హైదరాబాద్: రేవంత్ రెడ్డి ముడుపుల కేసులో ఇద్దరు సీఎంలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని టీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్ అన్నారు. తమ వద్ద చాలా సమాచారం ఉందని బాగోతాలు బయటపెడతామంటూ ఇద్దరు సీఎంలు పరస్పర ఆరోపణలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ వివాదంలో కేంద్ర కూడా జోక్యం చేసుకోవాలని జాప్యం చేయడం తగదని అన్నారు.
విపక్ష నేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా.. ప్రధాని బీజేపీ అగ్ర నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో తన కూతురుకి కేబినెట్ పదవికోసం కేసీఆర్ బీజేపీతో సఖ్యతతో ఉంటూ చంద్రబాబు విషయంలో రాజీపడుతున్నారని అనిపిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబుపై కేసు నమోదు చేయకపోవడమే అందుకు నిదర్శనం అని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులు, కొనుగోళ్లకు పాల్పడుతున్న ఇద్దరు సీఎంలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసి కేంద్రం ఎన్నిక జరపాలని వారు డిమాండ్ చేశారు.
రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసి ఎన్నికలు పెట్టండి
Published Thu, Jun 11 2015 4:11 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM
Advertisement
Advertisement