జిల్లాలో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ప్లాన్
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
ప్రకటనతో చర్చ ప్రణాళిక తయారుచేస్తున్న కలెక్టర్
అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు బిల్డర్ల యత్నం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’ను ఆపేదే లేదని.. దీనిపై ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా ముందుకు వెళ్తా మని ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. హైడ్రాను ఆపితే భవిష్యత్తులో హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. జిల్లాలోనూ హైడ్రా మాదిరిగా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ క్రమించిన వారిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, వా రి కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నా సదరు ఆక్రమణలు తొలగిస్తామని తెలి పారు. దీంతో ఈ విషయమై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
జిల్లాలో కబ్జాలు, ఆక్రమణల విషయమై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుండగా, ఆక్రమణదారుల్లో మా త్రం టెన్షన్ నెలకొంది. దీంతో చెరువులు, వాగుల్లో నిర్మాణాలు చేపట్టి విక్రయించిన బిల్లర్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డిలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. చివరకు వాళ్లు వేసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొన్నా మధ్యతరగతి అమాయకులు మాత్రం పరేషాన్ అవుతున్నారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి కలెక్టర్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నగరంలో అనేక ఆక్రమణలు
నిజామాబాద్‌లో కీలకమైన పూలాంగ్ వాగు అడుగడుగునా కబ్జా అయింది. మాలపల్లి నుంచి ప్రారంభమయ్యే డి –54 కెనాల్ చంద్రశేఖర్‌కాలనీ వరకు కబ్జా అయింది. అర్సపల్లిలోని రామర్తి చెరువు 90 శాతం కబ్జా అయింది. భారీ నిర్మాణాలు చేశారు. ధర్మపురి హిల్స్, డ్రైవర్స్ కాలనీ, పెయింటర్స్ కాలనీల్లో 40 ఎకరాల ప్రభు త్వ భూమి కబ్జా అయింది. వీటికి మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారు.
కనుమరుగవుతున్న కాలువలు
ఆర్మూర్ పట్టణంలో నిజాంసాగర్ 82/2/1 మైనర్ కాలువ ఆక్రమణలతో కనుమరుగు అవుతోంది. 70 ఫీట్ల వెడల్పుతో పట్టణంలోని మామిడిపల్లి, పెర్కిట్–కొటార్మూర్ మీదుగా వెళ్లే ఈ కాలువ ఉనికిని కోల్పోయింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువ 68వ డిస్ట్రిబ్యూటరీని కబ్జా అయింది. ఈ కాలువను ఆక్రమించి కొందరు వెంచర్లు వేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేసి ఏకంగా ప్రహరీలతో బిల్డింగ్‌లు నిర్మించారు. ఫలితంగా చిన్న వర్షం కురిస్తే జాతీయ రహదారి జలమయం అవుతోంది.
సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు
నగరంలో చాలా చోట్ల సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు లు వచ్చినా అక్రమార్కులకు పాల్పడుతున్న అధికారులను కాపాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో కిందిస్థాయి అధికారులు మాఫియా మాదిరిగా వ్యవహారాలు నడిపి రూ.కోట్లలో దండుకుంటున్నారు.
చెరువుల్లో కబ్జాలు
జిల్లాలోని పలు చెరువులు కబ్జా అయ్యాయి. నవీపేట దర్యాపూర్ చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఇందులో 5 ఎకరాల వరకు రియల్ స్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. నవీపేట మండలం మోకన్‌పల్లి చెరువులో 60 ఎకరాల శిఖం భూమిని కొందరు పట్టాలు చేసుకున్నారని గ్రామస్తులు గతంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. భీమ్‌గల్ రాధం చెరువు భూములు ఎన్నో ఏళ్లుగా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా చేసి అమ్మేశారు. ఇందల్వాయి చెరువు 80 ఎకరాలు కబ్జా అయింది. కొందరు ఈ ఆక్రమిత స్థలాల్లో డెయిరీ ఫామ్‌లు కట్టారు. నందిపేటలోని రఘునాథ చెరువు కబ్జా చేసి నిర్మాణాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment