'జస్టిస్ ఎస్‌కే గాంగిలీని తొలగించాలి'! | Justice SK gangilini remove | Sakshi
Sakshi News home page

'జస్టిస్ ఎస్‌కే గాంగిలీని తొలగించాలి'!

Published Fri, Mar 6 2015 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

Justice SK gangilini remove

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌కే గాంగిలీని తొలగించాలంటూ రాజ్యసభలో 58 మంది సభ్యులు అభిశంసన నోటీసులు ఇచ్చారు. గ్వాలియర్ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు మహిళా న్యాయమూర్తిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై జస్టిస్ గాంగిలీపై గురువారం విపక్ష సభ్యులు ఈ నోటీసులు ఇచ్చారు. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రతిపాదనకు కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ సహా పలు ఇతర పార్టీల సభ్యులు మద్దతు ప్రకటించారు. న్యాయరంగానికి చెందిన పలువురు తనను కలసి ఈ అంశాన్ని సభలో లేవనెత్తాల్సిందిగా కోరారని, జస్టిస్ గాంగిలీ వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని అందించారని శరద్‌యాదవ్ తెలిపారు. దాంతో ఆ జడ్జి అభిశంసనకు అర్హుడని తాను భావించానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement