పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాకు తాను వెనకాడబోనని చెప్పిన పాక్ పీఎం.. విపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా పాక్ ఆర్మీని విమర్శిస్తూ.. భారత్‌పై ప్రశంసలు గుప్పించాడు.
ఖైబర్ ఫక్తూన్వాలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాసం తేబోతున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ.. తన ప్రభుత్వ పని తీరును సమర్థించుకున్నాడు. పనిలో పనిగా.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నాడు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అలాగే భారత విదేశాంగ విధానం అద్భుతంగా ఉంటుందని, పౌరుల కోసం ఎంతకైనా తెగిస్తుందంటూ ఆకాశానికి ఎత్తాడు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండడం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించాడు.
అంతేకాదు భారత్ విధానాలు ఆ దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్ ఖాన్. ఇక పదవీ గండంపై స్పందిస్తూ.. రాజీనామాకు తాను ఎప్పటికైనా సిద్ధమని పేర్కొన్నాడు. అలాగని విపక్షాల ఒత్తిళ్లకు తాను తలొగ్గనని, ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని, పదవిని నిలబెట్టుకోలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్’ తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని కోరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment