encroachments
-
హైడ్రా మాదిరిగా నిడ్రా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’ను ఆపేదే లేదని.. దీనిపై ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా ముందుకు వెళ్తా మని ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. హైడ్రాను ఆపితే భవిష్యత్తులో హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. జిల్లాలోనూ హైడ్రా మాదిరిగా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ క్రమించిన వారిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, వా రి కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నా సదరు ఆక్రమణలు తొలగిస్తామని తెలి పారు. దీంతో ఈ విషయమై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జిల్లాలో కబ్జాలు, ఆక్రమణల విషయమై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుండగా, ఆక్రమణదారుల్లో మా త్రం టెన్షన్ నెలకొంది. దీంతో చెరువులు, వాగుల్లో నిర్మాణాలు చేపట్టి విక్రయించిన బిల్లర్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డిలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. చివరకు వాళ్లు వేసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొన్నా మధ్యతరగతి అమాయకులు మాత్రం పరేషాన్ అవుతున్నారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి కలెక్టర్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.నగరంలో అనేక ఆక్రమణలునిజామాబాద్లో కీలకమైన పూలాంగ్ వాగు అడుగడుగునా కబ్జా అయింది. మాలపల్లి నుంచి ప్రారంభమయ్యే డి –54 కెనాల్ చంద్రశేఖర్‌కాలనీ వరకు కబ్జా అయింది. అర్సపల్లిలోని రామర్తి చెరువు 90 శాతం కబ్జా అయింది. భారీ నిర్మాణాలు చేశారు. ధర్మపురి హిల్స్, డ్రైవర్స్ కాలనీ, పెయింటర్స్ కాలనీల్లో 40 ఎకరాల ప్రభు త్వ భూమి కబ్జా అయింది. వీటికి మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారు.కనుమరుగవుతున్న కాలువలుఆర్మూర్ పట్టణంలో నిజాంసాగర్ 82/2/1 మైనర్ కాలువ ఆక్రమణలతో కనుమరుగు అవుతోంది. 70 ఫీట్ల వెడల్పుతో పట్టణంలోని మామిడిపల్లి, పెర్కిట్–కొటార్మూర్ మీదుగా వెళ్లే ఈ కాలువ ఉనికిని కోల్పోయింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువ 68వ డిస్ట్రిబ్యూటరీని కబ్జా అయింది. ఈ కాలువను ఆక్రమించి కొందరు వెంచర్లు వేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేసి ఏకంగా ప్రహరీలతో బిల్డింగ్లు నిర్మించారు. ఫలితంగా చిన్న వర్షం కురిస్తే జాతీయ రహదారి జలమయం అవుతోంది.సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలునగరంలో చాలా చోట్ల సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు లు వచ్చినా అక్రమార్కులకు పాల్పడుతున్న అధికారులను కాపాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో కిందిస్థాయి అధికారులు మాఫియా మాదిరిగా వ్యవహారాలు నడిపి రూ.కోట్లలో దండుకుంటున్నారు.చెరువుల్లో కబ్జాలుజిల్లాలోని పలు చెరువులు కబ్జా అయ్యాయి. నవీపేట దర్యాపూర్ చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఇందులో 5 ఎకరాల వరకు రియల్ స్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. నవీపేట మండలం మోకన్‌పల్లి చెరువులో 60 ఎకరాల శిఖం భూమిని కొందరు పట్టాలు చేసుకున్నారని గ్రామస్తులు గతంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. భీమ్‌గల్ రాధం చెరువు భూములు ఎన్నో ఏళ్లుగా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా చేసి అమ్మేశారు. ఇందల్వాయి చెరువు 80 ఎకరాలు కబ్జా అయింది. కొందరు ఈ ఆక్రమిత స్థలాల్లో డెయిరీ ఫామ్‌లు కట్టారు. నందిపేటలోని రఘునాథ చెరువు కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. -
ఏపీలో ‘చెర’వులు.. 2,032!
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధికంగా చెరువులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. అత్యధికంగా చెరువులు ఆక్రమణలకు గురైన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే అని కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1,13,425 చెరువులను పరిశీలించగా.. వాటిలో 2,032 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని తెలిపింది. దేశంలో నీటి వనరులపై మొదటి సారిగా కేంద్ర జల్ శక్తి శాఖ విస్తృతంగా అధ్యయనం చేసింది. 2018–19లో ప్రారంభమైన ఈ అధ్యయనం రెండేళ్ల పాటు కొనసాగింది. ఇటీవల అధ్యయనం వెల్లడైన అంశాలపై నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో చెరువులతో పాటు కుంటలు, రిజర్వాయర్లు, సరస్సులు(లేక్‌లు), చెక్‌డ్యామ్‌లు, ఊట కుంటలు వంటి మొత్తం 1,90,777 నీటి వనరులను పరిశీలించగా వాటిలో 3,920 కబ్జాకు గురైనట్లు తెలిపింది. కబ్జాకు గురైన వాటిలో 51.8 శాతం చెరువులేనని వెల్లడించింది. నీటి వనరులలో 75 శాతానికి పైగా ఆక్రమణకు గురైనవి 199 ఉండగా, 50 నుంచి 75 శాతం ఆక్రమణకు గురైనవి 186, 25 నుంచి 50 శాతం వరకు ఆక్రమణకు గురైనవి 249, 25 శాతం లోపు ఆక్రమణకు గురైనవి 1,828 ఉన్నట్లు చెప్పింది. నీటి వనరులు దేశవ్యాప్తంగా సగటున 1.6 శాతం ఆక్రమణకు గురైతే.. ఆంధ్రప్రదేశ్‌లో 2.06 శాతం కబ్జాకు గురయ్యాయని వెల్లడించింది. నీటి వనరుల ఆక్రమణలపై జల వనరుల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదులు వందల్లో ఉన్నాయని తెలిపింది. నిరుపయోగంగా ఉన్న నీటి వనరులు తక్కువేం కాదు.. రాష్ట్రంలోని నీటి వనరుల్లో 1,49,279 ఉపయోగంలో ఉన్నాయని, వీటిలో 8,475 కుంటలు, 1,03,952 చెరువులు, 60 సరస్సులు, 667 రిజర్వాయర్లు, 32,011 చెక్ డ్యామ్‌లు, ఊట కుంటలు, ఇతర వనరులు 4,114 ఉన్నాయని తెలిపింది. 41,498 నీటి వనరులు నిరుపయోగంగా ఉన్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. వీటిలో అత్యధికంగా చెరువులు 9,473 ఉండటం గమనార్హం. ఫీడర్ చానళ్లు (వంకలు, వాగులు) కబ్జాకు గురవడం వల్ల వర్షం నీరు చేరకపోవడంతో 9,473 చెరువులు ఎండిపోయి, నిరుపయోగంగా మారినట్లు చెప్పింది. ఇలా నిరుపయోగంగా మారిన చెరువులు ఏపీలోనే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఏటా పూర్తి స్థాయిలో నిండే నీటి వనరులు 79,320 ఉండగా.. సాధారణంగా నీటిని మళ్లించడం ద్వారా నిండేవి 18,198గా తెలిపింది. అరుదుగా నిండేవి 28,633, ఎప్పుడూ నిండని వనరులు 2,171 ఉన్నాయని పేర్కొంది. -
ఆక్రమణల పేరుతో పేదల ఇళ్ల కూల్చివేత
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తికి సమీపంలోని రాజీవ్ నగర్లో 2 రోజులుగా విధ్వంసకాండ కొనసాగుతోంది. శనివారం ఇళ్ల నిర్మాణానికి పేదలు వేసిన 27 పునాదులను తవ్వేసిన అధికారులు..నిర్మించిన మరో 24 ఇళ్లను ఆదివారం కూల్చివేశారు. పేదలు అడ్డుకుంటున్నా..జేసీబీలు పెట్టి కూలదోశారు. పట్టణానికి సమీపంలోని రాజీవ్‌నగర్ కాలనీలో వైఎస్సార్ హయాంలో 3,000 మంది పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు సేకరించి ప్లాట్లను కేటాయించారు. అదే స్థలంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ హయాంలో 6,000 ఇళ్లకు అపార్ట్మెంట్లు నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరో 2,000 ఇళ్లు జగనన్న కాలనీ పేరుతో అభివృద్ధి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు పక్కన పేదలు నిర్మించుకున్న ఇళ్లను, పునాదులను ఆక్రమిత భూములుగా చూపుతూ వైఎస్సార్సీపీ వారు ఎక్కువగా ఉన్నారనే దురుద్దేశంతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.ఏ ఈ విధమైన నోటీసులు లేకుండా తొట్టంబేడు తహశీల్దారు శివరాముడు ఆధ్వర్యంలో ధ్వంసం చేçÜ్తున్నారు. ఏడాది ముందు నుంచి నిర్మాణాలు జÆభుత్వం మారిందన్న సాకుతో కూల్చివేస్తున్నారు. దీనివెనుక శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి హస్తం ఉందని, ఆయన ప్రోద్భలంతోనే కూల్చివేస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు. అక్రమ కట్టడాలు అయితే కరెంటు మీటర్లను ఎందుకు ఇచ్చారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. -
ఆక్రమణలే అడ్డంకులు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్ జోన్లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్ఇంపోజ్) చేశారు. ఆక్రమణలే పెద్ద సవాల్.. మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్ జోన్లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిర్మితమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్‌ఘాట్ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్‌కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్‌లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచ్చినా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు. మూసీకి మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్ జోన్, ల్యాండ్ స్కేపింగ్, కమర్షియల్ జోన్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్ సిటీ రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల. మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
ఉత్తరాంధ్రపై రామోజీ ఉన్మాదం..
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది.. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి ఆ పార్టీ పరిస్థితి నానాటికీ పాతాళానికి పడిపోతోంది.. సానుభూతి పవనాలు ఎక్కడా లేవు.. పైగా అరెస్టును నిరసిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు మైలేజీ ఇవ్వలేకపోయాయి.. ఎన్ని జాకీలు పెట్టినా ఫలితం శూన్యం. దీంతో పచ్చగ్యాంగ్‌కు పిచ్చెక్కిపోతోంది. ఒకటే మార్గం కనిపిస్తోంది.. అదీ పదేళ్లకు పైగా చేస్తున్నదే.. ఎప్పటిలాగే జగన్‌ను టార్గెట్ చేయడం.. ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయడం. ఇంకేముంది.. రుషికొండపై జనం సొమ్ముతో జగన్ సోకులు అంటూ శుక్రవారం ఈనాడు తన పైశాచిక ఆనందాన్ని మరోసారి ప్రదర్శించి విశాఖపై తన అక్కసుకు అంతులేదని చాటుకుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటే ప్రభుత్వంపై తెగ విషం చిమ్ముతోంది. ప్రగతిని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని దిగజారుడు రాతలు రాస్తోంది. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కబ్జాలు చేస్తే కన్నెత్తి చూడని, పెన్నెత్తి రాయని రామోజీ.. ఇప్పుడు ఉన్మాదంతో వెర్రెక్కిపోతున్నారు. బోడిగుండు రాతలు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో ఈనాడుకు కంటిమీద నిద్ర కరువైంది. అందుకే తన మార్కు వక్రీకరణ రాగం అందుకుంది. రుషికొండ బోడిగుండయ్యిందంటూ అనుమతుల విషయంలో అసత్య ప్రచారం చేసింది. కానీ, ప్రభుత్వం రుషికొండపై నిర్మాణాలు చేస్తున్న విస్తీర్ణం, వాటికున్న అనుమతులు అంకెలతో సహా చెప్పేసరికి దిమ్మతిరిగింది. అయితే.. ఎన్నడూ నిజాలను అంగీకరించని ఈనాడు.. నిస్సిగ్గుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలకు పదును పెడుతూనే ఉంది. ఇంతలో సీఎం జగన్ విశాఖ కేంద్రంగా సమీక్షలు, సమావేశాలు చేయాల్సి ఉండటంతో, అక్కడ విడిది చేసేందుకు ముఖ్యమంత్రికి, అధికారులకు, ఇతర ప్రభుత్వ శాఖలకు అవసరమైన వసతి సదుపాయాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను గుర్తించే పనిలో ఉంది. ఇందులో భాగంగానే సీఎం క్యాంపు కార్యాలయం కోసం సరైన భవనాలను అన్వేషిస్తూ రుషికొండపై నిర్మాణాలను కూడా పరిశీలిస్తోంది. వాస్తవానికి అవి రిసార్టుల కోసం నిర్మించినవి కావడం, వాటిని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించాల్సి వస్తే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటివరకూ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, రుషికొండలో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనంటూ గుండెలు బాదుకుంటోంది. రుషికొండపై శాశ్వత భవనాల నిర్మాణం.. ఇక రుషికొండపై నిర్మిస్తున్నవి ప్రభుత్వ భవనాలే. అవి కూడా శాశ్వత భవనాలు. వాటిని టూరిజం ప్రాజెక్టులో భాగంగా పునర్మిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. దాదాపు ఈ భవనాలు ఇప్పుడు పూర్తికావొచ్చాయి. కానీ, వాటిని ప్రైవేటు భవనాలుగా, ప్రైవేటు వ్యక్తుల కోసం ఉచితంగా నిర్మిస్తున్నట్లు.. వేరెవరికో దోచిపెడుతున్నట్లుగా ఈనాడు రంకెలేస్తోంది. అవి ఎప్పటికీ ప్రభుత్వ భవనాలే అన్న విషయాన్ని దాచేందుకు నానాపాట్లు పడుతోంది. అందుకే రుషికొండలో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని, వాటిని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనాల ఖర్చుతో పోల్చి బొక్కబోర్లా పడింది. నిజానికి.. గత టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.6,070 మాత్రమే ఖర్చయిందంటూ దోపిడీని తక్కువచేసి చూపించింది. వాస్తవంగా అక్కడ చ.అ.కు అయిన ఖర్చు రూ.9,166. ఆ తర్వాత కూడా మరికొంత అదనంగా ఖర్చుచేశారు. ఈ మొత్తం కలుపుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంత ఖర్చుచేసినా అవన్నీ తాత్కాలిక భవనాలే. ఈ విషయాన్ని గత ప్రభుత్వమే చెప్పింది. కేవలం తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం చదరపు అడుగుకు ఎక్కడైనా ఇంత ఖర్చు చేస్తారా? పైగా ఈ భవన నిర్మాణాల్లో డొల్లతనం రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. వర్షం నీరు కారడం, గదుల్లోకి మురుగు పొంగడం, గోడలు బీటలు వారడం చూస్తే వాటి గొప్పతనం అర్థమవుతుంది. కబ్జాలను దగ్గరుండి ప్రోత్సహించలేదా? మరోవైపు.. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పేరుతో భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆధారాలు లేకుండా ఈనాడు క్షుద్ర రాతలు రాస్తోంది. కానీ, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ, బాలకృష్ణ వియ్యంకుడు తద్వారా చంద్రబాబుకు బంధువైన ఎంవీఎస్ మూర్తి ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలోనే ఏకంగా 38.60 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జాచేస్తే ఈనాడు కళ్లు మూసుకుని కూర్చుంది. పైగా ఈ కబ్జా జరిగింది ఎక్కడోకాదు.. రోజూ రుషికొండ చుట్టూ తప్పుడు కథనాలు అల్లుతున్న ప్రాంతానికి సరిగ్గా ఎదురుగానే. ఇంత జరుగుతుంటే అప్పట్లో చంద్రబాబు నోరు పెగల్లేదు.. రామోజీ పెన్ను కదల్లేదు. పైగా వారి కబ్జాలకు వత్తాసు పలికారు. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి విడిపిస్తోంది. ఇవి తొలగిస్తుంటేనే ఈనాడు దానిని అభివృద్ధి విధ్వంసంగా చిత్రీకరిస్తోంది. వాస్తవానికి ఈ ప్రభుత్వం రుషికొండలో మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను కలిపి మొత్తంగా 24.13 ఎకరాలను స్వా«దీనం చేసుకుంది. కోర్టు స్టేతో మిగిలిన భూముల స్వా«దీన ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. అభివృద్ధిపైనా ఈనాడు అక్కసు.. ఇక రుషికొండకు సమీపంలో హెలీప్యాడ్, రుషికొండ చుట్టూ గ్రావెల్ రోడ్డు 2019కి ముందే ఉన్నాయి. కానీ, ముఖ్యమంత్రి విలాసాల్లో భాగంగా వీటిని నిర్మించారంటూ ఈనాడు కలరింగ్ ఇచ్చింది. తాజాగా.. టూరిజం ప్రాజెక్టులో భాగంగా ఈ రోడ్డు మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. చివరికి ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధిని కూడా ఈనాడు జీర్ణించుకోలేకపోతోంది. ఒక ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేటప్పుడు.. ప్రజల నివాసాలు వస్తున్న కొద్దీ కరెంటు, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తారు. ఇది ఏ ప్రభుత్వమైనా చేసేదే. కానీ, ఈనాడుకు మాత్రం వంకరగా కనిపిస్తోంది. ఎందుకంటే.. రామోజీ బుద్ధే వక్రబుద్ధి కాబట్టి!. ప్రభుత్వ భవనాల్లో ఎక్కడైనా ఉండొచ్చు.. రుషికొండపై సీఎం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేస్తే ఏదో తప్పన్నట్లుగా, చట్టవిరుద్ధమైనట్లు ఈనాడు పెడ»ొబ్బలు పెడుతోంది. విశాఖపట్నం పక్క దేశంలోనో, శత్రుదేశంలోనో ఉన్నట్లు చిత్రీకరిస్తోంది. అసలు రుషికొండలో ఉన్నవన్నీ ప్రభుత్వ భవనాలేనన్న పచ్చి నిజాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోంది. వాస్తవానికి.. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి రాజ్యాంగబద్ధంగా ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. ఈ నిజాన్ని ఈనాడు అంగీకరించదు. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఆక్రమణదారుల చెరలో 38,496 చెరువులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నగరాలు, పట్ణణాలు, పల్లెలు.. ఇవేమీ తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు.. ఫలితంగా వేల సంఖ్యలో జలవనరులు కనుమరుగవుతున్నా యి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చినవాటి లో కొన్ని ఆక్రమణలపాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారాయి. ఇటీవల కేంద్ర మైనర్ ఇరిగేషన్ స్టాటిస్టిక్స్ విభాగం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ‘ఇరిగేషన్ సెన్సెస్’నిర్వహించింది. అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరి కొన్ని ప్రమాదంలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఓరుగల్లు చెరువులు ఎంతెంత పోయాయంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలతో కుచించుకు పోయాయి. 100 ఎకరాలకుపైగా ఉండే చిన్నవడ్డేపల్లి చెరువు సుమారు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖనే తేలి్చంది. మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకుగాను సుమారు 40 ఎకరాలు, 126 ఎకరాల్లో విస్తరించి ఉన్న పాతబస్తీ ఉర్సు రంగ సముద్రం (ఉర్సు చెరువును) సుమారు 26 ఎకరాలు, హనుమకొండ హంటర్‌రోడ్ న్యూశాయంపేటలో 150 ఎకరాల విస్తీర్ణంలోని కోటి చెరువులో సుమారు 25–30 ఎకరాల వరకు ప్రైవేటుపరమయ్యాయి. హన్మకొండ, కాజీపేట ప్రాంతవాసుల తాగునీటి అవసరాలు తీర్చే హన్మకొండ వడ్డేపల్లి చెరువులో 40 ఎకరాలకు వరకు, 336 ఎకరాల భద్రకాళి చెరువులో సుమారు 40 ఎకరాల పైచిలుకు కనుమరుగైందని అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఆక్రమణకు గురైనవి 3,032 దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్ననీటి వనరులు కుచించుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 38,496 చెరువులు, ట్యాంకులు, సరస్సులు తదితర చిన్ననీటి వనరులు ఆక్రమణకు గురికాగా, సుమారు 14,535 చోట్ల ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కాగా అత్యధికంగా ఆక్రమణలకు గురైన ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 64,056 చిన్ననీటి వనరుల్లో 3,032 ఆక్రమణలకు గురైనట్లు నివేదిక తేల్చింది. ఈ 3,032 చెరువుల్లో ఎక్కువ హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు సెంటిమీటర్ల వాన పడితే నగరం మునుగుడే కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు వరంగల్ నగరం చుట్టూ ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల వల్ల గొలుసుకట్టు చెరువుల సిస్టం దెబ్బతిని ఐదు సెంటిమీటర్ల వర్షం పడితే చాలు నగరం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆక్రమణలను నియంత్రించకపోతే ఆ చెరువులు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది. – చీకటి రాజు, రాష్ట్ర కన్వీనర్, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ లోకాయుక్తలో విచారణ జరుగుతోంది వరంగల్‌లో 8కి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటన్నింటిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. భద్రకాళీ సహా అన్ని చెరువుల ఆక్రమణపై లోకాయుక్త కోర్టులో చేసిన ఫిర్యాదులపై తదుపరి విచారణ 2024 జూన్ 23న ఉంది. – సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు, వినియోగదారుల మండలి చెరువుల ఆక్రమణలపై నోటీసులు వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై వచి్చన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మా దృష్టికి వచి్చన వాటిని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాము. పోలీసు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశాం. – ఎ.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ, జలవనరులశాఖ చదవండి: ‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై! -
తెలంగాణలో 64,056 జల వనరులు
తెలంగాణలో మొత్తం 64,056 జల వనరులు ఉన్నాయని.. వీటిలో 98.5% (63,064) గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 1.5% (992) పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన తొలి జల వనరుల సెన్సస్ నివేదిక వెల్లడించింది. 80.5% (51,593) జల వనరులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండగా, 19.5% (12,463) ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. 17.3% (11,076) జల వనరులు ‘కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం’కింద, 10.6% (6,781) గిరిజన ప్రాంతాల్లో, మిగిలిన 72.1% (46,199) వరద పీడిత ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేగాక 64,056 జల వనరుల్లో 80.8% (51,733) వాడుకలో ఉండగా, 19.2% (12,323) ఎండిపోవడం, పూడిక తీయకపోవడం, మరమ్మతు చేయలేని విధంగా నాశనం కావడం, లవణీయత ఇతర కారణాల వల్ల ఉపయోగంలో లేవని నివేదికలో వెల్లడించారు. – సాక్షి, న్యూఢిల్లీ నిండిన స్థితిలో 43,695 జల వనరులు రాష్ట్రంలో 10,170 సహజసిద్ధమైన, 53,886 మానవ నిర్మిత జల వనరులు ఉన్నాయి. సహజ జల వనరుల్లో 96.2% (9,781) గ్రామీణ ప్రాంతాల్లో, 3.8% (389) పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మానవ నిర్మిత జల వనరుల్లో 98.9% (53,283) పల్లెల్లో, 1.1% (603) పట్టణాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 64,056 జల వనరుల్లో 43,695 వనరులు ‘నిండిన నిల్వ సామర్థ్యం’/ ’నిండిన స్థితి’కలిగి ఉన్నాయి. గత ఐదేళ్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడం లాంటి ప్రమాణాల ఆధారంగా ఈ 43,695 వనరుల్లో 20.3% (8,862) ప్రతి ఏటా నిండుతున్నట్లు గుర్తించారు. 41.9% (18,301) సాధారణంగా నిండుతుండగా, 29.8% (13,033) చాలా అరుదుగా నిండుతున్నాయని, 8.0% (3,499) ఎప్పుడూ నిండట్లేదని నివేదికలో వెల్లడించారు. మొత్తమ్మీద 38,540 వనరులు జిల్లా నీటిపారుదల ప్రణాళిక/రాష్ట్ర నీటిపారుదల ప్రణాళికలో ఉన్నాయి. వీటిలో 45.9% (17,681) చెరువులు కాగా, 54.1% (20,859) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, నీటి సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి. 1,540 చెరువులు, 1,492 ట్యాంకులు, సరస్సుల్లో ఆక్రమణలు రాష్ట్రంలోని 3,032 జల వనరుల్లో ఆక్రమణలను గుర్తించారు. వాటిలో 50.8% (1,540) చెరువులు, 49.2% (1,492) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, జల సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి. వీటిలో 3,032 ఆక్రమణకు గురైన జల వనరులు, 2,028 జల వనరుల్లో ఆక్రమణ ప్రాంతాన్ని అంచనా వేశారు. ఈ 2,028 వనరులకుగాను 1,415 జల వనరుల్లో 25% కంటే తక్కువ విస్తీర్ణంలో ఆక్రమణలకు గురవుతున్నాయని, 402 జలవనరులు 25%–75% మధ్య ఆక్రమణ కలిగి ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. మిగిలిన 211 జల వనరులు 75% కంటే ఎక్కువ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 64,056 జల వనరుల్లో 63,769 వనరుల్లో ‘జల వ్యాప్తి ప్రాంతం’నివేదించారు. వీటిలో 51.6% (32,914) జల వనరులు 0.5 హెక్టార్ల కంటే తక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నాయి. అయితే 1.8% (1,166) జల వనరులు 50 హెక్టార్ల కంటే ఎక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. -
Fact Check: ప్రహరీలు తొలగిస్తే ఇళ్లు కూల్చినట్టా?
సాక్షి, అమరావతి: ఆక్రమణలు పెరిగి రోడ్లు ఇరుకైపోవటంతో మంగళగిరి– తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని రోడ్ల వెంట ఉన్న ఆక్రమణలను తొలగించే పని రెండేళ్ల కిందటే మొదలుపెట్టారు. గత జనవరికల్లా పూర్తి చేశారు. తరువాత రూరల్ ప్రాంతంలోని ఆర్ అండ్ బీ రోడ్ల ఆక్రమణలపై చర్యలకు దిగారు. దాన్లో భాగంగానే ఇప్పటం గ్రామ పరిధిలో 75– 80 అడుగుల మేర ఉండాల్సిన ఆర్ అండ్ బీ రోడ్డును ఇరువైపులా 10 అడుగుల మేర ఆక్రమించి ప్రహరీలను నిర్మించుకున్నట్లు గుర్తించారు. ఇలా 54 మంది రోడ్డు ఆక్రమించినట్టు గుర్తించి జనవరిలో మార్కింగ్ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో రెండుసార్లు నోటీసులిచ్చారు. అనంతరం ఆక్రమణల తొలగింపును ఆరంభించారు. ఆత్మకూరు– పెద వడ్లపూడిలో తొలగింపు పూర్తయ్యింది కూడా. ఇదీ.. వాస్తవం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు రూ.3 కోట్లతో ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పనులు చేయటంతో పాటు గత నెలలో మరో రూ.6 కోట్లను ఈ గ్రామానికి కేటాయించిందనేది కూడా కాదనలేని నిజం. తొలగింపులో భాగంగా రెండు రోజుల కిందట దాదాపు 25 మంది ఇళ్ల ప్రహరీలను తొలగించగా సంబంధింత యజమానులు సైతం సహకరించారు. ఇందులో వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు లచ్చి వెంకటేశ్వరరావు గౌడ్‌తో పాటు పార్టీ కార్యకర్తల ఇళ్ల ప్రహరీలూ ఉన్నాయి. కానీ, శుక్రవారం చివరి నాలుగు ఇళ్ల ప్రహరీలను తొలగిస్తుండగా జనసేన నాయకులు గొడవకు దిగారు. తాము జనసేనకు సహకరిస్తున్నందుకే ఇళ్లు కూలుస్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన వారి ఇళ్లను టార్గెట్ చేసి కూల్చివేస్తున్నారని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... ♦ఇప్పటం గ్రామంలోని ఆర్ అండ్ బీ రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణలను జనవరిలో మార్కింగ్ చేశారు. ఆ తరువాత ఏప్రిల్, మే నెలల్లో నోటీసులిచ్చారు. ♦తొలగిస్తున్నవి కేవలం రోడ్డును ఆక్రమించుకుని ఉన్న ప్రహరీలే. కానీ జనసేన ప్రచారం చేస్తున్నట్లుగా ఎవ్వరి ఇళ్లనూ కూల్చేయలేదు. ♦ప్రహరీలు తొలగింపునకు గురైన వారిలో వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు లచ్చి వెంకటేశ్వరరావు గౌడ్, పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ♦జనసేన ప్లీనరీ మార్చి నెలలో ఇప్పటం గ్రామంలో జరిగింది. ఆనాడు పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలిస్తానని ప్రకటించారు కానీ ఇప్పటిదాకా రూపాయి కూడా ఇవ్వలేదు. ♦ప్రకటించిన డబ్బులివ్వాలని స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అడగటంతో జనసేన నేతలు సాకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు పథకం పన్నారు. ♦ఇప్పుడు ప్రహరీలు తొలగిస్తుంటే రాజకీయం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్... 2016లో కృష్ణా పుష్కరాల కోసమని తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం, బోట్ యార్డు, ఎన్టీఆర్ కరకట్ట, క్రిస్టియన్‌పేట తదితర ప్రాంతాల్లో 325 ఇళ్లను నాటి టీడీపీ ప్రభుత్వం తొలగించినపుడు నోరు మెదిపితే ఒట్టు. -
ఆ స్థలాల్లో ఆక్రమణలు తొలగించండి
సాక్షి, అమరావతి: పార్కులు, పబ్లిక్ రోడ్లు, ఇతర ప్రజోపయోగ స్థలాల ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్రమణలు తొలగించేటప్పుడు ఆక్రమణదారులకు షోకాజ్ నోటీసు జారీచేసి వారి వాదన వినాలని అధికారులకు హైకోర్టు స్పష్టంచేసింది. ఆ తర్వాతే వారిని ఖాళీచేయించే విషయంలో ఉత్తర్వులు జారీచేయాలని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం తీర్పు వెలువరించింది. పార్కులు, రోడ్లు తదితర ప్రజోపయోగ స్థలాల ఆక్రమణలపై హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పంచాయతీ, పురపాలక, అటవీ, రెవెన్యూ భూములను ఆక్రమించుకున్న వారిని ఆ భూముల నుంచి ఖాళీచేయించాలంటూ బుధవారం ఇచ్చిన ఆదేశాలను ఈ వ్యాజ్యాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది (రెవెన్యూ) పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి స్పందిస్తూ.. నాలాలు, కాలువలు పెద్ద సంఖ్యలో ఆక్రమణలకు గురై ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వర్షాకాలంలో మనకు బెంగళూరు, హైదరాబాద్ వంటి పరిస్థితి రాకూడదంటే నాలాలు, కాలువలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. నిజమే.. హైదరాబాద్, బెంగళూరు వంటి పరిస్థితి రాకూడదన్న ధర్మాసనం, ఆక్రమణల తొలగింపు ఉత్తర్వుల్లో నాలాలు, కాలువలను కూడా చేరుస్తామని తెలిపింది. వీటి తొలగింపు విషయంలో పంచాయతీ, పురపాలక శాఖ అధికారులకు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తారిని సుభాష్ చెప్పారు. ఈ వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. -
బ్లాక్‌ల వారీగా గుర్తింపు.. ఇక కూల్చివేతలే!
సాక్షి, హైదరాబాద్: సుందరీకరణలో భాగంగా మూసీ నది తీరప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరీవాహక ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ సర్వే ద్వారా బ్లాక్‌ల వారీగా ఆక్రమిత నిర్మాణాలను గుర్తించింది. మండలాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసి అక్రమ నిర్మాణాల జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తోంది. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి సమగ్రంగా పరిశీలించనుంది. అనంతరం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అక్రమ నిర్మాణాలను తొలగింపునకు మార్గం సుగుమమం చేసుకుంటోంది. రెండున్నరేళ్ల క్రితమే.. ► నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతంలో ఆరు వేలకుపైగా ఆక్రమణ నిర్మాణాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్ అథారిటీ సంయుక్తంగా సర్వే నిర్వహించి సుమారు ఆక్రమణల సంఖ్య 8,529 పైనే ఉన్నట్లు తేల్చారు. ఇందుకు అప్పట్లో తొమ్మిది బృందాలు రంగంలో దిగి మూసీ నది పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయి. ► మండలాల వారీగా మూసీ నది మొత్తం, పొడవు, ఆక్రమణల ఫొటోలు, వీడియోగ్రాఫ్‌లతో పాటు కేటగిరీల వారీగా పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. పరీవాహక ప్రాంతాంలో మండల వారీగా ఆక్రమణల సంఖ్య పరిశీలిస్తే.. ఆసిఫ్‌నగర్ మండలంలో ఆక్రమణల సంఖ్య 667, అంబర్‌పేట పరిధిలో 989, బహదూర్‌పురా 4,225, చార్మినార్ 73, గోల్కొండ 517, హిమాయత్‌నగర్ 499, నాంపల్లి 658, సైదాబాద్ పరిధిలో 902 ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వే మరోసారి.. మూసీ సుందరీకరణ వైపు వేగంగా అడుగులు పడుతుండటంతో ఆక్రమణలను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మరోసారి సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, చార్మినార్, నాంపల్లి, హిమాయత్‌నగర్, సైదాబాద్, అంబర్పేట్ మండలాల్లో పూర్తయింది. మొత్తం మీద నదిలో 978, బఫర్‌జోన్‌లో నదికి ఇరువైపులా 5,501 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. (క్లిక్: తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’) ఇరువైపులా 50 మీటర్ల పరిధి.. మూసీ ఒడ్డు నుంచి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్లో గుర్తించిన నిర్మాణాలను కూల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రత్యేక నోటీఫికేషన్ల ద్వారా ఆక్రమణల వివరాల జాబితాలను ప్రకటించి వాటిని ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీసులు, పీఎస్‌లు, మున్సిపల్, సంబంధిత ప్రభుత్వ ఆఫీసుల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అభ్యంతరాలుంటే సరైన డాక్యుమెంట్లతో పక్షం రోజులుగా సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులో తెలియజేసేలా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆ తర్వాత ఏకకాలంలో పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టనుంది. (చదవండి: భ్రాంతిగా మారిన తెలంగాణ సంపర్క్ క్రాంతి) -
చెరువులు మింగేసి... ఊరు మునకేసి..
వరద వెళ్లిపోవాలంటే కాల్వలు కావాలి.. వాటిని పూడ్చేసి ఇళ్లు నిర్మిస్తే..? నీరు నిల్వ కావాలంటే చెరువులు ఉండాలి.. వాటిలో కాలనీలు కట్టేస్తే..? మరి వాన నీళ్లన్నీ ఎటు పోవాలి? ఎటూ పోలేకనే.. వరద రోడ్ల మీద పారుతోంది.. కాలనీల్లో ప్రవహిస్తోంది.. ఇళ్ల్లను ముంచెత్తుతోంది.. ఎనలేని నష్టాన్ని మిగుల్చుతోంది! ఇలా కాల్వలు, చెరువులు, కుంటలు ఆక్రమణల పాలవడం వల్లే.. చిన్న వానకే నగరాలు, పట్టణాలు వణికిపోతున్నాయి. ఒకటీరెండు చోట్ల కాదు.. రాష్ట్రంలోని చాలా నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. వివిధ పార్టీల నేతలు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ఎక్కడికక్కడ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నాలాలను, చెరువులను పూడ్చేస్తున్నారు. ఆయా చోట్ల వెంచర్లు వేసి కాలనీలు కట్టేస్తున్నారు. అక్కడ ఇళ్లు కొనుక్కుంటున్న సాధారణ జనం ఆగమాగం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఆగస్టులో, ఈ ఏడాది జూలైలో, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తి చాలా పట్టణాలు అస్తవ్యస్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు పట్టణాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. చెరువులు, నాలాల ఆక్రమణలు, వాటివల్ల ఉత్పన్నమైన పరిస్థితిని గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. –సాక్షి నెట్వర్క్ ఇది సిరిసిల్ల పట్టణ శివార్లలో కరీంనగర్ వెళ్లే రోడ్డులో ఉన్న కొత్త చెరువు. ఆధునీకరణ పేరిట చెరువును సగం మేర పూడ్చి.. పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. రాజీవ్‌నగర్, జేపీ నగర్, ముష్టిపల్లి, చంద్రంపేట పరిసరాల నుంచి వచ్చే వరదను కొత్త చెరువులోకి మళ్లించారు. ఓవైపు చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, మరోవైపు వరద చేరిక పెరిగిపోయి.. కాస్త గట్టివాన పడితే మత్తడి దూకుతున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా శాంతినగర్ ప్రాంతం జల దిగ్బంధం అవుతోంది. ఇక కొత్త చెరువులోకి మురికినీరు చేరకుండా ఉండాలని మురికినీటి శుద్ధి (ఈటీపీ) ప్లాంటును ఏర్పాటు చేశారు. అది లోపభూయిష్టంగా ఉండటంతో మురికినీరు సిరిసిల్ల పట్టణ వీధులను ముంచెత్తుతోంది. కొత్తచెరువు మత్తడి నీళ్లు వెళ్లేందుకు గతంలో కాల్వ ఉండేది. దాన్ని కొందరు కబ్జా చేసి, ఇళ్లు, ఇతర సముదాయాలు నిర్మించారు. దీనితో మత్తడి వరద రోడ్డుపై ప్రవహిస్తూ.. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. నిర్మల్ బస్టాండ్ పక్కనే ఉన్న ధర్మసాగర్ చెరువులో వాకింగ్ ట్రాక్ పేరిట ఏర్పాటు చేసిన కట్ట ఇది. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామంటూ పోసిన ఈ కట్ట.. చెరువు ఎఫ్టీఎల్ మధ్యలోనే ఉండటం గమనార్హం. దీని అవతల మరింత చెరువు, ఎఫ్టీఎల్ పరిధి భూములు ఉన్నాయి. కానీ ఆ భూములు చెరువు పరిధిలోవి కావని, ఎఫ్టీఎల్ పరిధి ఆ కట్ట వద్దే ముగిసింది అన్నట్టుగా చూపుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రముఖుల భూములు ఉండటంతోనే.. ఇలా కట్ట నిర్మించారన్న ఆరోపణలున్నాయి. కొందరు పెద్దలు చెరువుల సమీపంలోని భూములను కొనుగోలు చేస్తూ.. మెల్లగా చెరువుల భూములను చెరబడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. చెరువు మధ్యలో రోడ్డు.. నీళ్ల మధ్యలోకి వెళ్తున్నట్టుగా ఉన్న ఈ రోడ్డు.. ఖమ్మం పట్టణశివార్లలోని ఖానాపురం చెరువులోనిది. ఖమ్మం కార్పొరేషన్‌గా మారినప్పుడు శివార్లలోని ఖానాపురం హవేలి పంచాయతీని విలీనం చేశారు. నాటి నుంచే ఇక్కడి చెరువుపై ఆక్రమణ దారుల కన్ను పడింది. ఖానాపురం చెరువు పూర్తి విస్తీర్ణం సుమారు 133 ఎకరాలు. సర్వే నంబర్ 13లో 75.23 ఎకరాల మేర చెరువు ఉండగా.. ఎఫ్టీఎల్ పరిధిలోని 57.17 ఎకరాల్లో పట్టా భూములు ఉన్నాయి. గతంలో ఈ చెరువు ద్వారా 200 ఎకరాలకు సాగునీరు అందేది. ఇప్పుడు ఆక్రమణలు పెరిగి కుంచించుకుపోతోంది. ప్రధాన చెరువులోనే రెండెకరాల వరకు కబ్జాలుకాగా.. ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. నిజానికి చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలోని భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఓ రియల్ వెంచర్‌కు దారి కోసం ఇటీవల చెరువు మధ్యలోంచి మట్టిరోడ్డు వేశారు. జనం ఫిర్యాదులు చేయడంతో అధికారులు దానిని తవ్వించేశారు. ఇలాంటి ఆక్రమణలు మరెన్నో ఉన్నాయని స్థానికులు అంటున్నారు. వరంగల్ శివనగర్‌లో కబ్జాల పాలై ఇరుకుగా మారిపోయిన శివనగర్ నాలా ఇది. ఇదొక్కటే కాదు. వరంగల్‌లో ప్రధాన నాలాలు అయిన నయీంనగర్ నాలా, బొందివాగు నాలా సహా అన్నీ కూడా ఆక్రమణలతో కుదించుకుపోయాయి. దీనితో భారీ వర్షాలు పడినప్పుడు వరద అంతా రోడ్ల మీద ప్రవహిస్తోంది. ఇది హన్మకొండలోని గోపాల్పూర్ ప్రాంతం. నిండుగా ఇళ్లతో కనిపిస్తున్న ఇక్కడ 25 ఏళ్ల కింద ఓ చెరువు ఉండేది. ఇదొక్కటే కాదు గోపాలపురం, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఆరు చెరువులు ఆక్రమణల పాలయ్యాయి. మెల్లగా నిర్మాణాలు వెలుస్తూ.. ఇప్పుడు చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. దీంతో వానలు పడ్డప్పుడల్లా కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ‘గొలుసుకట్టు’తెంపేశారు! రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్ ప్లాన్‌లో చూపించారు. ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు నామ్కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఒక్క వానతో ఆగమాగం గత ఏడాది ఆగస్టులో వరంగల్‌లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది. దీంతో అధికారులు వరంగల్‌లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. కేటీఆర్ ఆదేశించినా.. గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్ ప్లాన్‌లో చూపించారు. ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు నామ్కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఒక్క వానతో ఆగమాగం గత ఏడాది ఆగస్టులో వరంగల్‌లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది. దీంతో అధికారులు వరంగల్‌లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. కేటీఆర్ ఆదేశించినా.. గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి. హన్మకొండ హంటర్‌రోడ్ న్యూశాయంపేట లో 150 ఎకరాల కోమటి చెరువులో సుమా రు 15–20 ఎకరాలు కబ్జాల పాలైంది. ► కాజీపేట బంధం చెరువు 57 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ఇప్పుడు సగమే మిగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నా.. కార్పొరేషన్ వారు ఇంటి నంబర్లు ఇస్తున్నారు. ► హన్మకొండ వడ్డేపల్లి చెరువు 324 ఎకరాలు ఉంటుంది. ఇందులో సుమారు 40 ఎకరాల స్థలం అన్యాక్రాంతమైంది. ► గొర్రె కుంట కట్టమల్లన్న చెరువు 21.24 ఎకరాలు ఉండేది. ఇందులో ఎనిమిది ఎకరాల దాకా ఆక్రమణల పాలైంది. చెరువులోనే భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ► వరంగల్‌కు కీలకమైన భద్రకాళి చెరువు విస్తీర్ణం 336 ఎకరాలుకాగా.. 30 ఎకరాలు ఇప్పటికే కబ్జా అయినట్టు అంచనా. ► హాసన్పర్తి పెద్దచెరువు 157 ఎకరాలు ఉండాలి. ఇటీవల కొందరు.. పట్టాభూమి పేరుతో చెరువు పరిధిలోని 30 ఎకరాలను చదును చేయడం వివాదాస్పదమైంది. ► ములుగు రోడ్‌లోని కోట చెరువు 159 ఎకరాల విస్తీర్ణం ఉండేది. సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు రెవెన్యూ శాఖ తేల్చింది. ► చిన్నవడ్డేపల్లి చెరువు విస్తీర్ణం 100 ఎకరాలుకాగా.. 20 ఎకరాల వరకు ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ► 170 ఎకరాల మామునూరు పెద్ద చెరువు లో 40 ఎకరాలు ప్రైవేటు చెరలోనే ఉంది. ► పాతబస్తీ ఉర్సు రంగసముద్రం (ఉర్సు చెరువు) 126 ఎకరాల్లో ఉండగా.. సుమారు 26 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది. ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు సాగుతున్నాయి. ► అమ్మవారిపేట దామెర చెరువు విస్తీర్ణం 134 ఎకరాలు. ఇక్కడ రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు 20 ఎకరాల వరకు మాయమైంది. ► తిమ్మాపూర్ శివారు బెస్తం చెరువును స్మృతి వనంగా మార్చే ప్రతిపాదన ఉంది. 6 ఎకరాల విస్తీర్ణం ఉండే ఈ చెరువులో.. సగం దాకా ఆక్రమణలోనే ఉంది. వరంగల్ పెరకవాడలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి సోదరుడు నాలాపైనే కట్టిన భవనం ఖమ్మం.. ఆక్రమణలకు గుమ్మం ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు పరిస్థితికి అద్దం పడుతున్న చిత్రాలివి. 2006 నాటితో పోలిస్తే.. ప్రస్తుతం చెరువు ఎంతగా కుంచించుకుపోయిందో ఈ ఫొటోల్లో స్పష్టంగా తెలిసిపోతుంది. నిజానికి ఈ చెరువు పూర్తిస్థాయి విస్తీర్ణం 163 ఎకరాలు. పాకబండ బజార్, ఖానాపురం హవేలీ రెవెన్యూ పరిధిలోని 66, 234 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న ఈ చెరువులో ఆరేడు ఎకరాలకు పైనే కబ్జాల పాలైంది. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాదు ప్రభుత్వ భవనాలు కూడా చెరువు భూముల్లో వెలిశాయి. కొందరు చెరువుల పక్కనే ఉన్న భూములు కొని, ఆ సర్వే నంబర్లతోనే చెరువు భూములకు పట్టాలు చేయించుకున్నారు. తీరా ఇన్నేళ్ల ఆక్రమణలను కూల్చేందుకు అధికారులు వెళ్తే.. కోర్టు నుంచి తెచ్చుకున్న స్టేలు, తామే హక్కుదారులమంటూ పత్రాలు చూపిస్తుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. భూముల రేట్లు పెరిగి.. కబ్జాదారుల కన్నుపడి ఖమ్మం పట్టణం 2012 అక్టోబర్‌లో కార్పొరేషన్ హోదా పొందింది. అప్పటి నుంచి పట్టణం విస్తరణ, భూముల రేట్లు బాగా పెరిగాయి. పట్టణంలోని లకారం చెరువు చుట్టుపక్కల చదరపు గజం రూ.30 వేలకుపైనే పలుకుతుండటంతో కబ్జా దారుల కన్ను పడింది. మెల్లమెల్లగా ఆరేడు ఎకరాలకుపైనే ఆక్రమణలు వెలిశాయి. గతంలో చెరువు పరిధిలో భూమిని లీజుకు ఇచ్చిన ఉద్దేశం కూడా మూలకుపడి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. చివరికి 2015లో చెరువు ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఆక్రమణలు ఆగాయి. కానీ ఇప్పటికే కబ్జాల పాలైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనికితోడు చెరువుల్లోని నీళ్లు వెళ్లే కాల్వలు, నాలాలు కూడా కబ్జా కావడంతో.. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇండ్లు నీట మునుగుతున్నాయి. నిర్మల్.. కబ్జాల ఖిల్లా! నిర్మల్ జిల్లా కేంద్రం చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. 450 ఏళ్ల క్రితమే కాకతీయుల స్ఫూర్తితో స్థానిక పాలకుడు నిమ్మనాయుడు, ఆయన తర్వాతివారు వీటిని తవ్వించారు. ప్రస్తుతం 11 చెరువులు ఉనికిలో ఉండగా.. దాదాపు అన్నింటిలో ఆక్రమణలు ఉన్నాయి. ఈ చెరువుల మధ్య నీళ్లు తరలిపోయే కాల్వలు కూడా కబ్జాల పాలయ్యాయి. ఈ కారణంగానే భారీ వర్షాలు పడ్డప్పుడల్లా చెరువుల్లోకి చేరాల్సిన నీళ్లు.. కాలనీలు, ఇండ్లను ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది జూ లైలో భారీ వర్షాలతో పలు చెరువులు పూర్తిగా నిండాయి. సమీప కాలనీలు నీట మునిగాయి. కొందరు పట్టాభూములుగా చెప్పుకొంటున్న భూములు కూడా ఇప్పటికీ చెరువు నీటిలో మునిగే ఉన్నాయి. అవన్నీ ఆక్రమణలేనని.. అధికారులు పట్టించుకోకున్నా వానలతో బయటపడిందని స్థానికులు అంటున్నారు. నిజానికి నిర్మల్ గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై స్థానిక న్యాయవాది ఒకరు మూడేళ్ల కిందటే హైకోర్టులో పిల్ వేశారు. దానిపై కొద్దినెలల కింద జరిగిన విచారణ సందర్భంగా.. చెరువుల ఆక్రమణలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను గుర్తించి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దాంతో కొంతమేర తొలగింపు చేపట్టినా.. ఇంకా భారీగా కబ్జాలు అలాగే ఉన్నాయి. ఆక్రమణలపై టాస్క్‌ఫోర్స్ వేశాం ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలు, ఇతర నీటివనరుల ఆక్రమణలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఎక్కడికక్కడ పరిశీలన జరిపి.. కేసులు పెడుతున్నాం. పూర్తిస్థాయి నివేదికలు సిద్ధమయ్యాక ప్రభుత్వానికి అందజేస్తాం. – శంకర్‌నాయక్, సీఈ, జలవనరుల శాఖ, ఖమ్మం చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. ► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్‌లు మునుగుతున్నాయి. ►మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. ► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్‌లు మునుగుతున్నాయి. ► మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. చదవండి: GHMC: కోటికి చేరువలో టీకా -
పేదల గుడిసెలు కూల్చడం తగదు
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి నెల్లూరు(బారకాసు): నెల్లూరునగరంలో అక్రమ కట్టడాల పేరుతో పేదల గుడిసెలు కూల్చడం సరికాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా కాలువ గట్లుపై నివాసాలుంటున్న పేదలను తక్షణమే ఖాళీ చేయాలని లేకుంటే తమ గుడిసెలను కూల్చేస్తామంటూ వారిని ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. వరదలొస్తే ఇబ్బందులు జరగుతాయని పేదల గుడిసెలు తొలగించాలన్న ఆలోచనకు ముందు వాటి నుంచి రక్షించుకునే ప్రయత్నాలు ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. నగరంలో ఉన్న పంటకాలువల్లోని పూడికలు తీయడం, జాఫర్‌సాహెబ్, సర్వేపల్లి కాలువల్లోని గుర్రపుడెక్కలను ముందుగానే తొలగించ కుండా నిర్లక్ష్యం చేసి నేడు పేదలపై తమ ప్రతాపం చూపడం ఎంత వరకు సబబు అన్నారు. ప్రత్యామ్నాయం చూపించిన తరువాతనే గుడిసెలను తొలగించాలని సూచించారు. సమావేశంలో ఆపార్టీ నేతలు మద్దు శ్రీనివాసులు, నారాయణ, శ్రీనివాసులురెడ్డి, మాల్యాద్రి, సుధాకర్‌రెడ్డి, రాధాకృష్ణ, భాస్కర్, కప్పిర శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నాలాలపై ఆక్రమణలు తొలగించాలి
అందులో పేదలుంటే ప్రత్యామ్నాయం చూపండి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపాలి ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్ హన్మకొండ అర్బ¯ŒS : నగరంలో నాలాల అక్రమణల వల్ల తీవ్ర నష్టం జరుతోందని, ఈ విషయంలో అధికారులు ఉపేక్షించకుండా ఆక్రమణలు తొలగించాలని ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్ ఆదేశించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాకు ఆయనను ప్రత్యేకాధికారిగా ప్రభు త్వం నియమించింది. దీంతో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ నాలాల అక్రమణల వల్ల జరిగే నష్టం తీవ్రంగా ఉంటోందని అన్నారు. ఆక్రమితుల్లో పేదలు ఉంటే వారికి ప్రభుత్వ పరిధిలో ప్రత్యామ్నా యం చూపించాలని అన్నారు. జిల్లాలో భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని శాఖల వారీగా అంచనా వేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదిక ఇవ్వాలన్నారు. పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితి ఏర్పడేంతవరకూ సహాయక చర్యలు కొనసాగించాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు. రోడ్లు దెబ్బతిన్న చోట తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని, లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు. వ్యాధులు ప్రబలే ప్రమా దం ఉన్నం దున వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జేసీ ప్రశాంత్ జీవ¯ŒSపాటిల్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలకు ఒక వీఆర్వోతోపాటు మొత్తం నలుగురు మృతిచెందారని తెలిపారు. పునరావాస కేం ద్రాల్లో భోజన సదుపాయం కోసం పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో రెండు ప్రధాన నాలాలు అక్రమణకు గురయ్యాయని చెప్పారు. సమావేశంలో డీఆర్వో శోభ, డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బకింగ్హాంకు విముక్తి లభించేనా ?
అనుమానంగా ఆక్రమణల తొలగింపు నాలుగు నెలల క్రితమే సర్వే పూర్తి తదుపరి చర్యలు కరువు కాలువ భూముల్లో జోరుగా రొయ్యల సాగు జలరవాణా పరంగా ఓ వెలుగు వెలిగిన బకింగ్‌హాం కాలువకు పూర్వవైభవం రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. కాలువకు మహర్దశ పట్టించి జల రవాణాను పునరుద్ధరిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం తడబడుతోంది. సర్వేల పేరుతో కాలయాపన చేస్తుండటంతో కాలువ ఆక్రమణ దారుల కబంద హస్తాల్లో చిక్కుకుపోయింది. ఓ వైపు ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా మరోవైపు కాలువ భూముల్లో రొయ్యల సాగు జోరుగా సాగుతోంది. వాకాడు: బకింగ్‌హాం కాలువ రోజురోజుకూ బక్కచిక్కిపోతోంది. ఆధునికీకరణ పేరుతో కేంద్రప్రభుత్వం చేపట్టిన సర్వే పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆక్రమణల జోలికి వెళ్లకపోవడం పాలకుల చిత్తశుద్ధిని శంకిస్తోంది. ఒకప్పుడు జల రవాణాలో కీలకప్రాత పోషించిన ఈ కాలువ ఆ తర్వాత కాలంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై ఆక్రమణల్లో చిక్కుకుపోయింది. బ్రిటిష్ దొర బకింగ్ హామ్ జలరవాణా కోసం 1896లో కాకినాడ నుంచి చెన్నై వరకు ఆ కాలువను నిర్మించారు. బకింగ్‌హాం కాలువకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంది. కాకినాడ నుంచి రాజమండ్రి వరకు గోదావరి కాలువగా, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి విజయవాడ వరకు ఏలూరు కాలువగా, విజయవాడ నుంచి పెదగంజాం లాకుల వరకు కొమ్మమూరు కాలవగా, పెద్ద గంజాం నుంచి రాష్ట్ర సరిహద్దు తడ వరకు బకింగ్‌హామ్ కాలువ, ఉప్పు కాలవగా పిలుస్తారు. 100 మీటర్ల వెడల్పు ఉండాల్సిన ఈ కాలవ ప్రస్తుతం 10 మీటర్లకు కుంచించుకుపోయింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కాలువను ఆధునికీకరించి జలరవాణాను పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సర్వే బృందాలు ఎనిమిది నెలలుగా అత్యాధునిక గ్లోబల్ జీపీఎస్ టెక్నాలజీతో సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ప్రక్రియ ఏప్రిల్‌లో ముగిసింది. కాలువకు సంబంధించిన వేలాది ఎకరాల భూమి ఆక్రమణలో ఉన్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం. అనేక అవాంతరాల తర్వాత.. బకింగ్‌హాం కాలువ పునరుద్ధరణకు అనేక సార్లు ప్రయత్నాలు జరిగాయి. దేశీయ జలమార్గాలను పునరుద్ధరించాలని ఇన్లాండ్ వాటర్ హౌస్ అథారిటీ ‘ఇవ్వా’ చేసిన ప్రతిపాదనలను అమలుచేయాలని 1994లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. సర్వే బాధ్యతలను రైట్స్ ఇండియా సంస్థకు అప్పగించాయి. అయితే అప్పట్లో సర్వేప్రక్రియ కాగితాలను దాటలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు సర్వే చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు గత ఏడాది కావలి మండలం చెన్నాయపాళెం వద్ద సర్వే ప్రారంభించాయి. ఆరంభంలో నత్తనడకన సాగిన సర్వే తర్వాత వేగం పుంజుకుంది. కావలి నుంచి ఊటుకూరు వరకు ఓ బిట్‌గా, కుడిపాళెంలోని పెన్నానది తీరం నుంచి ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వరకు మరోబిట్గా, కృష్ణపట్నం నుంచి తడ వరకు మూడో బిట్‌గా విడగొట్టి సర్వే పూర్తి చేశారు. సర్వే నివేదికలతో ఆక్రమణల వివరాలను మొదట విజయవాడలోని హెడ్ ఆఫీస్‌కి పంపి అక్కడ పరిశీలన అనంతరం ఆయా మండలాల రెవిన్యూ అధికారులకు పంపాలి. అయితే సర్వే పూర్తయి నాలుగు నెలలు దాటుతున్నా ఆక్రమణల వివరాలు బయటకు రాకపోవడం, ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వకపోవడం, కనీసం హద్దు రాళ్లు కూడా నాటకపోవడం పాలకుల చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు వాకాడు మండలంలోని బకింగ్హాంకాలువ భూముల్లో వెనామీ రొయ్యల సాగు ఇష్టారాజ్యంగా సాగుతోంది. సర్వే అలైన్మెంట్ పూర్తి చేశాం: వీరకుమార్, డీఈ, బకింగ్‌హాం కెనాల్ నాలుగు నెలల క్రితమే సర్వే అలైన్మెంట్ పూర్తి చేశాం. దానికి సంబంధించిన నివేదికలను విజయవాడకు పంపాం. అక్కడ ఆమోదం లభించిన తర్వాత మిగిలిన దశ పనులు ప్రారంభమవుతాయి. -
అర్ధరాత్రి హైడ్రామా!!
