ఆదిత్య, మధు, సుబ్బ రాజు (ఎడమ నుంచి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్‌సీఎల్ గ్రూప్ కంపెనీ అయిన ఎన్‌సీఎల్ ఆల్‌టెక్ అండ్ సెక్కోలార్ పేరును ఎన్‌సీఎల్ బిల్డ్‌టెక్‌గా మార్చారు. కంపెనీ ప్రస్తుతం సుమారు రూ.100 కోట్లతో విస్తరణ చేపట్టింది. నెల్లూరులో ఏఏసీ బ్లాక్స్ యూనిట్ నిర్మాణంలో ఉందని ఎన్‌సీఎల్ బిల్డ్‌టెక్ ఎండీ కె.మధు తెలిపారు. జేఎండీ సుబ్బ రాజు, ఈడీ పి.ఆదిత్యతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నెల్లూరు యూనిట్ 2020 మార్చికల్లా సిద్ధం కానుంది. జర్మనీకి చెందిన షూకో సహకారంతో సంగారెడ్డి వద్ద అల్యూమినియం విండోల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇదే జిల్లాలో స్టీల్ డోర్ల తయారీ యూనిట్ కూడా నెలకొల్పుతున్నాం’ అని వివరించారు.
సోలార్ వెలుగులు..: విద్యుత్ వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా సోలార్ విద్యుత్‌ను వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది. మొత్తం అవసరాల్లో 60–70 శాతం సోలార్ నుంచి సమకూరేలా చూస్తామని మధు చెప్పారు. 2018–19లో కంపెనీ రూ.372 కోట్ల టర్నోవర్‌పై రూ.47 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 700లకు పైమాటే. త్వరలో కొత్తగా 200 మందిని నియమించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment