Pakistan Soldiers
-
మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి: ఇండియన్ ఆర్మీ
శ్రీనగర్: తమ దేశ సైనికుడి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాకిస్తాన్‌కు భారత్ ఆర్మీ తెలిపింది. శనివారం నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న చొరుబాటును భారత్ ఆర్మీ ముందుగానే పసిగట్టి కాల్పులు జరిపింది. కెరాన్ సెక్టర్లో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో పాక్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్‌కు చెందిన సైనికుడు మృతి చెందినట్లు మేజర్ జనరల్ ఏఎస్ పెంధార్కర్ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి మహ్మద్ షబీర్ మాలిక్‌గా గుర్తించామని తెలిపారు. పాకిస్తాన్ వైపున భారత చొరబాటు నిరోధక వ్యవస్థ ఉన్న చోట ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. అయితే భారత్ సైనికులు జరిపిన కాల్పులో ఓ వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. అతని వద్ద ఏకే రైఫిల్, మందుగుండు సామాగ్రి, 7గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాక్‌కు సమాచారం అందిచినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డు, పాక్ వైద్యశాఖ జారీ చేసిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. అందులోని ఫోటోలో సదరు వ్యక్తి పాక్ ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘింగిచే చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. -
ఎల్ఏసీ వద్ద పాకిస్తాన్ సైనికులు!
న్యూఢిల్లీ/లేహ్: భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా సైన్యంతోపాటు దాని సన్నిహిత మిత్ర దేశం పాకిస్తాన్ సైనికులు కూడా తిష్ట వేశారా? చైనాకు మద్దతుగా వారు కూడా పహారా కాస్తున్నారా? చైనా జర్నలిస్టు షెన్ షెవీ శనివారం షేర్ చేసిన ఓ వీడియోను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో చైనా సైనికులతోపాటు గుబురు గడ్డంతో ఉన్న మరో సిపాయి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతడి రూపురేఖలు, ఎత్తు, దేహ దారుఢ్యం వంటివి చైనా పౌరుల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎల్ఏసీ వద్ద చైనాకు సాయంగా పాకిస్తాన్ సైన్యం సైతం రంగంలోకి దిగిందని పలువురు భావిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సరిహద్దులో భారత్–చైనా సైనికుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 12న భారత్–చైనా ఆర్మీ ఏడో రౌండ్ చర్చలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునే దిశగా భారత్–చైనా ఆర్మీ ఏడో దఫా చర్చలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి.తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకునే కచ్చితమైన రోడ్ మ్యాప్ రూపొందించడమే ఈ సమావేశం ఎజెండా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన చర్చల్లో సరిహద్దుల్లోకి మరిన్ని అదనపు బలగాలను పంపించరాదనే నిర్ణయంతోపాటు పలు కీలక అంశాల్లో ఏకాభిప్రాయం సాధించారు. సైన్యం, వైమానిక దళం ఉమ్మడి కార్యాచరణ తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దూకుడును అడ్డుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. వైమానిక దళంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని భావి స్తోంది. సరిహద్దులో చెలరేగిపోతున్న చైనా సైనికులకు తగిన గుణపాఠం నేర్పడానికి భారత సైన్యం, వైమానిక దళం సన్నద్ధమ వుతున్నాయి. త్రివిధ దళాలను ఎప్పటి కప్పుడు సమన్వయ పరుస్తూ ముందుకు నడిపించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సూచనలతోనే సైన్యం, వైమానిక దళం కలిసి పని చేయనున్నాయి. లేహ్ ఎయిర్ ఫీల్డ్‌లో ఇప్పటికే వైమానిక దళం యుద్ధ విమానాలను మోహరించింది. వాస్తవా« దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద పరిస్థితి మరింత దిగజారితే వెంటనే ఉమ్మడిగా కొన్ని ఆపరేషన్లు చేపట్టడానికి సైన్యం, వైమానిక దళం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
బాలీవుడ్ సాంగ్స్‌కు భారత్, పాక్ సైనికులు డ్యాన్స్
-
చిందేసిన భారత్, పాక్ సైన్యం
మాస్కో: సరిహద్దుల్లో ఎప్పుడూ తుపాకులతో తలపడే భారత్, పాకిస్తాన్ సైనికులు తొలిసారి చిందేశారు. బాలీవుడ్ సాంగ్స్‌కు తమ స్టెప్టులతో శాంతి సందేశాన్నిచ్చారు. రష్యాలో జరిగిన యాంటీ టెర్రర్ డ్రిల్‌లో పాల్గొన్న ఇరు దేశాల జవాన్లు.. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రష్యాలోని చెబర్కుల్ పట్టణంలో జరిగిన ఈ డ్రిల్‌ను బీజింగ్‌కు చెందిన షాంఘై కార్పోరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) నిర్వహించింది. ఈ వీడియోను న్యూఢిల్లీలోని రష్యా ఎంబసీ సైతం ట్వీట్ చేసింది. ఎస్సీవో సభ్యదేశాలు అయిన తర్వాత తొలిసారి దాయదీ దేశాలు మిలిటరీ విన్యాసాల్లో పాల్గొన్నాయి. రష్యాకు చెందిన సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో ఈ సంయుక్త విన్యాసాలు జరిగాయి. ఈ డ్రిల్‌కు భారత్-పాక్ కలిసి రావడాన్ని చైనా స్వాగతించింది. రష్యా, చైనా, కజకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిజిస్తాన్, భారత్, పాక్‌ల నుంచి మూడు వేల మంది సైనికులు ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు. 2001లో ఏర్పాటు అయిన ఎస్సీవోలో చైనా, రష్యా, కజకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా కాగా.. 2017లో పాక్, భారత్‌లు కలిసాయి. This video show the true meaning of peace and love #IndianArmy #pakistanarmy doing dance together in Russia #SCO2018 #Chebarkul Jai Hind jai Bharat Bharat mata ki..... pic.twitter.com/h8ahcKyE69 — Nand Lal (@imjatNandlal) August 29, 2018 -
పాక్ సైనికులను వేటాడిన భారత ఆర్మీ
న్యూఢిల్లీ : భారత్ - పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్యలో గల నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎల్వోసీని దాటి వెళ్లిన భారత ఆర్మీ సైనికుల బృందం ముగ్గురు పాకిస్తాన్ సైనికులను హతమార్చింది. గత శనివారం ఎల్వోసీ వద్ద పాకిస్తాన్ ఆర్మీ విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో నలుగురు భారత ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోకి భారత ఆర్మీ బలగాలు చొచ్చుకెళ్లినట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారు. భారత్ ఆర్మీ ఎల్వోసీలోకి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలో కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో జైషే ఈ మహ్మద్ టాప్ కమాండర్ నూర్ మహ్మద్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోనే నక్కిన మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం దళాలు జల్లెడ పడుతున్నాయి. కాగా, భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్‌పై పాకిస్తాన్ మీడియా ప్రకటనను వెలువరించింది. నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు పాకిస్తాన్ సైనికులను చంపినట్లు పేర్కొంది. మరొకరికి కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది. -
భారత జవాన్ల 'ఈద్' మిఠాయిలను తిరస్కరించిన పాక్
వాఘా: ఇప్పుడప్పుడే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులు తలెత్తకముందే.. 'పొరుగు దేశం మిఠాయిలు చేదు' అన్నట్లుగా వ్యవహరించింది దాయాది పాకిస్థాన్. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పండుగల సందర్భంలో పరస్పరం పలకరించుకొని, మిఠాయిలు తినిపించుకునే సంప్రదాయానికి తెరదించింది. సరిహద్దుల్లో దశాబ్దాలుగా సాగుతోన్న పండుగ చెలిమికి మంగళం పాడింది. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) ఇవ్వజూపిన మిఠాయిలు స్వీకరించేందుకు పాక్ సైనికులు నిరాకరించారు. ఈ ఉదయం వాఘా సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది. వాఘానే కాకుండా భారత్- పాక్ సరిహద్దుల్లోని ముఖ్యమైన స్థావరాన్నింటివద్దా ఇలాంటి పరిస్థితే నెలకొంది. 'పండుగ సందర్భంగా పొరుగు దేశం సైనికులకు స్వీట్లు ఇవ్వడం ఆనవాయితి. అయితే ఈ సారి మాత్రం వారు స్వీట్లు తీసుకునేందుకు నిరాకరించారు. ఏది ఏమైనా మేం కోరుకునేది శాంతినే' అని బీఎస్ఎఫ్ డీఐజీ ఎంఎఫ్ ఫారూఖ్ చెప్పారు. పాక్ తీరుకు భిన్నంగా అసోం, మేఘాలయాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద భారత్, బంగ్లాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని, స్వీట్లు తినిపించుకోవడం గమనార్హం. కశ్మీర్ అంశం ప్రస్తావన లేకుండా భారత్- పాక్‌ల మధ్య చర్చలు అసాధ్యమని పాక్ రక్షణ సలహాదారు అజీజ్ ప్రకటించినప్పటినుంచి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం రెట్టింపయింది. గడిచిన పక్షంరోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి పాక్ సేనలు భాతర జవాన్లు, సాధారణ పౌరులపై తుపాకి గుండ్ల వర్షం కురిపించాయి. రంజాన్ పండుగ నాడు కూడా భారత సైన్యం స్థావరాలపై పాక్ రేజర్లు పలు మార్లు కాల్పులు జరిపారు.