శ్రీకాళహస్తిలో రెండు రోజులుగా విధ్వంసం
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తికి సమీపంలోని రాజీవ్ నగర్‌లో 2 రోజులుగా విధ్వంసకాండ కొనసాగుతోంది. శనివారం ఇళ్ల నిర్మాణానికి పేదలు వేసిన 27 పునాదులను తవ్వేసిన అధికారులు..నిర్మించిన మరో 24 ఇళ్లను ఆదివారం కూల్చివేశారు. పేదలు అడ్డుకుంటున్నా..జేసీబీలు పెట్టి కూలదోశారు. పట్టణానికి సమీపంలోని రాజీవ్‌నగర్ కాలనీలో వైఎస్సార్ హయాంలో 3,000 మంది పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు సేకరించి ప్లాట్లను కేటాయించారు.
అదే స్థలంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ హయాంలో 6,000 ఇళ్లకు అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరో 2,000 ఇళ్లు జగనన్న కాలనీ పేరుతో అభివృద్ధి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు పక్కన పేదలు నిర్మించుకున్న ఇళ్లను, పునాదులను ఆక్రమిత భూములుగా చూపుతూ వైఎస్సార్‌సీపీ వారు ఎక్కువగా ఉన్నారనే దురుద్దేశంతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.
ఏ ఈ విధమైన నోటీసులు లేకుండా తొట్టంబేడు తహశీల్దారు శివరాముడు ఆధ్వర్యంలో ధ్వంసం చేçÜ్తున్నారు. ఏడాది ముందు నుంచి నిర్మాణాలు జÆభుత్వం మారిందన్న సాకుతో కూల్చివేస్తున్నారు. దీనివెనుక శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి హస్తం ఉందని, ఆయన ప్రోద్భలంతోనే కూల్చివేస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు. అక్రమ కట్టడాలు అయితే కరెంటు మీటర్లను ఎందుకు ఇచ్చారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment