రాష్ట్రమొచ్చింది.. జాతి మురిసింది
తెలంగాణ ప్రాంత ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జూన్ రెండో తేదీ రానే వచ్చింది. వస్తూ వస్తూ ఈ ప్రాంత ప్రజల కళ్లల్లో కొత్త కాంతులు నింపింది. సుమారు ఆరు దశాబ్దాల కల నెరవేరడంతో ప్రజలు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అంబరమంటేలా వేడుకలు సాగాయి.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జిల్లాలో అంబరాన్నంటాయి. నింగీనేలా అదిరేలా సా గి న సంబురాలతో ఇందూరు పుల కించింది. ఆరు దశాబ్దాల కల సా కారమైన సందర్భంగా సంతోషం ఉప్పొంగింది. రాష్ట్రావిర్భావ ఘడియల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రజలు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే స్వాగతోత్సవా లు మొదలు పెట్టారు. ‘మా రాష్ట్రం, మా ప్రభుత్వం’ అంటూ నినాదాలు చేశారు. ‘ఔర్ ఏక్ దక్కా.. తెలంగాణ పక్కా’ అం టూ ఉద్యమించిన సబ్బండ వర్ణా లూ ‘తెలంగాణ’కు ఘన స్వా గతం పలికాయి.
మారుమోగిన తెలం‘గానం’
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఆదివారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాలు కొత్త కళ సంతరిం చుకున్నాయి. విద్యుత్ దీపాలతో జిగేలుమన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరించగా.. ఆ వెలుగులకు అధికారులు, ఉద్యోగుల సంబరాలు తోడయ్యాయి. తెలగాణ రాష్ట్రం కోసం అరవై ఏళ్లుగా కళ్లలో వత్తు లు వేసుకుని ఎదురు చూసిన ప్రజలు కల నెరవేరిన వేళ ధూంధాం చేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ, రాజకీయ జేఏసీలతో పాటు వివిధ ఉద్యోగ సంఘా ల నేతలు తెలంగాణ సంబురాల్లో ముని గితేలారు. జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఆమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ ఆవిర్భా వం సందర్భంగా కేక్ కట్ చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా టీఆర్‌ఎస్, కాంగ్రె స్, బీజేపీ, టీడీపీల కార్యాలయాలనూ విద్యుత్‌దీపాలతో అలంకరించారు. టీ ఆర్‌ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో నగరం గులాబీమయమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పార్టీ కార్యాలయాల్లో కేక్‌లు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా అంతటా వేడుకలు సాగాయి. జై తెలంగాణ నినాదంతో జిల్లా మారుమోగింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సోమవారం ఉదయం పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించనున్నారు. ఉదయం 8.45 గంటలకు కలెక్టర్ ప్రద్యు మ్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తారు. ఇందుకోసం పరేడ్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు.