Vidavaluru
-
నెల్లూరు జిల్లా విడవలూరు రైతుల ఔదార్యం
-
విడవలూరు యవకుడికి బ్రెయిన్‌డెడ్
-
విడవలూరు యవకుడికి బ్రెయిన్‌డెడ్
నెల్లూరు: విడవలూరుకు చెందిన దినేష్‌రెడ్డి అనే యవకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. దాంతో యవకుడు దినేష్‌రెడ్డి అవయవాలను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ నెల 13న దినేష్‌రెడ్డికి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. అయితే దినేష్‌రెడ్డి బ్రతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో అతడి తల్లిదండ్రుల అంగీకారం మేరకు నెల్లూరు జిల్లాలోని నారాయణ ఆస్పత్రిలో విజయవంతంగా అవయవదానం ఆపరేషన్ చేశారు. దినేష్ రెడ్డి కిడ్నీని నెల్లూరులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి.. మరొక కిడ్నీని నారాయణ ఆస్పత్రిలో ఉంచారు. గుండె, కాలేయాన్ని గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్‌కు అధికారులు తరలించినట్టు సమాచారం. -
విపత్తులను ధైర్యంగా ఎదుర్కోవాలి
రామలింగాపురం (విడవలూరు) : సముద్రతీరం వెంబడి ఉన్న మత్స్యకారులు, ఇతరులె విపత్తుల సమయంలో ధైర్యంగా ఉండి, వాటిని ఎదుర్కోవాలని చైతన్య జ్యోతి వెల్ఫేర్ సోసైటీ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని రామతీర్ధం పంచాయతీ పరిధిలో ఉన్న రామలింగాపురం మత్స్యకార గ్రామంలో మంగళవారం అవగాహన సదస్సును ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ విపత్తుల సమయంలో మహిళలు, చిన్నారులు, వద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా యువతని ప్రొత్సహించడమే సోసైటీ ఉద్ధేశమన్నారు. ఇందులో భాగంగా రామలింగాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. గాయపడిన వారిని ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలో ప్రయోగాత్మకంగా వివరించారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంతో పాటు బాలకార్మికులను గుర్తించి వారికి విద్య అందించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కషిచేస్తామన్నారు. -
నిషేధ స్థలంలో గోడ తొలగింపు
ముదివర్తి (విడవలూరు) : మండలంలోని ముదివర్తి వీఆర్వో నరసింహులు స్థానికంగా ఉన్న నిషేధ స్థలంలో ఉన్న గోడను తొలగించడంతో పాటు వీరంగం సష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. పెన్నానది తీరాన ఉన్న సర్వే నంబర్ 54లో కొంత ప్రభుత్వ భూమిని గతంలో స్థానికంగా ఉన్న శనీశ్వర చక్రవర్తి ఆలయానికి ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆలయ నిర్వహకులకు, ఓ వర్గానికి ఈ స్థలం విషయమై వివాదం చోటుచేసుకుంది. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీస్‌లు రంగప్రవేశం చేసి ఆ స్థలంలో 145 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో ఆదివారం వీఆర్వో తనకు ఆర్డీఓ, తహసీల్దార్ ఆదేశాలు ఉన్నాయని, ఈ గోడను కూల్చుతున్నట్లు తెలిపి, గోడను కూల్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో స్థానికులు కలుగచేసుకుని మీ వద్ద అధికారుల ఆదేశాలు ఉంటే చూపాలని కోరినా వినిపించుకోకుండా వీరంగం సష్టిస్తూ గోడను తొలగించారు. కాగా ఎటువంటి ఆదేశాలు లేకుండా నిషేధ స్థలంలో అధికారులు నిర్మించిన గోడ తొలగించిన విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తామని బాధితులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : తహసీల్దార్ వివాదానికి నిలయంగా ఉన్న స్థలంలో 145 సెక్షన్ విధించి, ఆ ప్రాంతంలో గోడను నిర్మించడం వాస్తమే. ప్రస్తుతం ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు గోడను తొలగించడం జరిగింది. ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములున్న కారణంగా ఆ భూములు చెందిన రైతులు రాకపోకలు సాగించేందుకు వీలుగా మాత్రమే గోడను తొలగించడం జరిగింది.