భూ వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్ | Ntr Team Clarifies Land Dispute Issue In Hyderabad | Sakshi
Sakshi News home page

Ntr: తెలంగాణ హైకోర్టుకి వెళ్లిన తారక్.. అసలు విషయం ఇది

Published Fri, May 17 2024 3:41 PM | Last Updated on Fri, May 17 2024 4:43 PM

Ntr Team Clarifies Land Dispute Issue In Hyderabad

భూవివాదంలో జూ.ఎన్టీఆర్.. ఏకంగా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. శుక్రవారం ఉదయం సడన్‌గా ఈ న్యూస్ బయటకొచ్చింది. పలు వెబ్ సైట్స్‌తో పాటు మీడియా ఛానెల్స్‌లోనూ ఇది వచ్చింది. దీంతో అసలేం జరిగిందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో తారక్ టీమ్ ట్విస్ట్ ఇచ్చింది. అసలు ఈ గొడవతో ఇతడికి సంబంధమే లేదని తేల్చి చెప్పింది.

(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్‍‌లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)

అసలేం జరిగింది?
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లోని ఓ ఫ్లాట్‌ని ఎన్టీఆర్ 2003లో కొన్నాడు. గీత లక్ష‍్మి అనే మహిళ దీన్ని విక్రయించింది. అయితే 1996లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల్లో గీతలక్ష‍్మి కుటుంబం లోన్స్ తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఎన్టీఆర్‌కి అమ్మేశారు. కానీ ఫ్లాట్ అమ్మేటప్పుడు కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే లోన్ ఉందని చెప్పి, దాన్ని క్లియర్ చేసిన తర్వాత తారక్‌కి భూమి తాలుకూ పేపర్లు తీసుకున్నారు.

అయితే ఆ ఫ్లాట్‌ తనఖా పెట్టి లోన్ తీసుకుని, చెల్లించని కారణంగా ఆ భూమిపై హక్కులు తమవే అని పలు బ్యాంకులు నోటీసులిచ్చాయి. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్‌టీ(రుణ వసూళ్లు ట్రైబ్యునల్) తీర్పిచ్చిందని.. ఈ ఆదేశాల్ని రద్దు చేయాలని ఎన్టీఆర్ తాజాగా తెలంగాణ కోర్టుని ఆశ్రయించినట్లు వార్తలొచ్చాయి. అయితే తారక్ కోర్టుకెళ్లారనేది నిజం కాదని, అలానే ఆ ఫ్లాట్ 2013లోనే తారక్ అమ్మేశారని ఇప్పుడు అతడి పేరు ఉపయోగించొద్దని చెబుతూ  ఓ నోట్ రిలీజ్ చేసింది. అలానే ఈ ల్యాండ్ తో ఎన్టీఆర్ కి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న ఎన్టీఆర్.. తన పుట్టినరోజుని విదేశాల్లోనే కుటుంబంతో కలిసి జరుపుకోబోతున్నాడు.

(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement