Midnight Runner Pradeep Mehra Receives Cheque From Shoppers Stop For Mothers Treatment
Sakshi News home page

Midnight Runner: బంగారు కొండ ‘ అర్ధరాత్రి పరుగుల’ ప్రదీప్‌ మెహ్రాకు ఊహించని సాయం

Published Fri, Apr 1 2022 10:34 AM | Last Updated on Fri, Apr 1 2022 3:10 PM

Midnight Runner Pradeep Mehra Receives Aid From Shoppers Stop - Sakshi

Midnight Runner Pradeep Mehra News: అర్ధరాత్రి రోడ్ల వెంట పరుగులు.. అదీ సైన్యంలో చేరాలనే లక్ష్యంతో.. ఇంకేం ప్రదీప్‌ మెహ్రా ఓవర్‌ నైట్‌ సెన్సేషన్‌ అయ్యాడు. ఆపై ఆ కుర్రాడిని ఈ-సెలబ్రిటీని చేసేందుకు ప్రయత్నాలు సాగగా..  తన ప్రయాణాకి ఆటంకం కలిగించొద్దంటూ సున్నితంగా మీడియాను వేడుకున్నాడు ఈ ఉత్తరాఖండ్‌ కుర్రాడు.

ఈ తరుణంలో.. ప్రదీప్‌ మెహ్రాకు సాయం మాత్రం అందుతోంది. ప్రదీప్‌ తల్లి చికిత్స కోసం, అతని కల నెరవేరేందుకుగానూ రెండున్నర లక్షల రూపాయల చెక్‌ సాయం అందించింది షాపర్స్ స్టాప్‌. ఈ విషయాన్ని మొదటి నుంచి మెహ్రాకు తోడుగా ఉంటున్న జర్నలిస్ట్‌, దర్శకుడు వినోద్‌ కాప్రీ తెలియజేశాడు. తనకు సాయం అందిస్తున్న వాళ్లకు ప్రదీప్‌ సైతం కృతజ్ఞతలు చెప్తున్నాడు. చదవండి: అమ్మ అనారోగ్యం.. ఆర్మీ కల.. ప్రదీప్‌ పరుగుల కథ ఇది! 

నోయిడా సెక్టార్‌ 16 దగ్గర మెక్‌డొనాల్డ్‌లో పని చేసే ప్రదీప్‌ మెహ్రా.. తానుండే చోటుకి దాదాపు 10 కిలోమీటర్ల దూరం పరుగుల మీదే ప్రతీరోజూ చేరుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓరోజు ఆ కుర్రాడి గురించి ఆరా తీసిన వినోద్‌ కాప్రీ.. లిఫ్ట్‌ ఇస్తానని చెప్పినా వద్దంటూ తనమానాన తాను పరుగులతోనే వెళ్లిపోయాడు. ఆ వీడియో ఆనంద్‌ మహీంద్రా లాంటి ప్రముఖులతో పాటు ఎంతో మందిని కదిలించింది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement