భారత సైన్యం వ్యవస్థాగత నిఘాను మెరుగుపరచడానికి, పోరాట కార్యకలాపాల్లో సహాయానికి రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ను అభివృద్ధి చేసింది. ఈ నెల 12న పోఖ్రాన్‌లో జరగనున్న ఆర్మీ ఎక్సర్‌సైజ్‌లో ఈ రోబో డాగ్ తన సత్తా చాటనుంది.
‘మ్యూల్’ అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్. దీనిలో పలు ఫీచర్లు ఉన్నాయి. ‘మ్యూల్’.. థర్మల్ కెమెరాలు, రాడార్‌తో అనుసంధానమై ఉంటుంది. మంచు, ఎడారి, కఠినమైన నేల, ఎత్తయిన మెట్లు, కొండ ప్రాంతాలలో.. ప్రతి అడ్డంకిని దాటగలిగేలా ఈ రోబో డాగ్‌ను రూపొందించారు. దీనికి శత్రు లక్ష్యాలను మట్టుబెట్టగల సామర్థ్యం కూడా ఉంది.
మార్చి 12న భారత సైన్యం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో స్వదేశీ ఆయుధాలు, సాయుధ దళాలకు చెందిన పరికరాల బలాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీనిలో ఇండియన్ ఆర్మీకి చెందిన రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ యాక్షన్ మోడ్‌లో కనిపించనుంది. ఈ రోబో డాగ్ 2023లోనే భారత సైన్యానికి చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్‌లో చేరింది.
రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ కుక్క మాదిరిగా కనిపిస్తుంది. దీనికి నాలుగు కాళ్లు ఉంటాయి. ‘మ్యూల్’ బరువు దాదాపు 51 కిలోలు. దీని పొడవు 27 అంగుళాలు. ఇది ఒక గంటలో రీఛార్జ్ అవుతుంది. పది గంటల పాటు పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శత్రు లక్ష్యాలపై కాల్పులు జరిపే సాంకేతికత ‘మ్యూల్’లో ఉంది.
#BharatShakti
— ADG PI - INDIAN ARMY (@adgpi) March 9, 2024
स्वदेशीकरण से सशक्तिकरण
Displaying the might of indigenous weapons & equipment of #IndianArmedForces.
On 12 Mar 2024 at #Pokaran Field Firing Ranges (Rajasthan).#AatmanirbharBharat#YearofTechAbsorption@DefenceMinIndia@HQ_IDS_India@IAF_MCC@indiannavy pic.twitter.com/poRvYHjOZh
Comments
Please login to add a commentAdd a comment