► బీఆర్పీ రోడ్డులో ఆక్రమణల తొలగింపు ► బ్రాహ్మణవీధిలో అన్నపూర్ణాదేవి ఆలయం.. భారీగా పోలీసులు, ► నగరపాలకసంస్థ సిబ్బంది మోహరింపు విజయవాడ (వన్‌టౌన్): వన్‌టౌన్‌లోని బాబారాజేంద్రప్రసాద్ రోడ్డులో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. భారీగా పోలీసులు, నగరపాలకసంస్థ, పోలీసు సిబ్బంది భారీగా మోహరించి స్థానికుల్లో కలవరం పుట్టించారు. అప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించారు. అర్ధరాత్రి పదకొండు గంటలకు ప్రారంభమైన ఈ తంతు రెండున్నర గంటల వరకూ కొనసాగింది. నెహ్రూరోడ్డు విస్తరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందు పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు. పంజా సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వెస్ట్‌బుకింగ్ వరకూ ఉన్న దుకాణాల ఎదుట ఆక్రమణలను తొలగించాలని శనివారం సాయంత్రం అధికారులు ఆయా యజమానులకు సూచించారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా నగరపాలకసంస్థ సిబ్బంది అక్కడకు చేరుకొని ‘ఇంకా తొలగించలేదేమిటంటూ’ ప్రశ్నించడంతో యజమానులు ఒక్కసారిగా బిత్తరపోయారు. రెండుమూడు గంటల క్రితమే కదా చెప్పింది అప్పుడే ఏమిటని యజమానులు తిరిగి ప్రశ్నించారు. కమిషనర్ ఆధ్వర్యంలోనే తొలగింపు మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ ఆధ్వర్యంలోనే ఆక్రమణలను తొలగించారు. నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్, సిటీప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఈఈలు, వెస్ట్ ఏసీపీ రామకృష్ణ, సీఐ దుర్గారావు ఇతర ఎస్ఐల సమక్షంలో ఈ తంతు నిర్వహించారు. బుల్డోజర్లు ఇతర వాహనాలతో దుకాణాల ఎదుట ఉన్న ఆక్రమణలను తొలగించారు. వెల్డర్లతో బోర్డులను, ఇతర సామాగ్రిని తొలగించారు. ముసాఫిర్ఖానా సెంటర్లో రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. దర్గా చుట్టూ ఉన్న దుకాణాలను తొలగించి కేవలం దర్గా ప్రాంగణాన్ని మాత్రమే ఉంచారు. కొంతమంది అభ్యంతరాలను వ్యక్తం చేసినా వాటిని పూర్తిగా పక్కన పెట్టి అధికారులు వారి పని వారు చేసుకుపోయారు. తొలగింపుపై ఆసీఫ్ అభ్యంతరం పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో అర్ధాంతరంగా తొలగింపు చేపట్టడం సరికాదని స్థానిక కార్పొరేటర్ షేక్ ఆసీఫ్ అధికారులకు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులు తమ షాప్‌ల ఎదుట ఉన్న సామాగ్రిని తామే తొలగించుకుంటామని, ఒకపూట సమయాన్ని ఇవ్వాలని పలువురు స్థానిక కార్పొరేటర్ ఆసీఫ్‌కు విజ్ఞప్తి చేయటంతో ఆయన దానిని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దానిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి ఆదివారం సాయంత్రం లోపు తొలగించుకోవాలని సూచించారు. రాత్రి పనులు పూర్తయ్యే వరకూ కమిషనర్‌తోనే ఉన్నారు. తొలగింపు చర్యలను స్థాయీ సంఘం మాజీ అధ్యక్షులు దాడి అప్పారావు ఖండించారు. బ్రాహ్మణవీధిలో అన్నపూర్ణాదేవి ఆలయం తొలగింపు బ్రాహ్మణవీధిలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం ఆనుకొని ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయాన్ని అర్ధరాత్రి వేళ నగరపాలకసంస్థ సిబ్బంది తొలగించారు. నాలుగైదు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా దసరాలో భారీగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. -
పింఛాపై రియల్ కన్ను
- గుట్టుచప్పుడు కాకుండా నదిని పూడ్చివేస్తున్న వైనం - పట్టించుకోని అధికార యంత్రాంగం పీలేరు: దశాబ్దాల చరిత్ర కలిగిన పీలేరు పింఛా నదిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఏటి సమీపంలో కొంతమేరకు దురాక్రమణకు పాల్పడుతున్నారు. వందలాది మంది రైతులకు ఆధారమైన నది పరిసర ప్రాంతాలను రోజుకు కొంత చొప్పున మట్టితోలి చదును చేస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న పీలేరు పట్టణ పరిసర ప్రాంతాల్లోని భూములకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టణ పరిసర ప్రాంతాల్లోని డీకేటీ భూములు, వాగులు, వంకలు, గుట్టలను చదునుచేసి ప్లాట్లు వేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అనతి కాలంలోనే లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పీలేరు పరిసర ప్రాంతాల్లో పలు గుట్టలను చదును చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పీలేరు పట్టణానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఎవ్వరికీ ఇవ్వమని ఓ వైపు అధికారులు చెబుతున్నప్పటికీ మరో వైపు ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. తాజాగా పింఛా ఏటిని ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమేరకు మట్టితో పూడ్చి ఆక్రమించుకున్నారు. మదనపల్లె మార్గం లోని బడబళ్లవంక ఇప్పటికే ఆక్రమణకు గురైంది. మరోవైపు కాకులారంపల్లె పంచాయతీ కోళ్లపారం గ్రామ సమీపంలో ఎన్నో ఏళ్లనుంచి ఉండే వంకను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి సిమెంట్ ఇటుకలతో మురుగునీటి కాలువ తరహాలో గోడ కట్టేశారు. పీలేరు పట్టణ నడిబొడ్డున వెళుతున్న అయ్యపునాయుని చెర్వు కాలువ అనేక చోట్ల ఆక్రమణకు గురైం ది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా ఎవరూ పట్టించుకోవడం లేదని పట్టణవాసులు, పలువురు రైతులు వాపోతున్నారు. బోడుమల్లువారి పంచాయతీ పరిధిలోని బ్రిడ్జివద్ద భూములను చదునుచేసే క్రమంలో భాగంగా పింఛా నదిని కొంతమేరకు పూడ్చివేసి రాతికట్టడం కట్టేశారు. మరోవైపు నదిలో మట్టితోలి ఆక్రమణకు ఉపక్రమిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా ఆక్రమణలు చోటుచేసుకోకుండా తగు చ ర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఉక్కుపాదం
* అక్రమ నిర్మాణాలకు ఆదిలోనే అడ్డుకట్ట * రంగంలోకి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు * హైదరాబాద్ పరిధిలోని 18 సర్కిళ్లకు 18 టీమ్స్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. వాటి నివారణకు ‘ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్’ను ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై ఈ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ రంగంలోకి దిగి అడ్డుకుంటాయి. తొలిదశలో సర్కిల్‌కి ఒకటి చొప్పున గ్రేటర్‌లోని 18 సర్కిళ్లకు వెరసి 18 ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్‌ల పనితీరును జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అడిషనల్ సీసీపీ లేదా సీపీలు పర్యవేక్షిస్తారు. సర్కిల్లో ఉండే ఏసీపీ నేతృత్వంలో టీమ్ పనిచేస్తుంది. ఒక్కో ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌కు ఆరుగురు సిబ్బంది ఉంటారు. అక్రమ నిర్మాణాల ఫిర్యాదులే అధికం.. జీహెచ్ఎంసీకి వివిధ వర్గాల నుంచి, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందినవి.. అందులోనూ అక్రమ నిర్మాణాలవే అధికం. వారం వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ప్రజావాణి’లో సైతం అక్రమ నిర్మాణాల ఫిర్యాదులే ఎనభై శాతానికి పైగా ఉంటున్నాయి. వీటి పరిష్కారానికి ఒకటి రెండురోజుల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి, తగిన వ్యూహం, కార్యాచరణ రూపొందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. నాలాలు, చెరువుల భూముల్లో నిర్మాణాలు జరిపితే కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. తొందరపాటు చర్యలకు దిగబోమని, న్యాయనిపుణుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్ కన్వెన్షన్‌పై అక్రమ నిర్మాణ బోర్డు.... సర్వే చేసిన అధికారుల బృందం తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ ఉందని తేల్చిన విషయం తెలిసిందే. ఎన్కన్వెన్షన్ లోపల మార్కింగ్ అధికారులు తాజాగా ‘అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్’ అని రాశారు. గురుకుల్ ట్రస్టులోని నిర్మాణాలపైనా ఇదే తరహాలో రాస్తున్నారు. కాగా, తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసేందుకు సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని సోమవారం కలిశారు. చార్జీలు మూడు రెట్లు గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని భవనాల్లో ఇప్పటికే కరెంటు, తాగునీటి సదుపాయం పొందుతున్న వారికి జూలై నెల నుంచి మూడు రెట్ల బిల్లులు అందనున్నాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు అక్రమ నిర్మాణాలు జరిపిన వారికి మూడు రెట్లు బిల్లులు వసూలు చేయవచ్చు.