ఎయిర్ హోస్టెస్‌లు తొలగింపు | Remove air hostess in air india | Sakshi

ఎయిర్ హోస్టెస్‌లు తొలగింపు

Sep 15 2015 8:25 AM | Updated on Sep 3 2017 9:27 AM

ఎయిర్ హోస్టెస్‌లు తొలగింపు

ఎయిర్ హోస్టెస్‌లు తొలగింపు

స్థూలకాయం కలిగిన విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్‌లకు ఎయిర్ ఇండియా సంస్థ ఉద్వాసన పలికింది.

చెన్నై : స్థూలకాయం కలిగిన విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్‌లకు ఎయిరిండియా సంస్థ ఉద్వాసన పలికింది. ఎయిర్ హోస్టెస్‌లుగా పనిచేసేవారికి అందం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. ప్రధానంగా స్థూలకాయంగా ఉండరాదు.
 
ఎయిరిండియా విమాన సంస్థలో పనిచేస్తున్న 125 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. స్థూలకాయం కలిగిన 600 మంది విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్‌లను గుర్తించారు. వ్యాయామం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు వారికి అవకాశం ఇచ్చారు. వ్యాయామం చేసినా శరీర బరువు తగ్గని 125 మందికి ఎయిరిండియా విమాన సంస్థ ఉద్వాసన పలికింది. వీరికి 18 నెలల గడువు ఇచ్చామని, అయినా వారు  స్థూలకాయాన్ని తగ్గించుకోలేకపోయారని, దీంతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ఆ సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement