
'నోటీసులు అందాక చూస్తా..'
ముంబయి: తనకు నోటీసులు అందిన తర్వాత న్యాయసలహా తీసుకొని ముందుకు వెళతానని అవినీతి వ్యతిరేక సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. పుణెలో ఆయన స్థాపించిన స్వచ్ఛంద సంస్థ 'భ్రష్టాచార్ విరోధి జన్ ఆందోళన్-మహారాష్ట్ర' అనే పేరులో భ్రష్టాచార్ అనే పదాన్ని పుణెకు చెందిన స్వచ్ఛంద సంస్థల కమిషనర్ తొలగించారు.
దీనిపై మీరు ఏమైనా స్పందిస్తారా.. చట్టపరంగా ముందుకు వెళతారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తనకు మాత్రమే కాకుండా మొత్తం 16 స్వచ్ఛంద సంస్థలకు నోటీసులు పంపిచారని, అయితే తనకు నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని అన్నా హజారే చెప్పారు.