ఆమ్ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్ బాధ్యతల నుంచి పార్టీ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను పక్కన పెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ నేత సంజయ్సింగ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 4న పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుందని చెప్పారు. పార్టీలో సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తే పాలనను సజావుగా చేయడం అంత సులువు కాదని, వారు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే ఏమి చేయలేమన్నారు. వారి అసంతృప్తుల విషయంలో చర్చలు జరుపుతామని చెప్పారు. పార్టీలో విభేదాల విషయంపై మార్చి 4న అంతర్గతంగా చర్చించుకుంటాం తప్ప బహిరంగంగా కాదని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎంగా, పార్టీ జాతీయ కన్వీనర్ గా రెండు పదవుల్లో కేజ్రీవాల్ కొనసాగడంపై కొందరు నేతలు ఇటీవల అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దాంతో కేజ్రీవాల్ గత గురువారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తన రాజీనామాను సమర్పించారు. అయితే కొందరు నేతలు ఆయనను నిలువరించారు.