Indian Army Dress 12 Manipur Militants A Mob Of 1500 Blocks Way - Sakshi
Sakshi News home page

మణిపూర్‌: ఆర్మీని అడ్డుకున్న మహిళలు.. 12 మంది మిలిటెంట్లు జంప్‌

Published Sun, Jun 25 2023 10:25 AM | Last Updated on Sun, Jun 25 2023 11:57 AM

Indian Army Frees 12 Manipur Militants As Mob Of 1500 Blocks Way - Sakshi

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ కొద్దిరోజులుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఇక, మణిపూర్‌పై అమిత్‌ షా అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో మణిపూర్‌లో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్థానిక మహిళల నేతృత్వంలో ఓ గుంపు భారత సైన్యాన్ని చుట్టుముట్టి 12 మంది మిలిటెంట్లకు అండగా నిలిచారు. అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య సైన్యం 12 మంది మిలిటెంట్లను వదిలేసింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఇంఫాల్‌ ఈస్ట్‌లోని ఇథమ్‌లో మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంతో భారత సైన్యం ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. మహిళ నేతృత్వంలో సుమారు 1200-1500 ఓ గుంపుగా ఏర్పాడ్డారు. ఈ క్రమంలో వారంతా ఆర్మీ వాహనాలను చుట్టుముట్టారు. వాహనాలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమకు అడ్డుకోవద్దని సైన్యం హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఇలా కొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో, అధికారులు రంగంలోకి దిగారు. 

కాగా, అధికారులు కూడా ఆందోళనకారులను హెచ్చరించినప్పటికీ లాభం కనిపించలేదు. దీంతో, చేసేదేమీలేక పరిస్థితి చేయిదాటిపోకముందే 12 మంది మిలిటెంట్లను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండానే ఉద్రిక్తపరిస్థితి సద్దుమనిగింది. ఈ క్రమంలో గ్రామంలో పెద్దసంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రీని సైనికులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. గ్రామస్తుల కారణంగా మైటీ వర్గానికి చెందిన మిలిటెంట్‌ గ్రూప్‌ కంగ్లీ యావోల్‌ కన్నా లుప్‌ సభ్యులు తప్పించుకున్నారు. వారిలో మొయిరంగథెం తంబా కూడా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. అతడు 2015లో 6 డోగ్రా రెజిమెంట్‌పై జరిగిన దాడితో సహా అనే ఘటనల్లో అతడు సూత్రధారి అని తెలిపారు. 


ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో మైతీ, కుకీల మధ్య జరగుతున్న హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు వేల మందికిపైగా గాయపడగా.. 4వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలతో 40 వేల మందికి పైగా ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.

ఇక, తాజాగా మణిపూర్‌ మంత్రి ఎల్‌ సుసీంద్రోకు చెందిన ప్రైవేట్‌ గోడౌన్‌కు కొంతమంది ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ గోడౌన్‌ ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని చింగారెల్‌లో ఉంది. ఈ ఘటనలో ఈ గోడౌన్‌ కాలి బూడిదైందని పోలీసులు శనివారం తెలిపారు. అలాగే శుక్రవారం రాత్రి ఖురారులోని ఆహార వ్యవహారాల మంత్రి నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించి వారిని నిలువరించారు. ఆందోళనకారులు మంత్రి నివాసాన్ని చుట్టుముట్టకుండా భద్రతా దళాలు అర్థరాత్రి వరకు పలుసార్లు భాష్పవాయుని ప్రయోగించాయని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపించాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement