తెలంగాణ వేడుకలకు ముస్తాబైన పరేడ్ మైదానం | parade-ground-ready-to-telangana-celebrations | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 1 2014 4:18 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

ఏటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు వేదికైన పరేడ్ మైదానం తాజాగా తెలగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ముస్తాబవుతోంది. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుతోపాటు సచివాలయం, శాసనసభ మొదలు డీజీపీ కార్యాలయాల వరకు ఏ రాష్ర్టం కార్యాలయం ఎక్కడ నిర్వహించాలన్న విషయంలో విభజనలు జరిగిపోయాయి. ఈ క్రమంలోనే త్వరలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు కావడం, హైదరాబాద్ నగరం పదేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటున్న నేపథ్యంలో పరేడ్ మైదానం వచ్చే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకునేందుకు ఏ ప్రభుత్వానికి వేదిక కానుందనేది సికింద్రాబాద్ ప్రాంతంలో చర్చలు జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement