకు రూ.434 కోట్ల వ్యయంతో చేపట్టామని, ఇప్పటి వరకు రూ.115 కోట్లు ఖర్చు చేసి 25 పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ద్వారా 2013-14లో రూ. 2.24 కోట్లతో విద్యుత్ లేని గిరిజన గ్రామాలకు సౌర విద్యుత్ పనులు పూర్తి చేశామన్నారు. రూ.18.19 కోట్ల విద్యుత్ బకాయిలను ఎస్సీ, ఎస్టీ పథకం కింద గృహ వినియోగదారులకు మాఫీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ అవతరణకు త్యాగధనులైన వారికి స్మృత్యంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పరేడ్ మైదానంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్లను, ప్రచార రథాలను తిలకించారు. ఉత్తమ ప్రదర్శనలు కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఆయా శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ లక్ష్మీకాంతం, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఏఎస్పీ జోయేల్ డేవిస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పరేడ్ మైదానంలో తెలంగాణ వేడుకలు
-
శుభ స్వప్నోదయం
గుండె గుండెనా ఉద్వేగం... ఊరూ వాడా ఉద్విగ్నం.. అణువణువూ పులకరింత... స్వరాష్ట్ర కాంక్షతో జ్వలించిన హృదయం... ‘నవజాత తెలంగాణ’ను గుండెకు హత్తుకున్న సందర్భం... అర్ధరాత్రి నవోదయాన్ని స్వప్నిస్తూ... కోటి ఆశలతో కొత్త రాష్ట్రంలో అడుగిడుతూ... పాలమూరు పరవశించింది... ఉద్యమ ప్రస్థానాన్ని నెమరువేసుకుంటూ... బలిదానాలతో అమరులైనవారికి గీతాలాపన చేసి స్మరించుకుంటూ... ‘మన రాష్ట్రం... మన పాలన’లో... బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ.. ఉప్పొంగిపోయింది. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం ఉదయం నుంచే జిల్లా అంతటా పండుగ వాతావరణం కనిపించింది. జిల్లాలోని ప్రభుత్వ భవనాలు, ముఖ్య కూడళ్లు, చారిత్రక ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా టీఆర్ఎస్ పార్టీ పతాకాలతో అలంకరించడంతో వీధులు, ముఖ్య కూడళ్లు గులాబీమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో పలు చోట్ల ‘ధూం.. ధాం’ నిర్వహించారు. కళాకారులు తెలంగాణ ఆట పాటలతో తెల్లవారు ఝాము వరకూ హోరెత్తించారు. జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లోని జిల్లా పరిషత్ మైదానంలో తెలంగాణ ఆవిర్భావ సంబురాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సెలవులో ఉండటంతో ఇంచార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జేసీ శర్మన్ సంబురాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు టీజేఏసీ భాగస్వామ్య సంఘాలు, జన సామాన్యం సంబురాల్లో పాల్గొంది. జిల్లా వ్యాప్తంగా అర్దరాత్రి దాటిన వెంటనే అమర వీరుల స్థూపాలకు నివాళి అర్పిస్తూ, బాణసంచా పేల్చి సంబురాలకు శ్రీకారం చుట్టారు. పార్టీలు, సంఘాలకు అతీతంగా వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకాలతో సందడి చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు చోట్ల రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ వద్ద బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఉద్యమ ప్రస్తానంలో తమ పాత్రను నెమరు వేసుకుంటూ సంబురాల్లో మునిగి తేలారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా సెల్ఫోన్లలో శుభాకాంక్షలతో కూడిన సందేశాలు వెల్లువెత్తాయి. కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోయాయి. కార్యాలయాల బోర్డులను కూడా కొత్త ప్రభుత్వం పేరిట ఏర్పాటు చేశారు. నేడు అవతరణ దినోత్సవం రాష్ట్ర అవతరణ సందర్భంగా కలెక్టర్ గిరిజా శంకర్ సోమవారం ఉదయం 8.45కు పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పతాకావిష్కరణకు ముందే అమరవీరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. అవతరణ వేడుకల సందర్భంగా కలెక్టర్ సందేశంతో పాటు, వివిధ పథకాల కింద ఎంపిక చేసిన లబ్దిదారులకు ఆస్తులు పంపిణీ చేస్తారు. అధికార పార్టీగా ఆవిర్భవిస్తున్న టీఆర్ఎస్ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు పార్టీకి చెందిన ఏడుగురు శాసనసభ్యులు, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ, వైఎస్సార్సీపీ ఇతర రాజకీయ పార్టీలు కూడా సోమవారం ఉదయం తమ పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నాయి. తెలంగాణ సంబురాల్లో భాగస్వాములు కావాలంటూ అన్ని రాజకీయ పక్షాలు పిలుపునిచ్చాయి. -
తెలంగాణోదయం
నిశీధిని చీల్చుతూ వెలుగులు విరజిమ్ముతున్న బాణాసంచా సాక్షిగా... అరవైఏళ్ల పోరాట స్ఫూర్తిగా... స్వరాష్ట్ర పోరాటంలో అమరులైన వీరుల ఆత్మత్యాగాలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్రం సాక్షాత్కరించింది. రాష్ట్ర ఆవిర్భావానికి స్వాగతం పలుకుతూ ఊరూవాడా సంబరాల్లో మునిగిపోయింది. కాగడాల ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, ధూంధాంలతో హోరెత్తింది. - సాక్షి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ జిల్లా ప్రజలు ఆదివారం సాయంత్రం నుంచే సంబరాలు చేసుకున్నారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు పోటీపడి సంబరాలు నిర్వహించాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు విద్యాసంస్థలు విద్యుత్ కాంతులతో మిరుమిట్లుగొల్పాయి. చిన్నా, పెద్దా.. పేద, ధనిక, కులమతాల తారతమ్యం లేకుండా అందరూ ఆదివారం రాత్రంతా సంబరాలతో జాగారం చేశారు. కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికారు. టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచిపెట్టారు. తెలంగాణ ధూంధాంలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. కాగడాల ప్రదర్శనలు.. కొవ్వొత్తుల ర్యాలీలతో జిల్లాలో పండుగ వాతావరణం కన్పించింది. అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల కుటుంబాలను సన్మానించుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో హోరెత్తించారు. కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య, ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కరీంనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి పూలమాలాంకరణ చేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నగరంలో టపాసులు కాల్చారు. సీపీఐ ఆధ్వర్యంలో మోటారుబైక్ ర్యాలీ తీసి.. అనభేరి ప్రభాకర్ విగ్రహానికి పూలమాల వేశారు. టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. టీ-జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. ఎస్పీ శివకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో కార్యకర్తలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో రాత్రి 10 గంటల నుంచి 1 గంటవరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ధూం ధాం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ కాగడాల ప్రదర్శన నిర్వహించగా, అధికారులు ర్యాలీగా వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు. జమ్మికుంటలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధూంధాంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాయి. ఇల్లందు క్లబ్లో, సింగరేణి క్లబ్లో అధికారులు, మేడిపల్లి ఓపెన్‌కాస్టులో కార్మికులు కేక్ కట్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మికులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగిత్యాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ శ్రేణులు కాగడాల ప్రదర్శన నిర్వహించి.. టపాసులు కాల్చారు. మిఠాయిలు తినిపించుకున్నారు. దర్మపురిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఆధ్వకర్యంలో టపాసులు కాల్చారు. సిరిసిల్లలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ధూంధాం నిర్వహించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీచౌక్ వద్ద ఆటాపాటా నిర్వహించారు. కోరుట్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు టపాసులు కాల్చారు. సైదాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. హుస్నాబాద్‌లో టీ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ధూం ధాం నిర్వహించారు. -
‘అమరుల కుటుంబాలను ఆదుకోవాలి’
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో అసువులు బాసినవారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ నూతన ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం టీఎన్జీవోస్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారిని గుర్తించడంలో జిల్లా రెవెన్యూ అధికారులు విఫలమయ్యారన్నారు. ఎఫ్ఐఆర్ లేనందున ఆత్మత్యాగాలుగా గుర్తించలేమని వారు పేర్కొంటున్నారన్నారు. తెలంగాణ కోసం జిల్లాకు చెందిన అరవై మంది ఆత్మత్యాగాలకు పాల్పడ్డారని, వారి వివరాలను జేఏసీ సేకరించిందని తెలిపారు. అమరుల కుటుంబ సభ్యులను ఆదుకుంటామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొందని, దానిని కేసీఆర్ అమలు చేస్తారన్న విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు బాబూరావు, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కిషన్, జేఏసీ నాయకులు భాస్కర్, దాదన్నగారి విఠల్‌రావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రమొచ్చింది.. జాతి మురిసింది
తెలంగాణ ప్రాంత ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జూన్ రెండో తేదీ రానే వచ్చింది. వస్తూ వస్తూ ఈ ప్రాంత ప్రజల కళ్లల్లో కొత్త కాంతులు నింపింది. సుమారు ఆరు దశాబ్దాల కల నెరవేరడంతో ప్రజలు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అంబరమంటేలా వేడుకలు సాగాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జిల్లాలో అంబరాన్నంటాయి. నింగీనేలా అదిరేలా సా గి న సంబురాలతో ఇందూరు పుల కించింది. ఆరు దశాబ్దాల కల సా కారమైన సందర్భంగా సంతోషం ఉప్పొంగింది. రాష్ట్రావిర్భావ ఘడియల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రజలు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే స్వాగతోత్సవా లు మొదలు పెట్టారు. ‘మా రాష్ట్రం, మా ప్రభుత్వం’ అంటూ నినాదాలు చేశారు. ‘ఔర్ ఏక్ దక్కా.. తెలంగాణ పక్కా’ అం టూ ఉద్యమించిన సబ్బండ వర్ణా లూ ‘తెలంగాణ’కు ఘన స్వా గతం పలికాయి. మారుమోగిన తెలం‘గానం’ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఆదివారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాలు కొత్త కళ సంతరిం చుకున్నాయి. విద్యుత్ దీపాలతో జిగేలుమన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరించగా.. ఆ వెలుగులకు అధికారులు, ఉద్యోగుల సంబరాలు తోడయ్యాయి. తెలగాణ రాష్ట్రం కోసం అరవై ఏళ్లుగా కళ్లలో వత్తు లు వేసుకుని ఎదురు చూసిన ప్రజలు కల నెరవేరిన వేళ ధూంధాం చేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ, రాజకీయ జేఏసీలతో పాటు వివిధ ఉద్యోగ సంఘా ల నేతలు తెలంగాణ సంబురాల్లో ముని గితేలారు. జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఆమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ ఆవిర్భా వం సందర్భంగా కేక్ కట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా టీఆర్ఎస్, కాంగ్రె స్, బీజేపీ, టీడీపీల కార్యాలయాలనూ విద్యుత్‌దీపాలతో అలంకరించారు. టీ ఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో నగరం గులాబీమయమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పార్టీ కార్యాలయాల్లో కేక్‌లు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా అంతటా వేడుకలు సాగాయి. జై తెలంగాణ నినాదంతో జిల్లా మారుమోగింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సోమవారం ఉదయం పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించనున్నారు. ఉదయం 8.45 గంటలకు కలెక్టర్ ప్రద్యు మ్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తారు. ఇందుకోసం పరేడ్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణ వేడుకలకు ముస్తాబైన పరేడ్ మైదానం
-
తెలంగాణ వేడుకలకు ముస్తాబైన పరేడ్ మైదానం
సికింద్రాబాద్: ఏటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు వేదికైన పరేడ్ మైదానం తాజాగా తెలగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ముస్తాబవుతోంది. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుతోపాటు సచివాలయం, శాసనసభ మొదలు డీజీపీ కార్యాలయాల వరకు ఏ రాష్ర్టం కార్యాలయం ఎక్కడ నిర్వహించాలన్న విషయంలో విభజనలు జరిగిపోయాయి. ఈ క్రమంలోనే త్వరలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు కావడం, హైదరాబాద్ నగరం పదేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటున్న నేపథ్యంలో పరేడ్ మైదానం వచ్చే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకునేందుకు ఏ ప్రభుత్వానికి వేదిక కానుందనేది సికింద్రాబాద్ ప్రాంతంలో చర్చలు జరుగుతున్నాయి. పదకొండు ఎకరాలు.... కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్ పరే డ్ మైదానంలో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను రాష్ట్రప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పదకొండు ఎకరాల విశాలమైన స్థలంలో ఆవరించి ఉన్న పరేడ్ మైదానాన్ని సైనిక శిక్షణకు వినియోగిస్తున్నారు. తొలుత క్రైస్తవ ప్రార్థనలు... 17వ శతాబ్దం నుంచి ఈ మైదానాన్ని క్రైస్తవులు ప్రార్థనలకు వినియోగించుకునేవారు. ఆ కాలంలో దీనిని సెయింట్ జోసెఫ్ క్యాథ్రల్ గ్రౌండ్‌గా పిలిచేవారు. కాలక్రమేణా బ్రిటిష్ పాలకులు, నిజాం పాలకుల హయాంలో ఇక్కడే సైనికులకు శిక్షణ శిబిరాలను నిర్వహించేవారు. స్వాతంత్య్రానంతరం... దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత 1948లో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు దీనికి పరేడ్ మైదానంగా నామకరణం చేశారు. అప్పటి నుంచే ఇక్కడ గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 16 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిన తరువాత 1957 ఆగస్టు 15 నుంచి, 2012 ఆగస్టు 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 55 మార్లు స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన 17 మంది ముఖ్యమంత్రుల్లో 16 మంది ఇక్కడ జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరైనారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మొదలు, చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. నెలరోజులపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన నాదెండ్ల భాస్కర్‌రావుకు మాత్రం ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేసే అవకాశం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు సైతం హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు హయాంలో సైతం ఇక్కడే రాష్ర్టప్రభుత్వం గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగాయి. 21 మంది గవర్నర్లు ఇదే సమయంలో రాష్ట్రానికి 22 మంది గవర్నర్లుగా పనిచేశా రు. 1954 జనవరి 26 నుంచి 2013 జనవరి 26 వరకు ఇక్కడ 59 మార్లు గణతంత్ర దినోత్సవాలు జరిగాయి. రాష్ట్ర తొలిగవర్నర్‌గా పనిచేసిన సీఎం.త్రివేది నుంచి ప్రస్తుత గవర్నర్ ఈఎల్ఎన్.నరసింహన్ వరకు 22 మంది గవర్నర్లలో 21 మంది జాతీయ పతాకాలను ఎగురవేశారు. 1997లో గవర్నర్‌గా కొద్దినెలలు మాత్రమే పనిచేసిన రామానుజానికి పరేడ్ మైదానంలో జాతీయపతాకాన్ని ఎగురవేసే అవకాశం లభించలేదు. ఘన ఏర్పాట్లు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటవుతున్న తరుణంలో జూన్ 1 నుంచే ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మైదానాన్ని సర్వాంగసుందరంగా అధికారులు తీర్చిదిద్దగా, టీఆర్ఎస్ నాయకులు గులాబీ జెండాలతో మైదానం పరిసరాలను నింపేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి గౌరవవందనం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
తెలంగాణ వేడుకలు వారం రోజులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అధికారులకు సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా అవతరణ ఉత్సవాలను అధికారి కంగా నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. జూన్2న ఉదయం 8.45 గంటలకు నిజామాబా ద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వారం రోజుల పా టు జరిగే ఉత్సవాల్లో జిల్లా చరిత్ర, చారిత్రక కట్టడాలు, సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులచే నాటికలు, ఒగ్గుకథ, బుర్రకథ, చిందు యక్షగానం, బోనాలు, బతుకమ్మ, సామాజిక జానపద గేయాలు, కోలాటం, ఒగ్గుడోలుపై ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ ప్రాచీన వైభవంపై డాక్యుమెం టరీ ప్రదర్శిస్తారు. సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడు తూ జిల్లాలోని ప్రజల జీవన విధానం, స్థితిగతులపై ప్రదర్శనలు వారోత్సవాలలో చోటు చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి, డ్వామా పీడీ శివలింగయ్య, ఐకేపీ పీడీ వెంకటే శం,డీఈఓ శ్రీనివాసచారి, సీఈఓ రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితో ప్రగతి బాట
సాక్షి, నల్లగొండ : ‘‘ప్రగతి ఏ ఒక్కరితోనూ సాధ్యం కాదు. సమష్టి కృషి అవసరం. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి పొందిన విజయాలతో సంతృప్తి పడకుండా ప్రతి పేదవాడి కన్నీటిని తుడిపివేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది’’ అని కలెక్టర్ టి. చిరంజీవులు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఆదివారం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు, అదనపు ఎస్పీ రామ రాజేశ్వరి ఆధ్వర్యంలో పోలీసులు, ఎన్ఎస్ఎస్ క్యాడెడ్ల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రసంగిస్తూ.... ప్రతి నిరుపేద కన్నీటిని దూరం చేసినప్పుడే అసలైన స్వాతంత్య్రమని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేస్తేనే ఇది సాధ్యమని చెప్పారు. సంకుచితత్వం, స్వార్ధాన్ని వదిలేసి బాధ్యతాయుతమైన పౌరులుగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉజ్వల భవిష్యత్ ఎంతో దూరంలో లేదని, అందరూ కష్టపడితే ఇది సాధ్యమని చెప్పారు. ఫలితంగా భారతావనిని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలపుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పథకాల తీరు, ప్రగతి గురించి వివరించారు. అన్నదాతల అభివృద్ధికి... ‘‘అన్ని రకాలుగా రైతులు అభివృద్ధి చెందడానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఖరీఫ్‌లో రూ.1011.80 కోట్ల పంట రుణాల లక్ష్యానికిగాను... రూ.1129.84 కోట్ల రుణాలు అందజే శాం. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత రబీల సీజన్లో అన్నదాతలకు ఉదారం గా రుణాలు అందజేయాలి. వడ్డీలేని రుణాల కింద 2.74 లక్షల మంది రైతులకు రూ.28.15 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు నష్టం జరిగిన వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాం. త్వరలో ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తాం’’ అని చెప్పారు. సాగుకు పెద్దపీట... పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించి జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి సాగుకు అవకాశం పెరిగిందన్నారు. పులిచింతల ముంపు గ్రామాల బాధితులకు సహాయ, పునరావాస చ ర్యలు యుద్ధప్రాతిపదికన కల్పిస్తున్నామని, కరువు పీడిత ప్రాంతాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రామాలకు తాగునీరు అందజేసేందుకు ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను చేపట్టామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు రూ.3,774 కోట్లు ఖర్చుచేశామన్నారు. అదేవిధంగా జేబీఐసీ పథకం కింద రూ.39.80 కోట్ల వ్యయంతో డిండి, ఆసిఫ్‌నహర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. ఇప్పటివరకు రూ.25.21 కోట్ల ఖర్చు చేసినట్టు తెలిపారు. నేతన్నలకు అండదండగా... చేనేతలను ఆదుకునేందుకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. 22 వేల చేనేత కుటుంబాల జీవనోపాధులకు భరోసా కల్పించాల్సిన బాధ్యతతో రూ.3.92 కోట్లతో 1025 మంది చేనేతలకు రుణ కార్డుల ఆధారంగా ఆర్థికంగా తోడ్పాటు అందించినట్టు చెప్పారు. అంతేగాక మరో పదివేల మందికిపైగా వృద్ధాప్య పింఛన్లు, బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో మహిళలను.. ‘‘మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా విరివిగా రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ ఏడాది 22,503 సంఘాలకుగాను.. రూ.440.82 కోట్ల రుణాల లక్ష్యానికిగాను.. 16,721 సంఘాలకు రూ.354.5 కోట్ల రుణాలు అందజేశాం. బంగారుతల్లి పథకం కింద అర్హులైన 8,355 మంది ఆడ శిశువులను నమోదు చేసి ముందంజలో ఉన్నాం’’ అని వివరించారు. ‘పది’లంగా ఉండేందుకు.. పదో తరగతిలో ఉత్తీర్ణతాశాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. బడిబయట ఉన్న ఐదు నుంచి 14 సంవత్సరాలలోపు మూడు వేల మంది పిల్లలను గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరిని వచ్చేనెల 10వ తేదీ వరకు బడిలో చేర్పించేందుకు బృహత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. తల్లీబిడ్డల సంరక్షణకు.... మాతాశిశు మరణాలు తగ్గించడం, పోషక విలువలు పెంచడం, ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిపే లక్ష్యంతో ఆయా శాఖలను సమన్వయ పరిచి ‘మార్పు’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని వివరించారు. జననీ సురక్ష యోజన, జననీ శిశు సంరక్ష పథకాల ద్వారా ప్రతి తల్లీ శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు సర్కారు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు.... ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, 74,869 మంది మందికి ఈ ఏడాది నూతనంగా ఓటు హక్కు కల్పించినట్టు తెలిపారు. భావితరాల భవిష్యత్ కోసం... ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల జవాబుదారీతనాన్ని పెంపొంది స్తున్నామన్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాల ప్రజల భాగస్వామ్యంతో నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పారిశుద్ధ్యం, రక్షిత తాగునీరు, ప్రజారోగ్యం, పౌష్టికాహారం అందజేత, స్త్రీ వివక్ష రూపుమాపడం, బాలికా శిశు సంరక్షణ మొదలైన అంశాలపై ప్రగతి సాధించేం దుకు నిత్యం పాటుపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, జేసీ హరి జవహర్లాల్, డీసీసీబీ ఇన్చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, స్వాతంత్య్ర సమరయోధుడు నర్రా రాఘవరెడ్డి, జిల్లా అధికారులు జెడ్పీ సీఈఓ వెంకట్రావు, డీఆర్డీఏ, డ్వామా పీడీలు సుధాకర్, కోటేశ్వరరావు, డీఈఓ జగదీష్, మాడా పీఓ సర్వేశ్వర్‌రెడ్డి, బీసీ, ఎస్పీ కార్పొరేషన్ ఈడీలు గంగాధర్, శ్రీధర్, డ్వామా అదనపు పీడీ నర్సింహులు, డీఎంహెచ్ఓ ఆమోస్, డీఆర్ఓ అంజయ్య, ఫైర్ ఆఫీసర్ హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధికి చేయూత
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా సమగ్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కలెక్టర్ శశిధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్లో 58వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ తొలుత జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల పంటలసాగు తగ్గిందన్నారు. ప్రధాన పంట వేరుశనగ 53శాతం మాత్రమే సాగైందన్నారు. రబీకి అవసరమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందన్నారు. గత ఖరీఫ్ పంట నష్టానికి రూ. 52కోట్లు మంజూరు కాగా రూ. 47కోట్లను 54వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో కురిసిన వర్షాల్లో నష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ. 43లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా 9వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని, దీనిపై తుది నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపేందుకు ఎన్యుమరేషన్ చేపడుతున్నామన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం పీబీసీ ద్వారా 25వేల ఎకరాలకు, గండికోట ఎత్తిపోతల పథకం కింద 5వేల ఎకరాల నూతన ఆయకట్టుకు, వామికొండ రిజర్వాయర్ కింద 5వేల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాల కోసం రూ. 488 కోట్ల రుణాలు మంజూరు చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాజీవ్ యువకిరణాల కింద 9వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. బంగారు తల్లి పథకం క్రింద 2వేల మంది శిశువులను నమోదు చేయగా, అందులో 71 మందికి రూ. 2,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. గృహ నిర్మాణంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధిహామీ కింద ఇప్పటివరకు 17వేల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించామన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద 198 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 32వేల మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఏడవ విడతలో 10వేల మంది లబ్ధిదారులకు 16వేల ఎకరాల భూమిని త్వరలో పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇందిరమ్మ అమృతహస్తం ద్వారా గర్భవతులు, బాలింతలు, శిశువులకు ఒక్కపూట భోజనం, పాలు, గుడ్లు అందిస్తున్నామన్నారు. మార్పు కార్యక్రమం ద్వారా మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యపరీక్షలు నిర్వహించడమేగాక 9వేల మందికి శస్త్ర చికిత్సల కోసం రూ. 25కోట్లు ఖర్చు చేశామన్నారు. శకటాల ప్రదర్శన : రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పోలీసుల మైన్‌ప్రూఫ్, వజ్ర, వ్యవసాయ శాఖ, డ్వామా, నిర్మల్ భారత్, ఇందిర జలప్రభ లబ్ధిదారులు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రాజీవ్ యువకిరణాలు లబ్ధిదారులు, 108 వాహనం, బంగారు తల్లి, ఉపాధిహామీ పథకం వాహనాలు పెరేడ్లో పాల్గొన్నాయి. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు : నగరంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల, జియోన్ ఉన్నత పాఠశాల, సాయిబాబా, మౌంట్‌ఫోర్ట్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో మౌంట్‌ఫోర్ట్ పాఠశాల విద్యార్థులకు మొదటి బహుమతి, సాయిబాబా పాఠశాల విద్యార్థులకు రెండవ బహుమతి, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు మూడవ బహుమతి, జియోన్ పాఠశాల విద్యార్థులు కన్సోలేషన్ బహుమతులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నుంచి అందుకున్నారు. ఆస్తుల పంపిణీ : డీఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖ, వికలాంగుల సహకార కార్పొరేషన్లకు చెందిన 4,335 మంది లబ్ధిదారులకు 1504.885 లక్షల రూపాయలు విలువ చేసే 456 యూనిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్ఓ ఈశ్వరయ్య, ఆర్డీఓ హరిత, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగాలు స్ఫూర్తి కావాలి
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్: సమాజ పరిరక్షణలో పోలీసు పాత్ర ఎంతో కీలకమైనదని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అన్నారు. విధి నిర్వహణలో పోలీసుల ప్రాణ త్యాగాలను మరువలేమన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాయ టం బాధాకరమన్నారు. ఇలాంటి సందర్భాల్లో నిరాశ కు గురికాకుండా అమరుల త్యాగాలను స్మరించుకుం టూ పోలీసులు విధులు నిర్విహ ంచాలన్నారు. సాంకేతికంగా వచ్చిన మార్పుల కారణంగా గత పదేళ్ల నుం చి పోలీసు శాఖను సవాలు చేసే రీతిలో నేరాలు జరుగుతున్నాయన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు పోలీసు లు సరికొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. ప్రజల వద్దకు పోలీసులు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించే పరిస్థితులు రావాలన్నారు. జిల్లా ఎస్పీ కేవీ మోహన్‌రావు మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న విధి నిర్వహణలో ఉన్న 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా దురాక్రమణలో చనిపోయిన ఘటన మొదలుకుని పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుతున్నామన్నారు. ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా 579 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులు అయ్యారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మం డలం మార్టూర్ గ్రామానికి చెందిన రిజర్వుడు ఇన్స్పెక్టర్ ప్రసాద్‌బాబు ఏప్రిల్ 17న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని బొట్టుగుడా, కారుగుట్టా ప్రాంతంలో నక్సల్స్‌తో పోరాడుతూ మరణించాడని పేర్కొన్నారు. వీరి సేవాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘అశోకచక్ర ’ ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో చనిపోయిన వారి పేర్లను నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ చదివారు. వారందరిని స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్‌పరేడ్ మైదానంలో నెలకొల్పిన పోలీసు అమర వీరుల స్థూపానికి కలెక్టర్,ఎస్పీ,డీఎస్పీ,సీఐలు,ఎస్సైలు పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఆంజనేయు లు, ప్రభాకర్, రిటైర్టు డీఎస్పీ దయానంద్ నాయుడు, నగ ర సీఐ సైదులు, ఎస్హెచ్ఓలు నర్సింగ్‌యాదవ్, సోమనాథం, ఏఆర్ ఎస్సై మల్లిఖార్జున్, నగర ఎస్సైలు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు షకీల్పాష తదితరులు పాల్గొన్నారు. -
సంబరాల పరేడ్
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: అది చరిత్రకు సాక్ష్యం.. చారిత్రక నేపథ్యానికి సజీవ దృశ్యం.. దేశభక్తిని చాటే వేదిక అది.. అదే సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానం. ఏడెకరాల సువిశాల స్థలంలో ఆవరించి ఉన్న ఈ మైదానానికి ఘనచరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా పంద్రాగస్టు వేడుకలకు మైదా నం ముస్తాబవుతోంది. విద్యార్థులు, పోలీసు బలగాల కవాతు రిహాల్స్తో ఇప్పటికే సందడిగా మారింది. తొలుత క్రైస్తవ ప్రార్థనలు.. 17వ శతాబ్దం నుంచి ఈ మైదానాన్ని క్రైస్తవులు ప్రార్థనలకు వినియోగించుకునే వారు. అప్పట్లో దీనిని సెయింట్ జోసెఫ్ క్యాథ్రల్ గ్రౌండ్‌గా పిలిచే వారు. కాలక్రమేణా సైనిక శిక్షణ కేంద్రంగా మారింది. నిజాంల హయాం లో ఇక్కడే సైనికులకు శిక్షణా శిబిరాలను నిర్వహించే వారు. తెల్లదొరలు, నిజాం పాలకులు సైనిక వందనం స్వీకరించడం కోసం ఈ మైదానాన్నే వేదికగా చేసుకునే వారు. స్వాతంత్య్రానంతరం.. దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత 1948లో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు దీనికి పరేడ్ మైదానంగా నామకరణం చేశారు. అప్పటి నుంచే ఇక్కడ గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు జరుగుతున్నాయి. ఏటా జనవరి 26న గవర్నర్, ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఈ మైదానంలోనే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. 16 మంది ముఖ్యమంత్రులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిన తరువాత 1957 నుంచి 2012 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 55 సార్లు స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసిన 17 మందిలో 16 మంది ఇక్కడ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మొదలు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఇక్కడ జాతీయ పతాకాలను ఎగురవేయగా.. నెల రోజుల పాటు సీఎంగా కొనసాగిన నాదెండ్ల భాస్కర్‌రావుకు మాత్రం ఆ అవకాశం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు సైతం ఇక్కడే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగేవి. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన బూర్గుల రామకష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 21 మంది గవర్నర్లు 1954 నుంచి 2013 వరకు ఇక్కడ 59 సార్లు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్రానికి 22 మంది గవర్నర్లుగా పని చేయగా, 21 మంది ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వీరిలో రాష్ట్ర తొలి గవర్నర్‌గా పని చేసిన సీఎం త్రివేది నుంచి ప్రస్తుత గవర్నర్ నరసింహన్ వరకు ఉన్నారు. 1997లో గవర్నర్‌గా కొద్ది నెలలు మాత్రమే పని చేసిన రామానుజానికి పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే అవకాశం రాలేదు. ఆదివారం ఆట విడుపు ఆదివారం వచ్చిందంటే చాలు ఈ మైదానం ఆటవిడుపుకు కేంద్రంగా మారుతోంది. నగరంలోని వందలాది మంది యువకులు, విద్యార్థులు సూర్యోదయాన్నే ఇక్కడికి చేరుకుని క్రికెట్ డుతుంటారు. సెలవు దినాల్లో క్రీడల సందడే ఇక్కడ రోజంతా కనిపిస్తుంది. అమర జవాన్ల స్థూపం కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన సుమారు వంద మంది అమర జవాన్ల స్మారకార్థం పరేడ్ మైదానంలో మిలటరీ అధికారులు స్థూపాన్ని నిర్మించారు. కార్గిల్ అమర్ జవాన్ స్థూపంగా నామకరణం చేశారు. 2000 నుంచి రెండేళ్ల పాటు సాగిన నిర్మాణ పనుల అనంతరం దీన్ని జాతికి అంకితమిచ్చారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ స్థూపం వద్ద ముఖ్యమంత్రి, గవర్నర్ ఇతర మిలటరీ అధికారులు పుష్పగుచ్ఛాల నుంచి నివాళులు అర్పించడం ఆనవాయితీ. కార్గిల్ దివాస్ పేరుతో ఏటా జూన్‌లో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.