శ్రీనగర్: తమ దేశ సైనికుడి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాకిస్తాన్‌కు భారత్ ఆర్మీ తెలిపింది. శనివారం నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న చొరుబాటును భారత్ ఆర్మీ ముందుగానే పసిగట్టి కాల్పులు జరిపింది. కెరాన్ సెక్టర్‌లో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో పాక్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్‌కు చెందిన సైనికుడు మృతి చెందినట్లు మేజర్ జనరల్ ఏఎస్ పెంధార్కర్ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి మహ్మద్ షబీర్ మాలిక్‌గా గుర్తించామని తెలిపారు.
పాకిస్తాన్ వైపున భారత చొరబాటు నిరోధక వ్యవస్థ ఉన్న చోట ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. అయితే భారత్ సైనికులు జరిపిన కాల్పులో ఓ వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. అతని వద్ద ఏకే రైఫిల్, మందుగుండు సామాగ్రి, 7గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు.
మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాక్‌కు సమాచారం అందిచినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డు, పాక్ వైద్యశాఖ జారీ చేసిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. అందులోని ఫోటోలో సదరు వ్యక్తి పాక్ ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘింగిచే చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment