నిషేధ స్థలంలో గోడ తొలగింపు
Published Sun, Jul 17 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
ముదివర్తి (విడవలూరు) : మండలంలోని ముదివర్తి వీఆర్వో నరసింహులు స్థానికంగా ఉన్న నిషేధ స్థలంలో ఉన్న గోడను తొలగించడంతో పాటు వీరంగం సష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. పెన్నానది తీరాన ఉన్న సర్వే నంబర్ 54లో కొంత ప్రభుత్వ భూమిని గతంలో స్థానికంగా ఉన్న శనీశ్వర చక్రవర్తి ఆలయానికి ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆలయ నిర్వహకులకు, ఓ వర్గానికి ఈ స్థలం విషయమై వివాదం చోటుచేసుకుంది. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీస్‌లు రంగప్రవేశం చేసి ఆ స్థలంలో 145 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో ఆదివారం వీఆర్వో తనకు ఆర్డీఓ, తహసీల్దార్ ఆదేశాలు ఉన్నాయని, ఈ గోడను కూల్చుతున్నట్లు తెలిపి, గోడను కూల్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో స్థానికులు కలుగచేసుకుని మీ వద్ద అధికారుల ఆదేశాలు ఉంటే చూపాలని కోరినా వినిపించుకోకుండా వీరంగం సష్టిస్తూ గోడను తొలగించారు. కాగా ఎటువంటి ఆదేశాలు లేకుండా నిషేధ స్థలంలో అధికారులు నిర్మించిన గోడ తొలగించిన విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తామని బాధితులు తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : తహసీల్దార్
వివాదానికి నిలయంగా ఉన్న స్థలంలో 145 సెక్షన్ విధించి, ఆ ప్రాంతంలో గోడను నిర్మించడం వాస్తమే. ప్రస్తుతం ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు గోడను తొలగించడం జరిగింది. ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములున్న కారణంగా ఆ భూములు చెందిన రైతులు రాకపోకలు సాగించేందుకు వీలుగా మాత్రమే గోడను తొలగించడం జరిగింది.
Advertisement
Advertisement