దేశంలో మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ శుక్రవారం విడుదలవుతోంది. బజాజ్ ఆటో లిమిటెడ్ తన మొట్టమొదటి సీఎన్‌జీ, పెట్రోల్ హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌ను 'ఫ్రీడమ్ 125' పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది.
బజాజ్ సీఎన్‌జీ బైక్ పేరు 'బ్రూజర్' అని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బజాజ్ ఆటో వెబ్‌సైట్‌లో పేరు లీక్ అయింది. 'ఫ్రీడమ్ 125'ని రెండు వేరియంట్‌లలో ఒకటి సాధారణ మోడల్, మరొకటి ప్రీమియం మోడల్‌లో విడుదల చేయాలని బజాజ్ ఆటో భావిస్తోంది. ఇందులో మరిన్ని కలర్ ఆప్షన్స్, ఫీచర్లు ఉండనున్నాయి.
బజాజ్ ఆటో నుంచి వస్తున్న ఈ డ్యూయల్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌లో పెట్రోల్ నుంచి సీఎన్‌జీకి అలాగే సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కు ఎప్పుడైనా మారేందుకు కంట్రోల్ బటన్ ఉంటుంది. ఇతర అంశాలలో రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, మరింత ప్రాక్టికాలిటీని అందించే ఫ్లాట్ సీటు ఉన్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'బజాజ్ బియాండ్' ఈవెంట్ సందర్భంగా, ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 80,000 నుంచి రూ. 90,000 మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో పోటీ ఎంపికగా మారింది. తమ రాబోయే ఉత్పత్తుల కోసం బజాజ్ ఇంతకుముందు గ్లైడర్, మారథాన్, ట్రెక్కర్, ఫ్రీడమ్ అని నాలుగు వేర్వేరు పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment