mla sudhir reddy
-
‘ఠాగూర్‌కు రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ తెచ్చుకున్నావ్’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నోరుంది కదా అని ఏదైనా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. ‘‘రేవంత్‌రెడ్డి.. పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి అంటున్నాడు. మీరు రాళ్లతో కొడితే మేం చెప్పులతో కొడతాం’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. మేం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎస్లో వీలినం చేశామని పేర్కొన్నారు. మావి సేవా రాజకీయాలు, నీది స్వార్థ రాజకీయాలు అంటూ రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. మాణిక్కం ఠాగూర్‌కి రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నావ్ అంటూ దుయ్యబట్టారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగ తమ గురించి మాట్లాడటం ఏమిటంటూ సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రాజకీయ ఎదుగుదల అంతా వివాదాస్పదమే.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి రాజకీయ ఎదుగుదల మొత్తం వివాదాస్పదమేనని, రాళ్లతో కొట్టి చంపండి అనేది రాజ్యాంగంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పార్టీ లు మారితే సంసారం, కానీ ఇక్కడ మారితే వ్యభిచారమా’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజాంగ్యం ప్రకారమే తాము టీఆర్ఎస్లో విలీనమయ్యామని వెంకటరమణారెడ్డి తెలిపారు. -
మేడ్చల్ లో ‘బాల స్వస్థ’ ప్రారంభం
మేడ్చల్: బాలల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాల స్వస్థ కార్యక్రమాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ సెంటర్(సీహెచ్ఎన్సీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గ్రామాల్లోని పాఠశాలల పిల్లలు, అంగన్వాడీ చిన్నారులకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ప్రతీ సీహెచ్‌ఎన్‌సీకి రెండు వాహనాలు కేటారుుంచి.. దీనిలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక ఆయుష్ డాక్టర్, ఒక ఫార్మాసిస్ట్, ఒక ఏఎన్ఎంను నియమించనున్నట్లు తెలిపారు. వీరంతా ఈ వాహనంలో గ్రామాలకు చిన్నారులకు పరీక్షలు చేసి అవసరమైన వైద్యం అందిస్తారని చెప్పారు. మేడ్చల్ సీహెచ్‌ఎన్‌సీకి రెండు వాహనాలు కేటారుుంచగా వాటి ద్వారా సీహెచ్ఎన్సీ పరిధిలో శ్రీరంగవరం, దుండిగల్, జవహర్‌నగర్, అల్వాల్, శామీర్‌పేట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సేవలందిస్తారని మండల వైద్యాకారి ఆనంద్ తెలిపారు. వైద్యులకు మెడికల్ కిట్లు అందజేసిన అనంతరం.. ఎమ్మెల్యే జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, ఎంపీపీ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైరన్ సత్యనారాయణ, ఎంపీడీఓ దేవసహయం, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాస్కర్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకులు విష్ణుచారి, నర్సింహారెడ్డి, రాఘవేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసి ఎన్నికలు పెట్టండి
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ముడుపుల కేసులో ఇద్దరు సీఎంలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని టీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్ అన్నారు. తమ వద్ద చాలా సమాచారం ఉందని బాగోతాలు బయటపెడతామంటూ ఇద్దరు సీఎంలు పరస్పర ఆరోపణలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ వివాదంలో కేంద్ర కూడా జోక్యం చేసుకోవాలని జాప్యం చేయడం తగదని అన్నారు. విపక్ష నేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా.. ప్రధాని బీజేపీ అగ్ర నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో తన కూతురుకి కేబినెట్ పదవికోసం కేసీఆర్ బీజేపీతో సఖ్యతతో ఉంటూ చంద్రబాబు విషయంలో రాజీపడుతున్నారని అనిపిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబుపై కేసు నమోదు చేయకపోవడమే అందుకు నిదర్శనం అని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులు, కొనుగోళ్లకు పాల్పడుతున్న ఇద్దరు సీఎంలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసి కేంద్రం ఎన్నిక జరపాలని వారు డిమాండ్ చేశారు.