10 వేల మందిని తొలగిస్తూ ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న పది వేల మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించింది. బుధవారం సాయంత్రం అన్ని జిల్లాల డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్లకు 2614/16.7. 2014 నంబర్‌తో ప్రభుత్వం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. జిల్లాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ గురువారం నుంచే విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జాబు కావాలంటే బాబు రావాలని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తూనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నెలన్నర రోజులకే పదివేల మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు
Published Thu, Jul 17 2014 3:52 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM
Advertisement
Advertisement