పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా? | Prabhas Name Changed For Kalki 2898 Movie | Sakshi
Sakshi News home page

Prabhas Kalki: కావాలనే మార్చారా లేదంటే ఏమైనా సెంటిమెంటా?

Jun 28 2024 7:19 AM | Updated on Jun 28 2024 8:47 AM

Prabhas Name Changed For Kalki 2898 Movie

డార్లింగ్ ప్రభాస్ హిట్ కొట్టేశాడు. 'కల్కి'తో వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్‌కి ముందు అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వస్తున్న టాక్ చూస్తుంటే తొలిరోజు వసూళ్లతో పాటు ఓవరాల్ కలెక్షన్స్‌లోనూ సరికొత్త రికార్డులు నమోదు కావడం గ్యారంటీ అనిపిస్తుంది. సినిమా సూపర్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ తన కామెడీ టైమింగ్ ప్లస్ యాక్షన్‌తో అదరగొట్టాడు. కానీ చాలామంది మూవీలో ఓ విషయం మాత్రం సరిగా గమనించలేదేమో!

(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)

ప్రభాస్ పేరులో చిన్న మార్పు చోటు చేసుకుంది. అవును మీరు విన్నది నిజమే. 'కల్కి' సినిమా చూడాలనే ఆత్రుత వల్లో ఏమో గానీ ఇటు ప్రేక్షకులు అటు ఫ్యాన్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ టైటిల్స్‌లో ప్రభాస్ బదులు 'శ్రీ ప్రభాస్' అని పడింది. అయితే దీన్ని గౌరవ సూచకంగా పెట్టారా? లేదంటే న్యూమరాలజీ ప్రకారం పేరుకి ముందు శ్రీ అని జోడీంచుకున్నాడా అనేది మరో మూవీ వస్తే క్లారిటీ వచ్చేస్తుంది.

ఏ పేరు మార్చినా సరే ఫ్యాన్స్‌కి మాత్రం ప్రభాస్ ఎప్పుడూ ప్రభాస్ డార్లింగే. ఇకపోతే మూవీలో మహాభారతం ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. టైటిల్స్ పడేటప్పుడు వచ్చే సీన్స్‌తో పాటు చివర్లో వచ్చే సన్నివేశాలు వావ్ అనిపించాయి. 3 గంటల సినిమాలో దాదాపు 30 నిమిషాలు మహాభారతం ట్రాక్ పెట్టారు. ఇందులో అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ కనిపించారు. వీళ్ల గెటప్స్ అయితే అలా అందరికీ నచ్చేసేయంతే!

(ఇదీ చదవండి: 'కల్కి' గెస్ట్‌ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement