Hero Suman Clarifies On 117 Acres Of Land Issue - Sakshi
Sakshi News home page

Actor Suman: భూ వివాదం, విరాళంపై స్పష్టత ఇచ్చిన సుమన్‌

Published Tue, Feb 1 2022 3:23 PM | Last Updated on Tue, Feb 1 2022 4:38 PM

Hero Suman Clarifies On 117 Acres Of Land Issue - Sakshi

ప్రముఖ నటుడు సుమన్‌ భారత సైన్యానికి 117ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో  విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ భూమిని విరాళంగా అందించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై సుమన్‌ స్పందించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. '117 ఎకరాల భూమిని తాను  భారత సైన్యానికి ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో ఉంది. వివాదం పరిష్కారం అయిన వెంటనే స్వయంగా తానే అందరికీ తెలియజేస్తాను' అంటూ అంటూ చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement