ఓటేసిన 111 ఏళ్ల సీనియర్‌ ఓటర్‌ బచన్‌ | 111 year old Bachan Singh, the Oldest Voter in Delhi | Sakshi
Sakshi News home page

ఓటేసిన 111 ఏళ్ల సీనియర్‌ ఓటర్‌ బచన్‌

Published Mon, May 13 2019 5:23 AM | Last Updated on Sat, Jul 6 2019 12:36 PM

111 year old Bachan Singh, the Oldest Voter in Delhi - Sakshi

ఆదివారం... ఢిల్లీలోని తిలక్‌ విహార్‌ పోలింగ్‌ కేంద్రం. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా అక్కడ పోలింగ్‌ జరుగుతోంది. అంతలో ఎన్నికల సంఘం అధికారులతో ఒక కారు వచ్చింది. దానితోపాటే మీడియా కూడా వచ్చింది. ఎన్నికల అధికారులు దగ్గరుండి మరీ తీసుకొచ్చిన ఆ ఓటరు బచ్చన్‌ సింగ్‌. 111 ఏళ్ల బచ్చన్‌ ఢిల్లీ ఓటర్లందరిలోకి వృద్ధుడు. ఈ సీనియర్‌ మోస్ట్‌ ఓటరు ఇంత వరకు ఏ ఒక్క ఎన్నికనూ మిస్‌ కాలేదు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సహా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నింటిలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. గత ఎన్నికల వరకు బచ్చన్‌ సైకిలు మీద వెళ్లి ఓటు వేసి వచ్చేవారు. అయితే, మూడు నెలల కింద పక్షవాతం సోకడంతో ప్రస్తుతం బయటకు రావడం లేదు. దాంతో అధికారులు స్వయంగా వెళ్లి ఆయనను కారులో తీసుకొచ్చారు. అక్కడ నుంచి కుర్చీలో మోసుకెళ్లి ఓటు వేయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement