సాక్షి, మంగళగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో రేపు(ఆదివారం) జరగబోయే రీపోలింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రీపోలింగ్‌కు భయపడిన టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై రెయిన్ ట్రీ పార్క్‌లోని న్యాయమూర్తి శ్యాంప్రసాద్ ఇంటివద్ద విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో పిటిషనర్, ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. ఇక చంద్రగిరిలో రేపు రీపోలింగ్ జరగాలా?వద్దా? అనేది ప్రస్తుతం న్యాయమూర్తి తీర్పుపై ఆధారపడి ఉంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
చంద్రగిరి రీపోలింగ్‌పై విచారణ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment