Hard Work Should Be Silent, Pradeep Mehra Says - Sakshi
Sakshi News home page

Midnight Run Pradeep Mehra: అర్ధరాత్రి పరుగులు.. ఫేమస్‌ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నాడు! తమ్ముడూ నువ్వు నిజంగానే బంగారం

Published Tue, Mar 22 2022 9:13 PM | Last Updated on Wed, Mar 23 2022 12:43 PM

Hard Work Should Be Silent Says Midnight Run Pradeep Mehra - Sakshi

ప్రదీప్‌ మెహ్రా వైరల్‌ దృశ్యం.. పక్కనే తల్లీసోదరుడితో ప్రదీప్‌

Pradeep Mehra Running Video: అనుకున్నది సాధించే క్రమంలో ఆటంకాల గురించి ఆలోచించి.. ఆగిపోయేవాళ్లే ఎక్కువ. కానీ, అవాంతరాలను అలవోకగా దాటేయాలనుకునే ప్రదీప్‌ మెహ్రా లాంటి వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి!. 19 ఏళ్ల ప్రదీప్‌.. భారత ఆర్మీలో చేరాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తాను పని చేసే చోటు నుంచి ఉంటున్న చోటుకి దాదాపు 8 కిమీపైనే అర్ధరాత్రి పరుగులు తీస్తుండడం, అది కాస్త వీడియో రూపంలో ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడం తెలిసిందే. అయితే.. 

తన రన్నింగ్‌ వీడియో వైరల్‌ కావడంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఉత్తరాఖండ్‌ ఆల్మోరాకు చెందిన ప్రదీప్‌.. అనవసరంగా తనను ఓ సెలబ్రిటీని చేయొద్దంటూ వేడుకుంటున్నాడు. అది ఎందుకో అతని మాటల్లోనే తెలుసుకుందాం.

ఫిల్మ్‌మేకర్‌ వినోద్‌ కాప్రి.. నొయిడా నుంచి బరోలా మధ్య ప్రదీప్‌ మెహ్రా ఉరుకులను షూట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో వైరల్‌ అయ్యాక.. ప్రదీప్‌ రియాక్షన్‌ ఎలా ఉందో తెలుసుకోవాలని కాప్రి ఆరాటపడ్డాడు. ఈ క్రమంలో మరోసారి ప్రదీప్‌ను కలిశాడు. ‘‘అతిగా ఫేమ్‌ దక్కినా నాకు ఇబ్బందే. ఇంటర్వ్యూల కోసం ఎగబడడమో లేదంటే నన్నొక సెలబ్రిటీగా మార్చేయడమో చేస్తారు. అప్పుడు  నా లక్ష్యంపై నేను దృష్టి సారించలేను. కాబట్టి, ఇదంతా నాకొద్దు. దయచేసి వేడుకుంటున్నా నా కోసం వేరే ఎవరూ రావొద్దు. ప్రశాంతంగా నా పని నన్ను చేసుకోనివ్వండి’’ అని వేడుకుంటున్నాడు ఆ కుర్రాడు. 

‘‘నా శ్రమ నిశబ్దంగానే సాగిపోవాలి. ఎందుకంటే నా విజయాన్ని నేను ప్రపంచానికి బిగ్గరగా చాటి చెప్పాలి కదా. అందుకే ఇలాంటి ఫేమ్‌లకు దూరంగా ఉండాలనుకుంటున్నా. సెల్ఫీల కోసం కొందరు వస్తుంటే.. సిగ్గుగా అనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఇంటర్వ్యూలంటూ ఇబ్బంది పెడుతున్నారు. నా తల్లి ట్రీట్‌మెంట్‌కి సాయం దొరికింది. సాయం అందించినందుకు కృతజ్ఞతలు. ఇక చాలు. ఇంకేం వద్దు. నా లక్ష్యం దేశ సేవే’’ అని క్లారిటీగా చెప్పేశాడు ఆ కుర్రాడు. కాస్తంత ఫేమ్‌ దక్కినా, అనుకోకుండా వైరల్‌ అయినా ఎలా క్యాష్‌ చేసుకోవాలా? అని ఆలోచించే వాళ్లు ఉన్న ఈ రోజుల్లో.. ప్రదీప్‌ మెహ్రా లాంటి వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి.  

ఇదిలా ఉంటే.. సినీ నిర్మాత అతుల్‌ కస్బేకర్‌, ప్రదీప్‌ కోసం షూస్‌, దుస్తులు, బ్యాక్‌ప్యాక్‌ను వినోద్‌ కాప్రి ద్వారా పంపించాడు. వాటిని దగ్గరుండి మరీ ప్రదీప్‌కు అందజేసి ఆల్‌ది బెస్ట్‌ చెప్పాడు కాప్రి. ఇక పలువురు ఇంటర్నెట్‌ వేదికగా ఆ కుర్రాడిని అభినందిస్తున్నారు. ఇక కాప్రి కూడా యూట్యూబ్‌ ఛానెల్స్‌కు, మీడియాకు ప్రదీప్‌ మెహ్రాను అలాగే వదిలేయాలంటూ రిక్వెస్ట్‌ చేస్తున్నాడు కూడా. 

సంబంధిత వార్త:  అమ్మ అనారోగ్యం, ఆపై.. ప్రదీప్‌ పరుగుల కథ ఇది! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement