గుంటూరు (పట్నంబజారు) : సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం గుంటూరు పర్యటనలో భాగంగా అర్బన్ జిల్లా పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 500 మంది సిబ్బందితో సన్నిద్ధి కల్యాణ మండపం, ఐటీసీ, ఐబీ వద్ద భారీ బందోస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో హెలికాప్టర్ దిగి వివిధ ప్రాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. 8 మంది డీఎస్పీలు, 15 సీఐలు, 23 మంది ఎస్సైలు, 77 మంది ఏఎస్సైలు, 260 మంది కానిస్టేబుళ్లు, నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన మరో 70 మంది కానిస్టేబుళ్లు ఈ బందోబస్తు నిర్వహించనున్నారు. బందోబస్తులో భాగంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం అధికారులతో సమీక్షించారు.