ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మాదిగలకు న్యాయం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ వేస్తాం. ఎస్సీ వర్గీకరణం కోసం జరుగుతున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది. మీ మాదిగ సామాజిక సామాజిక వర్గానికి న్యాయం జరగాలన్నదే మా ఆకాంక్ష. ఈ పోరాటంలో మందకృష్ణ నా నాయకుడు.. నేను ఆయన అసిస్టెంట్‌ను. అన్ని వర్గాలకు న్యాయం.. బీజేపీ లక్ష్యం.
:::సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మాదిగ విశ్వరూప సభ వేదిక దేశ ప్రధాని మోదీ హామీ
ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్
- తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ..
- సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి నరసింహుడికి నమస్కారం
- మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన నా బంధువులకు అభినందనలు
- పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే ఆనందం రెట్టింపు అవుతుంది
- ఈ సభకు హాజరు కావడం.. నా కుటుంబ సభ్యులతో గడిపినంత ఆనందంగా ఉంది
- మందకృష్ణ నా చిన్నతమ్ముడిలాంటివాడు
- మా ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన
- అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉంది
- స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో ప్రభుత్వాలను చూశారు
- ఆ ప్రభుత్వాలు.. మా ప్రభుత్వానికి ప్రజలు తేడా గమనించాలి
- సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. అనేది మా విధానం
- పేదరిక నిర్మూలనే మా ప్రథమ ప్రాధాన్యం.
- న్యాయం చేస్తామని అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి
- మీరంతా వన్ లైఫ్.. వన్ మిషన్‌లా పోరాటం చేస్తున్నారు
- మీ బాధలు పంచుకునేందుకే నేను వచ్చాను
- కాశీ నాథుడి దీవెనలతో నేను మీ ముందు ప్రధానిగా ఉన్నాను
- గుర్రం జాషువా తన కష్టాల్ని కాశీ విశ్వేశరుడికి విన్నవించుకున్నారు
- బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచింది
- స్వాతంత్రం వచ్చాక అనేక ప్రభుత్వాలు వచ్చాయి.. సామాజిక న్యాయం అమలు చేసింది బీజేపీ మాత్రమే
- అన్ని ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశాయి
- గత ప్రభుత్వాలు చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసేందుకే నేను వచ్చా
- ఇన్నాళ్లూ రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలు చేసి మాట తప్పినందుకు క్షమించమని కోరుతున్నా
- మందకృష్ణ 30 ఏళ్లుగా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారు
- మందకృష్ణ పోరాటానికి మేం అండగా ఉంటాం
- మాదిగల పోరాటానికి నా సంపూర్ణ మద్దతు
- పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసింది
- దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు
- పదేళ్ల కిందట ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం.. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు
- దళిత బంధు వల్ల ఎంత మందికి లాభం జరిగింది?
- బీఆర్‌ఎస్ నేతల బంధువుల స్కీమ్‌గానే దళిత బంధు మారింది
- బీఆర్‌ఎస్ నేతలకే దళితబంధు ఇచ్చి చేతులు దులుపుకుంది
- బలిదానాలు కాదని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు
- దళితులకు మూడెకరాలు ఇస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసింది
- రైతులకు రుణమాఫీ ఇస్తామని మోసం చేశారు
- బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో స్కాం చేసింది
- ఢిల్లీలో ఆప్‌తో కలిసి బీఆర్‌ఎస్ వేల కోట్ల అవినీతి చేసింది
- అభివృద్ధి కోసం పార్టీలు కలిసి పని చేయాలి కానీ అవినీతి కోసం కాదు
- అంబేద్కర్ విధానాలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తూట్లు పొడిచాయి
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి జాగ్రత్తగా ఉండాలి
- రాష్ట్రపతిగా దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను ఓడించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది
- ఆదివాసీ అయిన ముర్ము కూడా కాంగ్రెస్ ఓడించాలనుకుంది
- బీజేపీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అంబేద్కర్ చిత్రపటం పెట్టాం
- అంబేద్కర్‌కు కాంగ్రెస్ భారత రత్న ఇవ్వలేదు.. ఆ ఘనత బీజేపీదే
- రాజస్థాన్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన దళితుడిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ను చేశాం
- అంబేద్కర్‌ను రెండుసార్లు గెలవకుండా చేసింది కూడా కాంగ్రెస్సే
- బీఆర్‌ఎస్‌లాగే.. కాంగ్రెస్ చరిత్ర కూడా అణగారిన వర్గాలకు, బీసీలకు వ్యతిరేకం
- బీఆర్‌ఎస్‌తో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. కాంగ్రెస్‌తోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు తెర వెనుక రాజకీయం నడుపుతున్నాయి
- బీఆర్‌ఎస్ కాంగ్రెస్ ఒకవైపు.. బీజేపీ ఒకవైపు ఉంది
- పేదవారికి గ్యాస్ కనెక్షన్‌లు, బ్యాంక్ రుణాలు అందిస్తున్నాం
- నాలుగు కోట్ల మందికి పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టించాం
- బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన సంక్షేమ పథకాలను బీజేపీ అందిస్తోంది
మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో మందకృష్ణ ప్రసంగం..
- దశాబ్దాలుగా మమ్మల్ని హీనంగా చూశారు
- 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నాం
- మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూశారు
- మేం ఊహించని కల ఇది
- మా సభకు ప్రధాని మోదీ వస్తారని ఊహించలేదు
- మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పేందుకు వచ్చిన మోదీకి కృతజ్ఞతలు
- మాదిగల్ని కేసీఆర్ అణచివేస్తే.. మోదీ పదవులిచ్చారు
- బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన దమ్మున్న నాయకుడు మోదీ
- అత్యంత వెనుకబడిన మాదిగలకు తెలంగాణ మంత్రి వర్గంలో చోటు లేదు
- ఒక్క శాతం కూడా లేని వెలమకు నాలుగు మంత్రి పదువులు ఇచ్చారు
- అంబేద్కర్ ఆశయాల్ని అమలు చేసింది మోదీ మాత్రమే
- దళితుడ్ని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది
- రెండోసారి నెగ్గాక ప్రధాని మోదీ ఓ గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేశారు
- మోదీ దళిత వర్గాలకు అండగా నిలుస్తున్నారు
- సామాజిక న్యాయంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాటలు మాత్రమే చెప్తున్నాయి
- సామాజిక న్యాయం అమలు చేస్తున్న మోదీకి ధన్యవాదాలు
- కేసీఆర్ మాదిగలను అణిచివేశారు
- దళితున్ని సీఎం చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారు
- దేశాన్ని ఆదుకునే విషయంలో దేశాన్ని కాపాడే విషయంలో మిమ్మల్ని(మోదీని ఉద్దేశించి..) మించిన నాయకుడు లేడు
- పెద్దన్నగా మా కోసం వచ్చిన మోదీ వర్గీకరణపై మాకు హామి ఇవ్వాలని రెండు చేతులెత్తి దండం పెడుతున్నా
►మందకృష్ణ మాదిగ భావోద్వేగం.. ఓదార్చిన ప్రధాని మోదీ
పరేడ్ గ్రౌండ్ మాదిగ విశ్వరూప సభ వేదికగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమార్పీఎస్) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సభ ప్రారంభానికి ముందు వేదికనెక్కిన ప్రధాని మోదీ, మందకృష్ణను ఆలింగనం చేసుకున్నారు. దీంతో.. భావోద్వేగానికి లోనై మందకృష్ణ కంటతడి పెట్టారు. దీంతో.. తన పక్కనే కూర్చున్న మందకృష్ణను ప్రధాని మోదీ వీపుతట్టి ఓదార్చారు.
ఇక సభ ముగిసే ముందర మందకృష్ణ పోరాటానికి మొబైల్ ఫోన్ టార్చ్‌లు ఆన్ చేసి మద్దతు తెలపాలని ప్రధాని మోదీ కోరగా.. సభకు హాజరైన జనం సెల్‌ఫోన్ టార్చ్‌లతో సంఘీభావం తెలిపారు. ఆఖర్లోనూ వెళ్లిపోయే ముందర మందకృష్ణ కంటతడి పెట్టగా.. మోదీ ఓదార్చి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. బండి సంజయ్, లక్ష్మణ్‌లు మందకృష్ణను ఓదార్చడం గమనార్హం.
►మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ
►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని
►బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
► ఎస్సీ వర్గీకరణపై ప్రకటన?
- పరేడ్ గ్రౌండ్‌లో అణగారిన వర్గాల(మాదిగల) విశ్వరూప మహాసభ
- ఈ వేదిక నుంచి ఎస్సీ వర్గీకరణ ప్రకటన?
- మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి – MRPS నిర్వహిస్తున్న మాదిగ విశ్వరూప మహాసభ
- స్వయంగా ప్రకటన చేయనున్న ప్రధాని మోదీ!
►కాస్త ఆలస్యంగా రానున్న మోదీ
- 20 నిమిషాలు ఆలస్యంగా హైదరాబాద్‌కు నరేంద్రమోదీ
- సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయనికి చేరుకోనున్న నరేంద్రమోదీ
- ముందుగా 4.45 గంటలకు షెడ్యూల్ చేసిన PMO
- పీఎంవో షెడ్యూల్ చేసిన సమయం 20 నిమిషాల ఆలస్యంగా షెడ్యూల్
- 5.25 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు నరేంద్రమోదీ
- 40 నిమిషాల పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో నరేంద్రమోదీ
- సభ తర్వాత నేరుగా ఢిల్లీకి పయనం
►హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ప్రధాని మోదీ నగర పర్యటన సందర్భంగా.. సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు
- శనివారం రాత్రి 8 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు
- పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, టివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రోడ్లను మూసివేత
- బేగంపేట నుంచి సంగీత్ ఎక్స్ రోడ్స్ వైపు వెళ్లే వాహనదారులు సీటీవో ఎక్స్ రోడ్స్ వద్ద బాలమ్ రాయ్, బ్రూక్‌బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ మీదుగా వెళ్లాలని సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో బీజేపీ తరఫున ప్రచారం కోసం వారం వ్యవధిలోనే రాజధాని హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’ జరగనుంది. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment